RELATED EVENTS
EVENTS
అట్లాంటాలో ATA వారి ఫండ్ రెయిజింగ్ కార్యక్రమం విజయవంతం

ఆటా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేందర్ జిన్నా అధ్యక్షతన మార్చి 19వ తారీఖున అట్లాంటాలోని హిల్టన్ హోటల్ లో బోర్డు మీటింగ్ ప్రారంభమైంది. ఈ మీటింగ్ కు అమెరికాలో నలుమూలలనుంచి తెలుగువారు పాల్గొన్నారు. ఆటా బోర్డు మెంబర్లే కాక తెలుగు కమ్యునిటీ వారు, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ కొ-ఆర్డినేటర్స్, గ్రేటర్ అట్లాంటా తెలుగు కమ్యునిటీ సభ్యులు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) మరియు గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (GATA) బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ డాక్టర్ జిన్నా మాట్లాడుతూ ఆటా వారు గత నాలుగు నెలలలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి, ట్రై వాలీ స్టూడెంట్ బాధితుల కోసం ఇమ్మిగ్రేషన్ “శాం’’, వచ్చే రెండు సంవత్సరాలలో ఆటా వారు వివిధ అమెరికా సిటీలలో చేపట్టబోయే సేవ కార్యక్రమాల గురించి వివరించారు.

ఆటా కోశాధికారి సత్యనారాయణ కందిమళ్ళ గత నాలుగు నెలల రిపోర్ట్ ను సమర్పించి, ఆట వారు చేసిన వివిధ కార్యక్రమాలను వెబ్ సైట్ లో పొందుపరచటం, ఆటా మేగజైన్ ‘అమెరికా భారతి’గురించి వివరించారు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన జిన్నా మాట్లాడుతూ ఆటా బోర్డు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇండియాలో జరపతలపెట్టిన ఆటా వేడుకలు డిసెంబర్ నెలలో జరపడానికి చేస్తున్న ప్రయత్నాలు, తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాల అభివృద్ధిని మెరుగుపరిచే కార్యక్రమాలను తెలియజేశారు. జనవరి నుండి ఈనాటి వరకు మెంబర్లును చేర్పించిన రీజనల్ కొ ఆర్డినేటర్లకు ఈ సందర్భంగా తమ కృతజ్ఞతలను తెలియచేశారు ఆటా ఆఫీస్ కో-ఆర్డినేటర్ నరేంద్ర చెమర్ల.

ఆటా యువజన కన్వీనర్ గా కరుణాకర్ ఆశిరెడ్డి ఎగగ్రీవంగా ఎన్నికైనట్లు, ప్రాంతీయ ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా మాజీ అధ్యక్షుడు, తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా వ్యవస్థాపకుడు, మొదటి ప్రెసిడెంట్ డాక్టర్ జగన్ మోహన్ రావు కన్వెన్షన్ కో-ఆర్డినేటార్ గా ఎన్నికనట్లు ప్రెసిడెంట్ జిన్నా ప్రకటించారు. డాక్టర్ సంధ్య గవ్వ, మాజీ ప్రెసిడెంట్ ఆటా, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, మాజీ ప్రెసిడెంట్ మరియు మాజీ కన్వీనర్ ఆటా, రాజేశ్వర్ టెక్మల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా మాజీ ప్రెసిడెంట్, పరమేష్ భీం రెడ్డి ఆటా వారి అధ్యక్షా టీమ్ వంటి అనుభవమున్న నాయకత్వంలో 12వ ఆటా కన్వెన్షన్ ను విజయవంతంగా జరపుతారని డాక్టర్ జిన్నా ప్రకటించారు.

అట్లాంటా కన్వెన్షన్ కన్వీనర్ గా ఎన్నికైన కరుణాకర్ మాట్లాడుతూ ... ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలిపారు. అటు పాతతరం వారిని ఇటు కొత్తతరం వారిని కలుపుకుని తెలుగు భాషా, సంస్కృతిని, కన్వెన్షన్ లో తెలుగు కమ్యూనిటీ అన్ని విభాగాలను కలుపుకుని ముందుకు పోతామని తెలిపారు.

ఈ కన్వెన్షన్ లో మరింతమంది యువత పాల్గొని ఫండ్ రేయిజింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో ఆర్డినేటార్ డాక్టర్ జగన్ మోహన్ రావు పిలుపునిచ్చారు.

2000వ సంవత్సరపు అట్లాంటా ఆటా కన్వీనర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ “2012 కన్వెన్షన్ ఇంతకుముందు కన్నా బాగా జరుగుతుందని, ఆటా వారు సరైన సమయంలో సరైన వారిని అట్లాంటా కన్వెన్షన్ వారిని ఎంపిక చేసుకున్నారని’ అన్నారు. సాయంత్రం అట్లాంటా కన్వెన్షన్ టీమ్ వారు ఆటా లీడర్ షిప్ టీమ్ మరియు లోకల్ తెలుగు కమ్యూనిటీ వారి కోసం గొప్ప వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సుమారు 500 అట్లాంటా లోకల్ తెలుగువారు పాల్గొన్నారు. ఆటా లీడర్ షిప్ వారి సేవా దృక్పథం అట్లాంటా కన్వేషన్ అన్నిన్తిల్లో ఈ ఆటా కన్వేషన్ విజయవంతం అయ్యిందని, ఈ కన్వెన్షన్ లో 250K$ లను కేవలం ఒక గంటలోనే పాల్గొన్న వారి వద్ద నుండి సేకరించడం జరిగిందని ఆటా సెక్రెటరీ రామ్ మోహన్ కొండా తెలిపారు.

సభకు విచ్చేసిన వారందరూ స్థానికులు నిర్వహించిన వినోద కార్యక్రమాలను ఆస్వాదించారు. ప్రెసిడెంట్ జిన్నా, ఆటా లీడర్ షిప్ టీమ్, అట్లాంటా టీమ్ వారు తమ సహాయసహకారాలను అందిచినందుకు హృదయపూర్వకంగా ప్రశంసించారు. ఆటా లీడర్ షిప్ మరియు స్థానిక అట్లాంటా తెలుగు కమ్యూనిటీ వారు ఈ బోర్డు మీటింగ్ కు విచ్చేసి విజయవంతం చేసినందుకు తమ ధన్యవాదములు తెలియచేశారు.

25 సంవత్సరాలుగా నార్త్ అమెరికా తెలుగు కన్యూనిటీ వారికి సేవలు అందిస్తున్న అమెరికా తెలుగు అసోషియేషన్ గురించి మరిన్ని వివరాలు, మరియు వారు నిర్వహించే పలు కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే ఆటా వెబ్ సైట్ http://www.ataworld.org ను లాగ్ ఆన్ అవ్వండి.

TeluguOne For Your Business
About TeluguOne
;