RELATED EVENTS
EVENTS
కొండవీడు ఫోర్ట్ పునర్వైభవానికి ఆటా వారి ప్రచారం

రెడ్డి రాజులచే నిర్మించబడిన కొండవీడు ఫోర్ట్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవాలని గత ఏడు సంవత్సరాలుగా కృషి చేస్తున్న కొండవీడు ఫోర్ట్ డెవలప్ మెంట్ కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి గారు గ్రేటర్ చికాగో తెలుగు కమిటీ, అమెరికన్ తెలుగు అసోసియేషన్ హనుమంత రెడ్డి, ట్రెజరర్ సత్యనారాయణ, ఆర్, కందిమళ్ళ, ట్రస్టీ నరేందర్, ఆర్. చెమర్ల, మెంబర్ షిప్ కమిటీ చైర్ సత్యనారాయణ, ఆర్. కొండపల్లి మరియు తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ప్రెసిడెంట్ సుందర దిట్టకవి, ప్రెసిడెంట్ గా ఎన్నికైన కళ్యాణ్ ఆర్. అనందుల, ఎక్స్ ప్రెసిడెంట్ అమర్ నెట్టం మరియు తెలుగు నాయకులు రామ్ ఆదే, డాక్టర్ రవీందర్ రెడ్డి, సుధాకర్ బెజ్జం వారి సహాయాన్ని అర్థించారు.

 

శివారెడ్డి గారు కొండవీటి ఫోర్ట్ పరిరక్షణ కోసం 2004 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్స్ వారిని కూడా అర్థించారు. శివారెడ్డి గారు దేవాదాయ శాఖ ఎక్స్ మినిస్టర్ శ్రీ గాడే వెంకటరెడ్డి మరియు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్ వారి సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వారు చేపట్టిన అభివృద్ధి పనులను, పర్యాటక క్షేత్రంగా, ప్రకృతిని ప్రేమించే వారు, కొండవీడు ఫోర్ట్ చుట్టుపక్కల వున్న సుందర ప్రదేశాలను ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు.

 

కల్లి శివారెడ్డి గారు చేస్తున్న కృషిని తాము అభినందిస్తున్నామని, ఈ విషయాన్ని ఆటా, టిఏజిసి సభ్యులకు, అలాగే అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి కూడా తెలియచేస్తామని, ఈమెయిల్ ద్వారా, తమచే ప్రచురితమయ్యే పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని వారు తెలియచేసారు. ఇండియాకు వచ్చినప్పుడు తెలుగు వారు అందరూ కొండవీడు ఫోర్ట్ ను దర్శించాలని సూచించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;