Publish Date:Mar 20, 2013

ALSO ON TELUGUONE N E W S
  నార్త్ అమెరికాలో మూడో పెద్ద ఎగ్జిబిట‌ర్ అయిన సినీమార్క్ నాలుగు ద‌శ‌ల్లో యుఎస్‌లోని థియేట‌ర్ల‌ను ఓపెన్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. మొద‌టి ద‌శ జూన్ 19న (శుక్ర‌వారం) మొద‌లు కానున్న‌ది. 'టెస్ట్ ఫేజ్' కింద డ‌ల్లాస్‌-ఫోర్ట్ వ‌ర్త్ ఏరియాలోని ఐదు థియేట‌ర్ల‌ను తెర‌వ‌నున్న‌ట్లు సినీమార్క్ సీఈఓ మార్క్ జొరాడీ చెప్పారు. రెండో ఫేజ్ కింద ఆ త‌ర్వాతి వారం సినీమార్క్ అధీనంలోని మూడో వంతు థియేట‌ర్ల‌ను.. అదీ ఎక్క‌వ క‌లెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌ధాన మార్కెట్ల‌లో.. తెరుస్తారు. త‌ర్వాతి వారం మ‌రొక మూడో వంతు థియేట‌ర్ల‌ను, జూలై 10న నాలుగో ద‌శ కింద మిగ‌తా అన్ని థియేట‌ర్ల‌ను ఓపెన్ చేస్తారు. సినీమార్క్ అధీనంలో నార్త్ అమెరికాలో మొత్తం 344 థియేట‌ర్లు ఉన్నాయి. షెడ్యూల్ ప్ర‌కారం థియేట‌ర్లు ఓపెన్ అయితే జూలై 17న రిలీజ‌వుతున్న‌ వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సినిమా 'టెనెట్‌'ను పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించ‌డానికి వీల‌వుతుంద‌ని జొరాడీ తెలిపారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌మెంట్ నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం టెక్సాస్‌లోని థియేట‌ర్ల‌లో సీట్ల ప‌రిమతిని 25 శాతానికి  త‌గ్గించారు. టెనెట్ మూవీ రిలీజ‌య్యే స‌మ‌యానికి ఈ సీట్ల ప‌రిమితి 50 శాతానికి పెరుగుతుంద‌ని ఆశిస్తున్నారు. ఈలోగా పాత సినిమాల‌ను డిస్కౌంట్ రేట్ల‌కు ప్ర‌ద‌ర్శించాల‌ని సినీమార్క్ నిర్ణ‌యించింది. పెద్ద‌ల‌కు 5 డాల‌ర్లు, పిల్ల‌ల‌కు, వృద్ధుల‌కు 3 డాల‌ర్లు డిస్కౌంట్ ఇవ్వాల‌ని అది భావిస్తోంది. భార‌తీయ సినిమాల‌కూ.. ప్ర‌త్యేకించి తెలుగు సినిమాకూ ఇది శుభ‌వార్తే.
