LATEST NEWS
తెలంగాణలో   కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత  సంక్షేమ హాస్టల్ లో   ఓ విద్యార్థి చనిపోతే బీఆర్ఎస్ నేత  ఆర్ ఎస్ ప్రవీణ్ రాజకీయం చేస్తున్నారని మంత్రి కొండాసురేఖ ఆరోపించారు. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో  సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు  అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా అనేక చర్యలు తీసుకుందని వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హాయంలో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురు కులాల కార్యదర్శిగా పని చేసినప్పుడు అన్నంలో పురుగులు వచ్చాయని కొండా సురేఖ గుర్తు చేశారు. గురు కులాల్లో కుట్రలు చేస్తున్న బిఆర్ఎస్ నేతలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పగలరన్నారు. 
ఎపిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం  తెలియ జేసింది. .  నైరుతి బంగాళ ఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటితోందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.  దీని ప్రభావంలో  తెలంగాణ జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. 
అదానీ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ నినాదాలు చేస్తుండటంతో సభలో వాయిదాల పర్వం సాగుతోంది. ఐదు రోజులుగా సభ ఎలాంటి కార్యకలాపాలూ లేకుండానే వాయిదా పడుతూ వస్తున్నది. శుక్రవారం (నవంబర్ 29) కూడా లోక్ సభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ వ్యవహారం, యూపీలోని సంభాల్ లో చెలరేగిన హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను సాగనీయకుండా అడ్డుపడ్డాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. మిగిలిన వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితిలో సోమవారానికి వాయిదా పడింది.  
లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయసేకరణ వివాదాస్పదం కావడంతో జాతీయ రహదారుల కోసం  భూసేకరణ సరిగ్గా జరగడం లేదని  తెలుస్తోంది. అవార్డ్ పాస్ అయిన భూములకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇవ్వకుండానే భూసేకరణ చేపడుతున్న అధికారులకు  రైతులు సహకరించడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ కు విషయం అర్థమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్లను సాకుగా చేసుకుని రైతులు భూసేకరణకు ముందుకు రావడం లేదు. దీంతో లగచర్ల భూసేకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత రావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. భూసేకరణ చేసే జాతీయ  రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో రైతులు భూసేకరణకు సహకరించకపోతే జాతీయ ప్రాధికార సంస్థ  కు ఎలా సహకరిస్తారని  రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డికి సూటిగా ప్రాధికార సంస్థ  ప్రశ్నించింది. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వరని కోమటిరెడ్డి తేల్చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.  రీజినల్ రింగ్ రోడ్డుకోసం ఇప్పటికే 95 శాతం భూములను  ప్రాధికార సంస్థ సేకరించింది. మిగతా ఐదు శాతం భూములను సేకరించిన తర్వాతే అవార్డ్ పాస్ అయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధికారసంస్థ నిర్ణయించినట్టు కనబడుతోంది. శుక్రవారం లగచర్ల భూసేకరణ నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూసేకరణ విషయంలో వెనకడుగు వేసింది. దేశ వ్యాప్తంగా లగచర్ల భూసేకరణ వ్యవహారం సంచలనంగా మారడంతో నష్ట నివారణకు ఉపక్రమించింది. లగచర్ల భూసేకరణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  భూ సేకరణ చట్టం-2013 లోని సెక్షన్ 93 ప్రకారం  లగచర్ల భూ సేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ చేసి, ప్రజాభిప్రాయం, ప్రజాభీష్టం మేరకు భూసేకరణను ఉపసం హరించు కుంటున్నట్లు పేర్కొంది.   కాగా, వికారాబాద్‌ జిల్లా  లగచర్ల భూ సేకరణ విషయంలో అభిప్రాయ సేకరణకు వెళ్లి కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం రాష్ట వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడి ఘటనతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. దీంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం  దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాడికి పాల్పడిన 50 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందంటూ  కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అతడి ప్రధాన అనుచరుడు భోగమోని సురేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా లగచర్ల  బాధితులంతా కలిసి ఢిల్లీలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్  జాతీయ మహిళా కమిషన్‌  ను కలిసి వారిపై పోలీసులు చేసిన దాడులు, అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు.   వారి ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్   రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి  , డీజీపీ జితేందర్‌  కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా భూసేకరణపై వెనకడుగు వేయడం గమనార్హం. హక్కుల ఉల్లఘణ జరిగిందంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని అభిశంసించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ముందుగానే వెనక్కు తగ్గి లగచర్ల భూసేకరణను ఉపసంహరించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా లగచర్ల ఘటనను డీల్ చేసే విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఈ విషయంలో ప్రతిపక్ష  బీఆర్ఎస్ ప్రభుత్వంపై పై చేయి సాధించిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్లు లైకా సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.  ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ.. " జాసన్ సంజయ్‌ను తెర‌కెక్కించబోతున్న క‌థ, ఆయ‌న నెరేష‌న్ విన్న‌ప్పుడు డిఫ‌రెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్ర‌ధాన‌మైన పాయింట్‌ ఉంది." అన్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. 2025 జ‌న‌వ‌రి నుంచి మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
