‘మై నేమ్ ఈజ్ ఖాన్’ కు సేఫ్టీ
ముంబై: షారూఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్ర విడుదలకు ఆటంకం కలగకుండా తగిన భద్రత కల్పిస్తామని ముంబై పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాత, దర్శకుడు కరన్ జోహర్ మంగళవారం ముంబై పోలీసు కమిషనర్ ను కలిశారు. చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలవుతోంది. కరన్ జోహర్ మల్టిప్లెక్స్ ల యజమానులతో కలిసి పోలీసు కమిషనర్ డి. శివానందన్ తో సమావేశమయ్యారు. చిత్రం విడుదలయ్యే అన్ని హాళ్ల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేస్తామని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చినట్లు కరన్ జోహర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. విడుదలకు అన్నీ సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఇచ్చిన హామీతో తాను సంతృప్తి చెందినట్లు ఆయన తెలిపారు.