  సీనియ‌ర్ స్టార్ వెంక‌టేశ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'నార‌ప్ప‌'. ధ‌నుష్ హీరోగా న‌టించ‌గా సూప‌ర్ హిట్ట‌యిన త‌మిళ చిత్రం 'అసుర‌న్‌'కు ఇది రీమేక్‌. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్ల‌పై డి. సురేశ్‌బాబు, క‌లైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి మొదటిసారి ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటిస్తున్నారు. 'నారప్ప'  భార్య సుందరమ్మగా ప్రియ‌మ‌ణి చాలా రోజులు మన తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ రోజు ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా సుంద‌ర‌మ్మ‌గా ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. ఎడ్ల‌బండి మీద కూర్చొని గ్రామీణ మ‌హిళ‌గా క‌నిపిస్తోన్న ప్రియ‌మ‌ణి లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఇదే త‌ర‌హాలో మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నార‌ప్ప టీమ్ ఆమెకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. సాంకేతిక బృందం: కథ: వెట్రిమారన్‌ స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్ లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యామ్‌ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌ ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌ ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ దొంకాడ కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల  
కేరళలోని మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలోకి గర్భంతో ఉన్న ఏనుగు వచ్చి ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నించగా, ఆకతాయిలు బాణాసంచా కూర్చిన పైనాపిల్‌ ఇవ్వడంతో అది నోట్లో పేలి ఏనుగు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై తారాలోకం భగ్గుమంది. ముఖ్యంగా ఈ ఘటనకు కారణమైనవాళ్లను శిక్షించాలని కథానాయికలు కోరారు. ‘‘జంతు హింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, శిక్షలు రావాల్సిన అవసరం ఉంది’’ – హిందీ హీరోయిన్‌ అనుష్కా శర్మ ‘‘ఇది అత్యంత దారుణమై, అమానుష చర్య’’ – కాజల్‌ అగర్వాల్‌ ‘‘ఏనుగు  ఆకలితో ఉంది. పైగా, గర్భవతి. గ్రామంలో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని వచ్చింది. కానీ, మనుషులు ఎంత క్రూరులో తెలుసుకోలేకపోయింది’’ – లక్ష్మీ మంచు ‘‘ఈ దారుణానికి పాల్పడినవాళ్లకు జీవించే హక్కు లేదు’’ – పూజా రామచంద్రన్‌ ‘‘మానవత్వం మరణించింది’’ – రాశీ ఖన్నా ‘‘గర్భవతి అయిన మహిళను హత్య చేసిన దోషులకు ఏ విధమైన శిక్ష పడుతుంతో, ఈ దారుణం చేసిన వాళ్లకూ అదే శిక్ష పడుతుందని ఆశిస్తున్నా’’ – ఉపాసనా కొణిదెల ‘‘ఏదో ఒక రోజు మనుషులు నాగరికులుగా, మంచిగా మారతారని ఆశిస్తున్నా’’ – రేణూ దేశాయ్‌ ‘‘మానవత్వం మంటకలిసిపోతోంది. ఈ ఘటన చూశాక హృదయం ద్రవించింది. కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటున్నా’’ – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంకా పలువురు కథానాయికలు, హీరోలు, సినీ ప్రముఖులు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
బాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్ బసు చటర్జీ గురువారం ఉదయం ముంబైలో మృతి చెందారు. ఆయనకు 90 సంవత్సరాలు. ఆయన పశ్చిమ బెంగాల్ వాసి. వయసు పెరగడం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రాథమిక సమాచారం. 70, 80వ దశకాలలో ఆయన పలు హిట్ సినిమాలు తీశారు. వెండి తెరపై మాత్రమే కాదు బుల్లితెర మీద తన ప్రతిభ చాటారు. బాలీవుడ్ క్లాసిక్స్ ఫిలిమ్స్ 'పియా కా ఘర్' (1972), 'రజనీగంధ' (1974), 'ఛోటీసీ బాత్' (1976), 'కట్టా మీటా' (1978), 'షౌకీన్' (1982), 'ఏక్ రుకా హువా ఫైసలా' (1986), 'కమలా కి మౌత్' (1989) కి బసు చటర్జీ దర్శకత్వం వహించారు. వీటితో పాటు కొన్ని బెంగాలీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రజత్ కపూర్ నటించిన పాపులర్ దూరదర్శన్ టీవీ సిరీస్ 'బ్యూమఖేష్ బక్షి' కూడా ఆయన దర్శకత్వం వహించినదే. బసు చటర్జీ మృతిపట్ల పలువురు టీవీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అనూ ఇమ్మాన్యుయేల్ గుర్తుందా? నాచురల్ స్టార్ నాని సరసన 'మజ్ను' చిత్రంలో నటించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన నటించే అవకాశం ఆమెకు వచ్చిందని సమాచారం. '18 పేజస్'లో అనూను కథానాయికగా తీసుకున్నారట. నిఖిల్ హీరోగా 'కుమారి 21ఎఫ్' సూర్య ప్రతాప్ పలనాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సుకుమార్ అండదండలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. మెమరి లాస్ కాన్సెప్ట్ తో కొత్త కథతో స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సినిమాతోనైనా అను ఇమ్మాన్యుయేల్ హిట్ కొడుతుందేమో చూడాలి. తెలుగులో తొలి చిత్రం 'మజ్ను'తో విజయం అందుకుంది.‌ అయితే, ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో ఘన విజయం పడలేదు. రాజ్ తరుణ్ సరసన నటించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' పర్వాలేదు అనిపించుకుంటే... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', అక్కినేని నాగచైతన్య 'శైలజ రెడ్డి అల్లుడు' చిత్రాలు అంచనాలు అందుకోలేక చతికిల పడ్డాయి. అయితే... అనూ ఇమ్మాన్యుయేల్ అందంగా ఉంటుంది. హాట్ ఫిగర్ కూడా! అందుకని మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలో అనూని కథానాయికగా తీసుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ కథానాయికగా నటిస్తోంది.
