RELATED ARTICLES
ARTICLES
కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన

 

కార్లటన్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన


అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నాట్స్ ప్రతి ఏటా లాగే ఈ సారీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ రాజేంద్ర మాదాల చొరవతో  కార్లటన్ ఈ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది.  నాట్స్ డాలస్ మీట్ సహకారంతో స్థానిక అడ్వెంటేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ టోర్నమెంటులో  24 టీమ్ లతో పాటు దాదాపు 200 మందికిపైగా వాలీబాల్ ప్లేయర్లు పాల్గొన్నారు. నాట్స్ నేషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్ అనే రెండు టోర్నీలు నిర్వహించింది. మొదటి నుంచి నాట్స్ కోసం పనిచేస్తున్న వారి కోసం వాలంటీర్ కప్ పేరుతో ఈ పోటీ పెట్టింది. నాట్స్ నేషనల్ కప్ టోర్నిలో ధండర్స్ టీమ్ విజేతగా నిలిచింది. రేంజర్స్ టీమ్ రన్నరప్ గా మిగిలింది. ఇక  నాట్స్ వాలంటీర్ కప్ ను స్పార్టన్స్ టీం సొంతం చేసుకుంది.

స్నిపర్స్ టీం రన్నరప్ గా నిలిచింది. అట్లాంటా, హ్యుస్టన్, శాన్ అన్ టానియో ఇలా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాలీబాల్ ప్లేయర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డు ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి బాపు నూతి, శ్రీనివాస్ కోనేరు, విజయ్ శేఖర్ అన్నే, డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మరినేని తదితరులు ఈ టోర్నమెంటుకు తమ పూర్తి సహకారాలు అందించారు. ఇక నాట్స్ జాతీయ సభ్యులు కిషోర్ వీరంగంధం, చైతన్య కంచర్ల, అమర్ అన్నే, శ్రీనివాస్ కొమ్మినేని, కృష్ణ నిమ్మగడ్డ, ఉమా అట్లూరి తదితరులు ఈ టోర్నమెంటుకు హాజరై తమ విలువైన సేవలు అందించారు. నాట్స్ విజేతలకు, రన్నరప్ లకు బహుమతులు అందచేసింది. క్రీడా స్ఫూర్తితో సుదూర ప్రాంతాల నుంచి కూడా ముందుకొచ్చిన వాలీబాల్ ప్లేయర్లను ప్రత్యేకంగా అభినందించింది. ట్యాంటెక్స్ ప్రెసిడెంట్  కృష్ణారెడ్డి ఉప్పలపాటి, వైస్ ప్రెసిడెంట్ సత్యం వీరనపు, తదితరులు  కూడా ఈ టోర్నీకి హజరై ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టోర్నమెంటును ఘనంగా నిర్వహించింనందుకు నాట్స్ స్పోర్ట్స్ కమిటీకి అభినందనలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;