RELATED EVENTS
EVENTS
TANA 18 వ మహాసభలలో Chittoor NRIs Organization ద్వితీయ వార్షికోత్సవం మరియు చిత్తూరు శత వసంతాల సంబరాలు

మనలో చాలా మంది ఇప్పటికే దేశ, రాష్ట్ర, ప్రాంతీయ, భాషా ప్రతిపత్తితో మొదలైన వివిధ సంస్థలలో సభ్యులై మన మాతృ భూమికి ఎనలేని సేవ చేస్తున్నారు. వారి సేవలు సదా అభినందనీయం. అటువంటి మరియొక చిన్ని ప్రయత్నమే ఈ సంస్థ ఆవిర్భావం. కానీ మన సేవలు మాతృ భూమికే పరిమితం కాకుండా అక్కడి నుంచి విదేశాలకు వచ్చిన, వస్తున్న వారికి ఇతోధికంగా సాయం చేయడం ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. మనమందరం ఈ గడ్డపై అడుగు పెట్టినప్పుడు మనకు సహాయపడటానికి మన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు - ఇలా ఎవరో ఒకరు ఉండటం మన అదృష్టం.

మనకన్నా ముందు వచ్చిన వారు పడ్డ అవస్థలు, వారికి ఎదురైన అనుభవాలు మనకు వివరించినప్పుడు మనం చాలా అదృష్టం చేసుకున్నామనిపిస్తుంది. వాళ్ళు సహాయ పడబట్టే మనకు ఆ ఇక్కట్లు చాలా వరకు తప్పాయి. అదేవిధంగా మనం ముందుతరాల వారికి సాయ పడడం మన కనీస ధర్మమని మనందరికీ తెలుసు. అదే ఈ సంస్థ ఆవిర్భావానికి ప్రేరణ. జగత్ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లా గురించి తెలియని భారతీయుడు లేడనడం అతిశయోక్తి కాదు. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలలో ఉంటున్న లేదా స్థిరపడ్డ చిత్తూరు జిల్లా వాసులను సమీకరించడం, వారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన, వస్తున్న వారికి సాయ పడేలా చూడడం ఈ సంస్థ కున్న ప్రధమ కర్తవ్యం.

ఈ సంస్థ ఉద్దేశ్యాలలో కొన్ని క్రింద పొందు పరుస్తున్నాము.

1 చిత్తూరు జిల్లా వాసులందరూ ఒక చోట చేరడానికి, వారి అనుభవాలను పంచుకోవటానికి ఒక క్రియాశీల వేదిక ఏర్పరచటం.

2 సేవ, వృత్తి, వ్యాపార విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు, నైపుణ్యం, ఆభిప్రాయాలు పొందుపరచి పది మందికీ మార్గదర్శకం అయ్యేలా చూడడం.

3 అవసరాలలో ఉన్న వారికి వీలైనంతలో తక్షణ సహాయం అందించేలా అదే ప్రదేశంలో నివసిస్తున్న తోటి జిల్లా వాసులను చైత్యనం చేయడం.

4 సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను, అనుభవాలను వ్యాపింపచేయడం; మన మాతృ భూమికి అవి ఉపకరించేలా కార్యక్రమాలు చేపట్టడం.

5 ChittoorNRIs Organization అనేక సేవలందించిన చిత్తూరు జిల్లా వాసిని మరియు ఒక చిత్తూరు NRI ని గుర్తించి వారిని సత్కరించడం. మా ప్రయత్నంలో ఇది మొదటి మెట్టు మాత్రమే.

అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడ్డ చిత్తూరు జిల్లా వాసులందరినీ ఈ గొడుగు క్రిందకు తీసుకురావడం మా ప్రయత్నంలో భాగం. ప్రముఖులను సత్కరించడంలో భాగంగా రానున్న ద్వితీయ వార్షికోత్సవ సభలో Dr సుందర నాయుడు గారికి (Balaji Hatcheries ) మరియు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ Dr ధరణిపతి చౌదరి వల్లేటి గారికి జీవిత కాల పురస్కారం (LIFETIME ACHIEVEMENT అవార్డు) ప్రదానం చేయడం జరుగుతుంది. రానున్న TANA 18 వ మహాసభలలో Chittoor NRIs Organization ద్వితీయ వార్షికోత్సవం మరియు చిత్తూరు శత వసంతాల సంబరాలు (100 YEARS CELEBRATIONS ) జరుపుకుంటున్నాము. కావున ఎల్లరూ విచ్చేయ వలసిందిగా ప్రార్థన.


TeluguOne For Your Business
About TeluguOne
;