RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో యాభై మంది చిన్నారుల తో చెంచులక్ష్మి నాట్య విన్యాసం

డల్లాస్, TX: మార్చ్3: తెలుగు కళల వెలుగు కోసం నిత్యం తపించే నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో అద్భుతమైన కూచిపూడి నాట్య ప్రదర్శనకు నేనుసైతం అంటూ చేయూతనందించింది. నాట్స్ సౌజన్యంతో  కూచిపూడి కళాక్షేత్ర, ట్యాంటెక్స్ తో కలిసి  డల్లాస్ లో చెంచులక్ష్మి నృత్య ప్రద‌ర్శన‌ ఏర్పాటు చేశారు. మన పురాణాలలోని నరసింహావతారం చెంచు లక్ష్మి ఎపిసోడ్ ను నాటకీయత...నాట్యం.. రెండు కలగలపి ఈ ప్రదర్శన నిర్వహంచారు. కూచిపూడి నృత్య రీతిలో రూపొందించిన ఈ నృత్య ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. డల్లాస్ లో ఉండే ప్రముఖ నాట్య గురువు శ్రీమతి. పద్మ సొంటి దర్శకత్వంలో.. దాదాపు 50 మంది చిన్నారులు ఈ నృత్య ప్రదర్శన లో పాల్గొన్నారు.. సంప్రదాయ దుస్తుల్లో చెంచు లక్ష్మి డ్యాన్స్ ను వీరంతా అత్యత్భుతంగా రక్తి కట్టించారు. ఈ ఫ్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్పాంజలి నుంచి ప్రారంభమైన ఈ నృత్య ప్రదర్శన..నాట్య గణపతి.. నరసింహావతరాం..చెంచులక్ష్మి కల్యాణం వరకు చిన్నారులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు..

 


 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;