Top Stories

political-news-img

తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర వివాదం

జనగామ జిల్లాలో నాటుకోడి కూర విషయంలో మొదలైన కుటుంబ కలహం విషాదాంతానికి దారితీసింది. క్షణికావేశంలో కుమారుడు చేసిన దాడిలో కన్నతండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిలి రమేష్ (42) మంగళవారం రాత్రి మార్కెట్ నుంచి నాటుకోడిని తీసుకొచ్చాడు. వెంటనే కోడి కూర వండాలని భార్య అనూషను కోరాడు. అయితే అప్పటికే పది రాత్రి కావడం, ఇంట్లో చేపల కూర సిద్ధంగా ఉండటంతో ఆమె మరుసటి రోజు వండుతానని చెప్పింది. దీంతో రమేష్ ఆగ్రహానికి గురై భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిని దూషిస్తున్న తండ్రిని కుమారుడు గణేష్ ప్రశ్నించాడు. మాటామాటా పెరగడంతో రమేష్ కుమారుడిపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తండ్రి ప్రవర్తనపై ఆవేశానికి లోనైన గణేష్ ఇంట్లో ఉన్న రోకలిబండతో రమేష్ తలపై బలంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ రక్తపు మడుగులో కుప్పకూలగా, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొదట జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రమేష్ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నపాటి కుటుంబ వివాదం క్షణికావేశంతో హత్యకు దారితీయడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Publish Date: Jun 11, 2026 4:13PM

political-news-img

కోడి కూర వివాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకు

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంలో కన్న కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన జంగిటి రమేశ్ వృత్తిరీత్యా కూలీ పనులు చేసుకుంటుంటాడు. మంగళవారం (జూన్ 10) రాత్రి రమేశ్ ఒక నాటుకోడిని ఇంటికి తీసుకువచ్చాడు. దానిని కోసి కూర వండాలని భార్య అనూషను కోరాడు. అయితే భార్య ఇప్పటికే వంట పూర్తయ్యిందనీ, చేపల కూర వండాననీ చెప్పింది. ఇక ఇప్పుడు కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న వారి కుమారుడు గణేశ్.. తండ్రిని అడ్డుకున్నాడు. దీంతో తండ్రి రమేష్ గణేశ్‌పై కూడా తిరగబడ్డాడు. దీంతో కోపం పట్టలేకపోయిన కుమారుడు గణేష్ అక్కడ ఉన్న రోకలిబండను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో రమేష్ కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు, అక్కడ నుంచి హైదరాబాద్ కు తరలించారు. అయితే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ మరణించాడు. సమాచారం అందుకున్న తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన కొడుకు గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కే

Publish Date: Jun 11, 2026 4:07PM

political-news-img

హర్మూజ్ జల సంధి వద్ద అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులుప్రాణాలు కోల్పోయారు. తొలుత వీరు గల్లంతైనట్లు భావించినప్పటికీ.. వారు మరణించినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ అధికారికంగా ధృవీకరించారు. పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి. ఈ దాడిలో నౌక పూర్తిగా దెబ్బతింది. నౌకలోని 24 మంది భారతీయులలో 21 మందిని ఒమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. తాజాగా ఆ ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Publish Date: Jun 11, 2026 3:52PM

political-news-img

కాక్రోచే దిక్కు అంటున్న జగన్.. చేతులెత్తేసినట్టేనా?

రాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టడంలో వైసీపీ అధినేత జగన్ ది అందె వేసిన చెయ్యిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం ఘనతలను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు.. నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్‌ను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీట్ లీకేజీని ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల అంశానికి లింక్ చేసిమైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాడేపల్లిలో గురువారం (జూన్ 11) జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇది జెన్-జీ కాలం.. ఇప్పుడు జెన్-ఆల్ఫా కూడా నడుస్తోంది. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ఆ రెండు జనరేషన్ల అర్థాలు ఏమిటి? అన్నది జగన్ కు ఎంత వరకూ తెలుసో కానీ, జగన్ మాత్రం తాను ఏపీ కాక్రోచ్ మూవ్ మెంట్ ను లీడ్ చేస్తానంటూ అన్యాపదేశంగా ప్రకటించేశారు. అయితే దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది. ఈ డీఎస్సీ ప్రక్రియలో ఒక్కటంటే ఒక్క లీకేజీని కూడా జగన్ చూపించలేదు. ఆరోపణలు తప్ప ఆధారాలేవీ బయటపెట్టలేదు. అయినప్పటికీ.. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే.. ఏపీ యువత నమ్మేసి రోడ్లెక్కి చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన నమ్ముతున్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నేత.. అసత్య ప్రచారాలతో జనాలను నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి. ట్రెండ్ సృష్టించడమెందుకు.. ఫాలో అయితే పోలా అన్న చందంగా జగన్ .. కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ నీట్ లీకేజీకీ, ఏపీ డీఎస్సీకీ ముడిపెట్టి లబ్ధి పొందాలని చూసిన తీరును నెటిజనులు ఎండగడుతున్నారు. తాజా ప్రెస్ మీట్ లో జగన్ పదే పదే కాక్రోచ్ లు వస్తాయి అనడంతో నెటిజనులు వైసీపీ పేరును.. కాక్రోచ్ జగన్ పార్టీ అని మార్చేస్తారేమో అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ కొత్తగా మొదలెట్టిన బొద్దింకల రాజకీయం ఏపీలో జగన్‌కు మైలేజీ ఇవ్వడం మాట అటుంచి.. జనంలో ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 11, 2026 3:39PM

political-news-img

ఖమ్మం అమానుష ఘటన...బాధితురాలికి మెరుగైన వైద్యం : మంత్రి తుమ్మల

ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. వైద్యులను బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడి ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. మానవ మృగంలా ప్రవర్తించిన సదరు వ్యక్తి చేసిన ఈ ఘోరమైన చర్య క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తు నుండి బాలికను కిందకు తోసేయడంతో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం కారణంగా బాలిక కాళ్లు, చేతులతో పాటు వెన్నుముకకు కూడా తీవ్రమైన దెబ్బలు తగిలాయని వైద్యులు తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు ఎంత ఖర్చైనా వెనకాడకుండా అత్యాధునిక (అడ్వాన్స్‌డ్) వైద్య సేవలు అందిస్తామని, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అసలు విషయానికొస్తే.. జూన్ 6వ తేదీన ఖమ్మంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ అమానుషం చోటుచేసుకుంది. అక్కడ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న దంపతుల 12 ఏళ్ల మైనర్ కుమార్తెపై, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహ్మద్ గౌస్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ విషయాన్ని దాచడానికి మరియు ఆమెను హతమార్చడానికి రెండో అంతస్తు నుండి కిందకు తోసేశాడు. మొదట బాలిక ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భావించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు మరియు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘోర కలికి కారణమైన నిందితుడు మహ్మద్ గౌస్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని, అతనిపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమైంది. కానీ మంత్రి తుమ్మల స్వయంగా రంగంలోకి దిగడంతో బాధితులకు కొంత ఉపశమనం లభించింది. ఇలాంటి దారుణమైన ఘటనలు సమాజంలో మహిళలు, పిల్లల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే క్రిమినల్స్ విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని మహిళా సంఘాలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలికి అత్యున్నత స్థాయి న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి, నిందితుడికి త్వరగతిన కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజంలో ఇలాంటి వికృత చేష్టలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలే ఏకైక మార్గమని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Jun 11, 2026 3:38PM