  వెబ్ సిరీస్ : పారాచూట్ నటీనటులు: కిషోర్, కని తిరు, శక్తి రిత్విక్, ఇయల్, కృష్ణ , కాళి వెంకట్ తదితరులు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: కె. శ్రీధర్ ఎడిటింగ్: ఎ. రిచర్డ్ కెవిన్ మ్యూజిక్: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్ నిర్మాతలు:  కె.ఎస్ మధుబాలన్, కృష్ణ కులశేఖరన్ దర్శకత్వం: రసు రంజిత్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కథ:  షణ్ముగం(కిశోర్), లక్ష్మీ (కని తిరు) ఇద్దరు భార్యాభర్తలు. వారిద్దరికి వరుణ్(శక్తి రిత్విక్), రుద్ర(ఇయల్) పిల్లలు. ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుతుంటారు. అయితే వరుణ్ కి చదువు మీ శ్రద్ధ లేకపోవడం, ఆటలంటే ఇష్టం ఉండటంతో అతడిని వాళ్ళ నాన్న షణ్ముగం కొడుతుంటాడు. అయితే షణ్ముగం ఇంటింటికి తిరిగి సిలిండర్లు వేస్తుంటాడు. అతను నిజాయితీగా డ్యూటీ చేస్తున్నప్పటికీ, ఒక చిన్న వివాదం కారణంగా అతడి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ వేస్తారు. దీంతో పోలీస్ అతడి మీద గుర్రుమంటాడు. ఇక అదే సమయంలో వారిద్దరి పిల్లలు కలిసి తన తండ్రి షణ్ముగం బైక్ పారాచూట్ ని వేస్కొని బయటకు వెళ్తారు. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్(కృష్ణ) ఓ డ్రంక్ డ్రైవ్ కేసులో గొప్పింటి వ్యక్తి బైక్ ని తీసుకొని, అతడి మీద చేయి చేస్కుంటాడు. సీజ్ చేసిన ఆ బైక్ ని కొంతమంది దుండగులు తీసుకెళ్తారు. అది గొప్పింటి వ్యక్తి విషయం కావడంతో పోలీస్ ఆఫీసర్ కృష్ణకి పైనుండి ప్రెషర్ వస్తుంది. అసలు పారాచూట్ ని తీసుకెళ్ళిన పిల్లలు ఏమైపోయారు ? పోలీసులు గొప్పింటి వ్యక్తి బైక్ ని కనిపెట్టగలిగారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.  విశ్లేషణ: తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రులంటే భయం కచ్చితంగా ఉంటుంది. ఆ క్రమంలో పిల్లలు ఏవైనా తప్పులు చేస్తే వారికి తెలియకుండానే భయం వారిని వెంటాడుతుంది. అదే సమయంలో తప్పిపోయిన పిల్లలు, పారాచూట్ అనే బైక్, పోలీసులు ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య ఓ వైపు.. ఇలా నాలుగు రకాల భిన్నమైన సమస్యలు ఈ సిరీస్ లో సమానంగా సాగుతుంటాయి.  కథ మొదలవ్వడమే ఓ ప్రాబ్లమ్ తో మొదలవుతుంది. ‌ఇక మొదటి ఎపిసోడ్ లో పిల్లల మీద తండ్రి కోపం, తల్లి అన్యోన్యత  ఇలా సెంటిమెంట్ తో సాగగా.. మూడో ఎపిసోడ్ , నాల్గో ఎపిసోడ్ ఇలా ఒక్కో ఎపిసోడ్ లో పిల్లలు ఎక్కడున్నారో వెతుకుతున్న తల్లిదండ్రులని చూస్తుంటే అందరు కనెక్ట్ అవుతారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలోని వారంతా ఈ సిరీస్ కి కనెక్ట్ అవుతారు. ‌ఫ్యామిలితో కలిసి చూసేలా దర్శకుడు తీర్చిదిద్దారు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. అశ్లీల పదాలు వాడలేదు. కథకి తగ్గట్టుగా సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. ఓమ్ నారాయణ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నైట్ ఎఫెక్ట్ లోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు మంచి మార్కులు కొట్టేస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం, ఈ సిరీస్ కి హైలైట్. కానీ పాటలని తమిళంలోనే ఉంచేశారు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు:  షణ్ముగం పాత్రలో కిశోర్, లక్ష్మీ పాత్రలో కని తిరు ఆకట్టుకున్నారు. శక్తి రిత్విక్, ఇయల్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. ఫైనల్ గా...  ఫ్యామిలీతో కలిసి చూసే  పారాచూట్. మస్ట్ వాచెబుల్. రేటింగ్ : 3/5 ✍️. దాసరి మల్లేశ్
Thalapathy Vijay has established himself as a big star in Tamil Cinema and grew his market by multi-folds in recent years in other languages too. Many anticipated his son Jason Sanjay to debut as an actor carrying forward his legacy. But the youngster has decided to carry forward his grand father SA Chandrasekhar's legacy as a director.  SA Chandrasekhar wanted to be an actor but he turned into a director and then a producer. He wanted his son, Vijay to fulfil his dreams and even Vijay showcased interest in being an actor. Hence, SA Chandrasekhar designed his son's career in the first ten years and later, Vijay took his own decisions to become Thalapathy.  Jason Sanjay went abroad to complete course in writing and direction. After he completed his course, Lyca Productions have come forward to support his vision to become a director. Now, they have announced his debut film with Telugu actor Sundeep Kishan with a motion poster.  They revealed that the story revolves around the theme of theme of ‘searching for what you've lost in its original place’—but at what cost? Sandeep Kishan earned huge name in Tamil language with Lokesh Kanagaraj's Maanagaram, Dhanush's Captain Miller and Raayan. Hence, the young director wanted to go with him for his bilingual.  Head of Lyca Productions, G.K.M. Tamil Kumaran, stated that the production house has always focused on encouraging talented storytellers. When Jason Sanjay presented his story, it stood out as fresh and carried the unique appeal of drawing pan-Indian attention. He highlighted that Sundeep Kishan has consistently demonstrated his ability to captivate audiences across Tamil and Telugu regions, and this collaboration promises to deliver an exciting cinematic experience.   Star composer Thaman will be composing the tunes for this project. The discussions are ongoing with leading actors and technicians from the industry. The team plans to begin shooting in January 2025, with additional announcements to be made soon.
