TELUGU TEJALU
వాషింగ్టన్ లో క్యాట్స్ దసరా/దీపావళి సంబరాలు

వాషింగ్టన్ లో క్యాట్స్ దసరా/దీపావళి సంబరాలు – ఆంధ్ర ప్రదేశ్ (INDIA) ను Sister State గా ఆమోదించిన మేరిలాండ్ State (USA)

 

వాషింగ్టన్ DC : ఓ సంధ్యా సమయపు సాయంత్రాన రివ్వు రివ్వున వీచే గాలుల సవ్వడికి జల జల రాలే ఆకుల సవ్వడి తోడవ్వగా అక్టోబర్ 15న అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరం దసరా దీపావళి సంబరాలకు సన్నద్ధమయ్యింది.

మేరిల్యాండ్ state కు House of Delegate గా ఎన్నికైన మొట్టమొదటి తెలుగు మహిళ శ్రీమతి అరుణ మిల్లర్ గారి జ్యొతి ప్రజ్వలనతో శ్రీకారము చుట్టిన ఈ కార్యక్రమము గణపతి దేవుని పంచరత్నమాలతో మొదలై పిదప చిన్నారుల చిట్టి శ్లోకాలు,చిట్టిపాపల విభిన్న నృత్యాలు,యువతీ యువకుల నాట్య విలాసాలు వారి కోయిల గానాలతో ఆద్యంతము సంబరాలకు విచ్చేసిన 750 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

 

ముఖ్య అతిధులుగా విచ్చేసి మేరిల్యాండ్ రాష్ట్ర Deputy Secretary of State శ్రీ రాజన్ నటరాజన్ గారు మరియు శ్రీమతి అరుణ మిల్లర్ గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మేరిల్యాండ్ సోదరి రాష్ట్రంగా మేరిల్యాండ్ గవర్నర్ గారు ఆమోదించిన ప్రకటనను సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.ఈ ప్రక్రియలో భాగంగా గవర్నర్ గారు త్వరలో ఆంధ్ర ప్రదేశ్, INDIA దర్శించి ఈ ఒడంబడికను కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ అధ్యక్షులు కొండా రామ్మోహన్ గారు దసరా/దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మేరిల్యాండ్ సోదరి రాష్ట్రంగా గుర్తించినందులకు హర్షం వ్యక్తం చేస్తూ రాజన్ నటరాజన్ గారికి అరుణ మిల్లర్ గారికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు Vice Chairman భువనేష్ బుజాల గారు శుభాకాంక్షలు తెలుపుతూ CATS సంస్థ విధి విధానలు వివరించారు.

 

తరువాత Cultural Director చంద్ర కాటుబోయిన గారి ఆధ్వర్యంలో జరిగిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారుల నుంచి పెద్దల వరకు క్రిక్కిరిసిన సభా ప్రాంగణమంతా ఆద్యంతం రక్తి కట్టించాయి. అనూజ్ గురువార జన సమ్మోహనం, కౌసల్య స్వర మాధుర్యం, రేవంత్ రెచ్చిన వైనం, సినీతారలైన రజిత ఒలికించిన హాస్యం, యామిని శర్మ నర్తించిన మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, యువ హృదయాల అత్యుత్సాహ ప్రదర్శనలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లింది. ముఖ్య సభ్యులు Treasurer బద్రి చల్ల,ఆనంద్ బాబు గుమ్మడి, ప్రవీణ్ కట్టంగుర్, బాలాజి, ప్రభాకర్, నరసింహ రెడ్డి, చంద్ర ఈడెం, అపర్ణ, పద్మలత, ప్రమీల, కల్పన, సోమేశ్వర్, అనిల్ రెడ్డి, మధుకర్ వెదిరె తదితరులు ఈ కార్య క్రమంలో చురుకుగా పాల్గొన్నారు.చివరగా Secretary మధు కోల గారు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు జనరంజకరంగా ముగిసాయి.

Ram Mohan Konda Chairman,

CATS (Capitol Area Telugu Society)

 

TeluguOne For Your Business
About TeluguOne
;