We must of have heard this sentence by many people, who are couples, just married or married for long and also from people who are couples to be. People often say that compatibility is the key for any relationship. But what is this compatibility all about? For example, when he/ she getting married or looking for partner, their selection may happen based on looks, professional outlooks, or pay cheques etc.. But the most important thing in choosing a partner should be campatibility of values. Because, looks, professions, careers, tastes will change but values will never change. They remain with you through out. We often say that, you have to take right decissions in marriage; but make the decisions right in your marriage should be the correct attitude. When we call life as a journey, partner is also sailing with us through out.  To make this journey beautiful,  happy and memorable, we certainly have to invest our time and energies. When marriage  is  commitment for the life time you have to keep up your word by working on it continuously. compatability is having this thought of "continuous work" from both sides. However,  when one is weak in the he pair then the other one has to walk that extra mile to reach the goal. For this  you need to have trust, faith and belief in self and others and the philosophy you follow. When this matches  with  each other's thought process, this is called compatibility of values. This is the only thing which can help the couple to hold the relationship. Here the issue is not about inter cast, inter religion or different social and financial status but it's all about how far your values are compatible with your partner's. For example if you both trust in God whether it is Jesus or Jagannath,  you "having trust in the devine" is your compatibility.  you can worship eighter of them but "praying" play important role here. But if one believe in prayers and one won't then this difference of openion may lead to arguments. In a marriage,  when your values differ with each other, belief system is different from each other , there you suffer and your kids suffer more than any body. To avoid such circumstances,  find out your partner,  who is campatible with you in values of life.  In this current scenario,  we have so many options to know each other beforeentering  in to the wedlock. This helps a lot to know about your compatibility levels. Remember, marriage is a relationship where you need to work constantly.  This bonding will be always under construction. Enjoy the journey. ...............Bhavana  
At a restaurant, a cockroach suddenly flew from somewhere and sat on a lady. She started screaming out of fear. With a panic stricken face and trembling voice, she started jumping, with both her hands desperately trying to get rid of the cockroach. Her reaction was contagious, as everyone in her group also got panicky. The lady finally managed to push the cockroach away but it landed on another lady in the group. Now, it was the turn of the other lady in the group to continue the drama. A waiter rushed forward to their rescue. In the relay of throwing, the cockroach next fell upon the waiter. The waiter stood firm, composed himself and observed the behaviour of the cockroach on his shirt. When he was confident enough, he grabbed it with his hand and threw it out of the restaurant. Sipping my coffee and watching the amusement, the antenna of my mind picked up a few thoughts and started wondering, was the cockroach responsible for their histrionic behaviour? If so, then why was the waiter not disturbed? He handled it near to perfection, without any chaos. It is not the cockroach, but the inability of the ladies to handle the disturbance caused by the cockroach that disturbed the ladies. I realized that, it is not the shouting of my father or my boss or my wife that disturbs me, but it’s my inability to handle the disturbances caused by their shouting that disturbs me. It’s not the traffic jams on the road that disturbs me, but my inability to handle the disturbance caused by the traffic jam that disturbs me. More than the problem, it’s my reaction to the problem that creates chaos in my life. Lessons learnt from the story: I understood, I should not react in life. I should always respond. The women reacted, whereas the waiter responded. Reactions are always instinctive whereas responses are always well thought of, just and right to save a situation from going out of hands, to avoid cracks in relationship, to avoid taking decisions in anger, anxiety, stress or hurry. (Most People attribute this anecdote to Sundar Pichai, the CEO of Google... though no one is sure of the narrator. But everyone who has read this story is certainly sure of its worth!) ..Nirjara
తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
ఏపీ ప్రభుత్వం లో సర్వం తానే అయి వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ చిక్కుల్లో పడ్డారు. అటు సీఎం పేషీ లో ముఖ్య అధికారిగా అలాగే అధికారుల బదిలీలు పోస్టింగులు చూసే జీఏడీ లోను ఆయనే ముఖ్య అధికారి గా కొనసాగుతూన్న విషయం తెలిసిందే. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ను ఆ పదవి నుండి తప్పించిన వ్యవహారం లోను అయన కీలకంగా వ్యవహరించారు. అసలు చంద్ర బాబు కొంత కాలం సైలెంట్ గా ఉంటే ప్రవీణ్ ఏపీ ప్రభుత్వాన్ని ఒక దరికి చేరుస్తారని ఏపీ సెక్రటేరియట్ లోనే ఒక సెక్షన్ కామెంట్లు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం విషయానికి వస్తే కొద్దీ రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి రమామణి కన్నుమూశారు. ఐతే తాజాగా ఆమె మరణానికి కారణం ప్రవీణ్ ప్రకాష్, మరియు వాణిజ్య పన్నుల శాఖలో ముఖ్య అధికారి కారణమని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. రెండు నెలల క్రితం వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ఆమెను అక్కడి నుండి తప్పించి మళ్ళీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని అయన ఆరోపించారు. సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆమెను ఆ పోస్టు నుండి తప్పించే ముందు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఢిల్లీలో పని చేస్తున్న తన భార్య కారు బిల్లులు చెల్లించాలని అలాగే ఆ శాఖ పేషీ ఖర్చులు కూడా ఆమె భరించాలని ఒత్తిడి తెచ్చినట్లుగా ఆమె సోదరుడు ఆరోపించారు. రెండు నెలల నుండి ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా ప్రవీణ్ వేధించారని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. ఇంట్లో ఖాళీగా ఉండి జీతం తీసుకోవడం ఇష్టం లేక పోస్టింగ్ కోసం ఆమె ప్రవీణ్ ప్రకాష్ ను కలవగా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు అని ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నించినట్లు అయన తెలిపారు. తనకు వాట్స్ఆప్ తప్ప వేరే సోషల్ మీడియాలో అకౌంట్ లేదని ఆమె తెలపడం తో వాట్స్ఆప్ లోనే మీరు ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెడుతున్నారట అని ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదంతా కేవలం తనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటానికి ఇవన్నీ చేస్తున్నారని ఆమె తీవ్ర మానసిక వేదనకు గరయ్యారని ఆమె సోదరుడు ఆరోపించారు. అయినా ఎక్కడి ఢిల్లీలో ఉన్న అధికారుల భార్యల ఖర్చులు ఆమె ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ఇదే ప్రవీణ్ ప్రకాష్ తన సోదరి మరణించినపుడు హాస్పిటల్ కు రావడం తమను ఆశ్చర్యానికి, అనుమానానికి గురి చేసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు.  తాజా గా బీజేపీ అధికార ప్రతినిధి రఘు ఈ విషయంపై స్పందిస్తూ ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని అఖిల భారత సర్వీసుల వ్యవహారాలు చూసే డీవోపీటీకి లేఖ రాశారు. ఒకపక్క సీఎంఓలో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆదేశాలిస్తూ, మరో పక్క ప్రభుత్వపరంగా జీఏడీ అధికారి హోదాలో వాటిని అమలుచేస్తున్న తీరు బిజినెస్ రూల్సుకు విరుద్ధమని రఘు స్పష్టం చేశారు. ఆయన అహంకారపూరిత స్వభావం వల్లనే, సిన్సియర్ ఐఏఎస్ అధికారిణి రమామణి మృతి చెందాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. లోన్లు, ఈఎంఐలు లపై ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం ఎంచుకున్నవారికి ఈ ఆరు నెలల కాలానికి ఔట్‌ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, మారిటోరియం విధించినా, రుణవాయిదాలపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఆర్బీఐని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాదని అభిప్రాయపడింది.  మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశంపై ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు లీక్ చేయడం పట్ల సుప్రీంకోర్టు మండిపడినట్టు సమాచారం. ‘మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని మరింత సంచలనం చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.’అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని తాము అర్ధం చేసుకుంటాం.. కానీ, ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ, ఆర్బీఐ వివరణ కోరుతూ.. తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో తరచుగా ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ హైకోర్టులో స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్బంగా ఏపీ సీఎస్, స్పెషల్ సీఎస్, డీజీపీ తో సహా ఆరుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో మద్యపాన నియంత్రణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం SEB (స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో) ని ఏర్పాటు చేసింది. తాజాగా SEB కి చట్టబద్దత లేదని అందువల్ల SEB పెట్టె కేసులు న్యాయపరంగా చెల్లవని వాదిస్తూ ప్రకాశం జిల్లా వాసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారణ లో భాగంగా హైకోర్టు ఆరుగురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ ను రెండు వరాల పాటు వాయిదా వేసింది.
