|

ఆయన వ్యక్తిగతమన్న చిత్రపరిశ్రమ

Ntr--2హైదరాబాద్‌: అదుర్స్‌ చిత్ర నిర్మాత, టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినిమా రంగానికి రాజకీయాలు ఎప్పుడూ దూరమని నిర్మాతల మండలి, మూవీ అర్టిస్ట్‌ అసోసిమేషన్‌ తెలిపింది. నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని,  ఆయన వ్యాఖ్యలకు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. పార్టీలన్ని చిత్ర పరిశ్రమకు సహకరించాయని, ఇక ముందూ సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. కొడాలి నానిపై సర్వసభ్యసమావేశంలో చర్చించి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని నిర్మాతల మండలి ప్రతినిధులు తెలిపారు.  ఇక నుంచి సినిమా షూటింగ్‌లు చేసే సమయంలో నిర్మాతలు పోలీసుల రక్షణ కోరాలని సూచించారు. కాగా కొడాలి నాని ముఖ్యమంత్రి పైన, తెలంగాణపైన చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశరావు డిమాండ్‌ చేశారు.  లేకుంటే ఆంధ్రప్రాంత వ్యాపారులు తెలంగాణలో నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

  • Share/Bookmark

Tags: , , , , , , , ,

Related News

» Osama is hiding in Pak

» Saina Nehwal proves to be the Pride of India

» క్యాంపు ఆఫీసుకు రోశయ్య

» కింగ్స్ తో చార్జర్స్ ఢీ

» Maoists behind T agitation, says the letter

» నిత్యానంద పై తాజా కేసు

» Andhra MLAs change mood

» 'మాయా' దండ విలువ 5 కోట్లు

» Tollywood bandh called off

» పండిట్ రవిశంకర్ కు పురస్కారం

Leave a Reply