|

మంచు తుపాన్‌లో 17 మంది జవాన్ల మృతి

Jammuశ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లో మంచు తుపాన్‌ బీభత్సం సృష్టించింది. గుల్మార్గ్‌ వద్ద మంచు తుపాన్‌లో చిక్కుకుని 17మంది జవాన్లు మరణించారు.  ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేనంతగా విరుచుకుపడి శీతాకాలపు యుద్ద శిక్షణలో ఉన్న సైనికులపై పడింది.  శ్రీనగర్‌కు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న గుల్మార్గ్‌ ఆర్మీ క్యాంప్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.  మంచు తుపాన్‌లో సుమారు 350 మంది చిక్కుకున్నట్లు సమాచారం.  70 మందిని ఇప్పటికే రక్షించామని,  మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారి తెలిపారు.  తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో మరొకరిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల శివ నాగేశ్వరరావుగా గుర్తించారు.

  • Share/Bookmark

Tags: , , , , , , , ,

Related News

» Facebook to set up centre in Hyderabad

» ఆ క్రెడిట్ మాదేకావాలి

» Tropical Cyclone Tomas slams Fiji

» Beckham out of World Cup

» Pedda Jeeyar Swami, 86, passes away

» బెడిసికొట్టిన క్షిపణి ప్రయోగం

» 'డిసీఎం' రేసులో ఆ ముగ్గురు

» T-stir hits property rates

» 'రాష్ట్ర విధానాలు సరికాదు'

» ఉపఎన్నికలు ఏకగ్రీవం కానట్లే

Leave a Reply