Publish Date:Nov 10, 2012

ALSO ON TELUGUONE N E W S
                          విభిన్న ద‌ర్శ‌కుడు తేజ‌, అందాల న‌టి కాజ‌ల్ క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రాబోతుంద‌ని స‌మాచారం అందుతోంది. ఈ మ‌ధ్య వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `సీత‌` సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడ‌లేదు.  ఇక మ‌రోసారి కాజ‌ల్ కోసం లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ను రెడీ చేస్తున్నాడ‌ట తేజ‌.  మ‌రో విశేష‌మేంటంటే.. ఈ సినిమాని స్వ‌యంగా కాజ‌లే నిర్మించ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  కాంటెంప‌ర‌రీ అంశాల‌తో సందేశంతో పాటు, వినోదాన్ని మేళ‌వించి ఈ సినిమాను రూపొందించ‌నున్నాడు తేజ‌. ఇక ఈ సినిమా ప‌ట్టాలెక్కితే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `లక్ష్మి క‌ళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత‌, త‌ర్వాత వ‌స్తోన్న నాలుగో చిత్ర‌మ‌వుతుంది. కాజ‌ల్ ని `ల‌క్ష్మీ క‌ళ్యాణం` సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ కు కాజ‌ల్ ని తేజ ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే.
  ఇటీవ‌ల టాలీవుడ్ యంగ్  హీరోస్ షూటింగ్స్ లో  జ‌రుగుతోన్న యాక్సిడెంట్స్ వ‌ల్ల గాయాల‌పాల‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు మ‌రో న‌టుడుకి  రోడ్ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  `జ‌బ‌ర్ద‌స్త్` తో ఫేమ‌స్సైన చ‌లాకి చంటి అంద‌రికీ  సుపరిచితుడే. టీవీ షోస్, సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా గ‌డుపుతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు యాక్సిడెంట్ లో చంటికి గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. చంటి ప్ర‌యాణిస్తోన్న కారు ఆగివున్న లారీని ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది. కోదాడ హాస్పిట‌ల్ లో ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. కారు ముందు భాగ‌మంతా నుజ్జునుజ్జైంది. ఈ ప్ర‌మాదంలో చిన్న గాయాల‌తో చంటి బ‌య‌ట‌ప‌డ్డాడు.
  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న `సైరా` ట్రైల‌ర్ రిలీజ్ కు డేట్ ఫిక్స‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇది చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 151వ చిత్ర‌మ‌ని తెలిసిందే. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చిత్రంతో `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార‌, త‌మన్నా, సుదీప్ , జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు ముఖ్య‌తారాగ‌ణం `సైరా` చిత్రం టీజ‌ర్ ను గ‌తంలోనే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌ష్టు 22) న ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  
 `బాహుబ‌లి` తర్వాత రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో వ‌స్తోన్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`. ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా,  రామ్ చ‌ర‌ణ్  అల్లూరి సీతారామ‌రాజుగా  న‌టిస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన త‌మ అభిమాన హీరోల ఫ‌స్ట్ లుక్స్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో  క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు అభిమానులతో పాటు తెలుగు ఆడియ‌న్స్. ప్ర‌జంట్ ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిక‌ర‌మైన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ స్వాతంత్య్ర దినోత్సం నాడు ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయ‌డానికి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా ను డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. చర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం ఇంకా సెర్చింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాను నెక్ట్స్ ఇయ‌ర్ జూలై 30న విడుద‌ల చేయ‌నున్నారు.
ఇటీవ‌ల `జెర్సీ`తో మంచి విజ‌యాన్ని అందుకున్న  నేచుర‌ల్ స్టార్ నాని. ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక వైపు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ రూపొందిస్తున్న `గ్యాంగ్ లీడ‌ర్` లో న‌టిస్తూనే మ‌రోవైపు సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `వి` చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు నాని. కాగా ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న `వి` చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని వ‌రుస హ‌త్య‌లను చేసి క్లూస్ కూడా వ‌దిలేస్తుంటాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ కేసును డీల్ చేయ‌డానికి వ‌చ్చిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ సుధీర్ బాబు. ఆ మిస్ట‌రీని ఎలా ఛేదించాడు ? అనే క‌థాంశంతో `వి` సినిమా తెర‌కెక్కుతోంద‌ని టాలీవుడ్ టాక్ . ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే  కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. `దిల్` రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రంలోనే సినిమాను విడుద‌ల చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నారు నిర్మాత‌లు.
