బ్రెడ్ బొండా

 

 

 

కావలసిన పదార్ధాలు..

బ్రెడ్ పీసులు - 8 నుంచి 10
బంగాళదుంపలు - 2 (వుడకబెట్టినవి)
పచ్చి బఠానీలు - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2
నిమ్మ జూసు - 1 స్పూన్
కారం - 1/4 స్పూన్
ఉప్పు - సరిపడినంత
పసుపు - చిటికెడు
గరం మసాల - 1/4 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు - 1/4 స్పూన్
చాట్ మసాల - 1/4 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
కరివేపాకు - 4
కొత్తిమీర
నునె - 3 స్పూన్

తయారు చేసే విధానం :

1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, చాట్ మసాల వేసి వేయించాలి.

2. కొంచెం వేగాక అందులో బంగాలదుంపను , పచ్చి బఠానీలు వేసి వేయించాలి.( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి). ఆ తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

3. స్టవ్ మీద నుంచి దింపేముందు కొత్తిమెర, నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని వుండలుగా చేసుకోని వుంచాలి.

4. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని పాలతో కొంచెం తడిపి ఒకొక్క బ్రెడ్ కి ఒకొక్క వుండని పెట్టి బొండా లా చేసుకొని దానిని నునెలో వేయించు కోవాలి. అంతే బ్రెడ్ బొండా రెడీ.. వీటిని టొమాటో సాస్ తో తింటే బాగుంటుంది.