RELATED NEWS
NEWS
డల్లాస్ లో సరసుల మన్ననలందుకున్న కళావాహిని వారి రసరాజు కవితాగోష్ఠి

 

 

 

డాల్లాస్ కు చెందిన సాంస్కృతిక సంస్థ కళావాహిని ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ప్లేనోలోని బావర్చీరెస్టారెంట్ లో ప్రముఖ కవి, రచయిత రసరాజు గారి కవితా గోష్ఠి సాహితీప్రియుల సమక్షంలో ఘనంగా జరిగింది.


ముందుగా కళావాహిని వ్యవస్థాపకులలో ఒకరైన మల్లవరపు అనంత్ సభకు స్వాగతవచనాలు పలుకగా మరో వ్యవస్థాపకుడు జువ్వాడి రమణ ముఖ్య అతిథి రసరాజుగారిని సభకు పరిచయం చేసి వేదిక మీదకు ఆహ్వానించారు.  రసరాజు గారిని స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ (ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం) సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద పుష్పగుఛ్ఛంతో సత్కరించారు. 



రసరాజుగారు తాను ప్రథమంగా పద్యకవిగా తన కవితాయాత్ర ప్రారంభించానని చెప్తూ తెలుగుభాష ఔన్నత్యం వివరించి అందులో విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, తిరుపతి వేంకటకవుల పద్యాలను సోదాహరణంగా వివరించి తానువ్రాసిన కొన్ని పద్యాలను చదివివినిపించారు.  కవిగా తనకు ప్రక్రియ గురించి పట్టింపు లేదని తాను వ్రాసిన మినీ కవిత, నానీ, గజల్, సినీ గేయాలు పాడి వినిపించారు.  కళావాచస్పతి కొంగర జగ్గయ్య తన కవిత్వాన్ని విశేషంగా అభిమానించేవారని ఆయన ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు తనను పరిచయం చేసారని చెప్పారు.  అసెంబ్ల్రీరౌడీ సినిమాలోని ‘అందమైనవెన్నెలలోన’ పాటకు అవార్డులు వచ్చిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు.  ప్రేక్షకుల కోరిక మీద గజల్ ప్రక్రియ రచనలో వున్న కష్టనష్టాలు వివరించారు.  ఎంతో కవిత్వవంతంగా వున్న ఆయన రచనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఎన్నో సార్లు చప్పట్లతో సభ మోగి పోయింది. 



స్థానిక గాయకులు సాధు జ్యోతి, నారని రమేశ్, రసరాజు వ్రాసిన అందమైన వెన్నెలలోన (అసెంబ్లీ రౌడీ) పాడి వినిపించారు.  ఆ పూలరంగు నీ చీర చెంగు (దొంగ పోలీస్), అలాగే ఇటీవల డాలస్ల్లో రసరాజు వ్రాసిన కొత్తపాట కోపమైనఅందమే సాధు జ్యోతి పాడి ప్రశంసలందుకున్నారు.  సభికుల కోరిక మీద ఆనాటి మధురగీతం నన్నుదోచుకుందువటే సాధు జ్యోతి, మద్దుకూరి చంద్రహాస్ పాడి వినిపించారు.  



కళావాహిని కార్యవర్గం మల్లవరపు అనంత్, జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, నసీమ్ షేక్, కాజా సురేశ్ రసరాజుగారిని దుశ్శాలువతో సత్కరించారు.  టాంటెక్స్ (ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం) తరపున అధ్యక్షుడు మండువ సురేశ్, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ముఖ్యఅతిథిని సత్కరించారు.



ఈ కవనపు విందు, వీనుల విందు తో పాటు చక్కని విందు తో కార్యక్రమం సుసంపన్నం గా జరిగి, వచ్చిన వారికి మంచి అనుభూతినిచ్చింది.

TeluguOne For Your Business
About TeluguOne
;