LATEST NEWS
  Too many things come to our mind when we remember the temple town Tiruvannamalai. The Arunachal mountain, the Ashram of Ramana Maharshi, the tallest temple of Lord Shiva... would all fill us with a sense of admiration. But crime has not boundaries and no exemptions. That’s the reason why a 21 year old Russian national was raped in the town. The woman who came on a pilgrimage was allegedly drugged and gang-raped in a service apartment. She was then taken to the hospital in an unconscious situation. The police has detained six people regarding the incident and the probe is on the way. The incident has shocked the town which is often flocked by foreign nationals to visit the temple and the Ashram.
  It’s no more a news that LIC is eyeing to grab majority of holdings in the IDBI bank. The measure was initiated to give new life to IDBI bank which is on the brink of failure. Now the broad of LIC has given a green signal for the project to go ahead. It’s now estimated that the Insurance giant has to pay more than 20 thousand crore rupees to IDBI to grab 51 percent of its holdings. The deal should also get clearances from various watch dogs such as central government, RBI and SEBI. The deal has gone ahead despite facing stiff opposition from the employees and customers of LIC. They claimed that the honest paid amounts of the policy holders is being misused by the organisation. But who cares! The deal is going to get realised soon!
  The Supreme Court has made serious observations yesterday on the growing incidents of lynchings across the nation. It has sternly stated that a person can only report an incident to the police and cannot become the punisher himself. “There cannot be a right higher than the right to live with dignity and further to be treated with humaneness that the law provides … No citizen can assault the human dignity of another, for such an action would comatose the majesty of law,” observed the bench headed by Dipak Misra. The governments were asked to take strict measures against lynchings and never allow individuals to take law into their own hands. It has even asked the centre to frame a new law to stop such incidents. We have to wait and see whether these guidelines would curb the every growing cases of lynchings in the name of cows, caste and religion.
ALSO ON TELUGUONE N E W S
రాజేంద్ర‌ప్ర‌సాద్ ని అంద‌రూ న‌టకిరీటి అంటారు. కొంద‌రైతే.. హాస్యేంద్రుడు అని కూడా అంటారు. ఈ రెంటిలో ఏది క‌రెక్ట్ అన‌డిగితే... న‌ట‌కిరీటి అనే బిరుదే.. స‌రైందంటాను.  ఎందుకంటే.. రాజేంద్రుడు న‌వ్వించ‌డంలోనే  కాదండోయ్‌.. ఏడిపించ‌డంలో కూడా మాస్ట‌రే. ఆ మాట‌కొస్తే న‌వ‌ర‌సాలూ అద్భుతంగా ప‌లికించ‌గ‌ల న‌టుడు మ‌న‌ రాజేంద్రుడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ అన‌గానే.. ముందు చెప్పుకోవ‌ల్సింది టైమింగ్‌. ఆయ‌న జ‌న‌రేష‌న్‌లో అంత టైమింగ్ ఉన్న న‌టుడు మ‌రొక‌రు లేర‌ని నిర్భ‌యంగా చెప్పొచ్చు. అందుకే... అన్ని ర‌సాల్లో క‌ష్ట‌త‌ర‌మైన హాస్య ర‌సాన్ని అల‌వోక‌గా ప‌లించేస్తుంటాడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌.     రాజేంద్రుడు అంటే కామెడీ.. కామెడీ అంటే రాజేంద్రుడు. ఇది ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే. తెర‌పై ఆయ‌న న‌వ్వులు పూయించిన సినిమాలు కోకొల్ల‌లు. ప్రేమించుపెళ్లాడు, అహ నా పెళ్లంట‌, వివాహ భోజ‌నంబు, లేడీస్ టైల‌ర్‌, చెట్టుకింద ప్లీడ‌ర్‌, ఏప్రిల్ 1 విడుద‌ల‌, జూల‌క‌ట‌క‌, రెండురెళ్లు ఆరు, ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే... ఒక‌టారెండా! ముఖ్యంగా 80ల్లో 90ల్లో చెల‌రేగిపోయి న‌టించారాయ‌న‌. కేవ‌లం ఒకే జాన‌ర్‌కి రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌రిమితం కాలేదండోయ్‌. ఆయ‌న న‌టించిన‌ కాష్మోరా హార‌ర్ ధ్రిల్ల‌ర్. అందులో ఆయ‌న చేసిన ఖాద్రా పాత్ర... అప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు బ్ల‌డ్ ప్ర‌ష‌ర్ పెంచేసింది. ఎర్ర‌మందారంలో చేసిన రాముడి పాత్ర‌యితే..  ప్రేక్ష‌కుల‌ను క‌న్నీటి ప‌ర్యంతం చేసింది. ఇవేగాక‌.. ప‌విత్ర‌, పుణ్య‌శ్రీ, సంసారం ఒక చ‌ద‌రంగం..   ఇలా కొన్ని సినిమాలున్నాయ్‌. వాటిలో కొత్త రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ సినిమాలు ముత్య‌మంత‌ముద్దు, పెళ్లిపుస్త‌కం, మిస్ట‌ర్ పెళ్లాం. ఇలా ర‌క‌ర‌కాల సినిమాలు చేశాడు కాబ‌ట్టే.. ఆయ‌న న‌ట‌కిరీటి.  విజ‌యావారి సినిమాల‌ను ఎలాగైతే అంద‌రూ క‌చ్చితంగా ఇంట్లో ఉండాల‌ని కోరుకుంటారో... కొనుక్కొని దాచుకుంటారో..  అలాగే రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమాల‌ను కూడా చాలామంది దాచుకుంటారు. ఎందుకంటే..  మ‌న‌సు బాగోన‌ప్పుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమా ఒక‌టి చూస్తే చాలు రీఫ్రెష్ అయిపోతాం.     అంతెందుకండీ.. మ‌న మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావు కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ అభిమాని అన్న విష‌యం ఎంద‌రికి తెలుసు చెప్పండి. ఆయ‌నే స్వ‌యంగా ఆ విష‌యాన్ని త‌ను రాసుకున్న స్వీయ చ‌రిత్ర ఇన్‌సైడ‌ర్‌లో క్లియ‌ర్‌గా రాసుకున్నారు. టోట‌ల్‌గా చెప్పేదేంటంటే.. చిరంజీవి ఫ్యాన్స్, బాల‌కృష్ణ ఫ్యాన్స్‌, నాగార్జున ఫ్యాన్స్‌, వెంక‌టేశ్ ఫ్యాన్స్‌.. వీరంద‌రూ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఫ్యాన్స్‌.  ద‌టీజ్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌.     హీరోగా దాదాపు రెండొంద‌ల సినిమాల్లో న‌టించిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌... ఇప్పుడు కేర‌క్ట‌ర్ న‌టునిగా కొత్త జ‌ర్నీ మొద‌లుపెట్టారు. ఈ ఇన్నింగ్స్ కూడా దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నారాయ‌న‌. ఈ రోజు రాజేంద్ర‌ప్ర‌సాద్ పుట్టిన రోజు. ఇలాగే ప‌ది కాలాల‌పాటు సంబ‌రంగా ఆయ‌న జీవితం సాగాల‌ని ఆశిస్తుంది తెలుగువ‌న్‌.
