RELATED EVENTS
EVENTS
సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి

 

 

 

తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సిలికానాంధ్ర ఆదివారం అమెరికాలోనూ, హైదరాబాదులోనూ ఏక కాలంలో పుష్కరోత్సవం జరుపుకుంది. తెలుగువారి సుదీర్ఘమైన, సుసంపన్నమైన, సన్స్కృతిని, భాషా సాహిత్యాల సంపదను నేటి తరాలకు వివరించి భావితరాలకు చేరేలా శాశ్వతత్వం కల్పించే ఆశయంతో ఈ పన్నెండేళ్ళలో సిలికానాంధ్ర ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ప్రపంచంలో ఏ భాషలోనూ లేని విశిస్టత తెలుగుకు ఉంది. 32వేల సంకీర్తనలు రచించి, స్వరకల్పన చేసి పాడి పరవిశించిన అన్నమయ్యకు నీరాజనాలర్పిస్తూ సిలికానాంధ్ర నిర్వహించిన లక్ష గళ సంకీర్తన, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించింది. తెలుగు వారి జీవనాడి కూచిపూడి నృత్యం పట్ల ఈ తరానికి అనురక్తిని కలిగించే ఉద్దేశ్యంతో అమెరికాలో, హైదరాబాదు లో 3 అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాలని నిర్వహించింది. ప్రపంచ వేదికపై కూచిపూడికి పట్టం కట్టింది. ఇదివరకటితో పోలిస్తే కూచిపూడి నాట్యం నేర్చుకునే వారు 40 శాతం పెరిగారు.


విదేశాల్లో పుట్టి పెరుగుతున్న బాలలకు తెలుగు భాషను శాస్త్రీయమైన రీతిలో ప్రణాలికాబద్ధం గా నేర్పించేందుకు 'మనబడి ' కార్యక్రమాన్ని సిలికానాంధ్ర 2007 లో ప్రారంభించింది. అమెరికాలోనే కాక కెనడా, ఉక్రెయిన్,యూ కే తదితర దేశాల్లో ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.



ప్రాచీన భాషగా ఉన్న తెలుగు ప్రపంచ భాషగా సాగిస్తున్న ప్రస్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా తెలుగు భాషను అభివృద్ధి పరిచే విశిష్ట కార్యక్రమాన్ని సిలికానాంధ్ర 2011 లో చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సహకారంతో రెండు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించింది.18 నెలల కాలంలో 18 యూనికోడ్ ఫాంట్లను విడుదల చేసింది. కంప్యూటర్ను, అంతర్జాలాన్ని వినియోగించుకుని తెలుగును ప్రపంచభాషగా చేసేందుకు మార్గం వేసింది.



తెలుగు భాషా సంస్కృతుల అధ్యయనానికి, అభ్యాసానికి ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని సిలికానాంధ్ర నెలకొల్పుతుంది. వచ్చే విద్యా సంవత్సరంలోనే పనిచేయడం ప్రారంభించే ఈ విస్వవిద్యాలయానికి  యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ( USA) అని నామకరణం చేయడం జరిగింది. అమెరికాలోని అత్యూన్నత విద్యా ప్రమాణాలను అనుసరించి ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తుంది.



తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన పదసంపదను ఒకచోటకు తెచ్చి ఆ పదాలకు అర్ధాలు, పర్యాయ పదాలు, ఇతర విశేషాలను కూర్చి ఒక చోట అంతర్జాలంలో రాశిపోసే బృహత్తర ప్రణాలిక్ను రూపొందిస్తున్నది సిలికానాంధ్ర. తెలుగు భాషకు, సాహిత్యానికి ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమం ఇది. ఇదంతా యూనికోడ్ పరిజ్ఞానంతో ప్రపంచంలో ఎవరైనా ఉపయోగించుకునేలా ఉంటుంది.



హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారకరామారావ్ కళా మందిరం లో తెలుగు సంస్కృతికి అద్దం పట్టే విధంగా జరిగిన పుష్కరోత్సవంలో రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సిలికానాంధ్ర ప్రపంచానికి ఆదర్శమని ప్రశన్సించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అధ్యక్షత వహించి కార్యక్రమం వివరించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర పూర్వ అద్యక్షులు కొండుభట్ల దీనబాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పద్మిని సరిపల్లి ఆధ్వర్యంలో చక్కని తెలుగు లలిత గీతాలను ఆలపించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;