political-news-img

అల్లుడు కావాలా?... మేం కావాలా?... మమతకు టీఎంసీ నేత అల్టిమేటం

పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీలో అంతర్గత విబేధాలు నివురు గప్పిన నిప్పులా ఉండి, ఇప్పుడు ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతుండటంతో దీదీ సామ్రాజ్యం కుప్పకూలే ప్రమాదంలో పడింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఊహించని విధంగా 60 మందికి పైగా శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) తిరుగుబాటు బాట పట్టగా, దేశ రాజధాని ఢిల్లీ వేదికగా లోక్‌సభ సభ్యులు సైతం తిరుగుబాటు జెండా ఎగరవేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ గడ్డు కాలంలో తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా అత్యంత బలమైన షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, దశాబ్దాలుగా మమతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ వస్తున్న కల్యాణ్ బెనర్జీ ఇప్పుడు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. తన 40 ఏళ్ల నాటి సుదీర్ఘ రాజకీయ సహచరురాలు కాకోలి ఘోష్‌ను సైతం పక్కన పెట్టి, మమతా బెనర్జీ ఏ కల్యాణ్ బెనర్జీని అయితే లోక్‌సభలో అత్యంత కీలకమైన చీఫ్ విప్‌గా నియమించారో, ఇప్పుడు అదే కల్యాణ్ బెనర్జీ పార్టీ అధినేత్రికి ముక్కుసూటిగా గట్టి అల్టిమేటం జారీ చేశారు. "మీకు మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా? లేక నాలాంటి నమ్మకమైన నాయకులు కావాలా? వెంటనే తేల్చుకోండి" అంటూ దీదీ ముందే ఒక కఠినమైన ప్రశ్నను ఉంచారు. అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి తక్షణమే తొలగించకపోతే తాము ఇక ఏమాత్రం పార్టీలో కొనసాగలేమని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ తిరుగుబాటు ప్రకటనతోనే ఆగకుండా, అభిషేక్ బెనర్జీ నిందితుడిగా ఉన్న ఫోర్జరీ సంతకాల కేసు నుంచి తాను లాయర్‌గా తప్పుకుంటున్నట్లు కల్యాణ్ బెనర్జీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభిషేక్ బెనర్జీకి తనపై ఎప్పుడూ నమ్మకం లేదని, ఇకముందు కూడా ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు కోర్టులో జరగబోయే కీలకమైన విచారణ కోసం తాను అర్ధరాత్రి వరకు ఎంతో శ్రమించి ప్రిపేర్ అవుతుంటే, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా లాయర్‌ను మార్చేశామని చెప్పడం తనను తీవ్రంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిషేక్‌కు పెద్దలను గౌరవించడం అస్సలు తెలియదని, అతను తీవ్ర అహంకారి అని దుయ్యబట్టారు. అసలు పార్టీలో అతని స్థానం ఏంటని, అతని బాధ్యతారాహిత్యం వల్లే పార్టీకి ఇంత పెద్ద నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తాను ఎల్లప్పుడూ మమతా బెనర్జీ వైపే ఉంటానని చెబుతూనే, దీదీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని, ఆమెకు పార్టీ ప్రయోజనాలు, నమ్మకమైన సీనియర్ నాయకులు కావాలా? లేక ఒక చిన్నపిల్లాడు, కుటుంబం కావాలా? అంటూ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ పతనానికి కల్యాణ్ బెనర్జీ చేసిన ఈ తిరుగుబాటు 'చివరి మేకు' లాంటిదని రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత, కోర్టుల్లో పార్టీకి సంబంధించిన ఎన్నో సంక్లిష్టమైన, కీలకమైన కేసులను కల్యాణ్ బెనర్జీయే స్వయంగా వాదించి అండగా నిలిచారు. అలాంటి లీగల్ ట్రబుల్ షూటర్, కీలక నేత తిరుగుబాటు చేయడానికి కొన్ని గంటల ముందే మమతకు మరో రెండు పెద్ద షాక్‌లు తగిలాయి. మొదట రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయగా, నిన్నటివరకు మమతకు పూర్తి మద్దతుగా నిలిచిన ప్రసూన్ బెనర్జీ లోక్‌సభలో తిరుగుబాటు చేసిన కాకోలి గ్రూప్‌తో చేతులు కలిపారు. లోక్‌సభలో తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ కాకోలి వర్గం స్పీకర్‌కు ఇచ్చిన లేఖపై ప్రసూన్ బెనర్జీ కూడా సంతకం చేయడం టీఎంసీలో రేగుతున్న అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది. మొత్తం మీద బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

Publish Date: Jun 11, 2026 3:10PM

MOVIE NEWS