  1. Achammaku Seemantham – okka stree tana jivitamulo asalu marichipoleni vishesham idi. Lakshadhikari chitramulo vache alanti sanniveshaniki Kosaraju Garu “Achammaku Nityamu Seemantamayene” antu sahityam andinchina pata alage ah patani K Rani, Swarnalata mariyu Vaidehi Garu ento chakkaga padina pata mee andari kosam.   2. Dachalante Dagavule Preminchetapudu prati mata kuda pata lagane anipistundi. Lakshadikari chitram lo NTR mariyu Krishna Kumari samudramu teerana pade Dachalante Dagavule pata vintunte kachitanga andariki alage anipistundi   3. Elago Elago Toli Premani Aarudhra gari laga yevaru swaraparichinchaleru anipistundi Elago Elago Unnadi ana pata vintunte. Nammara – ayite Susheelamma Garu padina ee pata tappakunda vinandi   4. Mabbulo Emmundhi Me priyudi/preyasi tho meru pataladara – ante patala dwara matladara? Leda ayite C Narayana Reddy Gari sahityaniki Chalapathi Rao gari bani kaliste pataladatam kuda bheshuga untundi ani meru tappakunda oppukuntaru   5.Oho Andamaina Chinnadana Mee barya/priyuralu memedha aligindha? Ayite meru Kosaraju garu rasina ee pata padi vinipiste mee bangaru chinnadana ekuva sepu meemedha kopam ga undataniki avakasame ledu  
Bollywood actress Vidya Balan has met the family members of NT Rama Rao and on this occasion, Lokeswari (eldest daughter of NTR) has presented Vidya, a saree which is part of Telugu tradition and right from NTR, the Nandamuri family have continued this tradition. Vidya will be essaying the role of NTR’s best half, Basavatarakam in the biopic and during her interaction with Nandamuri family members, Vidya has asked details of Basavatarakam from Lokeswari about her body language, favourite hobbies etc.     Nandamuri Balakrishna and his best half Vasundhara Devi, second daughter Tejwasini and her husband, Sri Bharat were also present. The National award winning actress has joined the sets of NTR biopic on Wednesday and the shooting is presently going on in Ramoji Film City in specially designed sets. Vidya will be seen in a new look for her role and details of it will be revealed later. Krish is directing the movie while Nandamuri Balakrishna producing under NBK films Sai Korrapati and Vishnu Induri are jointly presents the movie
  అల్లు అర్జున్‌ ఇప్పుడు మాంచి జోరు మీద ఉన్నాడు. ఈ మెగావారి అబ్బాయి వరుసగా మూడు బ్లాక్‌ బస్టర్లతో బాక్సాఫీసు దుమ్ము దులిపేశాడు. అర్జున గత మూడు సినిమాలు- సరైనోడు, డీజే, నా పేరు సూర్య సినిమాలూ మూడూ హిట్‌ టాక్‌ తెచ్చేసుకున్నాయి. తాజాగా అర్జున్‌, మనం సినిమా ఫేమ్‌ విక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చేసేందుకు ఏకంగా హాలీవుడ్‌ నుంచి టెక్నీషియన్లు వస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో అర్జున్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే... ఈ సినిమాకి ఆస్కార్‌ అవార్డు గ్రహీత్‌ ఏ.ఆర్‌. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడట. ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో వేచి చూడాల్సిందే మరి!
Rumours can take any form as they are baseless. One such rumour has been circulating in Tollywood regarding ‘Bharat Ane Nenu’. People began to circulate a message that producer DVV Danayya has cheated Koratala Shiva and Kiara Advani of their remuneration. The rumour has become so popular that Koratala and Kiara had to come out giving an explanation. While Koratala has bashed the news as baseless, he said that Danayya is a producer who could be compared with the likes of Ramanaidu. Kaira Advani too has issued a press statement to make her position clear- “Shocked to see baseless allegations being levelled against DVV Entertainments and Danayya garu. I have had the pleasure of working in back to back films with such a professional production house. Why would anybody take up their immediate next project with the same production house if there really is an issue. I look forward to work with Danayya garu in their next venture too.” said Kiara in her press release. Any more doubts!!!
మొబోక్రసీ… డెమొక్రసీ తెలుసుగానీ ఇదేంటి అంటారా? అచ్చ తెలుగులో చెప్పుకుంటే మంద న్యాయం! ఒక్కరిపైనో, ఇద్దరిపైనో, లేదా కొందరిపైనో… ఓ మంద అమాంతం దాడి చేసి చావబాదటం. ఆగ్రహం తప్పకపోతే చంపేయటం! ఇదీ క్లప్తంగా మొబోక్రసీ! ఈ పదం సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టు వాడి మరీ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జనం మందలుగా మారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటాన్ని అరికట్టాలనీ అభిప్రాయపడింది. అందుకు తగిన చట్టం కూడా చేయాలని పార్లమెంట్ కు సూచించింది. అంతలా మొబొక్రసీ పెచ్చరిల్లిపోతోంది.     అత్యున్నత న్యాయస్థానం గోరక్షకుల ముసుగులో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడింది. కానీ, మందగా ఎగబడి అమాయకుల్నో, నేరం చేసిన వార్నో జనమే చంపేయటం చాలా చోట్ల జరుగుతోంది. గోరక్షకులు ఎవరిపైనైనా దాడి చేస్తే రాజకీయ కారణాల చేత సెక్యులర్ పార్టీలు చర్చ లేవదీస్తున్నాయి. కానీ, మిగతా సందర్భాల్లో అందరూ నిశ్శబ్ధంగా వుండిపోతున్నారు. గోరక్షకులు ముస్లిమ్ లనో, దళితుల్నో్ కొడతారు కాబట్టి పార్టీలు మాట్లాడుతున్నాయి. బీజేపిని టార్గెట్ చేస్తున్నాయి. కానీ, చాలా సందర్భాల్లో గోరక్షకులు కాని వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. విపరీతమైన కోపం వల్లో, లేదంటే నేరం చేశారని భావిస్తున్న వారిలోని అమానుషత్వం పట్ల కసితోనో జనం ఇలా చేస్తున్నారు. మందలుగా మీదపడి చంపేయటంలో చాలా సందర్భాల్లో దురుద్దేశాలు వుండకపోవచ్చు. కానీ, అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడిచే ఒక దేశానికి , సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇది ప్రభుత్వం, ప్రజలు గమనించాలి.     