మనిషి నుదురు విశాలంగా ఉంటే అది అతని పెద్ద మెదడుని సూచిస్తుందనీ, పెద్ద మెదడు తెలివితేటలని సూచిస్తుందనీ పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాల గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఆ సంగతేమో కానీ ఇప్పుడు మెదడు ఆకారాన్ని పరిశీలిస్తే, సదరు మనిషి మనస్తత్వం బయటపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు! ఆ మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే మానసిక సమస్యలని కూడా అంచనా వేయవచ్చని ఆశిస్తున్నారు.   ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మెదడులో ఉండే కార్టెక్స్‌ అనే ముఖ్యభాగం తీరుని బట్టి వ్యక్తుల ధోరణిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్టెక్స్‌ ఎంత మందంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంతవరకు ముడుచుకుని ఉంది అనే మూడు అంశాల ఆధారంగా ఐదు రకాల లక్షణాలను పసిగట్టారు. నిరాశావాదం (neuroticism), కలుపుగోలుతనం (extraversion), విశాల దృక్పథం (openness), పరోపకారం (altruism), ఆత్మస్థైర్యం (conscientiousness) అనేవే ఆ ఐదు లక్షణాలు.   ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది వ్యక్తుల మెదడు తీరుని గమనించారు. కార్టెక్స్‌ బాగా మందంగా ఉన్న వ్యక్తులలో నిరాశావాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు సహజంగానే మానసికమైన రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా విశాలమైన దృక్పథం ఉన్న మనుషులలో కార్టెక్స్ తక్కువ మందంతోనూ, ఎక్కువ వైశాల్యంతోనూ కనిపించింది.   మెదడు ఓ చిత్రమైన అవయవం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ యవ్వనం వచ్చేంతవరకూ కూడా ఆ మెదడులో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆలోచనా తీరు, మన అలవాట్లు కూడా మెదడు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. మెదడులోని కార్టెక్స్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒకే ఉపాయం ఉంది. అది తన మందాన్ని తగ్గించుకుని వైశాల్యాన్ని పెంచుకోవాలి. అలా పెరిగిన వైశాల్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముడతలు పడాలి.   ఒక్క మాటలో చెప్పాలంటే రబ్బరు షీటుని మడిచిపెట్టినట్లుగా కార్టెక్స్‌ కూడా మడతలు మడతలుగా మారడం వల్ల తనకి ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ విస్తరించగలుగుతుందన్నమాట. మెదడులో ఇలాంటి మార్పులు వచ్చేందుకు మన ఆలోచనలు కూడా దోహదపడతాయని ఇప్పుడు తెలిసిపోయింది. మనుషులు పెద్దవారయ్యే కొద్దీ వారిలో తిరుగుబాటు ధోరణి, బాధ్యతారాహిత్యం, నిరాశావాదం తగ్గడానికి కారణం కూడా మెదడులో వచ్చే మార్పులే కారణం అంటున్నారు. అదీ విషయం! అంటే మన మెదడు శుభ్రంగా ఎదగాలంటే ఆలోచనల్లో పరిపక్వత ఉండాలన్నమాట!   - నిర్జర.
