కేరట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్

 

 

ఆమ్లెట్ అంటే గుడ్డుతో మాత్రమే చేసుకుంటే ఎలా. ఇంకా బోల్డన్ని వెరైటీ ఆమ్లేట్స్ ఉన్నాయ్. బ్రెడ్ ఆమ్లెట్, స్వీట్ కార్న్ ఆమ్లెట్ ఇలా రకరకాలు ఉన్నాయి, అందులో ఇప్పుడు ఓ వెరైటి ఆమ్లెట్  ఎలా చెయ్యాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

కేరట్ - 2

స్వీట్ కార్న్ - 50 గ్రా

గుడ్లు - 2

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 5

కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు, నూనే - తగినంత 


తయారి విధానం:

ఈ ఆమ్లెట్ తయారి కోసం ముందుగా స్వీట్ కార్న్ ని ఉడికించి ఉంచుకోవాలి. కేరట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ మూడింటిని సన్నగా తరుగుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి కాగాకా ఉల్లిమిక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. అందులో కేరట్ తురుము కూడా కలిపి 2 నిమిషాల తరువాత ఉప్పు కొత్తిమీర తరుగు వేసి ఆఖరుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని వేసి అంతా బాగా కలిపి దించెయ్యాలి. ఇప్పుడొక గిన్నెలో గుడ్లు పగలకొట్టి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసి కాస్త కాలాకా దాని మీద మనం ముందుగా సిద్దం చేసుకున్నకేరట్ , స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి పూర్తిగా కాలాకా రెండో వైపు తిప్పకుండా తీసెయ్యాలి. ఇలాంటి ఆమ్లెట్ వద్దనే పిల్లలు కూడా ఉండరు. మీరే  ట్రై  చేసి చూడండి.

- కళ్యాణి