ఆనపకాయ పాలకూర తీపికూర

 

 

 

కావలిసిన పదార్ధాలు -

ముక్కలు ఉడికించినవి - 1 కప్పు

పాలు - 12 కప్పు

బెల్లం - కొద్దిగా (లేదా) చెక్కర 2 స్పూస్

నూనె -౩ ,4 చెంచాలు

కరివేపాకు - 8 ,10  ఆకులూ

పచ్చిమిర్చి - 1

ఉప్పుతగినంత

వరిపిండి  - 1 కప్పు

మిరియాల పొడి - కొద్దిగా

పోపుగింజలు , ఎండు మిరపకాయలు ,ఇంగువ

 

తయారి విధానం:

ముందుగా బాణిలో నూనె వేసి శెనగపప్పు , మినపపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకొక్కటిగా వేస్తూ దోరగా వేయించుకుని ఉడికించిన ఆనప ముక్కలు కలపాలి . అందులో పాలు పోసి .. బెల్లం (లేదా) చెక్కర జోడించి ఉడుకుతుండగా ఒక చెంచా వరిపిండి 14 కప్పు నీటిలో కలిపి కూరలో వేసి ఉడికించాలి ... కూర దగ్గరపడి చక్కగా తెల్లగా పారదర్శకంగా ఉంటుంది . చివరిలో ఉప్పుకలిపి మిరియాలపొడి జల్లాలి ఉప్పు ముందుగా కలిపితే కూర విరిగినట్లుగా అవుతుంది. చివరగా కలిపితే ...చూడడానికి  బావుంటుంది. ఇక ఈకూర అన్నంలోకి చపాతిలోకి కూడా చాలా బావుంటుంది.