క్యాప్సికమ్ పచ్చడి

 

 

కావలసినవి:

క్యాప్సికమ్ - పావు కిలో

కారం - 2 టీ స్పూన్స్

ఉప్పు - తగినంత

చింతపండు - సరిపడా

అల్లం, వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్

నూనె - తగినంత

జీలకర్ర - అర టీ స్పూన్

పసుపు - కొద్దిగా

జీలకర్ర పొడి - 1  స్పూన్

మెంతిపొడి - ఒక  స్పూన్

 

తయారీ :

ముందుగా క్యాప్సికమ్ కడిగి, తుడిచి, అంగుళం ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసు కోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్‌ పెట్టి నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మూతపెట్టి  ఉడికించాలి. ముక్కలు మసాలా ఉడికి నూనె తేలగానే స్టవ్ ఆఫ్ చేసి పొడి సీసాలో భద్రపరచుకోవాలి...