ఎగిసి పడుతోన్న సీమాంధ్రా!
విజయవాడ: తెలంగాణ అంశంపై కేంద్రం అనుసరించే అసంబద్దమైన వైఖరి వల్ల సీమాంధ్రాలో నిరసన జ్వాలను చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకూ శాంతియుతంగా, సౌమ్యంగా ఉన్న సమైక్యాంధ్రావాసులు ఎగిసిపడే రోజులు దగ్గర పడుతున్నాయి. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుకు సిద్దం అవుతోన్న విధానం చూస్తుంటే పరిస్ధితులు చేయిదాటి పోయే ప్రమాదం ఉందనిపిస్తోంది. సీమాంధ్రలో ఇప్పటి వరకూ పోరాటపటిమ అనుకున్నంత వాడి, వేడితో రూపొందలేదని, ముందుకు సాగలేదని భావిస్తున్నారు. కానీ కేంద్రం విధానం ఒకవైపు, తెలంగాణాల నాయకులు వ్యవహరించే తీరు మరోవైపు చూస్తుంటే సీమాంధ్రా ఐక్యకార్యచరణ సమితి నేతల గుండెలు రగిలిపోతున్నాయి. జాతిని సమైక్యంగా ఉంచాలని, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడాలని చేసే విజ్ఞప్తిని పట్టించుకున్నట్లుగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని, సమైక్యంగానే అభివృద్ది పథంలో పయనిద్దామనే అంశాన్ని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటోన్న నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని, దీనికోసం చేసే పోరాటాన్ని, సృష్టించే అశాంతిని సీమాంధ్ర ఐక్యకార్యచరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం దగ్గర ఇచ్చిన మాట ప్రకారం శాంతియుతంగా వ్యవహరిస్తున్నామని, లేకపోతే పరిస్ధితులు వేరుగా ఉంటాయని నాయకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అంశంపై ఉన్నట్లుండి ప్రకటన చేయడం, అశాంతిని సృష్టించడం, మరోసారి కమిటీని వేస్తున్నట్లు ప్రకటించడం చూస్తుంటే కేంద్రం దగ్గర కూడా ఈ అంశంపై స్పష్టమైన విధానం లేదనే అనుమానం కలుగుతోంది. ఉవ్వెత్తున్న ఎగిసి పడుతోన్న ఆగ్రహజ్వాలలను చూసిన తర్వాత కేంద్రం వైఖరిలో స్వల్ప మార్పు వచ్చింది. అయినా సరే కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లుగా వ్యవహరించడం ఏమాత్రం భావ్యం కాదు. ఎంత అలజడి సృష్టిస్తే అంతగా ప్రభావితం అయినట్లు భావించడం ప్రజాస్వామ్యంలో సరైన వైఖరి మాత్రం అనిపించుకోదు. హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్మితం కావాల్సిందే. కానీ అవి చట్టం పరిధిలో, రాజ్యాంగ బద్దంగా ఉండాలనే నియమం కూడా ఉంది. చట్టాన్ని కాదని, రాజ్యాంగాన్ని తోసిరాజనే హక్కు, అధికారం ఎవరీకి లేదని గుర్తించాలి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను అవలోకం చేస్తే అన్నింటికి అతీతంగా వ్యవహరించే శక్తులు బలపడుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అసాధారణమైన పరిస్ధితులు వచ్చిపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యవ్యవస్ధకు పెను సవాల్‌గానే పరిణమించబోతోంది. మానవహక్కులు మంటగలిసిపోతున్నాయి. నిండు జీవితాలు గాల్లో తేలియాడుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతుంది. అభివృద్ది, సంక్షేమ రంగాలు అల్లకల్లోలంగా మారాయి. దీనికి కారణం ఎవరు..? ఎవర్ని నిందించాలి..? ఉద్యమాలు పేరుతో ఉపద్రవాలు సృష్టిస్తే సరిపోతుందా..? కష్ట, నష్టాలను అవలోకనం చేసే అవకాశం లేదా..? మనుషులు కళ్లముందే కుప్పకూలిపోయినా ఫరవాలేదా..? ఒక మనిషిని బలితీసుకున్న తర్వాత వచ్చే స్వేచ్చ రాకపోతేనేం..? ఇవన్నీ ఉద్యమకారులు యోచన చేయాలి. ఉద్యమాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. కానీ దాన్లోనూ శాంతి ఉండాలి. పోరాటాలు ఎప్పుడూ పొగరు గానే సాగుతాయి. కానీ వాటిల్లో కాస్త పౌరజీవనం గురించీ అలోచించాలి. సాటి మనిషి గురించి, అతని జీవితాన్ని గురించి అలోచించలేని మనం పోరాటాలను నిర్మాణం చేసి, హక్కులను ఎలా సాధించగలం..? ఈ మాత్రం కూడా తెలుసుకోలేక పోతే పోరాటయోధులెలా అవుతారు..? రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది సీమాంధ్రా నేతల డిమాండ్. లేదు విడిపోవడమే అనివార్యమనేది తెలంగాణ నాయకుల సవాల్. దీనికి ఒక విధానం ఉండదా..? రాజ్యాంగబద్దంగా వ్యవహరించే పద్దతి ఉంటుంది కదా..? మరెందుకు అందరూ దీన్ని రాద్దాంతం చేస్తారు..? ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. దాన్ని అన్వేషించి, నిజాయితీగా, న్యాయబద్దంగా, స్వార్ధరహితంగా చూసినప్పుడే సాధ్యం అవుతుంది. ఈ దిశగా నాయకులు యోచన చేయాలి. రాష్ట్రం సమగ్రాభివృద్ది కోసం ప్రతి జీవి స్పందించాలి.


True.. there a constitutional procedure for many of the problems related to the bifurcation of the state. But the democracy always creates the scenario that the more chaos u create the more attention u get. Thats nothing but mass hysteria. How can one leave a state in the hands of hysterics in the name of Self Respect and Oppression ? First let them learn self restraint and be a part of development of the state. Perform before u Demand ur rights Separatests… Stop shouting start performance for the state growth. IPL is gone, New Projects are a history.. what do u hv to look forward.. yet another corpse readied in the name of Tissue?
jai telangana
దీనికి కారణం ఎవరు.. inka evaru lagadapati addam padaka pote godavale ayyevi kaavu kaaranam jagadapaati