Publish Date:Nov 10, 2012

ALSO ON TELUGUONE N E W S
  దేశమంతా ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని మనకు తెలుసు. ఆ డైరెక్టర్.. ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లుక్ కోసం రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను, తమిళ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర కనిని ఆయన తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకడైన అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో ఒక కీలక్ కేరెక్టర్ చేస్తున్నాడని చాలా కాలం క్రితమే రాజమౌళి ప్రకటించాడు. శంకర్ డైరెక్ట్ చేసిన '2.0' మూవీలో అక్షయ్ కుమార్ ఎలాగైతే విలన్‌గా కనిపించాడో, అదే తరహాలో అజయ్ దేవగణ్ సైతం 'ఆర్ ఆర్ ఆర్'లో విలన్‌గా కనిపించనున్నాడంటూ వదంతులు వినిపించాయి. దాంతో పాటు రాంచరణ్ తండ్రి కేరెక్టర్‌లో ఆయన కనిపించనున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది.  అయితే అజయ్ చేస్తున్నది విలన్ కేరెక్టర్ కాదనీ, ఆయనది హీరోలను తీర్చిదిద్దే గురువు తరహా కేరెక్టర్ అనీ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. తెల్లవాళ్లపై తిరగబడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, రజాకార్లకు నిద్రలేకుండా చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే నిజమైన పాత్రలతో, ఫిక్షనల్ స్టోరీతో ఈ మూవీని రాజమౌళి తీస్తున్నాడు. పోరాట యోధులుగా మారక ముందు సమకాలికులైన ఆ ఇద్దరూ.. తమ ఇళ్లను, ఊళ్లను విడిచిపెట్టి మూడు నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారని వాళ్ల జీవిత కథలు చెప్పాయి కానీ, ఆ కాలంలో వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయం చరిత్రలో చెప్పలేదు. దాన్నే కథగా తీసుకొని.. ఆ ఇద్దర్నీ యోధులుగా తీర్చిదిద్దిన గురువుగా అజయ్ దేవగణ్‌ను 'ఆర్ ఆర్ ఆర్'లో రాజమౌళి చూపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో కాలమే చెబుతుంది.
  హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎపిసోడ్‌లో అమలా పాల్, జగపతిబాబు నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేనా.. నాలుగు భాగాలకు నందినీరెడ్డి, సందీప్‌రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారని కూడా వైరల్ అయ్యింది.  అయితే తెలుగు 'లస్ట్ స్టోరీస్'కు తను డైరెక్ట్ చేస్తున్నాననే ప్రచారాన్ని నందినీరెడ్డి ఖండించింది. తన సోషల్ మీడియా అకౌంట్‌లో.. "ఆల్‌రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ని నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చెయ్యాలనుకుంటుంది? వై అమ్మా? ఏంటో ఈ వెరైటీ రూమర్స్" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' మూవీస్ రెండూ రీమేక్‌లే. వాటిలో 'ఓ బేబీ' ఒరిజినల్ అయిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో విడుదలైన విషయం ప్రస్తావనార్హం. నందిని ఇలా రెస్పాండ్ అయినా, ఇప్పటికే ఈ సిరీస్ తెలుగు రీమేక్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందనీ, అందులో అమలా పాల్ పాల్గొంటున్నదనీ ప్రచారం జరుగుతోంది. ఈ రెండు వెర్షన్స్‌లో ఏది నిజమో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.
  అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా ప్రెజెంట్ సెట్స్‌పై ఉంది. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తర్వాత రెండు సినిమాలు చెయ్యడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేం వేణు శ్రీరాం డైరెక్షన్‌లో అనౌన్స్ చేసిన 'ఐకాన్' కాగా, మరొకటి సుకుమార్ డైర్క్షన్‌లో చెయ్యాల్సిన సినిమా.  'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. దాని తర్వాత బన్నీ 'ఐకాన్' సినిమా చేస్తాడా? లేక సుకుమార్ సినిమా చేస్తాడా? అనేది తేలలేదు. ఇంతలోనే ఒక రూమర్ ఫిలింనగర్‌లో తెరపైకి వచ్చింది. 'ఐకాన్' మూవీ ఆగిపోయిందనేది ఆ రూమర్.  చేగువేరా బయోపిక్‌గా హాలీవుడ్‌లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు శ్రీరాం రాసుకున్నాడనేది సమాచారం. దాని ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో బన్నీ హ్యాపీగా లేడనీ, అందుకే ఆ ప్రాజెక్టును వద్దనుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది దిల్ రాజు ప్రాజెక్ట్ కాబట్టి అంత ఈజీగా ఆగిపోయే ప్రసక్తి ఉండదని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న దిల్ రాజు 'ఐకాన్' మోషన్ టీజర్ రిలీజ్ చేశాడు కూడా. 'కనబడుట లేదు' అనేది ట్యాగ్‌లైన్. డైరెక్టర్ వేణు శ్రీరాంతో స్క్రిప్టును మరింత పకడ్బందీగా తీర్చిదిద్దించే పని ఆయన చేపట్టాడనీ, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావచ్చనీ ఆ వర్గాలు అంటున్నాయి. 