ఒకవైపు కోర్టు మంద న్యాయంపై చట్టం తీసుకుర్మమని సూచిస్తుండగానే చెన్నైలో లాయర్లే ఆవేశంతో ఊగిపోయారు. మైనర్ ని ఏడు నెలల పాటూ పదిహేడు మంది అత్యాచారం చేశారని తెలిసి చావగొట్టారు. వారి ఆవేశంలోని నిజాయితీని, బాధని శంకించలేం. కానీ, అదే సమయంలో లాయర్లే ఇలా తక్షణ శిక్షలకి సిద్ధపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? కోర్టులు, జైళ్లు ఎందుకు? అత్యాచారం చేసిన వారు ఖచ్చితంగా రాక్షసులే. కానీ, వార్ని కొట్టి చంపేయటం రాజ్యాంగబద్ధమైన చర్య కాదు కదా! ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిపైనే.     మంద బలంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటంలో మరో కోణం కూడా వుంది. కోర్టు రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని చెబుతుండగానే జార్ఖండ్ లో స్వామీ అగ్నివేష్ పై దాడి జరిగింది. ఆయన మాటలు హిందువులు, హిందూత్వవాదానికి వ్యతిరేకంగా వున్నాయని దాడి చేసిన వారి వాదన. ఒకవేళ అదే నిజమైనా రోడ్డు మీద పడేసి కొట్టడం, ప్రాణాలకే హాని తలపెట్టడం…ఎంత మాత్రం అంగీకారం కాదు. మైనర్ ని రేప్ చేసిన వారిపై లాయర్ల దాడి ఒక కోణం అయితే, స్వామి అగ్నివేష్ పై దాడి మరో కోణం. ఈ రెండూ ప్రమాదకరమే. అయితే, గోరక్షకుల దాడులు, స్వామి అగ్నివేష్ పై దాడి వంటివి కొంత వరకూ ప్లాన్డ్ గా జరుగుతాయని ఒప్పుకోక తప్పదు.     బాగా ఆలోచిస్తే జనం ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోటానికి ప్రధాన కారణాలు… మందగా మారి ఎవరిపై దాడి చేసినా శిక్షలు కఠినంగా పడే ఆస్కారం లేకపోవటం. దీనికి కఠినమైన కొత్త చట్టం పరిష్కారం చూపుతుంది. దురుద్దేశాలతో దాడులు చేసే వారు భయపడేలా తీవ్రమైన శిక్షలు వుంటే రౌడీ మూకలు చాలా వరకూ వెనక్కి తగ్గుతాయి. ఇక నిజంగా కొన్ని సందర్భాల్లో జనం కడుపు మండిపోయి దారుణమైన నేరాలు చేసిన వారిపై దాడులు చేయటం మన న్యాయ వ్యవస్థ లోపాల్ని ఎత్తి చూపుతుంది. నిర్భయ రేపిస్టులు , హంతకులు ఇంకా బతికే వున్నారు. అందులో ఒకడైతే మైనర్ అని చెప్పి కొందరు లాయర్లు వాడ్ని మూడేళ్ల శిక్షతో బయటపడేశారు. ఇలాంటివి జనాల మనస్సులో గాయాలు రేపుతున్నాయి. న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ఒకవేళ న్యాయం దక్కినా ఏళ్ల తరబడి జరిగే విచారణ సగటు భారతీయుడ్ని వెక్కిరిస్తుంది. ఈ కారణాలే జనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరం చేశారని భావింపబడుతోన్న వార్ని రోడ్డు మీదే అంతం చేసేలా చేస్తున్నాయి. తాము చావబాదకపోతే, చంపకపోతే కోర్టులు, జైళ్లు నేరస్థుల్ని కాపాడతాయని జనం అనుమానం. కాదంటే నమ్మకం. ఇది పోవాలి. పోయేలా న్యాయవ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలి. నేరం చేసిన వాడు తప్పించుకోలేని స్థితి రావాలి. సత్వరం శిక్షలు పడాలి. లేదంటే జనం ఆవేశాన్ని ఏ కొత్త చట్టమూ శాంతింపజేయలేదు. న్యాయం మందగించినంత కాలం మంద న్యాయమూ వుంటూనే వుంటుంది!
ఈ దేశంలో ఆడ పిల్లలుగా పుడుతున్నందుకు.... మృగాళ్ల  చేతుల్లో నలిగిపోతున్నందుకు.... దేశంలో మహిళల్లారా ఇక్కడి మగవాళ్లని మన్నించకండి. జన్మనిచ్చిన అమ్మని కూడా వదలని రాక్షస దేశంలా మారుతున్నందుకు క్షమించకండి. అన్నెం... పున్నెం ఎరుగని... ఆటలు... పాటలు... చదువు తప్ప తెలియని పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్న మగ మ్రగాలు నానాటికి పెరిగిపోతున్న కాలం. ముదుసలి వయసులో కన్నూమిన్నూ కానక మగవాళ్లు చేస్తున్న దారుణాలు దేశ ప్రజలని కలవరపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేదు.... ప్రదేశంతో పని లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే పరిస్థితి. ఆ రాష్ట్రం... ఈ రాష్ట్రం అని బేధం లేదు. దేశ రాజధాని నుంచి ప్రతి చోటా మహిళలపై.... చిన్నారులపై అనాగరిక చర్చలే. చెన్నైలో పన్నెండేళ్ల చిన్నారిపై ఏడు నెలలుగా 24 మంది కామాంధులు పాశవికంగా జరిపిన అత్యాచారం దేశంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడే చర్య. బాధితురాలు వినికిడి లోపంతో బాధ పడుతోంది.     చెన్నైలోని అయనావరం కున్నూరు హైరోడ్డులోని సయానీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో 14 అంతస్థుల సన్నివేల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా ఫ్లాట్లు ఖాళీవే. అక్కడే లిప్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న 66 ఏళ్ల ముదుసలి రవికుమార్ ఈ చిన్నారిపై కన్ను వేశాడు. నిత్యం పాఠశాలకు వెళ్లేందకు ఆ చిన్నారిని లిప్ట్‌లో కిందికి దిగి బస్పులో వెళ్తుంది. ఏడు నెలల క్రితం ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడు. ఈ విషయం బయట పెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ చిన్నారిది మూగరోదనగానే మిగిలింది. ఆ తర్వాత మరికొందరితో కలిసి ప్రతి రోజూ ఆ చిన్నారికి నరకం చూపించారు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి... చిన్నారిపై అత్యాచారం చేసి వాటిని సెల్‌ఫొన్లలో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. ఇలా చిన్నారిని చిదిమేసిన వాళ్లు 24 మంది. ఊరి నుంచి వచ్చిన తన అక్కకు విషయం తెలియడంతో  వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారిలో లిప్ట్ ఆపరేటర్‌తో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.     దేశంలో నిర్భయ చట్టం ఉంది. దేశంలో దోషులకు కఠిన శిక్షలు వేసే చట్టాలూ ఉన్నాయి. అయినా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. పైగా అవి నానాటికి పెరుగుతున్నాయి. దీనికి కారణం చట్టాలున్నా అవి పటిష్టంగా లేకపోవడం. తప్పు చేసిన వారిని అరెస్టు చేసినా రెండు రోజుల్లో బయటకు వచ్చేస్తామనే భరోసా ఉంది. వారి తరఫున తిమ్మిని బమ్మిని చేస్తూ వాదించే న్యాయవాదులున్నారు. ఇదే కారణం. ఇదే భరోసా. ఇదే దీమా. అందుకే దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు వేయాలి తప్ప అవి మరణ శిక్షలు కాకూడదనే మానవ సంఘాలూ ఉన్నాయి. అలా వాదించే వారికి ఏడు నెలలుగా ఆ చిన్నారి అనుభవించిన నరకం గుర్తుకు రాదు. అలా సమర్ధించే వారికి ఆ చిన్నారి మనోవేదన పట్టింపునకు రాదు.     ఇదీ మన వ్యవస్ధ. ఇదీ మన దౌర్భాగ్యం. ఇదీ మన దుస్థితి. ఈ స్థితిలో మార్పు రావాలంటే మనిషిలో మార్పు రావాలి. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. వాటిని పటిష్టంగా అమలు చేసే వ్యవస్ధ కావాలి. ఇందుకోసం పాలకులు కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు కూడా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాలి. నిందితులను కోర్టులో హాజరు పరిచే సమయంలో అక్కడి న్యాయవాదులు వారిపై విరుచుకుపడ్డారు. వారిని మెట్లపై నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చారు.  చెన్నై సంఘటనలో ఓ చిన్న ఆశాజనకమైన అంశం... అక్కడి న్యాయవాడులెవరూ నిందితులకు అనుకూలంగా వాదించమని చెప్పడం. ఈ కేసును ఎవరూ చేపట్టమని ప్రకటించడం.
అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు! అద్భుతం జరిగాక ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు! భారత్ కు అధ్లెటిక్స్ లో తొలి స్వర్ణం సాధించి పెట్టిన హిమ దాస్ … అలాంటి ఓ అద్భుతం! ఆమె తమ వరి పొలాల్లో తెల్లెవారుఝామున చెప్పులు సైతం లేని అరికాళ్లతో పరుగులు పెడుతుంటే… దేశంలో ఎవ్వరూ ఆమెని గుర్తించలేదు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ పొటీల్లో స్వర్ణం సాధించింది. మనతో సహా అందరం తెగ మాట్లాడుకుంటున్నాం! కానీ, అవేవీ ఆమెకు పెద్దగా ఉపయోగపడేవి కావు. స్వంతంగా ధగధగ మెరిసే తారజువ్వలా ఆకాశానికి ఇప్పటికే ఎగిసిపోయింది!     హిమ దాస్ ఈ మద్య కాలంలో భారతదేశం నుంచి తళుక్కున మెరుస్తోన్న క్రీడాకారిణుల్లో ఒకరు! అంతే అయితే ఇంతగా మాట్లాడుకోవటం అనవసరం. సంవత్సరంలో జరిగే అనేక క్రికెట్ టోర్నమెంట్లలో అడపాదడపా కొత్త క్రికెటర్లు వస్తూనే వుంటారు. అభిమానుల్ని తమ విన్యాసాలతో కట్టిపడేస్తుంటారు. అలాగే, సానియా, సైనా, సింధూ ఇలా బోలెడు మంది ఇతర క్రీడల్లోని ఛాంపియన్స్ కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తుంటారు. కానీ, హిమ దాస్ విజయం కేవలం క్రీడలకు సంబంధించిన అద్భుతం కాదు. అదీ ఇక్కడి ప్రత్యేకత! కేవలం పట్టుదలనే తన కాలికి బూట్లుగా తగిలించుకుని దీక్ష అనే ట్రాక్ పై రన్నింగ్ చేసింది హిమ! అందుకే, ఆమె జీవితంలో ఏ రంగంలో ప్రయత్నం చేస్తోన్న వారికైనా అద్భుతమైన ప్రేరణ! ఆమె ఆటల్లో విజయం సాధించి వుండవచ్చు. కానీ, హిమ దాస్ విజయం మాత్రం ఓ ఆట కాదు!     హిమ దాస్ ఏ ముంబై, దిల్లీ లాంటి సకల సౌకర్యాలున్న మహానగరంలోనో పుట్టలేదు. ఈశాన్య భారతదేశంలో మారుమూలన వున్న ఆసోంలో పుట్టింది. ఆమె ఊరు థింగ్. తండ్రి వరి పండించే రైతు. పొలంలో పండేది అన్నమే అయినా వారికి కడుపునిండా ఆహారం వుండేది కాదు. అలాంటి రైతులు మనకు కొత్తేం వుంది? ఏ రాష్ట్రంలో చూసినా రైతులు ఎలా ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ఓ సగటు భారతీయ రైతే హిమ దాస్ తండ్రి. కానీ, ఆయన కూతురు మాత్రం సగటు భారతీయ అమ్మాయి కాదు. సగటు భారతీయ అమ్మాయిలో పట్టుదల భగ్గుమంటే ఎలా వెలిగిపోతుందో కళ్లారా చూపించిన వెలుగు దివ్వె! మొదట ఫుట్ బాల్ బాగా ఆడిన హిమ తండ్రితో పాటూ పొలంలో నేల దున్నేది, విత్తనాలు వేసేది, ట్రాక్టర్ నడిపేది. కానీ, ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు బంతి వెంట సుడిగాలిలా దూసుకుపోతోన్న ఆమె వేగాన్ని ఓ ఉపాధ్యాయుడు గమనించాడు. అథ్లెటిక్స్ కి మారి పరుగు పందంపై దృష్టి పెట్టమన్నాడు! అదే హిమ దాస్ ని రైట్ ట్రాక్ పైకి తీసుకొచ్చింది.       తమ స్వగ్రామం నుంచీ అసోం రాజధాని గువాహటీకి చేరుకుని ఓ దాత ఇచ్చే డబ్బులతో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విజయాలు నమోదు చేసింది. హిమ దాస్ ని ఇంటి నుంచి గువాహటీకి పంపేటప్పుడు ఆమె తండ్రి అంతర్జాతీయ స్వర్ణాలు ఆశించలేదు. నలుగురు సంతానంలో ఆమె అన్నా ఇంటికి దూరంగా వుంటూ మూడు పుటలా సరిగ్గా అన్నం తింటుందని భావించాడు! అలాంటి పేదరికం వారిది! అయినా, భూమిపై కదిలే మానవ రాకెట్ లా దూసుకుపోయే హిమని దారిద్ర్యం అడ్డుకోలేకపోయింది. పైగా అదే ఇంధనంలా మారి ముందుకు తోసింది. ప్రపంచ అథ్లెటిక్స్ లో మన దేశం మొత్తాన్ని గర్వంగా తల ఎత్తుకునేలా చేసింది!     ఒక సానియా, ఒక సైనా, ఒక సింధూ విజయాలు సాధించనప్పుడు ఎలాంటి హంగామా చేశారో ఇప్పుడూ అదే చేస్తున్నారు పొలిటీషన్స్. మీడియా కూడా హిమ దాస్ అంటూ జపం చేస్తోంది. కానీ, అసలు గుర్తించాల్సింది హిమ దాస్ ని కాదు! ఆమె ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లని! ఈ దేశంలో అడుగడుగునా హిమ దాస్ లే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్త శుద్ధి వుండాలే కానీ ఎక్కడ పిడికెడు మట్టి తీసినా… మాణిక్యాలే బయటపడతాయి. అంత జనాభ, అంత శక్తి, సామర్థ్యాలు, అంతటి అవకాశాలు వున్నాయి. అయినా ఒలంపిక్స్ వచ్చిన ప్రతీసారి ఒకటి , అరా మెడల్స్ కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తూ వుంటాం. కారణం … హిమ దాస్ లాంటి వార్ని పట్టించుకోకపోవటమే. డబ్బున్న సంపన్నలు, ఎంతో కొంత ఖర్చు చేయగలిగే మధ్య తరగతి వారు డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు అయిపోయి మరింత డబ్బు సంపాదిస్తున్నారు. మిగతా అన్ని రంగాల్లో దేశాన్ని సగర్వంగా నిలపగలిగే వారు ఊళ్లలో, నగరాల్లోని మురికి వాడల్లో మగ్గిపోతున్నారు. వారంతా హిమ దాస్ లాంటి తారజువ్వలే! కావాల్సింది వారికి సౌకర్యం, అవకాశం అనే అగ్గిని అందించటమే! ఒక్కసారి గ్రామ గ్రామంలోని హిమ దాస్ లాంటి లెక్కలేనంత మందికి ప్రభుత్వాలు ప్రొత్సాహమనే నిప్పుని తాకిస్తే ఆకాశాన్ని అంటుకుంటారు! ఓ అంతర్జాతీయ విజయం సాధించి వచ్చిన వారికి కోట్లు గుమ్మరించటం కాకుండా కోట్ల మంది అంతర్జాతీయ విజయాలు సాధించేలా ఏం చేయాలో ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి!
