ALSO ON TELUGUONE N E W S
  దర్శకుడు సుధీర్ వర్మకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. 'స్వామి రారా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అతడి మేకింగ్, టేకింగ్ ఇష్టపడే ప్రేక్షకులు పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. అయితే విజయాలే అతడి దరి చేరడం లేదు. 'స్వామిరారా తో అందరినీ మెప్పించిన సుధీర్ వర్మ ఆ తర్వాత ఆ స్థాయి సినిమా చేయలేదు. నాగచైతన్య కథానాయకుడిగా తీసిన 'దోచెయ్' దారుణ పరాజయం చవిచూసింది. తర్వాత నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కించిన 'కేశవ', శర్వానంద్ కథానాయకుడిగా రూపొందించిన 'రణరంగం' ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా.‌‌.. సుధీర్ వర్మ ప్రతిభపై 'కేశవ' చిత్ర నిర్మాత అభిషేక్ నామా నమ్మకం ఉంచారు. అతనితో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. స్టోరీలైన్ లాక్ చేశామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, మరో వారం పది రోజుల్లో పూర్తి వివరాలు ప్రకటిస్తామని, షూటింగులకు అనుమతులు వస్తే ఆగస్టులో సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నామని‌ అభిషేక్ నామా తెలిపారు. ఇప్పుడు సుధీర్ వర్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి అభిషేక్ నామా నిర్మించబోయే సినిమా అయితే... రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో కొరియన్ హిట్ 'మిడ్ నైట్ రన్నర్స్' తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ కూడా సుధీర్ వర్మకు వచ్చింది.
  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌పాటు అధికారంలో కొన‌సాగ‌ద‌ని హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హానాడులోనూ ఆయ‌న ఈ అభిప్రాయాన్నే వ్య‌క్తం చేశారు. ఎందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌పాటు ఉండ‌దో ఆయ‌న తాజాగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. "ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు ఎక్కువైపోయాయి. జ‌నంమీద దాడులు, దౌర్జ‌న్యాలు ఎక్కువైపోయాయి. ఆ రోజుల్లో హుద్‌హుద్ వ‌చ్చింది. చంద్ర‌బాబునాయుడు గారు వైజాగ్‌లో రెండు వారాల పాటు ఉండి, చ‌క్క‌గా డీల్ చేశారు. అది ప్ర‌కృతి వైప‌రీత్యం. ఇప్పుడు క‌రోనా వ‌చ్చింది. ఇదొక జ‌బ్బు. దీన్ని కూడా ఆయ‌న (చంద్ర‌బాబు) హ్యాండిల్ చేసేవారేమో" అని ఆయ‌న అన్నారు. అప్పుడు, ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో జ‌నం కంపేర్ చేసుకుంటున్నారని బాల‌కృష్ణ చెప్పారు. "ఇటీవ‌లే వైజాగ్‌లో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీక‌వ‌డం, హెచ్‌పీసీఎల్‌లో ద‌ట్టంగా పొగ క‌మ్ముకోవ‌డం చూశాం. వీట‌న్నింటినీ జ‌నం చూస్తున్నారు" అని ఆయ‌న‌న్నారు. ఆంధ్రాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.
సాక్షాత్తూ స్వర్గీయ నందమూరి తారకరామారావు రూపురేఖలతో జన్మించిన మనవడు, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పూర్తిస్థాయిలో ఎప్పుడు చేరతారు? అటు నందమూరి, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచే వ్యక్తి, ‘అన్నగారు’ అని ఆత్మీయంగా పిలుచుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు హరికృష్ణ రథసారథిగా ఉన్నారు. అందువల్ల, హరికృష్ణ కుమారుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే అభిమానులకు ఆనందమే కదా! జూనియర్‌ ఎన్టీఆర్‌ గతంలో తెలుగుదేశం తరఫున ప్రచారం నిర్వహించారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు తాజా ఇంటర్వ్యూలో ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీలోకి పూర్తిస్థాయిలోకి వస్తే అటు తెలంగాణలో గానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో గానీ పూర్వ వైభవం వస్తుందనేది ఉంది’ అని అభిప్రాయం ఎదురైంది. ‘‘మీరు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని అంటున్నారు. సినిమా యాక్టర్‌గా తనకి (జూనియర్‌ ఎన్టీఆర్‌కి) చాలా భవిష్యత్తు ఉంది. ఫ్రొఫెషన్‌ వదులుకుని రమ్మని అడగలేం కదా! నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సినిమాలు చేస్తున్నాను. నాన్నగారు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలోనూ సినిమాలు చేశారు. అందువల్ల, అది వాళ్ల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది’’ అని బాలకృష్ణ అన్నారు. ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని ఆయన ఎన్టీఆర్‌కి వదిలారు అన్నామాట.
  ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 2000లో సిడ్నీలో జ‌రిగిన‌ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించి, ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మల్లేశ్వరి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఎం.వి.వి.సినిమా, కోన ఫిల్మ‌కార్పొరేష‌న్‌ బ్యాన‌ర్స్‌పై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మించే ఈ బ‌యోపిక్‌కు సంజ‌నా రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించనున్నారు. సంజ‌నారెడ్డి ఇదివ‌ర‌కు రాజ్ త‌రుణ్ హీరోగా రాజుగాడు మూవీని డైరెక్ట్ చేశారు. అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిలైంది. కొంత‌కాలంగా ఆమె క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బయోపిక్ తీయాల‌నే ఉద్దేశంతో ఆమె జీవితాన్ని అధ్య‌య‌నం చేస్తూ వ‌స్తున్నారు.
