ALSO ON TELUGUONE N E W S
  ప్రతి వేసవిలో సన్నిహితులకు మామిడిపళ్ళు పంపడం పవన్ కళ్యాణ్ అలవాటు. సేంద్రీయ పద్దతిలో తన వ్యవసాయ క్షేత్రంలో మామిడిచెట్లకు కాసిన పళ్ళను పవర్ స్టార్ పంపిస్తుంటారు. ఎవరైతే ఆ మామిడిపళ్ళు అందుకుంటారో, ఆ ప్రముఖులు సంతోషంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కరోనా వేళ ఈ ఏడాది పవన్ పంపారో? లేదో? తెలియదు. ఎందుకంటే ఎవరు ట్వీట్లు, పోస్టులు చేయలేదు. ఈ ఏడాది తనకు పవన్ మామిడిపళ్ళు రాలేదని ప్రముఖ హాస్యనటుడు అలీ చెప్పారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పంపలేదేమో, వచ్చే ఏడాది వస్తాయని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టి అలీకి మాత్రమే పవన్ మామిడిపళ్ళు అందలేదని అనుకోవాలి. సినిమాలు పవన్ కళ్యాణ్, అలీని స్నేహితులు చేస్తే... రాజకీయాలు శత్రువులను చేశాయి. గత ఎన్నికల ప్రచారంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. అందువల్ల, అలీని తన లిస్టులోంచి పవన్ తీసేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోగా పవన్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', మొన్నటి 'అజ్ఞాతవాసి' మినహా మిగతా అన్ని సినిమాల్లో అలీ నటించారు. రాజకీయాల ఇద్దరి మధ్య దూరం పెంచాయని చెప్పుకోవాలి.
  తెలుగు కుర్రకారు గుండెల్లో 'ఇస్మార్ట్'గా గూడు కట్టేసుకుంది నిధి అగర్వాల్. 'సవ్యసాచి' (2018)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆపై 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాల్లో సందడి చేసింది. వీటిలో 'అక్కినేని బ్రదర్స్'తో జట్టుకట్టిన 'సవ్యసాచి' (అక్కినేని నాగచైతన్య), 'మిస్టర్ మజ్ను' (అక్కినేని అఖిల్) బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో జోడి కట్టిన 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్ల వర్షం కురిపించింది.   మొత్తంగా 'ఇస్మార్ట్ శంకర్'తో తన కెరీర్‌లో ఫస్ట్ సాలిడ్ హిట్ చూసిన నిధి.. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ 'జయం' రవి సిల్వర్ జూబ్లీ ఫిలిమ్‌ 'భూమి'లో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న నిధి.. తెలుగులో అశోక్ గల్లా (సూపర్ స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ తనయుడు) కథానాయకుడిగా పరిచయమవుతున్న పేరు నిర్ణయించని చిత్రంతో  పాటు మాస్ మహరాజా రవితేజ - దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ కథానాయికగా దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ క్రమంగా 'రీమిక్స్ క్వీన్' అయ్యే దిశగా అడుగులు వేస్తూ ఉండడం తెలుగునాట వార్తల్లో నిలుస్తోంది. తన తొలి తెలుగు చిత్రం 'సవ్యసాచి'లో 'నిన్ను రోడ్డు మీద' ('అల్లరి అల్లుడు') రీమిక్స్‌లో సందడి చేసిన నిధి.. అశోక్ గల్లా కాంబినేషన్ మూవీలో 'జుంబారే' ('యమలీల'లో కృష్ణ స్పెషల్ సాంగ్) రీమిక్స్‌కి స్టెప్పులు వేసింది. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. 'సవ్యసాచి'లో 'నిన్ను రోడ్డుమీద' రీమిక్స్ అంతగా క్లిక్ కాని నేపథ్యంలో.. 'జుంబారే' రీమిక్స్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మ‌రి. కొసమెరుపు ఏమిటంటే.. 'సవ్యసాచి' కోసం తన తండ్రి అక్కినేని నాగార్జున పాపులర్ సాంగ్‌కి చైతు చిందులేస్తే.. తన డెబ్యూ ఫిలిమ్ కోసం తాతయ్య కృష్ణ స్టెప్పులకు రీలోడెడ్ వెర్షన్‌లో అశోక్ గల్లా చిందులేశాడు.