  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్‌లో  200 కోట్ల రూపాయల క్లబ్‌లో జాయినయ్యింది. బుధవారం 11 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన ఆ మూవీ గురువారం మరో 9 కోట్లను రాబట్టింది. వెరసి.. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా. మొదటివారం వసూళ్లపరంగా హృతిక్, టైగర్, ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్)  కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ మునుపటి రికార్డ్ హోల్డర్ 'సుల్తాన్'ను అది అధిగమించింది. 2019లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పరుగులు తీస్తోంది 'వార్'. దేశవ్యాప్తంగా 'వార్' వసూళ్లు ఎలా ఉన్నాయంటే... అక్టోబర్ 2 - రూ. 51.60 కోట్లు  అక్టోబర్ 3 - రూ. 23.10 కోట్లు అక్టోబర్ 4 - రూ. 21.30 కోట్లు అక్టోబర్ 5 - రూ. 27.60 కోట్లు అక్టోబర్ 6 - రూ. 36.10 కోట్లు అక్టోబర్ 7 - రూ. 20.60 కోట్లు అక్టోబర్ 8 - రూ. 27.75 కోట్లు అక్టోబర్ 9 - రూ. 11.20 కోట్లు అక్టోబర్ 10 - రూ. 9.25 కోట్లు ఇప్పటివరకూ వసూలు చేసింది   - రూ. 228.50 కోట్లు (హిందీ వెర్షన్) తెలుగు, తమిళ వెర్షన్లు రాబట్టిన వసూళ్లు - రూ. 9.85 కోట్లు మొత్తం - రూ. 238.35 కోట్లు
  Cast: Payal Rajput, Tejus Kancherla, Naresh, Aamani, Adithya Menon, Mumaith Khan Songs: Bhaskarabhatla Cinematography: C Ram Prasad Editor: Prawin Pudi Music: Radhan Producer: C. Kalyan Story, Screenplay & Direction: Shankar Bhanu Release Date: 11th Oct 2019 While the teaser of the movie RDX Love was released with a lot of steamy scenes the trailer was exactly opposite. The trailer focused on social issues. After RX100, actress Payal Rajput will be seen in this movie. So how is the movie, let us read the review. Story: Alivelu (Payal Rajput) is promoting government schemes with 4 friends. The scheme emphasis on how to use condom (which is called safety in the movie). They also teach women on how to take care of their relationships. Siddu (Tejus Kancherla) falls in love with her. He asks her why does she promote such schemes? The answer is to meet the CM! But why does she want to meet CM? What is her ultimate aim? Answers to such questions form the movie story! Analysis: Before speaking about the movie RDX Love, we have to speak about a particular romantic scene where the heroine is seen sleeping under the tree showcasing her bellybutton. Up above the tree is a honeycomb from where a drop of honey falls near her belly button. Her friends tell the hero that she gets angry if something falls on her while she is sleeping & request him to do something. The hero then takes out the honey with his lips. All this are shot by heroine’s friends & later on heroine shares it to heros father. Why have they introduced this situation, to showcase what is a little unclear. If we keep the commercial success of the movie aside, it is a shock to know that a director who once