చిల్లి పన్నీర్

 

 

చల్లగా వున్నప్పుడు ఈ చిల్లీ పన్నీర్ తింటే భలే వుంటుంది..పేరు వినగానే అబ్బో కష్టం అనిపిస్తుంది కాని చేయటం సులువే... పైగా మన వీలు బట్టి చేసే విధానం లో మార్పులు , చేర్పులు చేసుకోవచ్చు. నేను చేసే విధానం ఎలాగో చెబుతాను... కావలసిన పదార్ధాలు లిస్టు చూసి భయపడకండి. లిస్టు పెద్దదే కాని అవన్నీ రోజు మనం వాడేవే.

 

కావలసిన పదార్ధాలు :

పన్నీర్ -250 గ్రాములు

మైదా  -  రెండు స్పూన్స్

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్స్

సెనగ పిండి - ఒక స్పూన్

మిరియాల పొడి చిటికెడు

కారం - ఒక స్పూన్

ఉప్పు - సరిపడినంత

పసుపు - చిటికెడు

చిల్లి సాస్ - అరచెంచా

సోయా సాస్ - అరచెంచా

టమాటో సాస్ - ఒక స్పూన్

కాప్సికం - రెండు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చి మిర్చి - రెండు

అజినమోటో - అరచెంచా

నీరు - సరిపడి నంత

నూనె - వేపుకు సరిపడ్డ

 

తయారి విధానం :

ముందుగా పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో మైదా , కార్న్ ఫ్లోర్ , ఉప్పు , కారం, సెనగ పిండి, మిరియాల పొడి,పసుపు వేసి బాగా కలిపి ఆ తర్వాత కొంచం నీరు పోసి దోసల పిండి లా కలపాలి.

 

మరి జారుగా ఉండకూడదు . అందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఓ పావుగంట తర్వాత పన్నీర్ ముక్కలని తీసి నూనెలో వేయించాలి.

 

ఎర్రగా వేగాక తీసి పేపర్ టవల్ మీద పెడితే నూనె పీలుస్తుంది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లి, క్యాప్సికం, పచ్చ్హి మిర్చి లని ఒక మూకుడులో రెండు చెంచాల నూనె లో వేయించాలి.

 

అవి ఎర్రగా వేగాగానే, సాసులన్నిటి ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ కూడా వేసి , అజినమోటో కూడా చేర్చి బాగా కలిపి స్టవ్ ఆపాలి. . ఇష్టమయితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఈ చిల్లి పన్నీర్ చాలా రుచిగా వుంటుంది.