దేశ రాజధానిలో వేడి పుట్టనుంది. గడచిన కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వర్షాలతో సతమతమైంది. అక్కడి ప్రజలు వర్షాలతో చలి కాచుకున్నారు. బుధవారం నుంచి వారే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేడి పుట్టించే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం లోక్‌సభ సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధికార భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించింది.     ఇందుకోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పవన్ కల్యాణ‌ జనసేన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల పాలైన తమను ఆదుకుంటామని, ప్రత్యేక హోదాతో అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడం తెలుగు ప్రజలను వంచించడమే. గడచిన ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతూండడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వారి మాయలో పడ్డారు. ప్రధానమంత్రిని నమ్మినందుకు నాలుగేళ్ళ తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అది వేరే సంగతి. నాలుగేళ్ల పాటు హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మంచిదని నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం వంచించిందంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై నాలుగేళ్ల పాటు పార్లమెంటులో మాట్లాడని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పుడే ఈ అంశంపై పోరాటం చేయడం రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలి.     ఈ మొత్తం వ్యవహారంలో సమిధులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మూడు పార్టీల మూడు ముక్కలాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్‌లుగా మిగిలారు. లోక్‌సభ సభ్యత్వాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాజనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది. దీంతో బుధవారం నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులే. బుధవారం నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో  ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ బద్ద శత్రువుగా చూసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి అమరావతిలో భేటీ అయ్యారు. ఇది మంచి పరిణామం. కొంతకాలంగా ఉంవడల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదాపై పలు సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికల ద్వారా సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికే నేరుగా చెప్పారు.      ఈ సూచనల్లో ప్రధానమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే తెలుగు వారికి ఆయుధాలని చెప్పడం ప్రధానం. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ సమావేశాల్లో మన వాదనను వినిపించ వచ్చునన్నది ఉండవల్లి సూచన. అయితే దీనికి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు రాకపోవచ్చు. వారు వ్యతిరేకించకపోయినా సభలో ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్నది అధికార తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం లోక్‌సభ ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుల దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, జితేందర్ రెడ్డిలను  దగ్గరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల కలిసారు. తెలుగు వారి ఇబ్బందులపై కలసి పోరాడాలన్న వారి వినతికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సానుకూల స్పందన రావడం ముదావహం. మొత్తానికి బుధవారం నుంచి రాజధాని ఢిల్లీలో  తెలుగు వారి వాడీ, వేడీ ఎలా ఉంటుందో చూడాలి...!?
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఫుట్‌బాల్ అభిమానుల కేరింతలతో నెల రోజులు జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అంచలంచెలుగా ప్రత్యర్ధులను తమ గోల్స్‌తో మట్టి కరిపించిన ఫ్రాన్స్ ఫైనల్ ప్రత్యర్ధి క్రొయేషియాపై 4 - 2 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. నెల రోజులుగా ఆశగా చూస్తున్న  ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు ఆ జట్టు ఆటగాళ్లు. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచ కప్ విజయం. తొలిసాకి 1998 సంవత్సరంలో తొలిసారి ప్రసంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆ కల ఈడేరడం కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.  ఇరవై సంవత్సరాల తర్వాత తీరిన కలతో ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. మన దేశంలో కూడా ఫుట్‌బాల్‌ పట్ల ఎంతో ఆదరణ ఉంది.     క్రికెట్‌ను మాత్రమే ఆదరిస్తారని ఇన్నాళ్లూ అన్నుకున్న భారత క్రికెట్ అభిమానులకు ఈ ఫుట్‌బాల్ అభిమానులు చూపించిన ఆదరణకు అదిరిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పట్ల ప్రజల్లో ఎంత క్రేజ్ ఎంతో ఉందో ఈసారి పోటీలు మళ్లీ మరోసారి నిరూపించాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్ పోటీలు అన్నీ ఉత్కంఠగా జరిగినవే. చివరికి అతి చిన్న జట్టుగా అసలెలాంటి అంచనాలు లేని క్రొమేషియా ఫైనల్‌కు రావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఫైనల్‌పై పడింది. జయపజయాల మాట పక్కన పెడితే ఫుట్‌బాల్ క్రీడ మనుషుల్లో ఉన్న ఓ పట్టుదలను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది.     అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లేని క్రేజ్ ఈ ఫుట్‌బాల్ పట్ల చూపిస్తారు అభిమానులు. క్రికెట్ పట్ల కేవలం పది పన్నెండు దేశాలు మాత్రమే ఆసక్తి చూపిస్తే ఫుట్‌బాల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. దానికి కారణం ఈ పోటీ గంట లోపే ఫలితం తేలడంతో పాటు బరిలో ఇరు జట్లు చూపించే వ్యూహప్రతివ్యూహాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందుకే కోట్ల మంది ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో నూ, కేరళలోనూ మాత్రమే ఫుట్‌బాల్ పట్ల క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రాల నుంచే భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడాకారులు ఎంపికవుతారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడపై ఆసక్తి పెంచేందుకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. దే:శంలో ఇంతకు ముందు ప్రపంచం గర్వించే ఫుట్‌బాల్ క్రీడాకారులున్నారు.     వారిలో అగ్రగణ్యుడు నివీల్డి డిసౌజా. భారత ఫుట్‌బాల్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన క్రీడాకారుడు డిసౌజా. 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అనూహ్య విజయాన్ని అందించింది డిసౌజానే. ఆయన తర్వాత భారత ఫుట్‌బాల్‌‌కు దేవుడిచ్చిన వరంగా చెప్పుకునే బైచుంగ్ భాటియా. ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో బ్రెజిల్ క్రీడాకారులు పీలే, అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మరడోనాలు ఎంత గొప్పవారు మన దేశానికి భాటియా కూడా అలాంటి క్రీడాకారుడే.     దేశంలో క్రికెట్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు ఇతర క్రీడలపై కూడా ఆదరణ చూపిస్తే మనకు పీలేలు, డిగో మరడోనాలు తయారవుతారు. భారత జాతీయ క్రీడ హాకీని పట్టించుకోకపోవడం వల్ల ఆ క్రీడ దాదాపుగా కనుమరుగవుతోంది. క్రికెట్ ఒక్కటే మన క్రీడగా మిగులుతున్న దశ ఇది. ఈ జాడ్యం పోతే హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కో కో వంటి క్రీడల్లో భారత్ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఎంతటిదో చూపిస్తాయి.
