LATEST NEWS
తెలంగాణ సాధన ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడుపోసుకున్నది కొండాలక్ష్మణ బాపూజీ నివాసంలోనేనని ఆయన చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా  కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  స్వాతంత్ర్య పోరాటం నుంచి  మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు  కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా పోరాట యోధుడిగా నిలిచారని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మనకు కావలసింది ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమా, లేక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమా అంటూ ట్వీట్ చేశారు. లడ్డూ వివాదంలో ప్రకాశ్ రాజ్ స్పందనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. లడ్డూ వివాదంపై తమిళ నటుడు కార్తి చేసిన వ్యాఖ్యపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేయడం... కార్తి సారీ చెప్పడంపై కూడా పవన్ మొత్తానికి అడిగి సారీ చెప్పించుకున్నారుగా అంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద ప్రకాశ్ రాజ్ ట్వీట్లు జనసేనానికి, జనసైనికులకు అసహనం తెప్పిస్తున్నాయనడంలో సందేహం లేదు.
జగన్ ప్రభుత్వ హయాంలో  అప్పటి ఎంపీ  రఘురామకృష్ణ రాజును సీఐడీ కస్టడీలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సంగతి నిజమేనని తెలిపోయింది.  కస్టడీలో రఘురామకృష్ణం రాజును చిత్రహింసలకు గురి చేయడం వాస్తవమేనని అప్టిటి సీఐడీ సిబ్బంది తమ వాంగ్మూలంలో అంగీకరించారు.  రఘురామ రాజును చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను వీడియోకాల్ లో అప్పటి సీఐడీ చీఫ్  సునీల్ కుమార్ కు చూపినట్లు అప్పటి   సీఐడీ సిబ్బంది గుంటూరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  
ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని ఏసీబీ అధికారులు అరెైస్టు చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై వెంకటరెడ్డిపై   ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. అప్పటి నుంచీ పరారీలో ఉన్న వెంకటరెడ్డిని ఏసీపీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నారు. వెంటకరెడ్డితో పాటు రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా ఏసీబీ కేసులు నమోదు చేసింది.   
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రభావం అయోధ్య రామమందిరంపైనా పడింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో  అయోధ్య బాల రాముడికి ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాల నైవేద్యంపై నిషేధం విధించారు.  ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలలోనూ ఇదే పద్ధతి పాటించాలని డిమాండ్ చేశారు.  తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ALSO ON TELUGUONE N E W S
Prince Sivakarthikeyan's multi-lingual biographical action film, Amaran, written and directed by Rajkumar Periyasamy, produced by Ulaganayagan Kamal Hassan, Mr. R. Mahendran and Sony Pictures International Productions, and co-produced by God Bless Entertainment, will see Sai Pallavi playing the female lead. Introducing Sai Pallavi As Indhu Rebecca Varghese, the makers of the movie unveiled a new promo. It offers a glimpse into the emotional journey of Mukund and Indhu. It begins with a captivating sequence of the Republic Day parade. The touching moment where real footage featuring Indhu honoring Mukund, alongside notable figures such as Indian Prime Minister Narendra Modi and former US President Barack Obama, are included. Sai Pallavi's portrayal of Indhu is a standout aspect of the promo. Known for her ability to infuse characters with warmth and authenticity, Pallavi brings depth to Indhu. The chemistry between Sai Pallavi and Sivakarthikeyan is palpable. Intriguingly, the promo focuses mainly on Sai Pallavi’s character. The top-notch technical team includes Music Director G V Prakash, Production Designer Rajeevan, Cinematographer CH Sai, Editor R. Kalaivanan, and Action Directors Anbariv Masters along with Stefan Richter. The film is based on the chapter “Major Varadharajan” from the book titled “India’s Most Fearless”, written by Shiv Aroor and Rahul Singh. Amaran is set for its theatrical release this Diwali on October 31st. Nithiin’s father Sudhakar Reddy, and his sister Nikhitha Reddy will release the movie in Telugu states through Sreshth Movies banner.
