TELUGU TEJALU
తాల్ కల్చురల్ సెంటర్ మొదటి రోజు హేమ మాచెర్ల ఉపన్యాసం

తెలుగు భాషా సంపద మరియు సంస్కృతిని భావి తరాలకు వారసత్వంగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో లండన్ తెలుగు సంఘం (తాల్) 2010లో తూర్పు, పశ్చిమ లండన్ లలో సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసింది.

తెలుగు తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి వేసవి శెలవుల ఆరంభం సందర్భంగా తాల్ "Open Day and Guest Lecture bu Mrs. Hema Macherla'' July 9న TCC East కేంద్రంలో నిర్వహించింది. మొదటగా ప్రస్తుతం తాల్ సాంస్కృతిక కేంద్రంలో కళలను నేర్చుకుంటున్న చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

తాల్ సలహాదారుడు రామానాయుడు తెలుగు భాష గొప్పదనాన్ని మరియు భావి తరాలకు అందించవలసిన బాధ్యతను వివరించగా, సాంస్కృతిక కార్యదర్శి రాజ రెడ్డి ఈ కేంద్రంలో తెలుగుతో పాటు వయోలిన్, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం వంటి కళలను నేర్పుతున్నారని వివరించారు.

Award winning తెలుగు రచయిత్రి శ్రీమతి మాచెర్ల హేమ గారు "పిల్లల ఎదుగుదలలో వ్రాయడం, చదవడం యొక్క ప్రాముఖ్యత'' అనే అంశంపై ఉపన్యసించి చర్చాగోష్టి నిర్వహించారు. ఈ చర్చాగోష్టిలో విచ్చేసిన తల్లిదండ్రులు వారి వారి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన మోహన్ బాబు, కృష్ణ కుమార్, రమేష్ విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు తాల్ కుటుంబానికి సాంస్కృతిక కార్యదర్శి రాజ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Photo Gallery : https://picasaweb.google.com/talukorg/TCCOpenDay


TeluguOne For Your Business
About TeluguOne
;