మోతాదు మించకుండా మద్యం పుచ్చుకుంటే ఏం కాదు, పైగా ఆరోగ్యానికి మంచిది కూడా! ఇక రోజుకి ఒకటో రెండో పెగ్గులు తాగితే గుండె కూడా బలంగా ఉంటుంది.... లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ మాటలు పట్టుకుని మందుబాబులు ఒకటి రెండు పెగ్గులతో మొదలుపెట్టి ఒకటి రెండు క్వార్టర్ల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇంతకీ మోతాదులో మద్యం మంచిదన్న మాట ఎక్కడిది. అది నిజంగా నిజమేనా!   మితంగా మద్యం తాగితే ఆరోగ్యపరమైన లాభాలు ఏమన్నా ఉన్నాయోమో పరిశీలించే ప్రయత్నం చేశారు కెనడాకి చెందిన పరిశోధకులు. దీనికోసం మద్యపానం గురించి ఇప్పటివరకూ జరిగిన ఓ 45 పరిశోధనల ఫలితాలను గమనించారు. మద్యంతాగనివారికంటే మోతాదులో మద్యం పుచ్చుకునేవారిలో గుండెజబ్బులు కాస్త తక్కువగానే ఉన్నట్లు వాటిలో చాలా పరిశోధనలు పేర్కొన్నాయి. కానీ ఈ పరిశోధనలని కాస్త జాగ్రత్తగా కనిపిస్తే ఒక విస్పష్టమైన లోపం కనిపించింది.   పరిశోధన సమయంలో ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉందా లేదా అని గమనిస్తున్నారు కానీ, అతనికి ఒకప్పుడు ఆ అలవాటు ఉందో లేదో ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు లాంటి సమస్యలు వచ్చిన తర్వాత చాలామంది మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. వారు సదరు అనారోగ్యంతో త్వరగా మరణించే ప్రమాదమూ ఉంది. దాంతో మందు తాగని వారు త్వరగా మరణిస్తున్నారని నిర్ధారించేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా జీవితంలో ఎప్పుడూ మందు ముట్టనంత మాత్రాన అతని లైఫ్‌స్టైల్‌ అద్భుతంగా ఉందనుకోవడానికి లేదు. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, పేదరికం.. లాంటి చాలా కారణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంటాయి.   పైన తేల్చిన విషయాన్నే మరోసారి నిర్ధరించేందుకు మరో సర్వే కూడా చేశారు. ఇందుకోసం 9,100 మందిని... వారి 23 ఏట నుంచి 55 ఏట వరకు గమనించారు. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న చాలామంది 55 ఏడు వచ్చేసరికి వేర్వేరు కారణాలతో ఆ అలవాటు మానుకుంటున్నట్లు తేల్చారు.   ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే... తక్కువ మోతాదులో మద్యం పుచ్చుకోవడం వల్ల, ఆరోగ్యానికి పెద్దగా హాని కలగని మాట వాస్తవమే! అలాగని మందుతో ఏవో అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలు మాత్రం కూడదంటున్నారు. ఈ భ్రమలో పడి లేని అలవాటుని బలవంతంగా చేసుకోవాల్సిన అగత్యం అసలే లేదంటున్నారు.   - నిర్జర.
