చిల్లి ఛీజ్ టోస్ట్

 

 

కావలసిన పదార్ధాలు..

* బ్రెడ్ స్లైసులు               - 8

* ఉల్లిపాయ                   - ఒకటి

* పచ్చిమిరపకాయలు    - 8

* కొత్తిమీర                      - కొద్దిగా

* నిమ్మరసం                   - టీ స్పూన్

* ఉప్పు                            - రుచికి తగినంత  

* ప్రాసెస్డ్ ఛీజ్

తయారు చేసే విధానం:

* ముందుగా ఉల్లిపాయ సన్నగా తరగాలి. ఆ తరువాత పచ్చిమిరకాయల్లో గింజలు తీసేసి సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి.

* ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి.. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు నిమ్మరసం, ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

* బ్రెడ్ స్లైసులను బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎలక్ట్రిక్ టోస్టర్ లో టోస్ట్ చేసుకోవాలి.

* వాటిపైన మిశ్రమాన్ని సమంగా పరిచి ఛీజ్ వేసి స్లైసులతో కవర్ చేయాలి. 

* తిరిగి టోస్టర్ లో ఉంచి ఛీజ్ కలర్ తేలికపాటి గోల్డెన్ బ్రౌన్ కలర్ కు మారేదాకా ఉంచాలి. అంచులు కట్ చేసి వేడిగాతినాలి.