RELATED EVENTS
EVENTS
టెంపా లో ట్రస్ట్ అండ్ విల్ సదస్సు నిర్వహించిన నాట్స్


టెంపా లో ట్రస్ట్ అండ్ విల్ సదస్సు నిర్వహించిన నాట్స్
కుటుంబ న్యాయపరమైన అంశాలపై అవగాహన

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగువారి కోసం అనేక  కార్యక్రమాలు చేపడుతోంది..ఈ క్రమంలోనే టెంపాలోని నాట్స్ చాప్టర్  ట్రస్ట్ అండ్ విల్ అనే సదస్సును నిర్వహించింది. ఆస్తులకు సంబంధించిన వీలునామాలు, బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించేటప్పుడు నామినీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సదస్సు  ప్రత్యేకంగా అవగాహన కల్పించింది. అమెరికాలోని న్యాయనిపుణులు అటార్నీ డెనీస్.ఎస్. మెజస్ ఈ సదస్సుకు విచ్చేసిన వారి సందేహలకు సమాధానాలు ఇచ్చారు. నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు కొత్త శేఖరం ఈ సదస్సుకు వచ్చిన అతిథిని సభకు పరిచయం చేశారు. అమెరికాలో జరగరానిది జరిగినా వారి కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు వారి వారసులకు సంక్రమించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై కూడా ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనిపైనే పలువురి సందేహాలకు న్యాయ నిపుణులు నివృత్తి చేశారు. ఒక వేళ తాము చనిపోతే అమెరికాతో పాటు ఇండియాలో ఆస్తులు తమ వారసులకు ఎలా సంక్రమించాలనే ప్రశ్నలకు న్యాయనిపుణులు సమాధానాలిచ్చారు. అసలు పిల్లలకు ఎవరిని గార్డియన్ గా పెట్టాలి?,  మనకు జరగరానిది జరిగితే పిల్లల రక్షణ ఎలా? అనే దానిపై కూడా దిశా నిర్థేశం చేశారు. ఏదైనా ప్రమాదాల బారిన పడి వైకల్యం సంభవించినా దాని నుంచి కూడా కోలుకోనేందుకు ముందుగా అప్రమత్తం కావాల్సిన అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది.. నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది ఆధ్వర్యంలో జరిగిన  ఈ సదస్సుకు చక్కటి స్పందన లభించింది. స్థానిక తెలుగువారితో పాటు అటు కొందరు అమెరికన్లు కూడా  ఈ సదస్సులో పాల్గొన్నారు.  నాట్స్ సభ్యులు శ్రీనివాస్ నన్నపనేని, రమేష్ కొల్లి, శ్యాం తంగిరాల, యుగంధర్ మునగాల, మధు తాతినేని, సుధీర్ మిక్కిలినేని, మాలినీ రెడ్డి, రమా కామిశెట్టి, శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ గౌరవెల్లి మరియు శ్రీనివాస్ అచ్చిరెడ్డి తో పాటు పలువురు నాట్స్ ప్రతినిధులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు. డా.పరిమి,  ప్రశాంత్ పిన్నమనేని లు అటార్నీ డెనీస్.ఎస్. మెజస్ ను మెమెంటో తో సత్కరించారు.


కమ్యూనిటీ కి ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని అతి తక్కువ సమయం లో నిర్వహించినందుకు టంపా టీం ని నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్ర్రసిడెంట్ మోహన్ మన్నవ, శేఖరం కొత్త లు అభినందించారు. టాంపా నాట్స్ చాప్టర్ కార్యదర్శి ప్రసాద్ కొసరాజు వందన సమర్పణ తో సభ ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;