Samantha Ruth Prabhu, the most sought after actress of Indian Cinema, posted on Instagram, "Until we meet again Dad", with a broken heart emoji, in her story. Sources close to her have revealed that her father Joseph Prabhu passed away on 29th November.  Samantha's father Joseph Prabhu, an anglo-Indian Telugu person, married a Siriyan Malayali Ninette Prabhu. She always remarked that her father encouraged her to explore her career opportunities and he was the strong reason for her successful career in film industry.  She stated that he always remained as a pillar of support in her life. Well, now he passed away and sources state that he suffered with medical ailments from past few months. It is interesting to note that her ex-husband Naga Chaitanya is getting re-married to Sobhita Dhulipala and Samantha lost her father during the same time. 
ప్రముఖ నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "మళ్ళీ మనం కలిసేవరకు డాడ్" అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజితో పోస్ట్ చేసింది. సమంత తండ్రి మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ గా ఉండు సామ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 
Animal movie starring Ranbir Kapoor and Rashmika Mandanna has become a smashing blockbuster with close to Rs.900 crores gross at the box office. The runtime of this Sandeep Reddy Vanga directorial is 3 hours 21 minutes. Even Pushpa 2 runtime is 3 hours 21 minutes.  It looks like a happy coincidence but now, it rises a doubt if Pushpa 2 can recreate Animal's box office magic. The money involved in theatrical business of Pushpa 2 is double than Animal and it needs to be a huge blockbuster collecting over Rs.1300 crores gross at the box office.  Sukumar has completed shooting on 26th November and he is working continuously on sound mixing. On the other hand, Allu Arjun and Rashmika Mandanna are going around India promoting the film. It is also interesting to notice that Animal protagonist's role is similar to Pushpa's character who will never bow down to anyone.  Interestingly, Rashmika Mandanna starred as leading lady in both the films. But Sukumar's style of making is different from that of Sandeep Reddy Vanga. He loves to go into weird zone for his character while Sandeep loves to highlight heroism.  Still, Pushpa Raj has already become a brand in Hindi language markets and Sukumar needs to keep that euphoria alive in the second part too. He cannot make it too weird and even take it too eccentric as it can backfire like his Nannaku Prematho, Aarya 2 and 1 Nenokkadine.  Animal's protagonist character also went into eccentric zone but Sandeep kept enough theatrical heroic moments to overcome it. But Sukumar has been seen carried away by his own ambition and at times indulgent nature in going overboard.  Mythri Movie Makers need Pushpa 2 to collect more than Kalki, RRR and KGF Chapter 2 to breakeven and hence, the movie needs to have lesser flaws and much more focused celebration of heroism of Pushpa Raj. Let's hope that is the case, even though the team is working sleeplessly till the last moment like the first one. 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.చరణ్ మూడు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తుండంతో పాటుగా,ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతుండంతో  మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి నిన్న 'నానా హైరానా'(naanaa hyraanaa)అనే ఒక బ్యూటీ ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్  అవ్వగా ఇప్పుడు ఈ సాంగ్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ అన్ని భాషల్లో కలుపుకొని కేవలం పదిహేను గంటల్లోనే ట్వంటీ మిలియన్ వ్యూస్ ని సంపాదించింది. మెలోడీ సాంగ్స్  పరంగా చూసుకుంటే ఎన్టీఆర్(ntr)దేవరలోని చుట్టమల్లే సాంగ్, మహేష్(mahesh)కళావతి సాంగ్, అలా వైకుంఠపురం లోని 'సామజ వరగమనా' పుష్ప 2(pushpa 2)లోని 'సుసెకీ అగ్గిరవ్వ మాదిరి' సాంగ్స్ 'నానాహైరానా' సాంగ్ మాదిరిగా అంత తక్కువ వ్యవధిలో రికార్డు వ్యూస్ ని సంపాదించలేదు. మరి ముందు ముందు ఈ సాంగ్ మరిన్ని రికార్డ్స్ సాధిస్తుందో చూడాలి. తెలుగు సాంగ్ ఇప్పటికే పంతొమ్మిది మిలియన్ల వ్యూస్ ని సంపాదించింది. చరణ్ సరసన కియారా అద్వానీ(Kiara Advani)జత కట్టగా అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో చెయ్యగా దిల్ రాజు(dil raju)నిర్మాతగా వ్యవరిస్తుండగా థమన్(thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.  
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ నుంచి సోలో హీరోగా వస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని, గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని నిలుపుకోవాలని చూస్తున్నాడు చరణ్. కానీ పరిస్థితులు మాత్రం అంతగా అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. (Game Changer) రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ కావడంతో 'గేమ్ ఛేంజర్'పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, సాంగ్స్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు.. రికార్డు కలెక్షన్స్ వస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇతర భారీ సినిమాలతో ఉన్న పోటీనే కాస్త ఇబ్బందికరంగా మారేలా ఉంది. (Ram Charan) 'గేమ్ ఛేంజర్' ఎంత పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ, చరణ్-శంకర్ కాంబో కాబట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు కలెక్షన్లు కీలకం. మెజారిటీ కలెక్షన్లు ఈ మూడు రాష్ట్రాల నుంచే వస్తాయి. అయితే ఈ రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' వసూళ్లకి భారీ గండి పడే అవకాశం కనిపిస్తోంది. 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. అయితే అదే సమయంలో తెలుగులో రెండు భారీ సినిమాలున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ 'డాకు మహారాజ్' కాగా, రెండోది వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమాలు 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అలాగే తమిళ్ లో పొంగల్ కి అజిత్ 'విడాముయర్చి' విడుదలవుతోంది. దాంతో తగినన్ని థియేటర్లు దొరకవు. దానికితోడు ఎంత శంకర్ సినిమా అయినప్పటికీ, అజిత్ సినిమా పోటీలో ఉండటంతో తమిళ ప్రేక్షకులు 'విడాముయర్చి' చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అంతేకాదు 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల వల్ల 'గేమ్ ఛేంజర్' యూఎస్ కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశముంది. సంక్రాంతి సీజన్ లో రెండు మూడు భారీ సినిమాలున్నా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అదొక్కటే 'గేమ్ ఛేంజర్'కి కలిసొచ్చే అంశం. అయితే అది జరగాలంటే 'గేమ్ ఛేంజర్'కి పాజిటివ్ టాక్ రావాలి. మరి ఈ అడ్డంకులను దాటుకొని 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి చూపిస్తాడేమో చూద్దాం.
