చింతచిగురు పచ్చి రొయ్యలు రెసిపి

 

 

 

 

కావలసినవి:

పచ్చి రొయ్యలు: అర కేజీ

చింతచిగురు : పావ్ కేజీ

ఉల్లిపాయలు : పావ్ కేజీ

పచ్చిమిరపకాయలు : ఎనిమిది

ఆయిల్: 150 గ్రాములు

పసుపు : తగినంత

కారం: సరిపడా

ఉప్పు: సరిపడా

 

తయారీ విధానం:

* ముందుగా పచ్చి రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకోవాలి .

* తర్వాత చింతచిగురులో కాడలు లేకుండా అన్నిటిని తీసేసి ఆకుని మెత్తగా చేత్తో నలిపి పెట్టుకోవాలి

* స్టవ్ మీద గిన్నిపెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చివేసి బాగా మగ్గనివ్వాలి.

* ఇప్పుడు పచ్చిరోయ్యలు వేసి కొద్దిగా పసుపు వేసి కొంచంసేపు మగ్గనివ్వాలి.

* తర్వాత చింతచిగురు కూడా వేసి కారం, ఉప్పు వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి.

* ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళుపోసి మరో 5 నిముషాలు ఉడకనివ్వాలి

* అంతే టేస్టీ కర్రీ రెడి...