  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పటివరకు 19 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో దక్షిణాది ముద్దుగుమ్మలు, ఉత్తరాది భామలు నాయికలుగా సందడి చేసిన వైనాలే ఎక్కువ‌. అయితే బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సందడి చేసిన సందర్భాలు మాత్రం రెండే రెండు ఉన్నాయి. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ 'ఏక్ నిరంజన్' (2009) చిత్రం కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ప్రభాస్.. ఆపై దాదాపు పదేళ్ల తర్వాత పాన్ ఇండియా మూవీ 'సాహో' (2019) కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్‌తో జట్టుకట్టాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభాస్‌కి చెప్పుకోదగ్గ ఫలితాలే దక్కాయి. 'ఛ‌త్రపతి' తరువాత సరైన విజయం లేని యంగ్ రెబల్ స్టార్‌కి.. కంగనాతో జోడి కట్టిన 'ఏక్ నిరంజన్' ఊరటనిచ్చింది. తొలివారంలోనే పెట్టుబడిని రాబట్టుకుని హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక 'సాహో' విషయానికి వస్తే 'బాహుబలి' సిరీస్ తరువాత వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైనా.. హిందీనాట‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ స్టామినా ఏంటో చెప్పకనే చెప్పింది. సో.. బాలీవుడ్ స్టార్ బ్యూటీలతో జట్టుకట్టిన ప్రతీసారి ప్రభాస్‌కి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట. ఈ నేపథ్యంలోనే.. 'మహానటి' ఫేమ్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న భారీ బడ్జెట్ మూవీ ('ప్ర‌భాస్ 21స‌) కోసం ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ స్టార్ బ్యూటీతో ప్రభాస్ జోడి కట్టనున్నట్టు కథనాలు వస్తున్నాయి. దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, అలియా భట్.. ఇలా పలువురు ప్రముఖ హిందీ కథానాయికల పేర్లు ఈ చిత్రం కోసం వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్ టాక్ ఏంటంటే.. దీపిక ఆల్మోస్ట్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనేది. మరి.. కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్ ఎలాగైతే ప్రభాస్‌కి కలిసొచ్చారో అలాగే దీపిక కూడా అచ్చొస్తుందేమో చూడాలి.
  కరోనా రక్కసి కాటు వేయడంతో ఓ బాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి చెందాడు. ఇప్పటివరకు దేశంలో పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. అదృష్టవశాత్తూ అందరూ చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే తొలిసారి, అదీ చిత్ర పరిశ్రమ నుండి ఒకరు మరణించిన ఘటన చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే...  బాలీవుడ్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్ లో వాజిద్ ఇకలేరు. కరోనా మహమ్మారి ఆయన్ను బలి తీసుకుంది. కోవిడ్19 కారణంగా 42 సంవత్సరాల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ఈ విషాదకర సంగతి ట్వీట్ చేశారు. వాజిద్ ఖాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కరోనా కారణంగా మృతి చెందారని బాలీవుడ్ కన్ఫర్మ్ చేసింది.  సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' సినిమాతో సాజిద్-వాజిద్ సంగీత దర్శకులుగా ప్రయాణం ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక పాట కంపోజ్ చేశారు. తర్వాత పలు సినిమాల్లో పాటలకు సంగీతం అందించారు. సల్మాన్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'దబాంగ్'కి సాజిద్-వాజిద్ పని చేశారు.  