2013 లో మోహన్ లాల్(mohan lal)హీరోగా వచ్చిన 'లోక్ పాల్' అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మలయాళ నటి దివ్య ప్రభ(divya prabha)ఆ తర్వాత  ముంబై పోలీస్,కోల్డ్ స్టోరేజ్,సిమ్,టేక్ ఆఫ్,తమాషా,మాలిక్ వంటి పలు సినిమాల్లో ప్రాధాన్యత క్యారెక్టర్స్ లో చేసి ప్రేక్షకులని మెప్పించిన దివ్య ప్రభ  2022 లో వచ్చిన 'అనియప్పు' అనే   చిత్రం ద్వారా సోలో హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. రీసెంట్ గా 'ఆల్ వుయ్  ఇమాజిన్ ఆజ్ లైట్' అనే మూవీలో చెయ్యగా ఇండియాతో పాటు మరో నాలుగు దేశాల్లో ఆ మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అందులో ఆమె నటించిన ఒక న్యూడ్ సీన్ క్లిప్ ని నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు.ఇప్పుడు వాటిపై దివ్య ప్రభ మాట్లాడుతూ ఈ మూవీ ఒప్పుకున్నప్పుడే ఇలాంటివి వస్తాయని ముందుగానే ఊహించాను.నేను న్యూడ్  సన్నివేశంలో నటించడాన్ని తప్పుబడుతున్నారు. సినిమా మొత్తం చూడకుండా కేవలం ఆ సన్నివేశం మాత్రమే షేర్ చేస్తున్న వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. నేను గుర్తింపు కోసమే అలాంటి క్యారక్టర్ ని  చేసానని అంటున్నారు.ఒక నటిగా మంచి ప్రాధాన్యత గల పాత్రలనే అంగీకరిస్తాను.ఈ సినిమాలో నా పాత్ర నచ్చి అవసరం మేరకే నటించాను.అంతే గాని గుర్తింపు కోసం నగ్నంగా నటించాలనే అవసరం లేదు ఇప్పటికే నేను నటించిన చాలా చిత్రాలకి పలు పురస్కారాలు ప్రశంసలు దక్కాయని చెప్పుకొచ్చింది ఇక ఈ సినిమా ఇండియాలో సెప్టెంబర్ 21 న రిలీజ్ అవ్వగా రానా దగ్గుబాటి దేశ వ్యాప్తంగా విడుదల చేసాడు.  
Keerthy Suresh visited Tirumala on 29th November and she looked completely excited and happy. The actress has been asked my media about her impending nuptials with her beau Antony Thattil. She confirmed that she is getting married in December in Goa but did not talk about the date.  Recently, she shared about her 15-year old relationship with Antony and stated that it was always been him, revealing the secret behind her pet dog's name, "NYKE". She named her after both of them. Now, with this confirmation, we can state that Keerthy Suresh is definitely entering into a new chapter into her life.  We congratulate her on embarking into this new journey and hope she would continue to entertain us with great performances while she enjoys this new chapter together with her beau and soon-to-be-husband.  On the work front, she has decided to shed her no over glamorous rule for her Bollywood debut movie Baby John, opposite Varun Dhawan. The recently released song from the album composed by S Thaman, has gone viral for her skin show more than the composition. Movie is releasing on 25th December all over. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రతి మనిషి తన జీవితంలో వివాహం అనే దశను చేరుకుంటాడు.  సంసార సాగరంలో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని ఈదుతూ ఉంటాడు. చాలామంది సింగిల్ గా ఉన్నప్పుడు జీవితం చాలా బాగుండేది.. వివాహం అయ్యాక స్వేచ్ఛ పోయింది అనే మాట అంటుంటారు. ఇంకొందరు ఏమో తన ఆలోచనలు, అభిరుచులకు సరైన భాగస్వామి రాలేదు అని అంటుంటారు. ఇప్పటికే పెళ్లైన వారిలో చాలామంది పెళ్లే వద్దు బాబోయ్ అని వివాహ బంధం గురించి తమ అనుభవాలను చెప్పి ఇతరులను భయపెడుతూ ఉంటారు. అయితే మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  మంచి పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు వెల్లడించాడు.  అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నవారు.. లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నిజాయితీ.. నిజాయితీగా ఉండే వ్యక్తులు మాత్రమే జీవితంలో మంచి లైఫ్ పార్ఠ్నర్ లు కాగలరు. అబద్దాల కోరును ఎవరూ నమ్మరు.  ఒకవేళ పెళ్లి తరువాత ఇలాంటి వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నా అబద్దాలు చెప్పడం వల్ల ఆ సంసారం ఎప్పటికీ సంతోషంగా ఉండదు. దయ.. ఇతరుల పట్ల దయా గుణం కలిగిన వారు మంచి లైఫ్ పార్ట్నర్ లు గా ఉండగలరు. బయటి వ్యక్తుల పట్ల దయ చూపించే వారు భాగస్వామి విషయంలో మరింత ప్రేమ, దయ,  సానుభూతి, పరిస్థితులను అర్థం చేసుకోవడం చేయగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో బ్యాలెన్స్డ్ గా ఉండగలరు. మర్యాద.. ఇతరులకు మర్యాద గౌరవం ఇవ్వడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరినీ అకారణంగా నొప్పించరు. తన  లైఫ్ పార్ట్నర్ ను కూడా చాలా విలువైన వ్యక్తిగా భావిస్తారు. మర్యాద ఇవ్వడం,  గొప్ప స్థానాన్ని ఇవ్వడం చేస్తారు.   అయితే ఈ గుణాలన్నీ ఉన్నట్టు నటించే వ్యక్తులు కొందరు ఉంటారు. కాబట్టి వ్యక్తులను సులువుగా ఎంచుకోకుండా కాస్త సమయం తీసుకోవడం మంచిది.  వ్యక్తి గురించి విచారించడం కూడా మంచిది.  ఒక వ్యక్తి జీవితంలో జీవితాంతం కలిసి ఉండేది భాగస్వామి మాత్రమే కాబట్టి.. భాగస్వామి విషయంలో ఎప్పుడూ తొందరపాటు అడుగులు వేయకూడదు.                                                 *రూపశ్రీ.
ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు. ఉదాహరణకు… ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి.  "సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట. అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా? పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా? బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి. అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.                                            ◆నిశ్శబ్ద.  
చాణక్యుడు చంద్రగుప్త చక్రవర్తికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు. ఈయన రాజనీతిలో మాత్రమే కాకుండా తాత్విక విషయాలను కూడా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా తన చాణక్య నీతి గ్రంథాలలో వివరించాడు.  ముఖ్యంగా మనిషి అలవాట్లను, మనిషి ప్రవర్తనను చాణక్యుడు చెప్పిన విధానం తెలుసుకుంటే మనుషుల జీవితాలు చాలా మారిపోతాయి.  జీవితంలో ఎప్పుడూ  సమస్యలతో చుట్టు ముట్టే వ్యక్తుల గురించి,  వ్యక్తి ప్రవర్తన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.. చాణక్యుడు చెప్పిన కొన్ని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుంటే ఆయన చెప్పిన విషయాలు బాగా అర్థమవుతాయి. వ్యవయనర్గతమాకారః శుచయతి| ఒక వ్యక్తి మనసులో ఏముందో అది ఆ వ్యక్తి ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుందట. అబద్దాలు చెప్పే వ్యక్తుల ముఖంలో కూడా అలాగే ఆ ఉద్దేశాలు వ్యక్తమవుతాయి.  అలాంటి వ్యక్తులు ఏదైనా దాచి పెట్టాలని చూసినా అందులో అర్థం లేదు.. అందరికీ అవి అలా అర్థమైపోతూ ఉంటాయి.  అబద్దం చెప్పే వ్యక్తులు తమ జీవితంలో ఇతరులను మోసం చేస్తున్నామని, ఇతరుల నుండి లాభపడుతున్నామని, కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటున్నామని అనుకుంటారు. కానీ అందులో అర్థం లేదు.. ఇలాంటివి చేయడం వల్ల వారికి సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. దాచిన పాపానాం సాక్షిణో మహాభూతాని| రహస్యంగా చేసిన పాపాలకు ఇతరులు ఎవరూ సాక్షులు లేరని చాలామంది సంతోషపడుతుంటారు.  తమకు ఎలాంటి నష్టం జరగదని తమను ప్రశ్నించేవారు ఎవరూ ఉండరని అనుకుంటూ ఉంటారు.  కానీ అలా రహస్యంగా చేసిన పాపాలకు పంచభూతాలే సాక్ష్యాలు.. పంచభూతాలైన భూమి, నీరు,  కాంతి,  వాయువు,  ఆకాశం ఇవన్నీ ప్రతి వ్యక్తి కదలికకు, చేసే తప్పులకు, చేసే మంచి పనులకు కూడా సాక్ష్యులుగా ఉంటాయి. ఆత్మః పాపాత్మైవ ప్రకాశయతి పాపం చేసే వ్యక్తి మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుందట. తను చేసిన తప్పు ఎవరూ చూడకపోయినా, ఎవరికీ తెలియక పోయినా తప్పు చేశాను కదా అనే భావన మనసులో ఉంటుంది.  ఈ భావన అనేది ఎప్పుడూ మనసులో గుర్తుకువస్తూ మనశాంతి లేకుండా చేస్తుంది.  దీని వల్ల మనసు కూడా నిలకడగా ఉండదు. ఎవరైనా తప్పుగా సాక్ష్యం చెబితే.. తప్పుగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు కొందరు. దానివల్ల వారికి కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని అలా చేస్తారు. లేదా కొన్ని సార్లు తప్పు సాక్ష్యం చెప్పడం వల్ల తనకు కావలసిన వారు సమస్యల నుండి బయటపడతారని అనుకుంటారు.  కానీ ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు నరకానికి వెళతారని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.  అలాంటి వ్యక్తులు అశాంతితో రగిలి పోవడమే కాకుండా.. వారిని ఎప్పుడూ సమస్యలు చుట్టు ముడతాయట. కాబట్టి అబద్దాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం జీవితంలో వ్యక్తిని పతనానికి తీసుకెళుతుందని.                                               *రూపశ్రీ.  