సమసోఖ్ఖ దుఖ్ఖ పరివడ్ఢిఆణం కాలేన రూఢ పెమ్మాణం  మిహుణాణం మర ఇ  జం తం జిగయి యీరం ము అం హోయి.  (గాధా-1-42) గాధాసప్తశతిలోని యీ గాధ, భార్యాభర్తల గాఢమైన ప్రేమకు అద్దం పడుతున్నది. 'సుఖదుఖాలను సమానంగా పంచుకుంటూ జీవించిన దంపతులలో, ముందెవరు మరణించినా, వారే జీవించి ఉన్నవారితో సమానం. మిలిగినవారు బ్రతికిఉన్నా, జీవన్మృతులే' అంటున్న పై గాధ, దాంపత్య జీవిత సార్థక్యతను స్పస్టంగా వివరిస్తున్నది. దాదాపు యేడు వందల సంవత్సరాల క్రితం రచనైనా, అప్పటి గృహస్థ జీవనంలోని విలువలను ఇప్పటి జంటలకు బోధిస్తున్నట్టూ, ఇలాగే మీరూ ఉండాలి సుమా' అని హెచ్చరిస్తున్నట్టూ ఉంది కదూ!              గాధాసప్తశతిలోని మరో పామరుడైన   రైతు,  తన భార్య గతించటాన్ని తట్టుకోలేక, ఆ శూన్యమైన ఇంటికి వెళ్ళేందుకూ ఇస్థపడక,పనేమీ లేకున్నా, పొలంలోనే కాలం గడుపుతున్నాడట! (గాధా-2-69) తనలో ఇంకా సజీవంగానే ఉన్న భార్య జ్ఞాపకాలను చెరిపివేయటం  సుతరామూ ఇష్టం లేదు పాపం ఆ అమాయకునికి!! ఈ నాటి దాంపత్య జీవితం,ఇటువంటి గాఢానుభూతులకు తావిచ్చేలా  లేదేమోననిపిస్తుంది. కారణం- ఆర్థిక పరమైన పరస్పరాధారాలుగానే  ఉంటున్న జీవితాలు మనవి. డబ్బుతో వచ్చే సౌఖ్యాలు తప్పనిసరి బంధాలను ప్రోత్సహిస్తున్నాయేమోననిపిస్తుంది కూడా!  యేది యేమైనా, ప్రేమ వివాహాలలోనూ, పెద్దలు కూర్చి చేసిన పెళ్ళిళ్ళలోనూ, 'ఇగో' అన్న గుణాన్ని అదుపులో ఉంచుకోకపోతే అన్నీ అనర్థాలే నన్నదీ నగ్న సత్యం. ఎంతగానో ప్రేమించుకుని, ఎన్నెన్నో త్యాగాలు చేసి మరీ పెళ్ళాడిన జంటలు కూడా యీ సమస్యతోనే విడిపోవటం నేను చూసిన సత్యం. ఇరువురి గుణాలూ, అలవాట్లూ అన్నీ అర్థమయ్యాకే పెళ్ళిళ్ళు చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే  వీళ్ళెందుకు విడిపోతున్నారో అర్థం కాదు. అంటే, పెళ్ళికిముందు, వీరిద్దరిలోనూ ఉన్నది  కేవలం  ఆకర్షణేనా అని అనుమానమూ వస్తుంది కదా!  అంతేకాక, చాలావరకూ ప్రేమ జంటలకు   తల్లిదంద్రుల సమ్మతి దొరకకపోవటం వల్ల, ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, సర్ది చెప్పే పెద్దవారూ  ఉండరు. ఇకపోతే, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో, భార్యాభర్తల మధ్య  అనుబంధం యేర్పడేందుకూ  కొంత కాలం పడుతుంది. ఐనా, ఇదివరకటి బాల్య వివాహాలు వితంతు సమస్యకు కారణమైనా, భార్యాభర్తల మధ్య,కుటుంబ సభ్యుల మధ్య కూడా, సుదీర్ఘ అనుబంధానికి అనుకూలంగా ఉండేవి. కాలం మారి, వివాహాలకూ అర్హమైన వయస్సును నిర్ణయించటం వల్ల, ముక్కుపచ్చలారక ముందే తల్లి కావటం, ప్రసవ సమస్యలకు గురి కావటం, లేత వయసులోనే తనువు వీడటం   లేదా కాళ్ళ పారాణికీ, పసుపు కుంకుమలకూ దూరం కావటమన్న సమస్యలు శాశ్వతంగానే పరిష్కరింప బడినాయి  కూడా!  ఇది మంచి పరిణామమే. ఈనాడు, ఆడ, మగ పిల్లలిద్దరూ సమానంగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్న వయసులో తమ కాళ్ళపై తాము నిలబడిన తరువాతే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.