took meaningful movies like “Ardhanari” has taken such a movie. Can directors come down to this level for commercial success? May be the director’s intensions were good. But just to meet CM will a girl do such things? Are there no other ways left? Audience will surely get this doubt. Okay, after taking that path has he traversed properly? The answer is no again. Plus Points: Payal Rajput Few DIalogues Minus Points: Direction Music & Background music Romantic scenes Performances: If we look at hero & heroine differently, we feel they have done a good job. But if we look at their chemistry, it has clearly not worked out. Heroine Payal looked elder than hero Tejas. Among the others Aditya Menon & Naresh did justice to their character. Tulasi’s character goes on an emotional track. TeluguOne Perspective: Audience who have gone for the movie after seeing RDX Love teaser, they will only be able to enjoy a few scenes & a couple of songs. Similarly, for people who have gone for the movie after watching the trailer, you will surely be disappointed. If anyone wishes to watch the movie with family, they will surely face awkward situation in the theatre. The movie is a collection of cheap scenes!! Rating 2/5
  చాలా రోజుల క్రితం ఓ పిసినారి ఉండేవాడు. అతని యావంతా డబ్బు మీదే! సాయంత్రమయ్యేసరికి ఇంకొకరితో కన్నీళ్లు పెట్టించయినా, తన కడుపు కొట్టుకుని అయినా వీలైనంత డబ్బుని పోగుచేసుకోవాలన్నదే అతని తాపత్రయం! రోజురోజుకీ ఇంట్లో డబ్బు మూటలు పోగవుతున్న కొద్దీ పిసినారికి వాటిని పెంచుకోవాలన్న యావ పెరగసాగింది. ఇలా కాలం గడిచేకొద్దీ ఒకటి కాదు, రెండు కాదు... పదుల కొద్దీ నాణెపు మూటలు పోగవడం మొదలయ్యాయి.   ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ అశాంతి తప్పదు కదా! ఎప్పుడు ఎవరి కన్ను పడుతుందా? ఎవరు వచ్చి తన నెత్తిన ఒక దెబ్బ వేసి ఆ మూటలను దోచుకుపోతారా? అని బిక్కుబిక్కుమంటూ పిసినారి కాలం గడపడం మొదలుపెట్టాడు. ఈ భయంతో అతనికి రాత్రిళ్లు కూడా సవ్యంగా నిద్ర పట్టేది కాదు. తన ఆస్తంతా ఇలా దోచుకుపోవడానికి సిద్ధంగా ఉండటమే... తనలోని అశాంతికి కారణం అని అర్థమైంది పిసినారికి. దాంతో అతను ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఒకరోజు తన నాణెపు మూటలన్నీ తన బండిలో వేసుకుని పట్నానికి బయల్దేరాడు. అక్కడ నేరుగా ఒక బంగారపు దుకాణానికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న నాణెలకు బదులుగా బంగారాన్ని ఇవ్వమని బేరం పెట్టాడు. దుకాణం యజమానికి ఇదంతా చాలా సాధారణమైన విషయంలా తోచింది. వెంటనే ఆ నాణేలన్నింటినీ తీసుకుని తన పనివారితో లెక్కపెట్టించాడు. వాటి లెక్కకు తగినంతగా... ఒక ఇటుకరాయంత బంగారాన్ని పినినారి చేతిలో పెట్టాడు.   ఆ ఇటుకరాయంత బంగారాన్ని తీసుకుని పసినారి సంతోషంగా బయల్దేరాడు. కానీ దారిలో అతనికి ఇంకో అనుమానం తట్టింది. ఇంతకుముందు నాణేల మూటలు ఉన్నాయి కాబట్టి, అంత పెద్ద మూటలని దోచుకోవడం కష్టం కావచ్చు. కానీ ఇప్పుడు చేతిలో పట్టేంత బంగారపు ఇటుకని దోచుకుంటే నా గతేం కాను! నా సంపద, నా శ్రమ అంతా ఈ ఇటుకరాయంత బంగారంలోనే ఉంది కదా! మరేం చేసేది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మరో ఉపాయాన్ని ఆలోచించాడు.   