  శరీరానికి అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు అవసరం అవుతాయి.  ఏ ఒక్కటి లోపించినా శరీర పనితీరు దెబ్బతింటుంది.  ముఖ్యంగా శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లోపించడం వల్ల శరీరానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది.  ఈ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీరానికి పూడ్చలేని నష్టం జరుగుతుంది.  ముఖ్యంగా చాలా అరుదుగానూ, మాంసాహారంలోనూ లభించే పోషకాల వల్ల శాకాహారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు.  అలాంటి వాటిలో విటమిన్-బి12 లోపం కూడా ఒకటి.  విటమిన్-బి12 మాంసాహారంలోనూ,  కొన్ని శాకాహార ఆహారాలలోనూ మాత్రమే లభిస్తుంది.  ఈ కారణంగా విటమిన్-బి12 కేసులు శాకాహారులలో ఎక్కువగా ఉంటాయ.  అసలు విటమిన్-బి12 లోపిస్తే జరిగేదేంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యను అధిగమించాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. లక్షణాలు.. శరీరంలో విటమిన్-బి12 లోపిస్తే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.  వాటిలో అలసట,, బలహీనత,  కళ్ళు తిరగడం,  జ్ఞాపకశక్తి,  రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విటమిన్-బి12 శరీరంలో రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది,  కొత్త ఎర్ర రక్తకణాలు అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది. కానీ విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత ఎక్కువ అవుతుంది.  విటమిన్-బి12 భర్తీ కావాలంటే ఏం తినాలంటే.. పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారంలో కూడా విటమిన్-బి12 ఉంటుంది.  శాకాహారం తీసుకునేవారు విటమిన్-బి12 భర్తీ కావాలంటే పాలు, పాల ఉత్పత్తులు అయిన పాలు, పెరుగు, చీజ్,  పనీర్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని చాలా తొందరగా అధిగమించడానికి చికెన్,  టర్కీ కోడి మొదలైనవి ఆహారంలో తీసుకోవచ్చు. చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.  చేపలతో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల విటమిన్-బి12  లోపాన్ని అధిగమించవచ్చు.  వైద్యుల సూచన మేరకు చేప సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. గుడ్లలో పెద్ద మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది. రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  లేదంటే గుడ్డుతో ఆరోగ్యకరమైన పద్దతిలో ఆమ్లెట్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకుని తినవచ్చు. కానీ ఉడికించిన గుడ్లే శ్రేష్టం.  మాంసాహారులు అయితే విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు.  ఇందులో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.                                                    *రూపశ్రీ.
ఇటీవలి కాలం లో అటు సాదారణ జంటలు ముఖ్యంగా ఐ టి రంగం లోని వారి వారి ఉద్యోగాల లో ఉన్న ఒత్తిడి కారణంగా సంసార జీవితం పై ఆశక్తి తగ్గడం, వారి వారి జీవన శైలి కారణంగా పిల్లల ను కనే ఆశక్తి లేకపోవడం వల్ల మరోపక్క ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం తో ఇంటా బయట తీవ్ర అవమానాలు ఎదుర్కోలేక తమ ముఖాన్ని అందరికి చూపించుకోలేక అసలు కొన్ని సందర్భాలలో పెళ్లి పేరంటాలకు సైతం వెళ్లేందుకు ఆశక్తి చూపడం లేదు. ఈక్రమంలో కుటుంబాల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు రావడం సంతానం కలగకపోవడానికి మీరు అంటే మీరు అంటూ చోటు చేసుకుంటున్న పరిణామాలు భార్యా భర్తల మధ్య విభేదాలకు కారణమౌతున్నాయి. ఇది కాస్త ముందుకు వెళ్లి విడాకుల కు దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు.ఈ పరిణామ క్రమం లో ఇటీవలి కాలం లో సెలబ్రేటీలు సరోగసీ పద్ధతి లో పిల్లలను పుట్టించే పనిలో పడ్డారు.ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో సన్నీ లియోన్,శిల్పాశేట్టీ, ఖాన్ కుటుంబం అగ్రభాగాన ఉన్నారు. ఇకతెలుగులో మంచు లక్ష్మి కూడా సరోగసి ద్వారా పిల్లలను కనడం తెలిసిన విషయమే ఇందులో అటు విదేశి క్రీడాకారులు కొందరైతే ఇంకొందరు బాలివుడ్ తారలు ఉండడం గమనించవచ్చు.బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా,నికో జోనాస్ తల్లి తండ్రులు కాబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.సరోగేట్ ద్వారా పిల్లలను స్వాగతిస్తున్నా మని పేర్కొన్నారు.ఇటీవల టాలి వుడ్, కోలివుడ్ నటి నయన తార సరోగసి పద్దతిలో జన్మనివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే వివాహం జరిగి తిరుమల దర్సనంలోను వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిందే. ఇంతలోనే  సరోగాసీ ద్వారా పిల్లలు కన్న విషయం గుప్పు మనడం తో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.కాగా నయన తార చట్టప్రకారం సరోగసి అమలు చేసారా.? నియమ నిబందనల ప్రకారామే వ్యవహరించారా అన్న అంశం చర్చనీయ అంశం కాగా నాలుగు నెలలోనే కవల పిల్లలకు జన్మనివ్వడం సాధ్యా సాధ్యాల పై నిపుణులను నేటిజన్లు  ప్రశ్నిస్తున్నారు. ప్రియాంకా చోప్రా చెల్లెలు మీరా చోప్రాకు పాప పుట్టిందని తెలిపారు. 