కేరట్ కేక్

 

 

కేక్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. బేకరిలో తయారుచేసే కేక్ లో గుడ్డు కలుపుతారు. అయితే మనం చేసే ఈ కేరట్ కేక్ లో గుడ్డు కలపక్కర్లెద్దు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కేరట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారి విధానం చూద్దామా.

 

కావల్సిన పదార్థాలు:

కేరట్ తురుము - 2 కప్పులు

మైదా పిండి - 1 1/2 కప్పు

దాల్చిని పొడి - 1 స్పూన్

జాజికాయ పొడి 1/4 స్పూన్

వెన్న - 1/2 కప్పు

బెల్లం - 1/2 కప్పు

బేకింగ్ పౌడర్ - 1/4 స్పూన్

తేనె - 1/2 కప్పు       

క్రీమ్ - సరిపడినంత (optional)

 

 

తయారీ విధానం:

ముందుగా మైదాపిండి, జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్ ని ఒక గిన్నెలో కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో బెల్లం, వెన్న, తేనె కలిపి సన్నని మంటపై స్టవ్ మీద పెట్టి కదుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగి పల్చబడ్డాకా దింపాలి. ఈ బెల్లం మిశ్రమాన్ని, గోధుమపిండి మిశ్రమాన్ని రెండింటిని కలిఫై అందులో కేరట్ తురుముని కూడా వేసి కలపాలి. అన్నిటిని బాగా కలిపాకా ఒక కేక్ గిన్నెకి వెన్న రాసి గోధుమ పిండి చల్లి ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకుని ప్రీ హీటెడ్ ఒవేన్ లో 180° c లో గంట సేపు బేక్ చేసుకోవాలి. గంట అయిన తరువాత ఒవేన్ లోంచి ఒక ప్లేట్ లోకి తీసి (ఇష్టమున్న వాళ్ళు పైన క్రీమ్ అప్లై చేసుకోవచ్చు) ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే చాలు, పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన కేరట్ కేక్ రెడీ అయినట్టే.

 

...కళ్యాణి