- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
- సిలికానా౦ధ్ర మనబడి తెలుగు విశ్వవిద్యాలయ౦ స్నాతకోత్సవం
- సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం
- అద్వితీయం, కమనీయం, నేత్రానందం - శ్రీ జయ నామ సంవత్సర ఉగాది ఉత్సవం
- సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి
- Siliconandhra Antarjateeya Mangalavadya Sammelanam
- సిలికానాంధ్ర మనబడి కి డల్లాస్ లో చక్కటి ఆదరణ
- Manabadi 5th Anniversary Celebrations
- Antarjaateeyya Mangala Vaadya Sammelanam On May 5th And 6th
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
భరతనాట్యం కోర్సులు ప్రారంభించనున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
భారతీయ కళలు మరియు భాషలలోని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలనే సంకల్పంతో, అమెరికా లోని కాలిఫొర్నియా రాష్ట్రంలో ప్రారంభించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, 2017 జనవరి నెలలో కూచిపుడి మరియు కర్నాటక సంగీతంలో మాస్టర్స్, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులలో తరగతులు ప్రారంభించింది. అమెరికా వ్యాప్తంగా భరతనాట్యం కోర్సులలో చేరటానికి విద్యార్ధులు కనబరుస్తున్న అదరణను దృష్టిలో పెట్టుకొని, జనవరి 2018 నుంచి తరగతులు ప్రారంభించటానికి కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వవిద్యాలయాల అనుమతుల సాధికారక సంస్థ BPPE వారి నుంచి అనుమతి సాధించినట్లు చీఫ్ ఎకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి,భారతీయ భాషలు మరియు కర్నాటక సంగీతానికి సంబంధించిన వివిధ వాద్య సంగీతం కోర్సులను కూడా ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ ముఖ్య అర్ధిక నిర్వహణాధికారి (CFO) దీనబాబు కొండుభట్ల తెలిపారు. విశ్వవిద్యాలయం భరతనాట్యంలో కోర్సులు ప్రారంభించటానికి అనుమతులు సాధించటం పట్ల, ఈ కోర్సుల రూపకల్పనలో కీలకపాత్ర నిర్వహిస్తున్న అకడమిక్ కమిటి చైర్మన్ మరియు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డా. పప్పు వేణుగోపాల రావు, భరతనాట్య విభాగానికి అకడమిక్ అడ్వైజరీ సభ్యులు పద్మభూషణ్ సి. వి. చంద్రశేఖర్, విశ్వవిద్యాలయం సి. ఈ. ఓ అనంద్ కూచిభొట్ల, సి.సి.ఓ. దిలీప్ కొండిపర్తి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. కోర్సు గురించిన మరిన్ని వివరాలు, మరియు నమోదు కోసం www.universityofsiliconandhra.org చూడవచ్చు.