పిసినారి తన ఊరి బయటకు చేరుకోగానే ఎవ్వరూ చూడకుండా చల్లగా ఒక రావి చెట్టు చాటుకి చేరుకున్నాడు. చీకటి పడేవరకూ ఉండి. ఆ చెట్టు కింద వీలైనంత పెద్ద గుంతను తవ్వాడు. తన బంగారపు ఇటుకను అందులో కప్పి... ఏమీ ఎరుగనట్లు ఊరిలోకి చేరుకున్నాడు. మర్నాటి నుంచి పిసినారి జీవితం మామూలుగానే సాగిపోయింది. జనాలని పీక్కు తినడం, తన కడుపుని మాడ్చుకోవడం, డబ్బుని పోగుచేసుకోవడం! ఇదే అతని దినచర్యగా సాగింది. కాకపోతే వారం వారం ఊరిబయటకు వెళ్లి ఆ బంగారపు ఇటుకను బయటకు తీసి తనివితీరా చూసుకుని ఇంటికి చేరుకునేవాడు.   ఓ వారం ఎప్పటిలాగే పిసినారి ఊరిబయట చెట్టు కిందకు వెళ్లాక... అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మతిపోయింది. చెట్టు కింద గుంత తవ్వేసి ఉంది. బంగారపు ఇటుక మాయమైపోయింది. ఇంకేముంది! లబోదిబోమంటూ ఎడవడం మొదటుపెట్టాడు. పిసినారి ఏడుపుని చూసి అటుపక్కగా రహదారి మీద పోయేవారంతా చెట్టు కిందకి చేరుకున్నారు. వారిలో ఒక సాధువు, పినినారి భుజం మీద చేయి వేసి ఏమైందంటూ అనునయంగా అడిగాడు. పిసినారి భోరుభోరుమంటూ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. సాధువు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అన్నాడు... ‘నీదేమంత పెద్ద సమస్య కాదు. నీకు కావల్సింది గుంతను తెరిచి చూసుకోవడమే కానీ, అందులో ఉన్న ధనాన్ని వాడుకోవడం కాదు కదా! ఓ పని చేయి. ఓ బండరాయిని తీసుకుని ఆ గుంతలో పూడ్చిపెట్టు. వారం వారం వచ్చి దాన్ని చూసుకో! అదే బంగారం అనుకో. ఉపయోగపడనిదానికి, అది బండరాయి అయితేనేం, బంగారం అయితేనేం?’ అంటూ తన దారిన తను చక్కా పోయాడు.   పిసినారికి సాధువు మాటల్లోని మర్మం తెలిసి వచ్చింది. జీవితం కోసం డబ్బుని సంపాదించడం తప్పులేదు కానీ, డబ్బే జీవితంగా మారకూడదని బోధపడింది. రోజువారీ ఖర్చులకు, భవిష్యత్తులోని అవసరాలకు డబ్బుని సంపాదించాలే కానీ... కేవలం కూడపెట్టడం అనే ఒకే ఒక్క ఆశయంతో సంపాదన చేయకూడదని అర్థమైంది. అదే కనుక జీవితాశయం అయితే బంగారానికీ, బండరాయికీ తేడా ఏముంటుంది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara
మొటిమలు..నేటి సమాజంలో అత్యంత ఇబ్బంది కలిగించే సమస్యల్లో ఒకటి. చాలా మంది అనుకున్నట్లు, మొటిమలు కేవలం టీనేజర్లను మాత్రమే కాదు..అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడతాయి. కొంతమందికి పింపుల్స్ మరీ పీడకలలా వేధిస్తుంటాయి. చర్మాన్ని నాశనం చేయడంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ఈ మొటిమల్ని నివారించడం ఎలా..? వాటి గురించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం రండి. 1. పింపుల్ అంటే ఏంటి..? మొటిమ అనేది చర్మానికి సంబంధించిన ఒక హార్మోనల్ డిజార్డర్. అవసరమైన దానికంటే ఎక్కువ ఆండ్రోజన్లు ఉత్పత్పి అయిన పక్షంలో, చర్మానికి అవరసమైన దానికంటే ఎక్కువ నూనె ఏర్పడుతుంది. ఇది చర్మం గ్రంథులు వ్యాపించేలా చేస్తుంది. దాన్ని పింపుల్ లేదా మొటిమ అని అంటారు. 