|

నెల్లూరు జిల్లాలో గ్లాస్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా నాయుడు పేటలో గ్లాస్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు హిందూస్ధాన్‌ నేషనల్‌ గ్లాస్‌ కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రోశయ్యతో సచివాలయంలో ఆ సంస్ధ ప్రతినిధులు భేటి అయ్యారు.  వెయ్యికోట్ల పెట్టుబడితో గ్లాస్‌ ప్లాంట్‌ను ఏప్రిల్‌లో స్ధాపించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా అన్నివిధాల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.  తొలివిడతగా రూ. 480 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.  ఈ ప్లాంట్‌లో రోజుకు 600 టన్నుల గ్లాస్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2012 నాటికి ప్లాంట్‌ నిర్మాణం పూర్తికానుందని చెప్పారు.

  • Share/Bookmark

Tags: , , , , , , , ,

Related News

» వాటి నియంత్రణకూ కమిటీ

» సుప్రీంలో జయకు చుక్కెదురు

» స్మగ్లర్లు కనిపిస్తే కాల్చివేత

» తెలంగాణకు అన్యాయం : లగడపాటి

» కాంట్రాక్టర్లకు హెచ్చరికలు...

» శిశువుల అమ్మకాలు... పట్టించుకొని ఐసిడిఎస్

» కాలానికి అనుగుణంగా 3జీ సేవలు

» బెజవాడలో సినీఫక్కిలో చోరీలు

» తీర్మాన ఆమోదం అప్రజాస్వామికం : చిరు

» నదిలో బస్సుపడి 18మంది మృతి..

Leave a Reply