అంతేకానీ, వివాహబంధం కలకలం ఒక తీయని అనుబంధంగా వర్ధిల్లేందుకు అవసరమైన ఆలోచనాధోరణిని అలవరచుకోవటంలో కాస్త అలసత్వం వహిస్తున్నారేమోననిపిస్తుంది.  జీవితంలో భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలూ, అనునయించుకోవటాలూ, రాజీపడి, తిరిగి జీవనరాగాలు ఆలపించటమూ ఉన్నట్టే,అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, పట్టు విడుపులూ, ఒకరి అభిప్రాయాలను మరొకరు కుటుంబ నేపధ్యంలో గౌరవించుకోవటమూ కూడ అలవరచుకుంటే, యీ 'ఎడమొగం-పెడమొగం’ కాపురాలకొక పరిష్కారం  దొరుకుతుంది. ఎవరికి వారే యమున తీరే అనుకుంటూ, తాను పట్టిన కుందేటికి   మూడే కాళ్ళూ అని పట్టుదలలతో ప్రవర్తించేవారికి విడాకులూ వరాలుగా అనిపించినా, జీవిత చరమాంకంలోగానీ  మనం కోల్పోయినదేమిటో అర్థం కాదు.అలాంటి విడాకుల జీవితాలూ, విశృంఖల జీవితాలూ, స్వేచ్చాశృంగారంతోనే తాత్కాలిక ఆనందం పొందుతూ, 'వివాహానికి అర్థం ఇదేకదా' అని వాదించే  విపరీత  ధోరణులు పాశ్చాత్య జీవిత ప్రభావాలే! ఇలాంటి ఆలోచనలనుండి, బయటపడాలనీ, మన భారతీయ కౌటుంబిక జీవనాన్నే ప్రమాణంగా స్వీకరించాలనీ, పశ్చిమ దేశాలు సైతం తహతహలాడుతున్న నేపధ్యంలో యీ 'యిగో 'అన్న అంశాన్ని గురించి దంపతులు పునరాలోచించవలసి ఉంది.  పెళ్ళి అన్నది, ధర్మార్థకామమోక్షాలకు ఆలవాలంగా, గృహస్తాస్రమం,  సమాజానికి ఒక నిజమైన అండగా అభివర్ణించిన మన శాస్త్రాలలోని అంతరార్థం అర్థం చేసుకుంటే,  ఒంటరి జీవితం ఒక దిద్దుకోలేని తప్పుకు అద్దం లా నిలిచి పోతుంది. అంతే!!   అలాకాక, ఒకరికోసం మరొకరు అప్పుడప్పుడూ తగ్గుతూ, ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ మనగలిగితే, వైవాహిక జీవితంలోని అసలు ఆనందం అనుభవీభూతమవుతుంది. తల్లిదండ్రులిరువురి  ప్రేమనూ సమానంగా పొంది, పెరిగిన పిల్లల్లను సమజానికి అందించటం ద్వారా,బాధ్యతాయుతమైన పౌరులను సమాజానికి మన కానుకగా అందించిన  తృప్తి దక్కుతుంది దంపతులకు.సమాజంలో నేడు జరుగుతున్న అనేక నేరాలకు, వారి వారి కుటుంబ నేపధ్యమే కారణమంటున్నాయి మనస్తత్వ శాస్త్రాలు. ఈ నేపధ్యంలో ఆలోచించినా, భార్యాభర్తల మధ్య అవగాహన,సర్దుకుపోయే మనస్తత్వం అవసరమేననిపిస్తుంది కూడా. అలా సుఖంగా సంసారాలు చేసుకుని, తమ వారసత్వం యెదుగుదలను కళ్ళారా ఆనందంగా చూసుకునే ఆనందంలోని ప్రతి క్షణమూ కవితాత్మకం కాదామరి? -పుట్టపర్తి నాగపద్మిని
అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు. ‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక. చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం నివసించే మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి వర్తకుడు ‘మీ తోటి చిలుక నా దగ్గరే ఉంది. అది మీ అందరి తోడునీ, ఈ అడవిలోని స్వేచ్ఛనీ కోరుకుంటోంది. కానీ ఏం చేసేది! నాకు ఆ చిలుక అంటే ప్రాణం. అందుకనే దాన్ని వదిలిపెట్టలేను. అందుకే కేవలం దాని సందేశాన్ని మాత్రమే తీసుకువచ్చాను. ఇప్పడు మీ సందేశం ఏదన్నా ఉంటే చెప్పంది. నేను తనకి అందిస్తాను’ అన్నాడు. వర్తకుడి మాటలు వింటూనే ఓ చిలుక చెట్టు మీద నుంచి ఢామ్మని పడిపోయింది. జరిగిన దానికి వర్తకుడు కంగారుపడిపోయి మారుమాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. వ్యాపారాన్ని ముగించుకున్న వర్తకుడు ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ‘ఏం జరిగింది! నా సందేశాన్ని మా కుటుంబానికి అందించారా? వారు ఏమన్నారు?’ అని అడిగింది చిలుక. ‘ఆ నీ సందేశాన్ని అందిచాను. కానీ… కానీ… నా మాటలు వినగానే ఓ చిలుక ఢామ్మని చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది’ అన్నాడు వర్తకుడు. ఆ మాటలు వింటూనే పంజరంలోని చిలుక కూడా ఒక్క పెట్టున కుప్పకూలిపోయింది. ‘అరెరే! అక్కడ జరిగిందే నాకు అర్థం కావడం లేదంటే, ఇదేంటి….’ అనుకుంటూ లబోదిబోమంటూ వర్తకుడు పంజరాన్ని తెరిచి ఆ చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. వర్తకుడు అలా చిలుకను చేతిలోకి తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున ఆ చిలుక ఎగిరిపోయి తలుపు దగ్గరకి చేరుకుంది. ‘నా నేస్తాలు నాకందించిన సందేశం ఇదే! ఎవరైనా మమ్మల్ని బంధిస్తే ఇలా తప్పించుకోవాలని మా పెద్దలు చెప్పేవారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పడు మళ్లీ నాకు ఆ ఉపాయాన్ని గుర్తుచేశారుగా. ఇక బయల్దేరతాను.’ అంది చిలుక. ‘మరి నా సంగతో! నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. నీకోసం వెండి, బంగారాలు అందించాను. మూడుపూటలా నచ్చిన ఆహారాన్ని ఇచ్చాను. ఇవన్నీ వదులుకుని నువ్వు వెళ్లిపోతావా!’ అంటూ బేలగా అడిగాడు వర్తకుడు. ‘ప్రపంచంలో ఏ జీవికైనా బానిసత్వాన్ని మించిన దౌర్భాగ్యం ఉండదు. స్వేచ్ఛే కనుక లేకపోతే కడుపు నిండినా తృప్తిగా ఉండదు. బంగారంతో చేసినా కానీ పంజరం పంజరమే! అది నాకు వద్దు. దాని బదులు ఎండిన చెట్టు మీద ఖాళీ కడుపుతో కూర్చున్నా బతికున్నాననీ, నా జీవితం నే చేతిలోనే ఉందనీ తృప్తిగా ఉంటుంది. సెలవ్‌!’ అంటూ తుర్రుమంది చిలుక.
  టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వైసీపీ గెలిచిన తరువాత కూడా పవన్ పై విమర్శలు చేశారు. ఆయన పవన్ పై విమర్శలు చేయడం మెగాహీరోలను బాధపెట్టింది. ఆ కారణంగానే ఇప్పుడు తమ సినిమాల్లో పృధ్వీకి అవకాశాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పృధ్వీ కోసం త్రివిక్రమ్ ఓ రోల్ అనుకున్నాడట. అయితే అల్లు అర్జున్ మాత్రం దీన్ని వ్యతిరేకించారట. తన సినిమాల్లో పృధ్వీకి చోటు లేదని బన్నీ చెప్పడంతో.. పృధ్వీకి బదులుగా త్రివిక్రమ్ మరో కమెడియన్ ని తీసుకున్నారట. ఈ విధంగా చూసుకుంటే మెగాహీరోల చిత్రాల్లో పృధ్వీకి అవకాశాలు రావడం కష్టమనే అనిపిస్తోంది.