కుమారస్వామి కంటతడి పెట్టారు. ఇది నిజంగా షాకింగే! మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమూ కానప్పటికీ… 2019లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం కంటతడి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయమే. అసలింతకీ ఆయనెందుకు ఏడ్చారు? నలభై సీట్లు కూడా లేని జేడీఎస్ నేత నక్క తోక తొక్కినట్టు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ భయంతో కాంగ్రెస్ అతడ్ని బంపరాఫర్ ఇచ్చి రథ సారథని చేసింది. యడ్యూరప్ప సీఎం అవ్వకుండా ఆపగలిగింది. మరో రాష్ట్రం మోదీ వశం కాకుండా అడ్డుకుంది. కానీ, కాంగ్రెస్ మార్కు రాజకీయం నిత్యం భరిస్తూ ముళ్లపాన్పు లాంటి సీఎం కుర్చీపై కూర్చోటం కుమారస్వామికి ఎంత కష్టమో త్వరగానే తెలిసిపోయింది!     చరిత్రలో అనేక సార్లు కాంగ్రెస్ సంకీర్ణ  ప్రభుత్వాల్లో వుంటూ వచ్చింది. కానీ, ఎప్పుడూ కూడా తాను ప్రధాన పార్టీగా వుంటేనే ఆ గవర్నమెంట్లు అయిదేళ్లు నెగ్గుకొచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తూ మరో పార్టీ ప్రభుత్వం నడుపుతుంటే … ఆ సర్కార్ అయిదేళ్లు నడవటం అసాద్యమే. ఇది పదే పదే హస్తం నేతలు నిరూపించారు. కాంగ్రెస్ వ్యవహారంతో కొందరు ప్రధాని పదవులు కోల్పోతే అనేక మంది సీఎం పదవులు కోల్పోయారు. ఇప్పుడు కుమార స్వామి వంతు అన్నట్టు కనిపిస్తోంది పరిస్థితి. తనకు విషం తాగుతున్నంత కష్టంగా వుందని పార్టీ నాయకులు, కార్యకర్తల ముందు ఏడ్చేశాడు దేవెగౌర రాజకీయ వారసుడు. ఆ విషం తాగిస్తున్నది సంకీర్ణంలోని కాంగ్రెస్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఒకవైపు నుంచీ మాజీ సీఎం సిద్దరామయ్య, మరో వైపు నుంచీ డాక్టర్ శివ కుమార్, మధ్యలో మల్లిఖార్జున ఖర్గే… ఇలా ఎవరికి వారు కన్నడ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు. కుమార స్వామి ఫ్రస్ట్రేషన్ కి కారణం అదే! ఆయన నిమిత్తమాత్రుడైన సీఎంలా మిగిలిపోయే ప్రమాదం పొంచి వుంది. అలా రబ్బర్ స్టాంప్ లా వుండటం ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడైన కుమార స్వామికి రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అదే ఆయన దుఃఖానికి కారణం!     కుమార స్వామిని ముఖ్యమంత్రిగా జనం ముందు పెట్టి తరువాత అతడ్ని ఏమీ చేయకుండా అడ్డుకుంటున్నారు కన్నడ హస్తం నేతలు. వాళ్లు అలా చేస్తుండటంతో చెడ్డ పేరంతా కుమార స్వామి భరించాల్సి వస్తుంది. ఇది ముందు ముందు జేడీఎస్ పై జనం ఆగ్రహించే స్థితి తీసుకు రావచ్చు. అదే సమయంలో మరింత మంది ఓటర్లు బీజేపి వైపు మొగ్గ చూపవచ్చు. కాంగ్రెస్ ఆకతాయితనం వల్ల పార్లమెంటు ఎన్నికల ముందో తరువాతో మళ్లీ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వస్తే కమలానికి జనం స్పష్టమైన మెజార్టీ ఇవ్వొచ్చు. ఇదే కుమార స్వామి భయమంతా! అయినా కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతల మాటలు ఆందోళనకరంగా వుంటున్నాయి. కుమార స్వామి కంటతడిపై కామెంట్ చేసిన మల్లిఖార్జున ఖర్గే… ఆయన ఇబ్బందుల్ని పరిష్కారిస్తామని అనలేదు. కాంగ్రెస్ మరింత సహకరిస్తుంది అని కూడా అనలేదు. సంకీర్ణంలో ఇలాంటి ఒత్తిళ్లు సహజం. తట్టుకుని ముందుకు సాగాలి అని సెలవిచ్చారు! అంటే, తమ వైపు నుంచి పెద్దగా మార్పుండదని చెప్పకనే చెప్పేశారు!     జేడీఎస్ కి, కర్ణాటక కాంగ్రెస్ కి మధ్య గొడవ నిజానికి జాతీయ సమస్య కాదు. అది ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, త్వరలోనే పార్లెమంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక పరిణామాలు దిల్లీపై కూడా ప్రభావం చూపుతాయి. ఎలాగంటే, ఏ క్షణమైనా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలితే అది మోదీ, షాలకు బంగారు ఆవకాశం. జనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే జై కొట్టే చాన్స్ వుంటుంది. కాంగ్రెస్ , జేడీఎస్ లను నమ్మకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూలకపోయినా… కుమారస్వామి చేత నిత్యం విషం తాగిస్తూనే కాంగ్రెస్ వారు ఇబ్బంది పెడితే… అది కూడా రెండు పార్టీలకు నష్టమే. ఎన్నికల్లోపు ఎంతో కొంత మంచి చేస్తేనే ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. లేదంటే, రాహుల్, కుమారస్వామి, సిద్దరామయ్య లాంటి వారి కంటే మోదీనే బెటర్ అని ఆయన వైపు మొగ్గు చూపుతారు.పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఛరిష్మా కూడా పని చేస్తుంది. ఇలా ఎలా చూసినా కుమార స్వామి కంటతడి… యడ్యూరప్ప ఆనందభాష్పాలుగా మారే సూచనలు పుష్కలంగా వున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఇంకా కాస్త పట్టుమిగిలిన కన్నడ నాట… హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా వుంటే తప్ప మోదీని నిలువరించటం సాద్యం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుని రాహుల్ కన్నడ కాంగ్రెస్ నేతల్ని నియంత్రించి కుమారస్వామి కళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి! లేదంటే… మోదీకి కావాల్సిన ఎంపీ సీట్లు, యడ్యూరప్పకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రెండూ త్వరలోనే కమలం ఖాతాలో పడిపోవచ్చు! 
మీరు నా లాంటి వారయితే chocolates తినడానికి ఇష్టపడతారు. కానీ ఏ చాక్లెట్. అవును నేను dark chocolate  గురించి మాట్లాడుతున్నాను.  Dark chocolates గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. 1. Dark Chocolatesలో Fiber, Iron, Magnesium, Copper, Manganese ఇంకా చాలా రకాలైన Minerals ఉంటాయట.  2. Dark Chocolateలోని Flavonols చర్మాన్ని సంరక్షించడంతోపాటు Sun Damage నుండి కాపాడతాయట. 3. దీనిలోని Caffeine And Theobromine, Brain Functioning ని Improve చేయటంలో ఎంతో దోహద పడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. 4. Dark Chocolatesలో చాలా రకాలైన Antioxidants ఉంటాయట. ఇవి మిగిలిన Foods లో కంటే దీనిలో ఎక్కువగా లభిస్తాయని చెబుతున్నారు.   5. ఎవరైతే Dark Chocolates తీసుకుంటారో వారిలో గుండె జబ్బులు వచ్చే లక్షణాలు తక్కువ గా వుంటాయని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. So,  మరి ఇంకా ఆలస్యం దేనికి మనం కూడా మన Daily Life లో Dark Chocolate ని ఒక భాగం చేసేద్దాం రండి !!    