2. మొటిమల్లో ఎన్ని రకాలుంటాయి..? పింపుల్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కోమెడోన్స్, క్లోజ్డ్ కోమెడోన్స్ అని వీటిని అంటారు. వాడుక భాషలో ఓపెన్ కోమెడోన్స్ ను వైట్ హెడ్స్ అని, క్లోజ్డ్ కోమెడోన్స్ ను బ్లాక్ హెడ్స్ అని పిలుస్తారు. వెంట్రుక పెరిగే చోట మూసుకుపోయి, నూనె చేరుకుని ఏర్పడి పింపుల్ ను బ్లాక్ హెడ్ అంటారు. కొవ్వు కారణంగా ఏర్పడిన,తెల్లగా కనబడే మొటిమల్ని వైట్ హెడ్స్ అంటారు. 3. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా..? ఆడవారిలోనే కాక, మగవారిలో కూడా పింపుల్స్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉన్నవారు చాలా మందే ఉంటారు. షేవింగ్ కారణంగా పింపుల్స్ వస్తాయా అనేది చాలామందికి వచ్చే సందేహం. కేవలం షేవింగ్ కారణంగా ఇవి రానప్పటికీ, సరైన బ్లేడ్ లేదా షేవింగ్ క్రీమ్ ను వాడకపోతే, చర్మానికి ఎలర్జీ వచ్చి, మొటిమలుగా మారే అవకాశం ఉంది. 4. సెల్ ఫోన్స్ వాడకం కారణంగా పింపుల్స్ వస్తాయా..? బుగ్గలపైన, లేదా ఫోన్ ను ముఖం మీద ఆనించి ఉంచే చోటులో పింపుల్స్ ఉంటే, వాటికి మొబైల్ ఫోన్ వాడకం ఒక కారణమయ్యే అవకాశం ఉంది. రోజూవారీ వాడకంలో, చేతుల నుంచి మొబైల్ ఫోన్ కు అనేక రకాల మురికి, డస్ట్, బ్యాక్టీరియా చేరుతుంటుంది. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు, ఈ బ్యాక్టీరియా ముఖంపై చర్మానికి చేరుకునే అవకాశం ఉంది. రోజుకు ఒకసారైనా, మొబైల్ ను యాంటీ బ్యాక్టీరియల్ తో నీట్ గా తుడవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. 5. ఒత్తిడి పింపుల్స్ ను కలిగిస్తుందా..? పనిచేసే చోట, లేక పర్సనల్ లైఫ్ లో కలిగే రోజూ వారీ ఒత్తిళ్లు మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఒత్తిడి వలన డైరెక్ట్ గా పింపుల్స్ ఏర్పడే అవకాశం లేనప్పటికీ, ఇన్ డైరెక్ట్ గా కారణం కావచ్చు. ఒత్తిడి మరీ ఎక్కువై శరీరం హార్మోన్లు ఎక్కువ విడుదల చేస్తుంది. అది తిరిగి మొటిమలు ఏర్పడటానికే కారణం అవుతుంది. 6. సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ హెల్ప్ అవుతాయా..? సరైన సబ్బులు, యాంటీ పింపుల్ క్రీమ్స్ ను వాడితే, ఫలితం ఉండచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు, రోజుకు రెండు సార్లు యాంటీ పింపుల్ క్లెన్సర్ తో గానీ, ఆయిల్ స్కిన్ కు వాడే క్లెన్సర్ ను గానీ ఉపయోగిస్తే మొటిమలు తగ్గడానికి ఆస్కారం ఉంది. అయితే మరీ ఎక్కువ క్రీములను ఉపయోగించడం కూడా ప్రమాదకరమే. యాంటీ ఆయిల్ క్రీమ్స్ ముఖం లోని ఆయిల్ శాతాన్ని పూర్తిగా తగ్గించి స్కిన్ డ్రై అయిపోవడానికి దోహదపడతాయి. ఇది మొటిమల్ని మరింత ఎక్కువ చేస్తుంది. ఇలాంటి క్రీమ్స్ వాడాలనుకుంటే, స్కిన్ స్పెషలిస్ట్ సూచనల మేరకు వాడటం చాలా మంచిది. 7. పింపుల్స్ ను చిదిమేయచ్చా..? ఎక్కువ శాతం మందికి ఉండే క్వశ్చన్ ఇది. పింపుల్స్ ను చిదిమేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చా అని ఆలోచించే వారికి కొదువ లేదు. కానీ అలా చేయడం పింపుల్ ను తగ్గించకపోగా, మరింత ఎక్కువ చేస్తుంది. పైపెచ్చు విషమించి మరింత పెద్ద ఇన్ఫెక్షన్ లో కి దారి తీసే ప్రమాదం ఉంది. చిదిమిన తర్వాత పింపుల్ లో ఉండే బ్యాక్టీరియా మరింత లోతుకు వెళ్లిపోయి పుండుగా మారిపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి వాటిని సహజంగా తగ్గించడమే సేఫ్ తప్ప, చిదిమడం అంత మంచిది కాదు. అన్నింటికీ మించి మొటిమల సమస్యలతో బాధపడే వారు ప్రతీ రెండు మూడు గంటలకోసారి కేవలం నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా పింపుల్స్ సమస్య అదుపులోకి తెచ్చుకోవచ్చు. 
