మైదాన ప్రాంతాల్లో వర్షం
జమ్మూ కాశ్మీర్లోని శిఖర ప్రాంతాల్లో భారీగా హిమపాతం పడుతుంటే, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులుగా అదే పరిస్ధితి. చాలా ప్రాంతాల్లో 5-6 అడుగుల మేర హిమపాతం పేరుకుపోయింది. దీంతో బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అమరనాథ్ వద్ద మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మరో 24 గంటల పాటు హిమపాతం, వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాశ్మీర్ ముఖద్వారమైన జవహర్‌టన్నెల్ వద్ద భారీగా మంచుకురవడంతో జమ్మూ -శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రహదారిపై 500 వాహనాలు చిక్కుకుపోయాయి. మరోవైపు రాజస్ధాన్‌లో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పంజాబ్, హర్యానాల్లో కూడా చెదురుమదురుగా చిన్నపాటి జల్లులు పడుతున్నాయి.