  తన తండ్రి దీరూభాయ్ అంబానీ ఆస్తులను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు పంచుకున్న తరువాత.. 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో.. అడాగ్‌ గ్రూపు అధినేతగా నిలిచిన అనిల్‌ అంబానీ 42 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్ట్ లో 6వ స్థానంలో ఉన్నారు. అయితే దశాబ్దం గడిచేసరికి ఆయన ఆస్తి విలువ దారుణంగా పడిపోయింది. ఒకవైపు ధీరూభాయ్ అంబానీ పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరిగా దూసుకుపోతూ ఉండగా అనిల్ అంబానీ మాత్రం వెనుకబడిపోయారు. పదేళ్ల కిందట అత్యంత శ్రీమంతుల్లో ఒకరిగా నిలిచిన అనిల్ అంబానీ ఆ తర్వాత మాత్రం వెనుబడిపోయారు. ఎంతగా అంటే, ఇప్పుడాయన ఆస్తి కనీసం బిలియన్ డాలర్లు కూడా లేదు. అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం కేవలం రూ. 3,651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే. గత కొన్నాళ్లుగా అనిల్ అంబానీ గ్రూప్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆయన నేతృత్వంలోని సంస్థలన్నీ నష్టాల్లో కూరుకుపోవడం, అప్పులు పెరగడంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరింది. మ్యూచువల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన, రిలయన్స్‌ - నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ. 35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అనిల్ అంబానీ చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 1.70 లక్షల కోట్లకు పైగా ఉండటం గమనార్హం.
  భారత దేశ జ‌నాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. మ‌రో 8 ఏళ్ల‌లో జ‌నాభా విష‌యంలో భార‌త్ చైనాను దాటేయనుంది అని ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది. 2027 క‌ల్లా ప్ర‌పంచంలోనే అత్యధిక జ‌నాభా ఉన్న దేశంగా భార‌త్ నిలుస్తుంద‌ని త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. భార‌త్‌లో 2050 వ‌ర‌కు మ‌రో 273 మిలియ‌న్ల జ‌నాభా జ‌త‌కూడ‌నున్న‌ట్లు అంచ‌నా వేశారు. యూఎన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ సోష‌ల్ అఫైర్స్‌కు చెందిన పాపులేష‌న్ డివిజ‌న్ ఈ రిపోర్ట్‌ను ఇచ్చింది. అయితే మ‌రో 30 ఏళ్ల‌లో ప్ర‌పంచ జ‌నాభా సుమారు 200 కోట్లు పెర‌గ‌నున్న‌ట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాబా 770 కోట్లుగా ఉంది. అయితే ఇది 2050 వ‌ర‌కు సుమారు 970 కోట్లు కానున్న‌ది. ఈ శ‌తాబ్ధం చివ‌రిలోగా ప్ర‌పంచ జ‌నాభా మ‌రీ తారాస్థాయికి చేరనున్న‌ది. అది సుమారు 11 బిలియ‌న్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే 2050 వ‌ర‌కు కేవ‌లం 9 దేశాల్లో జ‌నాభా పెరుగుద‌ల ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ది. ఆ లిస్టులో ఇండియా లీడింగ్‌లో ఉంటుంది. ఆ త‌ర్వాత నైజీరియా, పాకిస్థాన్‌, కాంగో, ఇథోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికా దేశాలు ఉన్నాయి అని రిపోర్ట్‌ పేర్కొంది.
    పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.   కారణాలు:  ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.   *ఆయుర్వేద చికిత్సా: కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది. ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే..... జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజలు: గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. * మందార ఆకులు పూలతో నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది. పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి. పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి. మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు. ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది. ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి. ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో    ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంది.
  రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు! సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన . ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు. అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంకా చెప్పాలంటే..   నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి. అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు.   తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. మరీ ముఖ్యంగా.. చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు. అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.  
  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.   ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.    *  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.      * వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .   *  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును.      *  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.    *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు.    * వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును.    *  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును.      * వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను .    *  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.    *  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను .    *  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను.    *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .      *  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను .    *  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.