  గ్రహించే మనసు ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అణువణువూ ఓ జీవితపాఠాన్ని నేర్పుతుందంటారు పెద్దలు. ఇందుకు చీమలనే ఓ ఉదాహరణగా తీసుకోవచ్చునేమో. విశ్లేషించడం అంటూ మొదలుపెడితే, చీమల నుంచి ఎన్నో విలువైన పాఠాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని...   పూర్తిస్థాయి సామర్థ్యం: తాము అల్పంగా ఉన్నాం కదా అని చీమలు వెనకడుగు వేయవు. ఎంతబరువు మోయగలవో అంత బరువునీ మోసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకేనే చీమలు తమ బరువుకంటే దాదాపు 5000 రెట్లు అధికబరువుని మోయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. కానీ మనుషులు అలా కాదు! ఎన్నో ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని అమలుపరిచే సత్తా ఉన్నా లేనిపోని పరిమితులను ఊహించుకుని గిరగీసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి చీమలు ఓ గొప్ప గుణపాఠం కదా!   వెనకడుగు వేసేది లేదు: ఆహారం కోసం బారులుగా బయల్దేరిన చీమలకి దారిలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి... అవి వెనక్కి వెళ్లడం జరగదు. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం ఏముంటుందా అని అన్వేషిస్తాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ ఎలాగొలా గమ్యానికి చేరుకుంటాయి. ఒకటి రెండు అడ్డంకులకు బెంబేలెత్తిపోయి చేతులెత్తేసే మనకి ఇలా నిరంతరం లక్ష్యం వైపుగా సాగిపోవడమే ధ్యాసగా ఉన్న చీమలు గొప్ప స్ఫూర్తి కదా!   కలసికట్టుగా: బలవంతమైన సర్పము/ చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! అంటాడు శతకకారుడు. చీమలు గొప్ప సంఘజీవులు అన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. అవి తాము సేకరించిన ఆహారాన్ని మిగతా చీమలన్నింటితోనూ పంచుకునేందుకే ఇష్టపడతాయి. ప్రతి చీమా తనకు ఎదురుపడిన చీమతో దారుల గురించీ, ఆహారం గురించీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని తేలింది. తన ఆకలి తీరడమే కాదు, తన తోటివారి కడుపు నిండినప్పుడే నిజమైన తృప్తి లభిస్తుందని చీమలు బోధిస్తున్నాయి.   దూరదృష్టి: చీమల దూరదృష్టి గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే అవి పుట్టలను నిర్మించుకుంటాయనీ, ఆహారాన్ని పోగేసుకుంటాయని అంటారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో కానీ దీర్ఘకాలం తిండికీ గూడుకీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అవి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయనే విషయంలో ఏ అనుమానమూ లేదు. ఒంట్లో సత్తువ ఉండగా శ్రమించడమే కాదు, అది లేని రోజు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనని చీమలు కలిగిస్తున్నాయి.   లక్ష్యం ఉంటుంది: చీమల్ని చూస్తే అవి నిరంతరం ఏదో వెతుకులాటలో ఉన్నట్లే కనిపిస్తాయి. ఆహారాన్ని వెతుక్కొంటూనో, దొరికిన ఆహారాన్ని మోసుకువెళ్తూనో, సాటి చీమలతో సమాచారాన్ని పంచుకుంటూనో వడివడిగా సాగుతుంటాయి. మనసుకి ఆలోచించే దమ్ము, ఒంట్లో పనిచేసే సత్తా ఉన్నంతవరకూ విశ్రమించవద్దంటూ మనకి సూచిస్తూ ఉంటాయి.   - నిర్జర.
