కరివేపాకుపొడి

 

 

 

 

కావలసిన పదార్ధాలు:

* కరివేపాకు - 1/4 kg లేక కప్పు పూర్తిగా
* శెనగపప్పు - 1 స్పూన్
* మినపప్పు - 1 స్పూన్
* మిరియాలు - 5
* వెల్లుల్లి - 6
* మిరపకాయలు - 10
* జీలకర్ర - 2 స్పూన్లు
* నూనె - 2 స్పూన్లు
* ఉప్పు, చింతపండు - రుచికి తగినంత
* ధనియాలు  - 3 స్పూన్లు

 

తయారీ విధానం:
ముందుగా వేడి మూకుడులో పప్పులు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు ఒకదాని తరువాత ఒకటిగా వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే మూకుడులో కరివేపాకు గలగల లాడేలా పొడిగా వేయించుకొని.. కొద్ది చల్లార్చి.. అన్నీ కలిపి ఉప్పు చింతపండుతో మిక్సీలో పొడి చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అవుతుంది.

 

--భారతి