Global star Ram Charan’s upcoming political drama Game Changer, directed by the visionary Shankar Shanmugam, is generating immense buzz. The highly anticipated film, set to release in Telugu, Tamil, and Hindi, is expected to be a pan-India blockbuster, captivating Ram Charan’s vast fanbase across the country. Just recently, the makers of Game Changer provided an exciting update regarding the film’s second single, Raa Macha Macha (Telugu and Tamil), titled Dam Tu Dikhaja in Hindi. Penned by Anantha Sriram, Vivek Velmurugan and Kumar for respective languages with music composed by SS Thaman, the promo for the song is set to release on 28 September, and the full song will be available on 30 September. Adding to the excitement, a special 3-minute video was released today, where director Shankar and music director Thaman shared some thrilling details about the making of the song. One of the key highlights is a breathtaking single-shot dance sequence featuring Ram Charan alongside 1000 folk dancers from various Indian states, promising to be a visual feast for fans. Here are more fascinating details about Raa Macha Macha. The song, choreographed by Ganesh Acharya, is the introductory number for Ram Charan in Game Changer. Sung by Nakash Aziz in all three languages (Telugu, Tamil, and Hindi). A tribute to India’s rich culture, the song showcases a wide array of folk dances from different regions including:
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(prakash raj)తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్(pawan kalyan)కి చేస్తున్న ట్వీట్ ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రకాష్ రాజ్ ట్వీట్ ల మీద ట్వీట్ లు చేస్తూనే ఉన్నాడు.  ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేసాడు. మనకేం కావాలి అనే టాగ్ లైన్ ని టైటిల్ గా ఉంచి ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమయినా, అవసరమైతే  తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్టీఆర్(ntr)ఫ్యాన్స్ లో అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లతో భయం పట్టుకుంది.ఇప్పటికే హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ మీద కోపంగా ఉన్నాయి.కొంత మంది అయితే ఏకంగా సినిమా ఆర్టిసులకి సంబంధించిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరకి వెళ్లి ప్రకాష్ రాజ్ ని సినిమాల నుంచి బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో భయం పట్టుకుంది. దేవర లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.   
ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)ఈ రోజు ప్రేక్షకుల తీర్పు కోరుతూ వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ప్రస్తుతం థియేటర్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులతో, ప్రేక్షకులతో కోలాహలం నెలకొని ఉంది.మూవీ చూసిన చాలా మంది  దేవర పర్ఫెక్ట్ మాస్ సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  దేవర ద్వారా ఒకప్పటి అందాల నటి శ్రీదేవి(sridevi)కూతురు జాహ్నవి కపూర్(janhvi kapoor)తెలుగు తెరకు పరిచయమైన విషయం అందరకి తెలిసిందే. తంగం అనే  క్యారక్టర్ లో జాన్వీ సూపర్ గా చేసిందని,ఎన్టీఆర్ ని ఆట పట్టించే సీన్స్ లో అయితే  ఎంతో అనుభవమున్న నటిగా చేసిందని అంటున్నారు.ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ లో అయితే తన అందాలతో ఎన్టీఆర్ ని చుట్టేసుకోవడంతో పాటుగా,ప్రేక్షకుల మతులు పోగొట్టిందనే మాటలు వినిపిస్తున్నాయి.అచ్చం జూనియర్ శ్రీదేవి ని చూస్తున్నట్టుగా ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి తన క్యారక్టర్ వరకు సూపర్ గా చేసి సినిమాకి తన వంతు హెల్ప్ అయ్యిందని కూడా అంటున్నారు   ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న దేవర టోటల్ గా ఫస్ట్ డే కి సంబంధించి 200 కోట్లు దాకా  వసూలు చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని సినీ ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఇదే జరిగితే ఎన్టీఆర్ ఇండియన్ సినీ హిస్టరీ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.  
Mega Prince Varun Tej is gearing up to captivate audiences across India with his upcoming Pan-Indian film, "Matka," directed by Karuna Kumar. The film's shoot nearing compeltion. The actor, who has been choosy in picking roles has recently given his nod for a new film that will be directed by Merlapaka Gandhi. The film rolls this year. First Frame Entertainments are the producers. We've got exclusive information that Satya, who is basking in the afterglow of Mathu Vadalara 2 success, is on board to play a key supporting role in VT15.  A full-length comic caper, it goes to floors in November with half of it to be shot in South Korea next January in a 40-day long schedule. The film will be ready for grand release in Summer 2025.a The actor also gave his nod for Touch Chesi Chudu fame Vikram Sirikonda. The film starts rolling next year and top production house Mythri Movie Makers are the producers. The pre-production work of this untitled film is happening currently.
ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)ఈ రోజు మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడంతో  థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం వచ్చినట్లయింది.ఇక స్క్రీన్ పై ఎన్టీఆర్ ప్రత్యక్షమవ్వగానే అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని మారుమోగించారు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయనే టాక్ వినపడుతుంది.ఆయా సీన్స్ లో ఎన్టీఆర్ కనపరిచిన పెర్ఫార్మెన్సు లో అయితే అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దేవర, వర అనే రెండు పాత్రల్లో విభిన్న నటనని ప్రదర్శించడమే కాకుండా ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడని, మాస్ ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ అనే టాక్ అయితే వస్తుంది. ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంతో పాటు షిప్ నుండి సరకు దొంగలించే ఎపిసోడ్ కూడా ఆకట్టుకున్నాయనే మాటలు వినిపడుతున్నాయి. జనతా గ్యారేజ్ తో మ్యాజిక్ చేసిన కొరటాల శివ(koratala siva)ఎన్టీఆర్ కాంబో దేవర తో మరోసారి మ్యాజిక్  చేసిందని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఇక ఫ్యాన్స్ అయితే దేవర రిజల్ట్  పట్ల ఫుల్ హ్యాపీ గా ఉండటంతో పాటు దేవర సాధించబోయే సరికొత్త  రికార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే ఫస్ట్ డే కి సంబంధించి 200 కోట్లు దాటిందనే వార్తలు వస్తున్నాయి.   
Young actor Bellamkonda Sreenivas, is committed to Nandhi fame Vijay Kanakamedala for a film and it is the remake of Tamil blockbuster film Garudan. The film is also a multi-starrer and it features Bellamkonda Sreenivas, Nara Rohit and Manchu Manoj in the lead roles. Manchu Manoj is essaying a role with negative shades in the film. Veera Dheera Sura is the title locked for this interesting film. The makers wanted to lock the original title Garudan for the film but it was registered be someone else. Its been 13-14 days since the film went to floors. The shoot is progressing at RFC, Hyd. It should be wrapped up by December 1st week. Director Vijay Kanakamedala has retained the soul of the original while making adequate changes. It is a neo-noir action drama. KK Radha Mohan is the producer of this film. More details to be announced soon. Bellamkonda Sai Srinivas is also busy filming for Tyson Naidu under the banner of 14 Reels production house, and is directed by Sagar K Chandra. The film is currently underway and will be wrapped up soon. The actor is simultaneously shooting for Ludheer’s film and an untitled film directed by Koushik Pegallapati.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.ఎన్టీఆర్ వన్ మాన్ షో దేవర(devara)ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మిడ్ నైట్ పన్నెండు గంటల నుంచే అన్ని ఏరియాస్ లో షోస్ పడటంతో ఆయా థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కూడా వచ్చినట్లయ్యింది.  ఇక మూవీ చూసిన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అయితే ఎన్టీఆర్ నటనకి ఫిదా అవ్వడంతో పాటు దేవర,వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్తు అని అంటున్నారు.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అయితే ఒక రేంజ్ అరాచకమే సృష్టించాడని, డాన్స్ లు కూడా ఇరగదీశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మూవీ మొత్తానికి ఎన్టీఆర్ నటనే హైలట్ అనే మాటలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మిగతా పాత్రల్లో చేసిన నటినటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసారని కూడా ప్రేక్షకులందరు ముక్త కంఠంతో చెప్తున్నారు.ఓవర్ సీస్ ప్రేక్షకులు కూడా చాలా సంవత్సరాల తర్వాత మంచి మాస్ సినిమా చూశామనే ఫీల్ తో ఉన్నారని తెలుస్తుంది. టోటల్ గా దేవర పక్కా మాస్ మూవీ అని మాస్ ని ఇష్టపడే ప్రేక్షకులకి పండుగే అనే మాటలు కూడా విన్పిస్తున్నాయి. మరి ఈ లెక్కన కలెక్షన్స్ పరంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన దేవర రాబోయే రోజుల్లో మరెన్నిరికార్డులు తన ఖాతాలో  వేసుకుంటుందో చూడాలి. కొరటాల శివ(kortala siva)దర్శకుడు కాగా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్,అజయ్ వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించగా అనిరుద్ సంగీతాన్ని అందించాడు.  
తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్,  శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్ ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్‌ వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్‌ రచన, దర్శకత్వం: కొరటాల శివ నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్స్: యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ విడుదల తేదీ: సెప్టెంబర్ 27, 2024  'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'దేవర'. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి ఏకంగా ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ సేల్స్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన దేవర.. ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ఎన్టీఆర్-కొరటాల కాంబోకి మరో బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Devara Movie Review) కథ: ఎర్రసముద్రం అని పిలవబడే ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. వారి పూర్వీకులు దేశానికి రక్షణగా సముద్రతీర ప్రాంతంలో సైనికుల్లా నిలబడితే.. ప్రస్తుత తరం మాత్రం స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలై, డబ్బుల కోసం అక్రమ రవాణాలో భాగమవుతుంటారు. వారిలో దేవర(ఎన్టీఆర్) కూడా ఒకడు. అతను ఒక గ్రామానికి పెద్ద. చేసేది తప్పుడు పని అయినప్పటికీ, కొన్ని విలువలు పాటిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక ఘటనతో దేవరలో పూర్తిగా మార్పు వస్తుంది. పూర్వీకుల్లా తాము కూడా మంచిగా బ్రతకాలని, స్మగ్లింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనతో పాటు మిగతా వారిని కూడా స్వగ్లింగ్ మానేయాలని చెప్పడమే కాకుండా.. మాట వినని వారిని దండించడం మొదలుపెడతాడు. దీంతో మరో గ్రామ పెద్ద అయిన భైర (సైఫ్ అలీ ఖాన్)తో పాటు, పలువురు దేవరపై కోపం పెంచుకుంటారు. దేవర ఉండగా స్వగ్లింగ్ చేయడం కుదరదని అర్థమై.. అతన్ని అంతమొందించాలి అనుకుంటారు. మరోవైపు ఏం చేసినా భైర వంటి వారిలో మార్పు రాకపోవడంతో.. 'కనిపించని భయాన్ని అవుతా' అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతాడు దేవర. అప్పటినుంచి తప్పుడు పని కోసం ఎవరు సముద్రంలోకి వెళ్లినా వారి అంతు చూస్తుంటాడు. దీంతో స్మగ్లింగ్ అంటేనే అక్కడివారు భయపడతారు. కొన్నేళ్ళకు అందరూ స్మగ్లింగ్ కి దూరమవుతారు. అసలు దేవర ఎక్కడికి వెళ్ళాడు? ఎవరికీ కనిపించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవర మళ్ళీ తిరిగొచ్చాడా? అతన్ని చంపాలన్న భైర కోరిక నెరవేరిందా? ఇందులో వర (ఎన్టీఆర్), తంగం (జాన్వీ కపూర్) పాత్రలేంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది ట్రెండ్ లా మారిపోయింది. నిజంగా కథలో విషయం ఉండి.. రెండు భాగాలుగా చెప్పాల్సినంత పెద్ద కథ అయితే అలా చేయడంలో తప్పులేదు. కానీ చిన్న కథను రెండు భాగాల పేరుతో సాగదీస్తేనే మొదటికే మోసం చేస్తుంది. దేవర చాలా పెద్ద కథ అని, అందుకే రెండు భాగాలుగా చేస్తున్నామని దర్శకుడు కొరటాల విడుదలకు ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. కానీ సినిమా చూశాక మాత్రం, ఆయన చెప్పినంత పెద్ద కథ అయితే కాదనే అభిప్రాయం ప్రేక్షకులకు కలిగే అవకాశముంది. అయితే కథ చిన్నదైనప్పుడు.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు, యాక్షన్ ఎలిమెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టి, ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయగలగాలి. కొరటాల కూడా అదే చేసే ప్రయత్నం చేశారు. ఒక పెద్ద స్మగ్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ పాత్రధారి అజయ్ ఎర్రసముద్రానికి వెళ్లడం, అతనికి ప్రకాష్ రాజ్ 'దేవర కథ' చెప్పడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. దేవరగా ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం, షిప్ నుండి సరకు దొంగలించే ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి. అప్పటికే ఈసారి కొరటాల ఏదో కొత్తగా ట్రై చేశాడని అర్థమవుతుంది. ఆయుధపూజ సాంగ్, ఫియర్ సాంగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ రేసీగానే నడుస్తుంది. ఒకట్రెండు చోట్ల కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ.. తప్పుడు పనులు మానేయాలంటూ దేవర సొంతవారికే ఎదురుతిరగడం, వారు అతన్ని చంపాలనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం బాగానే నడిచింది. ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ఇక సెకండాఫ్ ప్రధానంగా వర (ఎన్టీఆర్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. అప్పటివరకు సీరియస్ గా నడిచిన సినిమా.. వర-తంగం (జాన్వీ కపూర్) లవ్ ట్రాక్ తో ఒక్కసారిగా సరదాగా మారిపోవడం చూసే ఆడియన్స్ కాస్త కొత్తగా అనిపించవచ్చు. జాన్వీ గ్లామర్ ఆ ఎపిసోడ్ కి ప్లస్ అయింది. ముఖ్యంగా 'చుట్టమల్లే' సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మెప్పించాయి. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కాస్త స్పీడ్ తగ్గింది. పతాకసన్నివేశాల్లో యాక్షన్ ఎపిసోడ్ ని ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ జనరల్ ఆడియన్స్ కి కొంత కిక్ ఇవ్వొచ్చు. 'బాహుబలి-1' తరహా ముగింపుతో పార్ట్-2 కి లీడ్ ఇచ్చారు. నిజానికి పతాక సన్నివేశాలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. కానీ ఎందుకనో కొరటాల కలం కాస్త తడబడింది. మెజారిటీ సినిమాలు ప్రస్తుత కథని ముందు చూపించి, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంటాయి. కానీ దేవరలో ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించి, సెకండ్ హాఫ్ లో ప్రజెంట్ చూపించారు. అలా కాకుండా ప్రధమార్ధంలోనే వర పాత్రని చూపించి, ఇంటర్వెల్ కి ముందు దేవర పాత్రను పరిచయం చేసి.. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ని నడిపించి ఉంటే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది అనిపించింది. స్క్రీన్ ప్లే అలా రాసుకొని ఉంటే.. సెకండాఫ్ లో యాక్షన్ డోస్ పెరిగి, ఆడియన్స్ మరింత కిక్ తో బయటకు వచ్చే అవకాశం ఉండేది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రీకొడుకులు దేవర, వర పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా పిరికివాడి నుంచి వీరుడిలా మారే వర పాత్రలో రెచ్చిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. వయసు పరంగా రెండు వేరియేషన్స్ ఉన్న.. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెప్పించాడు. ఎన్టీఆర్ తో తలపడే సన్నివేశాల్లో విజృంభించాడు. జాన్వీ క‌పూర్ పోషించిన తంగం పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో తన అందం, అభినయంతో మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ లో తన గ్లామర్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. దేవర భార్య పాత్రలో శృతి మరాఠే ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఎప్పటిలాగే తమదైన నటనతో వారి పాత్రలకు న్యాయం చేశారు. అజయ్, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా దేవర చిత్రం ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ తో ఇప్పటికే ఆకట్టుకున్న అనిరుధ్.. ఆయుధపూజ సాంగ్ తో అదరగొట్టాడు. ఇక నేపథ్య సంగీతమైతే సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు కెమెరా పనితనం ఆకట్టుకుంది. 1980-1990 కాలం నాటి సముద్రతీర ప్రాంతంలో జరిగే కథతో రూపొందిన ఈ సినిమాకి సాబు సిరిల్‌ ఆర్ట్ వర్క్ మెప్పించింది. యుగంధర్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ బాగానే ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సన్నివేశాల కూర్పు కూడా బాగానే కుదిరింది. కొరటాల రాసిన కొన్ని సంభాషణలు బాగున్నాయి కానీ, పూర్తిస్థాయిలో ఆయన మార్క్ కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా... యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ మేళవింపుతో యాక్షన్ డ్రామాగా రూపొందిన 'దేవర' మూవీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఫ్యాన్స్ కి, మాస్ ఆడియెన్స్ కి మాత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపే అవకాశముంది. రేటింగ్: 2.5/5 - గంగసాని