12 వారాల క్రితమే సరోగసి ద్వారా జన్మించినట్లు ప్రియాంకా చోప్రా వెల్లడించారు.భారత ప్రభుత్వం సరోగసి తో వ్యాపారం చేయడాన్ని నివారించేందుకు జనవరి 25 న సరోగసి చట్టం 2౦21 ప్రకటీంచింది.తమ అందం కరిగిపోతుందన్న  భావనతో ఒకరకంగా స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారనడం లో ఎటువంటి సందేహం లేదు.  బిడ్డకు జన్మనివ్వడం ఆతరువాత పిల్లలకు పాలు ఇవ్వడం వృత్తిపరంగాతాము అవకాశాలు   కోల్పోతామన్న భావన సేలబ్రేటీలలో పేరుకుపోవడం తో సరోగాసి ని అస్రయిస్తున్నరన్నది వాస్తవం. విధం చెడ్డ ఫలం దక్క లేదన్నట్టు సేల్బ్రేటీలు  సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు.సృష్టి కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీరి ఆలోచన పూర్తిగా విమర్సలకు దారితీస్తోంది.  అసలు వీళ్ళు చట్టాన్ని నియమనిభందనలను పాటిస్తున్నారా, చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది అసలు వీరు సరోగాసికి వెళ్లేందుకు ఎవరు అనుమతించారు వీరి సరోగట్ వివరాలు గోప్యంగా ఉంచినా వ్యాపారాత్మకంగా సరోగాసికి ప్రోత్సాహం కల్పిస్తున్నారా అన్నది మరోప్రశ్న.ఇక సరోగాసిలో వైద్యులు చెపుతున్న వివరాల ప్రకారం శుక్రకణాలు X,Xకలిస్తే ఆడపిల్లని  XY. కలిస్తే మగపిల్లవాడని ఒకసరోగట్ కు ఒకరిని మాత్రమే కనాలని నిబంధన ఉన్న కవలలు సాధ్యమా అన్న ప్రశ్నకు గయన  కాలజిస్ట్లు లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సరోగసి చట్టం 2౦21 యొక్కలక్ష్యం... భారత్ లో సరోగాసి తో వ్యాపారం నివారించడమే లక్ష్యంగా పార్ల మెంట్ రూపొందించింది. మనదేశంలో ఉన్న చట్టం ఏమి చెపుతోంది... ప్రముఖ వైద్య నిపుణులు అంశుమన్ కుమార్ మాట్లాడుతూ సరోగసి వైద్య ప్రక్రియ దంపతులకు సంతానం కలగదో పిల్లలు కావాలని కోరు కుంటారో  గర్భసంచిని  అద్దెకు తీసుకోవచ్చు.అలా గర్భాన్ని అదీకిచ్చే మహిళను సరోగేట్ అని అంటారు.సంతానం కావాలని కోరుకునే వారిలో శుక్రకణాలను,అండాశయం లోనుండి తీసి ల్యాబ్ లో పరీక్షించిన తరువాత వైద్య ప్రక్రియ ద్వారా వాటిని శంకరం చేస్తారు.వైద్య విధానం ద్వారా మాత్రమే సరోగేట్ గర్భసంచిలో చేరుస్తారు.సరోగేట్ గర్భంలోనే పిండం పెరుగుతుంది.9 నెలల తరువాత జన్మనిస్తుంది ఈసమయంలో  సరోగేట్ తో జరిగిన ఒప్పందం ప్రకారంఅయ్యే వైద్య ఖర్చు దంపతులే భరించాలి మనదేశం లో ఉన్న ఆర్ధిక అసమానతలు బలహీనంగా ఉన్న మహిళలు సులభంగా సరోగేట్ తల్లులు లభిస్తూ ఉండడం తో విదేశీయులు,ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పిల్లలను కనేందుకు ఈ మార్గం ఎంచుకోవడం ఈ పద్దతిలో పిల్లలను పొందడం సరోగేట్ తల్కికి డబ్బులు ఆశచూపడం చట్టప్రకారం ఇది నిషేదించిన కొన్ని నియమనిబందనల ను రూపొందించి సరోగాసిని నివారించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం మంచిదే. వ్యాపారాత్మక లాభం తో చేసే సరోగసీ పై నియంత్రణ... డిల్లి హైకోర్ట్ న్యాయవాది కరణ్ సింగ్ మాట్లాడుతూ సరోగసి నియంత్రణ చట్టం రెగ్యు లేషన్ యాక్ట్ 2౦21 ప్రకారం వ్యాపార సంబంధ సరోగాసి ని నిలుపుదలచేసింది.డిసెంబర్ 2౦21 పార్లమెంట్ లో చట్టం ఆమోదించింది. జనవరి 25 2౦ 22 ఈచట్టానికి రాష్ట్రపతి ఆమోదించడం తో న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.చట్టం ప్రకారం సరోగసి నిబంధనలకు లోబడి పరస్పర పరోపకారం తోనే సరోగాసీకి అనుమతిస్తారు.సరోగేట్ తల్లి కి తప్పనిసరిగా దంపతులు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.ఆమెకు ౩6 నెలలు నిండి ఉండాలి. దీనితోపాటు సరోగేట్ తల్లికి అయ్యే వైద్యం ఖర్చు దంపతులె భరించాలి.సరోగేట్ తో మరే ఇతర ఆర్ధిక లబాదేవీలు నిర్వహించారాదని చట్టం లో పేర్కొన్నారు.ఏ క్లినిక్ లో అయితే సరోగాసి చేస్తున్నారో అది తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండడం తప్పనిసరి అని చట్టంలో పేర్కొన్నారు. సరోగసిలో ఎగ్ కుసంబందించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించారాదాన్న నిబంధన తప్పనిసరి అని నిబంధనలో స్పష్టం చేసారు. అసలు సరోగేట్ మదర్ ఎవరు అవుతారు?... హైకోర్ట్ న్యాయావాది నవీన్ శార్మ చెప్పిన వివరాల ప్రకారం కొన్ని నిబందనలు చేర్చారు.ఎవరైనా ఒకమహిళ ఒక్కసారి మాత్రమే  సరోగేట్ మదర్ గా ఉంటుంది.ముందే ఆమె వివాహిత అయ్యిఉండాలి.అప్పుడే ఆమె సరోగేట్ తల్లికాగలదు. ఆమెకు ఎటువంటి మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉండకూడదు.వైద్య పరంగా ఆమె ఫిట్ గా ఉండాలి.ఒక వేళ సరోగేట్ తల్లికి ఇన్సూరెన్స్ చేయించక పోవడం,వైద్య ఖర్చులు ఇచ్చే నిబంధన ను ఉల్లంఘిస్తే ఆడంపతులకి 1౦ సంవత్చరాల జైలు 1౦ లక్షల జరిమానా ఇవాల్సి ఉంటుందని నిబంధనలో పేర్కొన్నారు. సరోగాసితో అందరూ తల్లి తండ్రులు కాలేరు. డిల్లి హైకోర్ట్ న్యాయవాది రాజీవ్ కుమార్ మాలిక్ మాట్లాడుతూ ఎవరైతే దంపతులు  సరోగసి ద్వారా పిల్లలు కావాలని అనుకుంటారో వారికి ముందునుండే పిల్లలు ఉండ కూడదు.వారు వ్యక్తిగతంగా ఎవరినీ దత్తత తీసుకుని ఉండకూడదు.దంపతులలో పురుషుల వయస్సు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలని స్త్రీల వయస్సు 2౩-5౦ సంవత్సరాల మధ్యలో ఉండాలి.