|

జూడాలకు కొత్త రూల్

Doctorsహైదరాబాద్: వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ పూర్తిచేసిన వైద్యులందరూ ఏడాదిపాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలి. ఈ నిబంధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వైద్య విద్యా శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిబంధన ప్రకారం వచ్చే సంవత్సరం 14 వందల మంది వైద్యుల సేవలు గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. అలాచేయకపోతే జరిమానా విధిస్తారు. పీజీ డిప్లామా చేసినవారికి 15 లక్షల రూపాయలు, పిజి డిగ్రీ చేసినవారికి 20 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని మంత్రి సుదర్శన రెడ్డి చెప్పారు.

  • Share/Bookmark

Tags: , , , , , , , ,

Related News

» వాటి నియంత్రణకూ కమిటీ

» సుప్రీంలో జయకు చుక్కెదురు

» స్మగ్లర్లు కనిపిస్తే కాల్చివేత

» తెలంగాణకు అన్యాయం : లగడపాటి

» కాంట్రాక్టర్లకు హెచ్చరికలు...

» శిశువుల అమ్మకాలు... పట్టించుకొని ఐసిడిఎస్

» కాలానికి అనుగుణంగా 3జీ సేవలు

» బెజవాడలో సినీఫక్కిలో చోరీలు

» తీర్మాన ఆమోదం అప్రజాస్వామికం : చిరు

» నదిలో బస్సుపడి 18మంది మృతి..

Leave a Reply