  హిమదాస్‌. నిన్నమొన్నటి వరకు ఆ పిల్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడూ... ఆపేరు వినని వాళ్లు చాలా రేర్‌గా కనిపిస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు హీనాది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ అంతర్జాతీయస్థాయి పరుగుపోటీల్లో బంగారుపతకం సాధించలేదు. పీటీ ఉష, అశ్వనీ నాచప్పలాంటి వాళ్లు కూడా సాధించలేనిది ఈ హీనా ఎలా గెల్చుకుందో తెలుసుకోవాలంటే... ఆమె జీవితాన్ని ఓసారి చూడాల్సిందే! హిమదాస్‌ది అసోంలో శివసాగర్‌ అనే పల్లెటూరు. అక్కడ హిమ వాళ్ల నాన్న చిన్న రైతు. తన పిల్ల ఏదో కాస్త చదువుకుంటే చాలనుకునే మనస్తత్వం. హిమకి మాత్రం అటు చదువు, ఇటు వ్యవసాయం కంటే ఆటల మీదే శ్రద్ధ ఉండేది. ఎంత శ్రద్ధ అంటే మగపిల్లలతో కలిసి పొలాల పక్కనే ఉండే బురదలో తెగ ఫుట్‌బాల్‌ ఆడేది. ఆటలో పడితే ప్రపంచాన్నే మర్చిపోయేది. అలాంటి సమయంలో ఓ లోకల్‌ కోచ్‌ హీనాని చూశాడు. తను ఫుట్‌బాల్లో కంటే రన్నింగ్‌లో మరింత బాగా రాణించగలదనుకున్నాడు. వెంటనే హీనాని ఒప్పంచి రన్నింగ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వసాగాడు.   హిమ క్రమంగా రన్నింగ్‌లో రాటుదేలింది. జిల్లా స్థాయిలో మెడల్స్ తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఆ సమయంలోనే నిపాన్‌ అనే కోచ్‌ దృష్టి హిమ మీద పడింది. చవక బూట్లు వేసుకుని కూడా, హిమ గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం చూసి ఆశ్చర్యం వేసింది. తను ఇంతకుముందు ఎప్పుడూ చూడని టాలెంట్‌ హిమలో ఉందని నిపాన్‌ గ్రహించాడు. వెంటనే హీనాకి ప్రభుత్వ కోచింగ్‌ ఇప్పించాలని అనుకున్నాడు.   గవర్నమెంట్‌ కోచింగ్‌ తీసుకోవాలంటే అసోం రాజధాని గువాహతికి పంపించాలి. అది హిమ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల, అందులోనూ ఆరుగురు పిల్లల్లో అందరికంటే చిన్నది. అందుకే హిమని అంతదూరం పంపడానికి వాళ్ల మనసు ఒప్పలేదు. కానీ హీనాని వాళ్లు గువాహతికి పంపేదాకా నిపాన్‌ ఊరుకోలేదు. తీరా గువాహతికి వెళ్లాక అక్కడ అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచింగ్‌ లేదని తెలిసింది. అయినా హిమ వెనక్కి రాలేదు. ఆమె ప్రతిభ చూసిన అధికారులు కూడా హిమని అకాడెమీలోకి తీసుకోక తప్పలేదు. ఓ రెండేళ్లు తిరిగేసరికి... ఇదిగో ఇలా చరిత్రి సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరిగిన ‘world championships’లో గోల్డ్‌ మెడల్‌ కొట్టింది.   హిమ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సంపాదిస్తుందని ఆమె కోచ్‌ నిపాన్‌కు ఎప్పుడూ తెలుసు. ‘చాలా కొద్దిమందిలోనే టాలెంట్‌ ఉంటుంది. అలాంటి వాళ్లలో హీనా ఒకరు. అందుకే ఆమెను ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోవద్దని చెబుతూ ఉంటాను,’ అంటాడు నిపాన్‌. మనకి నచ్చిన రంగం ఏదైనా సరే... దాని మీదే effort పెడితే ఎప్పటికైనా విజయం తప్పదని హీనా నిరూపిస్తోంది. దేని మీదైనా మనకి విపరీతమైన dedication ఉంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తాయని హీనా కథతో తెలుస్తోంది. - Nirjara  
  చాలామంది ఏదో ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలుకదా అనుకుంటారు. మరికొందరు అవసరం కదా అనుకుని ఇంగ్లీష్ వంటి మరో భాషని నేర్చుకుంటారు. కానీ భాష అంటే కేవలం ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు కదా! అది ఒక కొత్త ప్రపంచానికి ప్రతీక. భాష వెనుక ఏకంగా ఒక సంస్కృతే దాగి ఉంటుంది. అంతేకాదు! కొత్త భాషలని నేర్చుకోవడం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని... ఆత్మవిశ్వాసం: ఒకటికి మించిన భాషలు నేర్చుకున్నవారిలో తాము ఇతరులకంటే ఏమాత్రం తీసిపోమన్న విశ్వాసం ఉంటుంది. భాష అనేది జ్ఞానానికి సూచన కాబట్టి, తాము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సమర్థులం అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా తాము నేర్చుకున్న భాష అవసరమయ్యే పరిస్థితులలో, తమ సహచరులకంటే వారే దూకుడుగా ఉండగలుగుతారు. మెదడు పనితీరు: ఎక్కువ భాషలను నేర్చుకున్నవారి మెదడులో రకరకాల సానుకూల చర్యలు జరుగుతూ ఉంటాయి. అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధులు ఇలాంటివారికి దూరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతేనా! వీరిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనీ, మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది. అటు వినికిడి కూడా మెరుగుపడుతుందట! అదనపు అర్హత: కొత్త భాష అనేది ఎప్పుడూ ఒక అదనపు అర్హతే! కొత్త భాషతో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పరిధి విస్తరిస్తుంది. ఉదాహరణకు హిందీ వచ్చినవాడు, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక అర్హతను సాధిస్తాడు. అంతేకాదు! యాజమాన్య సంస్థలు ఎప్పుడూ కూడా ఒకటికి మించి భాషలు వచ్చినవారికి అదనపు ప్రాధాన్యతని ఇస్తాయి. భిన్నమైన పనులు: పరుగులెత్తే ఈ జీవితంలో ఒకేసారి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటి మించిన భాషలను నేర్చుకునేవారు వెంటవెంటనే వేర్వేరు పనులను చేయగలుగుతారనిన పరిశోధనలు నిరూపించాయి. పైగా వీరు కొత్త పరిస్థితులలో కూడా సులువుగా ఇమిడిపోగలుగుతారంట. అప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారట. విశాల దృక్పథం: కొత్త భాషని నేర్చుకున్న మనిషి కొత్త ప్రాంతాలలో తిరగగలుగుతాడు. ఆ భాషలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. భిన్నమైన సంస్కృతినీ, జీవన విధానాన్నీ చూసి తన అభిప్రాయాలను మెరుగుపరుచుకుంటాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు ప్రయాణాలు చేయడానికీ, ప్రపంచాన్ని అన్వేషించడానికీ ఉత్సాహం చూపుతారు. ఒక భాష తెలిసినవారికి మరో భాషని నేర్చుకోవడం మరింత సులువుగా మారుతుంది. మెదడు అప్పటికే భాషకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నమోదై ఉంటారు కాబట్టి, మరో భాషని నేర్చుకునేందుకు అది అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరింకేం... 30 రోజుల్లో ఏదో ఒక భాషను నేర్చుకునేందుకు సిద్ధపడితే పోలా!
రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ఓ సంచలనమే.. ఒక్కోసారి వాళ్ళు సీరియస్ గా మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని కామెడీగా తీసుకొని జోకులేసుకుంటూ ఉంటారు.. సరిగ్గా ఇలానే వైసీపీ అధినేత జగన్ విషయంలో జరిగింది.     రీసెంట్ గా జగన్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూ లో జగన్ మాట్లాడుతూ.. దేవుడు ఆశీర్వదిస్తే తాను 2019లో ముఖ్యమంత్రిని అవుతానని, తాను అధికారంలోకి వస్తే అసలు అవినీతి అనేదే లేకుండా చేస్తానని అన్నారు.. ఇంకేముంది 'జగన్ క్రాక్స్ ఏ జోక్' అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు జగన్ మీద ఛలోక్తులు విసురుతున్నారు.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకున్నట్టు, జగన్ చుట్టూ అవినీతి ఆరోపణలు పెట్టుకొని అవినీతి లేకుండా చేస్తా అనడం కామెడీగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.. మొత్తానికి జగన్ సీరియస్ గా చెప్పిన మాట కాస్తా జోక్ లాగా మారిపోయి 'జగన్ క్రాక్స్ ఏ జోక్' పేరుతో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అప్పుడే రాజకీయ పార్టీల గెలుపోటముల గురించి, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గురించి చర్చ మొదలైంది.. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం చర్చనీయాంశమైంది.. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి లోకేష్ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.     లోకేష్ వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి లోకేష్ ఆ స్థానం నుండి పోటీ చేయబోతున్నాడు, ఈ స్థానం నుండి పోటీ చేయబోతున్నాడంటూ ఒకటే వార్తలు.. తాజాగా లోకేష్ పోటీ చేస్తున్న స్థానం గురించి ఓ కొత్త వార్త మొదలైంది.. అదే లోకేష్ కుప్పం నుండి పోటీ చేయబోతున్నారట.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గం మీద లోకేష్ కి కూడా మంచి పట్టుంది.. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను లోకేష్ దగ్గరుండి అమలుచేసారు.. అలానే స్థానిక నేతలతో కూడా మంచి సంబంధాలున్నాయి.. దీంతో లోకేష్ కుప్పం నుండి పోటీ చేస్తే బాగుంటుందని ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు భావిస్తోన్నారట.. మరోవైపు చంద్రబాబు కూడా ఈసారి గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ నుంచి పోటీ చేస్తే, ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతున్న భావనతో ఉన్నారట.. చూద్దాం ఏం జరుగుతుందో.
వైసీపీ అధినేత జగన్ రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. బీజేపీతో తమకు ఎలాంటి లాలూచీ లేదని, మోడీని తాను ఎన్నోసార్లు విమర్శించానని, రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడికి తాను సున్నా మార్కులు వేస్తానని అన్నారు.. అలానే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.     దేవుడు ఆశీర్వదిస్తే తాను 2019లో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పిన జగన్.. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన నిర్ణయాలు కూడా కొన్ని కారణమని అన్నారు.. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశానని చెప్పిన జగన్, అయినా పొరపాట్లు చేయని మనిషి ఎవరున్నారని ప్రశ్నించారు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబును బీజేపీ, పవన్ కళ్యాణ్ గెలిపించారని అన్నారు.. చంద్రబాబు అవినీతిపరుడు అని పవన్ ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదన్నారు.. గత ఎన్నికల్లో అన్ని రకాలుగా కలిసొచ్చి చంద్రబాబు గెలిచారన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జగన్ జోస్యం చెప్పారు.
Description: Vaginal discharges are common for all the young women. If the discharge is sticky white with no smell then the discharge is absolutely common says Dr. Manjula Anagani. On the contrary, if the color of the discharge changes leading to foul smell – then you must consult a gynecologist to treat the infection she adds. What are the other ways to treat infections – watch this video and get you know in detail.... https://www.youtube.com/watch?v=qaQFTkPb6-w  
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి
  ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ అన్న మాటతో పరిచయం లేని మనిషిని గుర్తించడం కష్టం. కాస్తో కూస్తో కంప్యూటర్‌ పరిజ్ఞానం కలగగానే ఓ ఫేస్‌బుక్‌ ఖాతాని తెరిచేయడం... కుదిరితే ఓ పోస్టు, లేకపోతే ఓ లైకు అంటూ ఫేస్‌బుక్కే జీవితంగా గడిపేయడం సహజం. కానీ విచక్షణారహితంగా ఫేస్‌బుక్‌ని వాడితే మానసిక సమస్యలు తప్పవంటూ రెండు తాజా పరిశోధనలు రుజుబుచేస్తున్నాయి.   పరిశోధన 1 - చూస్తూ ఉండిపోవద్దు: చాలామంది ఫేస్‌బుక్‌ని ఊరికే అలా చూస్తూ ఉంటారు. అందులో కనిపించే పోస్టులను గమనిస్తూ, ఎవరికెన్ని లైక్‌లు పడ్డాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ‘కోపెన్‌హేగెన్ విశ్వవిద్యాలయాని’కి చెందిన పరిశోధకులు ఓ వెయిమందిని సంప్రదించారు. సోషల్ మీడియాతో వారి అనుబంధం ఎలాంటిదో గమనించారు. ఈ వేయిమందిలో ఎక్కువగా స్త్రీలే ఉండటం గమనార్హం. వాళ్ల పోస్టులూ, వీళ్ల పోస్టులూ చూస్తూ గడపడం వల్ల వాటితో మన జీవితాలను బేరీజు వేసుకునే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే సోషల్‌మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతనీ, ఆడంబరాన్నీ చాటుకునేందుకు వీలుగా డాబుసరి పోస్టులు పెడుతుంటారు. వీటితో లేనిపోని పోలికలు ఏర్పడతాయి. ఇక మనలో అసూయ, క్రుంగుబాటు వంటి సమస్యలను రెచ్చగొట్టే పరిస్థితులు కలుగుతాయి.   ఇలాంటి చిత్రమైన సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని పరిష్కరాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఊరికనే ఫేస్‌బుక్‌ వంక అలా చూస్తూ ఉండిపోవద్దనీ... అందులో మీరు కూడా పాలుపంచుకుంటూ ఉండమనీ సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజులపాటు సోషల్‌మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు.   పరిశోధన 2 - ఎన్ని సైట్లైతే అంత డిప్రెషన్‌: సోషల్‌ మీడియా ద్వారా చెలరేగిపోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ అందుకోసం చాలా మాధ్యమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌, వాట్సప్‌... ఇలా నానారకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని సోషల్‌ మీడియా సైట్లలో పాలుపంచుకుంటే మనిషిలో అంత డిప్రెషన్‌ ఉంటుందని పిట్స్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు రుజువుచేశారు.   పరిశోధకులు తమ అధ్యయనం కోసం 1,787 మంది యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 19 నుంచి 32 ఏళ్ల లోపువారే! వీరు గూగుల్‌ ప్లస్, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌... వంటి 11 రకాల సోషల్‌ మీడియా సైట్లను ఏ తీరున అనుసరిస్తున్నారో గమనించారు. అధ్యయనం చివరికి తేలిన విషయం ఏమిటంటే... ఏడు లేక అంతకుమించి సోషల్‌ మీడియా సైట్లను అనుసరిస్తున్నవారిలో క్రుంగుబాటుకి సంబంధించిన లక్షణాలు మూడురెట్లు అధికంగా కనిపించాయట.   ఒక వ్యక్తిలో మానసిక సమస్యలు ఉండటం వల్ల, వెసులుబాటు కోసం ఇలా రకరకాల సైట్ల వంక పరుగులు తీస్తున్నాడా? లేకపోతే రకరకాల సైట్లని అనుసరించడం వల్ల మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయా? అన్న విషయం మాత్రం తేలనేలేదు. అంటే పిల్ల ముందా? గుడ్డు ముందా? అన్న చందాన ఈ సమస్య ఉందన్నమాట. అందుకని ఈ విషయమై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.   ఏది ఏమైనా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు సోషల్‌ మీడియాని కూడా అతిగా అనుసరించడం వల్ల ఏవో ఒక సమస్యలు తప్పవంటూ పై పరిశోధనలు రెండూ రుజువుచేస్తున్నాయి. అన్నింటికీ మించి సోషల్‌ మీడియాని మంచి విషయాలను పంచుకునేందుకు కాకుండా, ఇతరులతో పోల్చుకుంటూ ఉండేందుకు ఉపయోగిస్తే... ఈర్ష్యాద్వేషాలు తప్పవని నిరూపిస్తున్నాయి.     - నిర్జర.