విడాకులు తీసుకున్న వివాహిత లు, వేరుగా జీవిస్తున్న వారుహోమోసేక్షువల్స్ సరోగాసికి అనుమతిలేదని నిబంధనలో పేర్కొన్నారు.సరోగసిని తప్పుడు పద్దతులలో అనుసరించే వారు నియంత్రిచేందుకు చట్టం అమలు చేస్తున్నారు. చట్టం లో లొసుగులు... సరోగాసి విషయానికి సంబంధించి డాక్టర్ అంశుమన్ మాట్లాడుతూ సరోగాసి ప్రక్రియలో వైద్యనిపునులతో పాటు పిండం తయారి సంక్రమించే పద్ధతి అయ్యే అవకాసం ఉందని నిర్ధారణ కావాలి. అది అదా మగ అని అడగకూడదు. శుక్రకణా లలో 2౩ కన్నా ఎక్కువ ఉంటె ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి అండా ణువులు 2౩ ఎక్స్ క్రోమోజోమ్స్ తీసుకోవాలి రెండింటినీ కలిపి ఫలదీకరిస్తే 46 ఎక్స్ కణాలు ఉంటె ఆడపిల్ల పుడుతుందని శుక్ర కణాలు 2౩ కన్నా ఎక్కువ క్రోజోములు తీసుకుంటే వై క్రోమో జోములు కలిస్తే బాలుడు పుడతాడని నిపుణులు అంటున్నారు. దంపతులు వారివద్ద ఉన్న క్రోమోజోముల లభ్యత ఆధారంగా పిల్లలను సరోగాసిద్వారా పుట్టించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.ఇందులో ఏ మాత్రం చట్టానికి సడలింపు ఉండరాదని పిల్లల పట్ల లింగ వివక్ష ఉండరాదని లింగనిర్ధారణ పరీక్ష నిషేధం అమలు చేయాలాని చట్టంలో పేర్కొన్నారు.సరోగసి విషయం లో నిపునులమధ్య ఎలాంటి అంతర్గత ఒప్పందాలకు తావు ఈయరాదాని పేర్కొన్నారు. కాగా సరోగాసి ద్వారా పుట్టిన బిడ్డకు రక్షణ సంరక్షణ విధానం లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపరాదని ఇందుకోసం సరోగసి చట్టం తో పాటు  బాలల సంరక్షణ, దత్తత కార్ నిబంధనల ప్రకారం 2౦15 ప్రకారం అనుసరించాలని తద్వారా బాలిక సంరక్షణ కలిగిస్తుందని అయితే సరోగాసి నిషేదింప బడలేదని సరోగసి ని నియంత్రణ చేసేందుకు చట్టం రూపొందించామని నిపుణులు పేర్కొన్నారు.
వెల్లుల్లి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏ కొద్దిమందో వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఇది సీజన్ తో సంబంధం లేకుండా వాడుతుంటారు. వెల్లుల్లి లేని వంటను   ఇష్టపడని పరిస్థితితో చాలామంది ఉన్నారు.  ఇది బలమైన రుచి,  ఘాటైన  సువాసన కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం.  జలుబు,  దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి అద్భుతాలు చేస్తుంది. శీతాకాలం అంతటా ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెల్లుల్లిలో మాంగనీస్, పొటాషియం, ఐరన్, కాల్షియం,  విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలో కింది కారణాల చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. యాంటీఆక్సిడెంట్ & యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి  ఆరోగ్యంగా ఉంచుతాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి. వెల్లుల్లిని 'మ్యాజిక్ పదార్ధం'గా పరిగణిస్తారు, ఇది కాలానుగుణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అద్బుతంగా సహాయపడుతుంది.  తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే  వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం  గుండె జబ్బులతో బాధపడే వారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్, గుండెపోటుతో సహా  ఇతర గుండె సంబంధించిన  సమస్యల  ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా,  రక్తపోటు, కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను తగ్గించాలనుకున్నా  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది  వెల్లుల్లిలో సల్ఫర్ తో కూడిన  రసాయనాలు,  యాంటీఆక్సిడెంట్లు  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.  వైరల్ ఇన్పెక్షన్లను  సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వెల్లుల్లిని వివిధ రకాలుగా తినవచ్చు.  పచ్చి వెల్లుల్లినే తినాల్సిన అవసరం లేదు. శరీరాన్ని శుద్ది చేస్తుంది  ఆరోగ్యకరమైన జీవక్రియ వెల్లుల్లి తినడం  ద్వారా సాధ్యమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ది చేయడంలో  సహాయపడుతుంది.  తద్వారా  బరువు తగ్గడాన్ని  ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం, ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల సహజంగా  బరువు-నియంత్రణ సాధ్యమవుతుంది. పచ్చి వెల్లుల్లి రసాన్ని,  తేనెను ఉదయాన్నే తీసుకోవడం వల్ల నిస్సందేహంగా బరువు తగ్గుదలలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది  వెల్లుల్లిలో ఉండే  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యం,  శ్వాసక్రియకు తోడ్పడతాయి.  ఇవి తరచుగా చల్లని వాతావరణంలో వచ్చే  జ్వరం, శ్వాసనాళాలు, ముక్కుల రద్దీ,  గొంతు నొప్పి ద్వారా కలిగే సమస్యలు. వీటికి వెల్లుల్లి చెక్ పెడుతుంది.  జీర్ణక్రియ మెరుగుపరుస్తంది   ఆహారం మెరుగ్గా  జీర్ణం కావడానికి,  పోషకాలను గ్రహించడానికి,  జీర్ణ రసాలు,  ఎంజైమ్‌ల సంశ్లేషణ చాలా అవసరం. ఈ సంశ్లేషణ పెంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.  శరీరం ఆహారం నుండి తగినంత పోషకాలను స్వీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది.                                        *నిశ్శబ్ద.