EVENTS
కెనడా లో తాకా ఆధ్వర్యంలో స్వాతంత్రదినోత్సవం

కెనడా లో తాకా మరియు పనోరమ ఇండియా కలిసి Toronto నగరం లో వెలాది మంది భారతీయులు సమక్షంలో 66వ స్వాతంత్రదినోత్సవాన్ని ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ high commisioner Mr. S. M.Gavai and Consulate Genaral Preeti Saran మరియు దాదాపు 20 మంది భారతి సంతతికి చెందిన MPS, MPPS పాల్గొన్నారు.

 


తాకా ఆధ్వర్యంలో ఆంద్రప్రదేశ్ వాహనాన్ని దాదాపు 3 గంటలు సేపు జరిగిన పెరేడ్ లో తెలుగు సంస్కృతి ప్రతి బింబించే విధంగా తీర్చిదిద్ది ప్రత్యేక ఆకర్షణగా పది మంది నాద స్వరములను మరియు మృదంగములు తో ముందు వైపున వుండి నడిపించారు. తాకా వారు తెలుగుతల్లి ని వాహనము పై కూర్చుండబెట్టి మేళ తాళాలు తో ముందుకు తీసుకు వెళ్లారు. చిన్న పెద్ద బేధము లేకుండా తెలుగు వారు తెలుగు తనము వుట్టి పడే విధముగా పాల్గొన్నారు. మా తెలుగు తల్లి తెలుగు పాట ని స్టేజి ప్రోగ్రంగా చిన్నారులు ప్రదర్శించారు. చిరంజీవి వేమూరి ప్రవల్లిక తెలుగు తల్లిగా అందరిని ఆకట్టుకున్నారు.

 

 

 

ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ శ్రీ గంగాధర్ సుఖవాసి, బోర్డు ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ చారి సామంతపూడి,ఫౌండేర్స్ చైర్మన్ శ్రీనాథ్ కుందురి, మరియు అరుణ్ కుమార్ లయం, లోకేష్ చిలుకూరు, బాచిన శ్రీనివాస్ ఎంతో శ్రమించి తాకా తరుపున వ్యవహారించారు. తాకా ఈ క్రింది కార్య వర్గమంత ఎంతో కృషి చేసి ఈ స్వాతంత్ర దినాన్ని గుర్తుండే విధముగా జరిపారు.   

 

 

 

ఎగ్జ్జిక్యూటివ్ కమిటి:

ప్రెసిడెంట్ : శ్రీ గంగాధర్ సుఖవాసి
వైస్ ప్రెసిడెంట్: మునాఫ్ అబ్దుల్
జనరల్ సెక్రటరి: రామచంద్రరావు దుగ్గిన
కల్చరల్ సెక్రటరి: అరుణ్ కుమార్ లయం
ట్రెజరర్: లోకేష్ చిల్లకూరు


డైరెక్టర్స్: 1. శ్రీనివాసరావు బాచిన
2. రవి కిరణ్ చవ్వా
3. అపర్ణ కొరిపెల్ల
4. వివేక్ గోవర్ధనం


బోర్డు ఆఫ్ ట్రస్టీస్:
శ్రీ హనుమంతచారి సామంతపూడి ( చైర్మన్ )
శ్రీ రమేష్ మునుకుంట్ల     

TeluguOne For Your Business
About TeluguOne
;