కళ్లు మూతలు పడిపోయేలా నిద్ర వస్తుంటేనో, ఏమీ తోచకుండా నిస్సారంగా ఉంటేనో ఆవలింతలు రావడం సహజం. కానీ అవతలివారు ఆవలించినప్పుడు మనకి కూడా ఆవలింత రావడంలో ఆంతర్యం ఏమిటి! ఒకోసారైతే ఆవలిస్తున్న ఫొటోని చూసినా, ఆవలింత అన్న మాట విన్నా కూడా మనలో ఆవలింత వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి చర్య వెనుక కారణం ఏమిటి! శరీరం నిద్రాణంగా ఉన్నప్పుడు మనలోని శ్వాస కూడా నిదానిస్తుంది. ఇలాంటి సమయంలో ఒంటికి తగినంత ప్రాణవాయువు లభించదు. దాంతో అవసరమైనంత ఆక్సిజన్‌ని గ్రహించేలా ఎక్కువ గాలిని పీల్చుకునే ప్రయత్నం చేస్తాము. అదే ఆవలింత! ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఒకరి ఆవలింత మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నకు అవతలివారితో మనకి ఉన్న అనుబంధమో, వారి పట్ల సహానుభూతి చూపడమో కారణం అనుకునేవారు. కానీ ఈ చర్య వెనుక భావోద్వేగాలు ఏమాత్రం కారణం కాదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.   -ఒకరిని చూసి వేరొకరు ఆవలించడం వెనుక మన జన్యువులే కారణం అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఆ కారణంగానే కొంతమంది ఎదుటివారు ఆవలించిన వెంటనే నోరుతెరిస్తే, మరికొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉండగలుగుతారు. అంతేకాదు! ఈ ఆవలింతను నియంత్రించే జన్యువు మామూలు వ్యక్తులలో ఒకలా ఉంటే... ఆటిజం, స్కిజోఫ్రీనియా వంటి మానసిక వ్యాధులు ఉన్నవారిలో మరోలా ఉంది. కాబట్టి ఇదేదో అల్లాటప్పా జన్యువు కాదనీ, దీన్ని ఛేదిస్తే కనుక చాలా మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందనీ భావిస్తున్నారు.   -ఆవలించడం వల్ల శరీరానికి ఎక్కువ ప్రాణవాయువు లభిస్తుంది కాబట్టి హాయిగా ఉంటుంది. మొహంలోని కండరాలన్నింటికీ ఓసారి పని చెప్పినట్లు ఉంటుంది. అందుకనే ఆవలింత అన్న విషయం గుర్తుకురాగానే మనిషి అందుకు సిద్ధపడిపోతాడన్నది కొందరు శాస్త్రవేత్తల మాట. ఇంత విచక్షణ పిల్లలలో ఉండదు కాబట్టే వారిలో ఒకరిని చూసి మరొకరు ఆవలించడం తక్కువని కూడా తేల్చేశారు.   - ఆవలించడం వల్ల శరీరం నిస్సత్తువని వదిలి అప్రమత్తమవుతుంది. కాబట్టి ఇది మనం అడవులలో బతికిన రోజుల నుంచి వచ్చిన అలవాటన్నది మరి కొందరి విశ్లేషణ. గుంపులో ఉన్నవారిలో ఒకరు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల, వారిలో అప్రమత్తని పెంచేందుకు శరీరం ఆవలిస్తుంది. ఈ విషయాన్ని అతని చుట్టుపక్కల వారు కూడా అనుకరించడం వల్ల, వారు కూడా ప్రమాదం వస్తే ఎదుర్కొనేందుకో, పారిపోయేందుకో (fight or flight) సిద్ధపడిపోతారు.   -ఎదుటివారి మనసుని మెప్పించేందుకు తమకి తెలియకుండా వారిని అనుకరించే ప్రయత్నంలో కూడా ఆవలించవచ్చని అంటున్నారు. దీని వలన ఇద్దరు మనుషులూ ఒకే తరహాలో ప్రవర్తిస్తున్న భావన కలుగుతుంది కదా!   ఇన్ని కారణాలు చెప్పుకొన్నా కూడా ఆవలింతకు సంబంధించి ఇంతవరకూ స్పష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఆవలించేందుకు ఖచ్చితమైన కారణాన్ని కనుక్కొనేందుకు తీవ్రమైన పరిశోధనలు జరగాల్సి ఉందట!!!       - నిర్జర.
  చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.