Sudarshan Paruchuri, grandson of legendary writers Paruchuri Brothers, is making his debut into films with the upcoming intriguing action and crime thriller Mr Celebrity. The film directed by Chandina Ravi Kishore, and produced by N Panduranga Rao and Chinna Reddaiah under the RP Cinemas banner is carrying enthusiastic reports. Today, the makers announced the film’s release date. Mr Celebrity will grace the cinemas on October 4th, nearly a week before Dussehra festival. Paruchuri Brothers who launched the release date poster extended best wishes to their grandson and also the whole team of Mr Celebrity. While speaking on the occasion, Paruchuri Gopalakrishna said, “Our grandson Sudarshan is making his debut with Mr Celebrity which will be hitting the screens on October 4th. Although it’s a first film as a director for Ravi Kishore, he made the movie impressively. His movie is sure to captivate everyone. We hope that you, who have blessed us as writers, actors, and directors, will also extend your blessings to our grandson.” Paruchuri Venkateswara Rao said, “The Telugu audiences have supported us immensely over the past 40 years in the industry as writers, actors, and directors. Our grandson, Sudarshan Paruchuri, is coming up with his first film Mr Celebrity releasing on October 4, seeking your blessings and support. We hope for a great success. The producers have made this film remarkably without compromising on anything. The director has done a fantastic job. Your support will ensure Sudarshan remains in the industry for a long time. This is not just for a living; he comes for the love of the audience. The title itself holds the story, revealing what a celebrity's life is all about.” Varalaxmi Sarathkumar and Sri Deeksha are the leading ladies in the movie. Shiva Kumar Dewarakonda handled the cinematography, while Vinod Yajamanya scored the music. Shiva Sharvani is the editor. As the makers have announced the release date, they will intensify the promotional activities.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.
డబ్బు మనిషికి తప్పనిసరి అయిపోయింది. మానవ కార్యకలాపాలలో డబ్బుదే కీలకపాత్ర. డబ్బు లేకుంటే మనిషికి గౌరవం లేకపోవడం మాట అటుంచిదే.. జీవనం దుర్బరంగా మారుతుంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మంచి జీవితం, కన్న కలలు, సమాజంలో ఆర్ధిక హోదా వంటివన్నీ డబ్బుంటేనే నెరవేరుతాయి. అందుకే ప్రతి వ్యక్తి తమకు లోటు లేకుండా డబ్బు ఉండాలని అనుకుంటాడు. అందుకోసం కష్టపడి సంపాదించడమే కాకుండా ఇంట్లో ధనం నిలవడానికి చాలా పరిహారాలు, ప్రయత్నాలు, పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని  మొక్కలు ఇంట్లో పెంచితే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని అంటున్నారు. ఇంతకీ అవేం మొక్కలంటే.. వెదురు మొక్క.. వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ఈ మొక్క ఇంట్లో వారి జీవితాలలో ఆనందాన్ని,  కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుతుందట.  అందుకే వెదురు మొక్కను పెంచుకోవడం మంచిదంటున్నారు. మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో ఉండే మొక్క. ఈ మొక్క ఇంట్లో ఉంటే పేరుకు తగ్గట్టే ఆర్థికంగా బాగుంటుందని,  ఆ ఇంట్లో ధనం అభివృద్ది చెందుతూ ఉంటుందని అంటారు. అయితే మనీ ప్లాంట్ లో పసుపు రంగు ఆకులు ఉండకుండా చూసుకోవాలి ముదురు ఆకుపచ్చ ఆకులు మాత్రమే ఉండాలి.   పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  ఈ మొక్క ఇంటి పరిసరాలలోనూ, ఇంట్లోనూ గాలిని శుద్ది చేస్తుంది.  ఇంటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.  ఇంటి ఆర్థిక అభివృద్దికి దోహదం చేస్తుంది. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్.. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ మొక్క ఆకులు పెద్దగా ఏనుగు చెవుల ఆకారంలో ఉంటాయి.  ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి కూడా ఈ మొక్క సహాయపడుతుందట. స్నేక్ ప్లాంట్.. స్నేక్ ప్లాంట్ మొక్క గాలిని శుభ్రపరుస్తుంది.  ఈ మొక్క  ఒకవైపు ఆరోగ్యాన్ని, మరొకవైపు ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ను కూడా ఇస్తుంది. శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే మంచిది. చైనీస్ మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ భారతీయుల దగ్గర ఒక విధంగానూ, చైనా ప్రజల దగ్గర ఒక విధంగానూ ఉంటుంది.  చైనీస్ మనీ ప్లాంట్ కు ఆకులు గుండ్రంగా ముదురు ఆకువచ్చ రంగులో ఉంటాయి.  ఇవి ధన ఆకర్షణ కలిగి ఉంటాయని అంటారు. అదే విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయట. తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సిట్రస్ మొక్కలు.. నమ్మరు కానీ సిట్రస్ మొక్కలను ఇంట్లో పెంచుతుంటే అదృష్టం కలిసొస్తుందట. సిట్రస్ పండ్లు ఎలాగో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.  ఇక ఇవి పెరుగుతున్న ఇంట్లో ఆర్థికంగా మంచి అభివృద్ది ఉంటుందట.  సిట్రస్ మొక్కల నుండి వచ్చే సువాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.                                               *రూపశ్రీ.  
చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  
   జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా జుట్టు బలహీనత,  జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.  కుటుంబంలో ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారికి జన్యుపరంగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, జీవనశైలి,  ఆహారానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతాయి. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. పోషకాలు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్-డి,  విటమిన్-బి7 లేదా బయోటిన్, విటమిన్-ఇ,  విటమిన్-ఎ వంటి పోషకాలు జుట్టుకు సమతుల ఆహారంగా పనిచేస్తాయి. వీటి లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు వేగంగా రాలుతున్నా, జుట్టు బాగా రాలిపోతున్నా ఆహారంలో పోషకాలను తనిఖీ చేసుకోవాలి.  దీని వల్ల జుట్టు రాలడానికి ఏం చేయాలి? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏం తినాలి అనే విషయాల మీద అవగాహన పెరుగుతుంది. బయోటిన్ లోపిస్తే.. బయోటిన్ లేదా విటమిన్-బి7 లోపిస్తే జుట్టు, చర్మం, గోళ్లకు చాలా నష్టం కలుగుతుంది.  జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి బయోటిన్ అవసరం.  బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.  ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి అవసరం. అలాగే బయోటిన్ లోపిస్తే వెంట్రుకలు పల్చబడటం,  చిట్లడం కూడా జరుగుతుంది.   తరచుగా మహిళలు గర్భం దాల్చడం,  కొన్ని రకాల మందులు ఉపయోగించడం,  కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బయోటిన్ పుష్కలంగా ఉన్న ఆహారం, లేదా బయోటిన్ విటమిన్-ఎ లోపిస్తే.. జుట్టు గ్రంధులలో సెబమ్ ఉత్పత్తిని పెంచడంలో విటమిన్-ఎ సహాయపడుతుంది.  ఇది జుట్టును,  స్కాల్ప్ ను తేమగా ఉంచడానికి అవసరం అవుతుంది.  విటమిన్-ఎ లోపం ఉన్నవారిలో జుట్టు పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుంది.  అయినప్పటికీ విటమిన్-ఎ లోపం అధికంగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది.  మరొక విషయం ఏమిటంటే విటమిన్-ఎ శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నా జుట్టు రాలడం జరుగుతుంది.  కాబట్టి విటమిన్-ఎ సరైన మోతాదులో తీసుకోవాలి.  
