అన్నం వడియాలు

 

 

కావలసిన పదార్థాలు :

బియ్యం                                           - ఒక గ్లాసు
సగ్గుబియ్యం                                     - ఒక కప్పు
జీలకర్ర                                            - ఒక చెంచా
పచ్చిమిర్చి                                      - మూడు
ఉప్పు                                             - రెండు చెంచాలు
అల్లం ముక్క                                    - చిన్నది
నీళ్లు                                               - నాలుగు గ్లాసులు

తయారీ విధానం:

బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఓ కుక్కర్ లో నీళ్లు పోసి, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. కుక్కర్ మూత పెట్టకుండా అలానే ఉంచాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, సగ్గుబియ్యం కూడా వేసి మూత పెట్టి... మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. కుక్కర్ చల్లారిన తర్వాత అన్నాన్ని బయటికి తీసి జీలకర్ర కలిపి పక్కన పెట్టాలి. అన్నం చల్లారిన తర్వాత వడియ్యాల్లాగా పెట్టుకోవాలి. జంతికల కుడకలో వేసి మురుకుల్లా కూడా వేసుకోవచ్చు. వీటిని మూడు రోజుల పాటు ఎండలో పెట్టి, ఆ తర్వాత భద్రపరచుకోవాలి. ఇవి భోజనంలోకే కాదు... పిల్లలు సరదాగా తినడానికి కూడా చాలా బాగుంటాయి.

- Sameera