  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆయన శరీరం తొంభై శాతం వరకు కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. టీఎంయూ నేతగా కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన కొద్ది సేపటికే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని తోటి కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు ఏకంగా యాభై వేల ఉద్యోగులను కేసీఆర్ ఒక్కసారిగా డిస్స్మిస్ చేయడం పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలు ఖమ్మం డిపో లోని డ్రైవర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా టీఎంయూలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సమ్మె పై కేసీఆర్ ప్రసంగించిన తరువాత ప్రెస్ నోట్ ని విడుదల చేసిన వెంటనే తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా తొంభై శాతం శరీరం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతానికి అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించినట్లు తెలియజేశారు. దాదాపుగా అన్ని యూనియన్ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగాను, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుండటమే కాక ఇటువంటి పాలనతో ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరిని కూడా ప్రభుత్వం అణిచివేస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేస్తామని దీనిని జిల్లా పరంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉదృక్తం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వామపక్ష పార్టీలు, యూనియన్ నేతలు చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద చేరుకోవడమే కాక అదనపు బలగాలను కూడా తీసుకొచ్చెందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
  'భలే మంచి చౌక బేరము' అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు ఈ న్యూస్ వింటే అదే సాంగ్ పాడుకుంటారు. విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న ఖరీదైన ఐదెకరాల స్థలాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ దక్కించుకున్న సంస్థకి రూపాయికే లీజుకిస్తారట. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేయడం.. ఆర్టీసీ కార్మిక సంఘాల్లో సంచలనం అవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రిబిడ్డింగ్ సమావేశానికి ముందే.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేశారు. అప్పుడే.. పోలవరం రివర్స్ టెండర్లను తక్కువకు వేసిన సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి డబుల్ రేట్లకు.. టెండర్ కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగింది. అదే సంస్థ తెలంగాణలో కి.మీ రూ. 36కి ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేస్తోంది. ఏపీలో మాత్రం రూ. 60 అడిగినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారం అని చర్చ జరుగుతోంది.  అయితే.. బస్సుల కాంట్రాక్ట్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ అత్యంత విలువైన ఆర్టీసీ భూముల్ని కూడా కట్టబెట్టబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గన్నవరంలలో ఆర్టీసీకి విలువైన స్థలాలు ఉన్నాయి. మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుంది. సిటీ డివిజన్‌ పరిధిలో ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ కోసం మెయింట్‌నెన్స్‌ డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆర్టీసీ అధికారులే ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. అయితే మెయింట్‌నెన్స్‌ డిపోకు కేటాయించే స్థలాలను సంవత్సరానికి రూపాయికి అద్దెకు ఇస్తున్నట్టు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) లో సూచించటం ఇప్పుడు దుమారాన్నే రేపుతోంది. కి.మీ లెక్కల ఖర్చులు ఆర్టీసీ చెల్లిస్తున్నప్పుడు.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ మొత్తం సదరు కంపెనీనే పెట్టుకోవాలి. కానీ.. నిర్వహణ, మెయింట్‌నెన్స్‌ భారం ఆర్టీసీపై పడేలా.. స్థలాన్ని ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆర్టీసీలో సాధారణ బస్సులను అనేకం అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. అద్దెకు బస్సు ఇచ్చేవాళ్లే బస్సును సొంతంగా నిర్వహించుకుంటారు. డ్రైవర్‌ యజమానికి చెందిన వారు ఉంటే.. కండక్టర్‌ మాత్రం ఆర్టీసీకి చెందిన వారు ఉంటారు. వ్యాపారం అతనే చేస్తున్నాడు కాబట్టి.. మెయింట్‌నెన్స్‌ కూడా అతనే చేసుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రం.. ఆ భారం మొత్తం ఆర్టీసీపై వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దె ప్రాతిపదికన తీసుకునే బస్సుల కోసం సంస్థ ఆస్థులను అప్పనంగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా కార్పొరేట్‌ స్థాయి కలిగిన బల్క్‌ సప్లయిర్‌కు ఈ విధంగా అప్పనంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను అప్పగించాలను కోవటం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తీసుకునే సాధారణ బస్సుల విషయంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో.. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కూడా ఆర్టీసీ అధికారులు అదే వైఖరిని అవలంభించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేస్తామని కానీ.. ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పండగ సమయంలో సమ్మెకు వెళ్లారని విమర్శించారు. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రజల కోణంలో ఆలోచించకుండా రాజకీయం చేస్తున్నాయని.. ప్రతిపక్షాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అజయ్ పేర్కొన్నారు. టెంట్‌ వేసిన చోటల్లా విపక్షాలు వాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కర్రు కాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని అజయ్ అన్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, 2014బ్యాలెన్స్ షీట్‌లో ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో ఆర్టీసీకి నష్టాలే వచ్చాయన్నారు. కేసీఆర్‌ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీకి 14 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3,303 కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని అజయ్ ప్రశ్నించారు. 5 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని తెలిపారు. అన్ని రకాల బస్సు పాస్‌లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అజయ్ హెచ్చరించారు.
ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ... ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది. ఏడేళ్ల పరిశీలన ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్నుకొన్న అభ్యర్థులని ఏడేళ్ల పాటు నిశితంగా గమనించారు. ఈ పరిశీలనలో ఉద్యోగంలో ఒత్తిడికీ, మరణాలకీ ఖచ్చితమైన సంబంధం బయటపడింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారు త్వరగా చనిపోయేందుకు 15.4 శాతం అధికమైన అవకాశం ఉన్నట్లు తేలింది. పనిలో పనిగా బయటపడిన మరో ఫలితం వారిని నిర్ఘాంతపరిచింది. ఒత్తిడితో మృత్యువు దూరం ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు సుదీర్ఘకాలం బతికినట్లు తేలింది. ఉద్యోగం ఎంత కఠినమైనదైనప్పటికీ, లక్ష్యాలు ఏర్పరిచే అవకాశం దగ్గర్నుంచీ వాటిని సాధించే విధానం దాకా అన్నీ ఉద్యోగికి అందుబాటులో ఉన్నప్పుడు అది అతని ఆరోగ్యం మీద అనుకూల ప్రభావమే చూపుతోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఏకంగా 34 శాతం తక్కువగా ఉందట. ఒత్తిడి ఒకోసారి బాగుంటుంది ఒక పక్క ఒత్తిడిలో ఉండి, దానిని పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేని వ్యక్తులు... సదరు ఒత్తిడిని అధిగమించేందుకు అతిగా తినడమో, సిగిరెట్లు కాల్చడమో వంటి పనులు చేస్తుంటారట. ఇక మనసులోనే తిష్టవేసుకునే ఒత్తిడి వలన రక్తపోటు ఎలాగూ తప్పదు. అదే సమయంలో బాధ్యతలూ నీవే, హక్కులూ నీవే అన్న భరోసాని ఉద్యోగికి కల్పించినప్పుడు అతను అదే ఒత్తిడిని ఒక సవాలుగా తీసుకుంటాడు. దానిని ఎదుర్కోవడాన్ని, తద్వారా తనని తాను నిరూపించుకోవడాన్నీ ఇష్టపడతాడు. వింటానికి బాగుంది కానీ... ‘నిర్ణయాలు తీసుకునే అధికారం’ అన్న వాక్యం వినడానికి బాగుంది కానీ... ఆ అదృష్టం ఎంతవరకూ, ఎంతమందికి లభిస్తుందన్నదే అనుమానం. ఒత్తిడి మాత్రమే ఉండి స్వేచ్ఛ లేని సందర్భాలలో దానిని ఎదుర్కొనేందుకు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం... వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ, వీటిని ఎంతమంది పాటిస్తారన్నదే అనుమానం!!!   - నిర్జర.
Do you love drinking coffee? If that is true, then I have some good news for you. Did you know? By drinking coffee, you are protecting your liver from many diseases. Read on to find out more. This news has come from the nation of coffee lovers - Canada, on World Coffee Day. With 63% of them consuming coffee everyday, it made them very happy to know that they were doing a favor on their liver while satisfying their coffee cravings. So what does coffee do to protect your liver. Here’s a list of few benefits you receive by consuming a minimum of 3 cups of coffee per day. • Improving  abnormal liver blood tests including ALT, AST and GGT • Preventing fatty liver disease by reducing insulin resistance; • Enhancing response to treatment for  chronic hepatitis C • Reducing  the risk  of cirrhosis due to alcohol or viral hepatitis • Reducing the risk of  hepatocellular carcinoma (liver cancer) Now, that’s a lot, isn’t it? Most of the time, we don’t recognize a liver disease until its beyond repair. With coffee we are unknowingly saving our liver or sometimes repairing the damage caused by alcohol consumption. After a thorough research, it is advised by Seinäjoki Central Hospital and the University of Tampere in Finland, that heavy alcohol consumption must be compensated with 5 cups of coffee or more. This may undo the damage caused by alcohol. So grab that coffee mug to save your liver!   -Kruti Beesam
  మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్‌ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి.   పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట.      వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్‌ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది.   తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం.     దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.