టీ అనేది భారతీయులకు పెద్ద ఎమోషన్. ఉదయం చాయ్ తో మొదలయ్యే పనులు పూర్తయ్యే వరకు మద్య మద్యలో చాయ్ పడుతూనే ఉండాలి చాలామందికి.  చాయ్ తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కొందరికి. మరికొందరు ఆఫీసులలోనూ,  పనులలోనూ బ్రేక్ తీసుకోవడానికే చాయ్ ని సాకుగా చూపెడుతుంటారు. టీ అంటే టీ డికాక్షన్,  పాలు, పంచదార మాత్రమే కాదు. కొన్ని చోట్ల బ్లాక్ టీ తాగుతారు. మరికొన్ని చోట్ల గ్రీన్ టీ తాగుతారు. కానీ లోటస్ ప్లవర్ టీ గురించి తెలిసినవారు తక్కువ.  తామర పువ్వుల టీ చాలా చర్చగా మారింది.  ఈ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే.. తామర పువ్వుల టీ రుచిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ తామర పువ్వుల టీ తాగుతుంటే చాలా అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. మొదట దీన్నెలా చేయాలంటే.. తామర పువ్వుల టీ తయారుచేయడం చాలా సులభం.  ఒక గిన్నెలో గ్లాసు నీరు పోయాలి.  ఈ నీటిని మరిగించాలి.  ఈ నీటిలో ఎండిన లేదా తాజా తామర పువ్వులు వేసి మూత పెట్టి  కొన్ని నిమిషాలు ఉడికించాలి.  ఆ తరువాత స్టౌవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచాలి.   తామర పువ్వులు ఉడికిన నీరు చల్లారిన తరువాత దాన్ని స్టైయినర్ తో ఫిల్టర్ చేయాలి.  ఈ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని, స్వచ్చమైన రోజ్ వాటర్ జోడించవచ్చు.  ఇందులో రుచి కోసం కాసింత తేనె కూడా కలుపుకోవచ్చు. అంతే తామర పువ్వుల టీ తాగడానికి సిద్దమైనట్టే. ప్రయోజనాలేంటంటే.. తామర పువ్వులలో  అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి ఒత్తిడి, నిరాశ,   ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో తామర పువ్వుల టీని రోజుకు ఒకటి నుంి రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి అసౌకర్యాల నుండి ఉపశమనం ఉంటుంది.                                             *రూపశ్రీ.
పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క జామ పండు తింటే చాలాసేపు ఆకలి అనే పదం మరచిపోతారు. అయితే ఎప్పుడూ జామ పండ్ల గురించేనా జామ ఆకుల గురించి తెలుసుకోవద్దా.. కాయలు లేకపోయినా సరే చెట్టుకు ఆకులైతే ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున జామ ఆకులను తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే జీర్ణసంబంధ సమస్యలు అన్నీ చిటికె వేసినట్టు మాయం అవుతాయి. జీర్ణాశయాన్ని శుద్ది చేయడంల, జీర్ణక్రియ పనితీరు మెరుగుపరచడంలో జామ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. జామ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని ఉదయాన్నే నమిలి తింటే అద్బుతం జరుగుతుంది.  కాంప్లెక్స్ స్టార్స్ను చక్కెరగా మార్చడాన్ని జామఆకులు నిరోధిస్తాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో అదనపు చక్కెరలు, అదనపు కొవ్వుల నిల్వను అరికడుతుంది. దీని ఫలితంగా అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి జామ ఆకులు తోడ్పడతాయి. ఉదయాన్నే జామ ఆకులు నమిలి తినడం లేదా జామ ఆకులతో టీ తయారుచేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేస్తే శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలలో అతిసారం ఒకటి. అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.  ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులు వేసి బాగా మరిగించాలి.  ఈ ద్రావణాన్ని రోజులో రెండుసార్లు కొద్దికొద్దిగా తాగాలి.  ఇలా చేస్తే లూజ్ మోషన్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహం ఉన్నవారికి జామకాయలు చాలామంచివి అనే మాట వినే ఉంటాం.  అయితే జామఆకులు కూడా చాలామంచివి. జామఆకులు శరీరంలోని సుక్రోజ, మాల్టోస్ శోషణను నిరోధిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 10నుండి 12వారాలపాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ ఇత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా  రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులను బాగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ చెయ్యాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉదయాన్నే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం వల్ల కొద్దిరోజులలోనే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోవడానికి కూడా జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్ చేసి ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాయాలి. దీనివల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.                                                              *నిశ్శబ్ద.