RELATED NEWS
NEWS
మసాచుసెట్స్‌లో దిగ్విజయంగా జరిగిన ‘అన్నమయ్య స్వరామృతం’కార్యక్రమం


మసాచుసెట్స్‌లో దిగ్విజయంగా జరిగిన

‘అన్నమయ్య స్వరామృతం’కార్యక్రమం

 


 

తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం బోర్డు అఫ్ ట్రస్టీస్ అధ్యక్షులు శ్రీ వల్లిపల్లి శశికాంత్ మరియు డా. పండేటి భూపతి రాజు గార్ల నేతృత్వంలో అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో బెల్లింగ్ హాం హై స్యూల్ ప్రాంగణంలో జులై 21 సాయంత్రం ‘అన్నమయ్య స్వరామృతం’కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

ముందుగా స్థానిక కళాకారులు శ్రీనివాస బాల, ఇంకా మహతి గణపతి ప్రార్థనా గీతాలు ఆలపించారు. కాగానే, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఐకా రవి మరియు వారి సతీమణి డాక్టర్ గాయత్రి దేవి వేదికపైన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. ప్రముఖ కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. తదనంతరం తానా ఫౌండేషన్ ఇండియాలో చేప్పట్టిన అనేక కార్యక్రమాలపైన చక్కటి ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హృదయ పూర్వకంగా స్పందించి కరతాళ ధ్వనులతో హర్షం వ్చక్తం చేశారు.

ప్రముఖ గాయని శ్రీమతి శోభారాజు అన్నమ గాయత్రితో ఈ భక్తి సంగీత కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత, చాలాదా హరినామ సౌఖ్యము, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు, సకల సంగ్రహం సకల సంచయం, వేడుకుందామా’ వంటి బహుళ ప్రాచుర్యంలో ఉన్న మధురమైన అన్నమాచార్య కీర్తనలు ఆలపించి శ్రోతలను తన గానామృతంలో ఓలలాడించారు. ప్రతి పాట చివర సహగాయకులతో పాడిన గోవింద నామాలు, అందరిని భక్తిరసంలో ముంచెత్తి, సంగీత కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత సంతరించుకునేలా చేశాయి.

శ్రీమతి శోభారాజు తన స్వీయ రచనలు ‘వాల్మీకి కోకిల పాడింది గీతం, నీవు లేకుంటే స్వామి ఏడి, యెంత అందగాడు రా’ వంటి మధురమైన భక్తి గీతాలను ఆలపించి శ్రోతలను ఆనందింప చేశారు. చివరగా ‘బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే’ అన్నమయ్యగీతంతో సంగీత కార్యక్రమాన్ని ముగించారు. బోస్టన్ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు సంగీతం అభ్యసిస్తున్నారు. కార్య నిర్వాహకులు వారిని నాలుగు బృందాలుగా చేసి, శోభారాజు గారితో కలిసి వేదికపైన పాటలు పాడే అవకాశాన్ని కల్పించారు. అయ్యప్ప రాజు ‘కీ బోర్డు‘పైన ఇంకా తాటికొండ మోహన్ తబలా వాద్య సహకారంతో సంగీత కార్యక్రమం వీనుల విందుగా సాగింది. అనంతరం ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఎమతి శోభారాజును సత్కరించారు. శ్రీయుతులు కృష్ట వెంపటి, సత్య పరకాల, నాగశ్రీ చక్కా ఇంకా పద్మజ సూరపనేని గార్లు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చివరికి పండేటి భూపతి రాజుగారు వందన సమర్పణలో, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి నిర్విరామంగా కృషి చేసిన అనేక మంది వాలంటీర్లకు, ఔదార్యంగా విరాళాలిచ్చిన దాతలకు, ఇంకా ఇండియా నుండి వచ్చిన కళాకారులకు కృజ్ఘతలను తెలియచేశారు.

కార్యక్రమం అనంతరం విందు భోజనం ఏర్పాట్లను చూసి అందరు హర్షం వ్యక్తం చేశారు. మన వంతు పర్యావరణ పరిరక్షణ చేస్తున్న గ్రీన్ టీం కృషిని పలువురు ప్రశంసించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;