  కొద్ది రోజుల క్రితం రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్ నిశ్చితార్ధం (రోకా) జ‌రిగింది. రామానాయుడు స్టూడియోస్‌లో కుటుంబ‌స‌భ్యుల‌ మ‌ధ్య ఉల్లాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లో ఆ ఇద్ద‌రి జంట ఎంత అందంగా ఉందో చూశాం. అప్ప‌ట్నుంచీ వాళ్ల పెళ్లి తేదీ ఎప్పుడో తెలుసుకోవాల‌ని రానా ఫ్యాన్స్ ఆస‌క్తి చూపుతూ వ‌స్తున్నారు. తాజాగా ఆ తేదీని రానా తండ్రి సురేశ్‌బాబు బ‌య‌ట‌పెట్టారు. ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో ఈ వేడుక జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు ఆ వేడుక‌కు హాజ‌ర‌వుతార‌ని సురేశ్‌బాబు చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి కుటుంబ‌ స‌భ్యుల‌తో పాటు రానా, మిహీకాల స్నేహితులు, సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన‌ కొంత‌మంది ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొనే అవ‌కాశం ఉంది. రానా, మిహీకా కొంత‌కాలంగా ప్రేమించుకుంటూ వ‌స్తున్నారు. అయితే త‌మ మ‌ధ్య బంధాన్ని వాళ్లు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. "ఆమె స‌రేనంది" అంటూ సోష‌ల్ మీడియా ద్వారా మిహీకాను రానా ప‌రిచ‌యం చేశాకే.. అంద‌రికీ వాళ్ల ప్రేమ వ్య‌వ‌హారం తెలిసింది.
తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...     మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి. రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!     - నిర్జర.
  Do you think you are Loyal towards the Mother Earth after taking everything that is essential? After seeing so much of deforestation we feel the answer is absolutely no. How loyal should you be towards the planet - watch this video to know more.......   https://www.youtube.com/watch?v=dSohFWv4tgs  
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 1 మార్గదర్శకాల్లో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకల పై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ కు రావాలంటే ఎటువంటి పర్మిషన్ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఐతే అంతర్రాష్ట్ర బస్సులు మాత్రం ప్రస్తుతానికి నడపడం లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఏపీలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇతర రాస్జ్త్రాల నుండి ఏపీకి రోడ్ మార్గం ద్వారా రావాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏపీకి రావాలనుకున్న వారు స్పందన పోర్టల్ ద్వారా అప్లై చేసుకుని పాస్ తీసుకుని రావాలని అయన తెలిపారు. ఐతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఏపీకి వస్తున్న వారిని చెక్ పోస్టుల వద్ద చెక్ చేసి పాస్ లు ఉన్నవారినే మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల క్యూ పెరుగుతూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే వారు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని.. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని అయన తెలిపారు.
మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తీసుకొస్తామని చెప్పిన జగన్ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి మరో 535 మద్యం షాపులు మూతపడనున్నాయి. ఇటీవల తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. రాష్ట్రంలో 535 మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ తగ్గించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా, ఇప్పుడు వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 20 శాతం షాపులు తగ్గించింది. ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 33శాతం షాపులు తగ్గించినట్లైంది. మద్య నిషేధం లక్ష్యమని చెబుతున్న జగన్ సర్కార్.. అందులో భాగంగానే షాపులను తగ్గించుకుంటూ వస్తోంది.
తెలంగాణ సర్కార్ కి గోదావరి నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు గోదావరి బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది. పునర్‌విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని ఏపీ ఫిర్యాదు చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మించరాదని గోదావరి బోర్డు స్పష్టం చేసింది. దీంతో  కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు బోర్డు బ్రేకులు వేసినట్లైంది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. గోదావరి నది మీద తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అందులో ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ఐఎస్, మిడ్ మానేర్ డ్యామ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టులన్నింటి నిర్మాణ పనులు వెంటనే ఆపేయాలని గోదావరి రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కృష్ణా జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చించనున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ జూన్ 4న జరగనుంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఆ విషయం మీద తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాలపై ఏపీ నిర్ణయాన్ని కార్నర్ చేసి కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. గోదావరిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్ట్ లను  ఏపీ టార్గెట్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల  రాష్ట్రాల మధ్య జల రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఈ జల జగడానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
  చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  
  ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మేఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ. పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.