  టిబెట్‌ దగ్గర బోర్డర్స్‌లో ఇండియన్‌ ఆర్మీతో చైనా ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతుండటం, పైగా ఘర్షణపూరిత వైఖరి ప్రదర్శిస్తుండటంతో చైనా ప్రొడక్ట్స్‌ బ్యాన్‌ చేయాలని ఇండియాలో చాలామంది డిమాండ్‌ చేస్తున్నారు. ప్రొడక్ట్స్‌ మీద మేడిన్‌ చైనా కనపడితే ఉపయోగించవద్దని సోషల్‌ మీడియాలో అవేర్‌నెస్‌ క్యాంప్స్‌ రన్‌ చేస్తున్నారు. చైనాకి చెందిన యాప్స్‌ వాడొద్దని కోరుతున్నారు. హలో, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌ చైనాకి చెందినవే. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్‌’ సినిమా గుర్తుందా? శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ జీవితం స్ఫూర్తితో తీశారు. ఇటీవల ఆయన ‘బాయ్‌కాట్‌ చైనీస్‌ ప్రొడక్ట్స్‌’ అని పిలుపు ఇచ్చారు. దానికి బాలీవుడ్‌ యాక్టర్‌ మిళింద్‌ సోమన్‌ స్పందించారు. ఇకపై ‘టిక్‌ టాక్‌’లో తాను ఉండనని ఆయన తెలిపారు. తన మొబైల్‌ నుండి చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ యాప్‌ను డిలీట్‌ చేస్తున్నట్టు మిళింద్‌ సోమన్‌ పేర్కొన్నారు. ఆయన బాటలో ఎంతమంది నడుస్తారో చూడాలి. యాంకర్‌ రష్మీ గౌతమ్‌ సైతం సోనమ్‌ వాంగ్‌చుక్‌ వీడియో షేర్‌ చేశారు. ఆవిడ కూడా బాయ్‌కాట్‌ చైనీస్‌ ప్రొడక్ట్స్‌ క్యాంపైన్‌కి సపోర్ట్‌ చేస్తున్నారు.
తమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. కావాలంటే ఈ చిన్న కథను చదివి చూడండి. దాదాపు వందేళ్ల క్రితం మాట ఇది. స్కాట్లాండులో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద పేరు క్లార్క్. కుటుంబం అంటే అందులో ఓ నలుగురో, ఐదుగురో ఉంటారనుకునేరు. క్లార్క్‌, అతని భార్యా... వారి తొమ్మిదిమంది పిల్లలు. ఆ తొమ్మిదిమంది పిల్లలతో బతుకు బండిని లాగడం భార్యాభర్తలకు చాలా కష్టంగా ఉండేది. అందుకని మంచి అవకాశాల కోసం అమెరికాకు చేరుకోవాలనుకున్నారు. మరి విదేశంలో స్థిరపడాలంటే మాటలా! అందుకోసం తగిన గుర్తింపు పత్రాలు, అనుమతి పత్రాలూ కావాలి. అన్నింటికీ మించి కుటుంబంలోని పదకొండు మందీ ప్రయాణించేందుకు టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. వీటి కోసం భార్యాభర్తలు తెగ కష్టపడేవారు. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని కావల్సిన పత్రాలను సంపాదించారు. రాత్రింబగళ్లూ పనిచేసి టికెట్లకు అవసరమైన డబ్బుని సంపాదించారు. తిండీతిప్పలూ మానేసి ఏళ్లకి ఏళ్లు కష్టపడితే కానీ ఇదంతా సాధ్యం కాలేదు. చివరికి ఫలానా రోజున అమెరికాకి ప్రయాణం అవ్వబోతున్నామన్న తీపి కబురుని తన కుటుంబానికి వినిపించాడు క్లార్క్‌. ఈ వార్త విన్న కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ...     మరో వారం రోజుల్లో ప్రయాణం ఉందనగా ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడిని కుక్క కరిచింది. వారుండే చోట ర్యాబిస్‌ మందు ఇంకా అందుబాటులో లేకపోవడంతో గాయానికి కుట్లు మాత్రమే వేసి వదిలేశాడు ప్రభుత్వ వైద్యుడు. పైగా అప్పటి నిబంధనల ప్రకారం, ర్యాబిస్ ప్రబలకుండా ఉండేందుకు మరో రెండువారాల పాటు ఆ కుటుంబం ఎక్కడికీ కదలడానికి వీల్లేదంటూ ఆజ్ఞలు జారీచేశాడు. ఇంకేముంది! ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉండిపోయింది. తమ టికెట్లని తిరిగి అమ్ముకునే అవకాశం కూడా లేకపోయింది. ఇంటిల్లపాదీ ఆ పిల్లవాడిని తిట్టుకుంటూ ఉండిపోయారు. ఈ రెండువారాల్లో ఆ పిల్లవాడికి కానీ, అతని నుంచి కుటుంబానికి కానీ ర్యాబిస్‌ అయితే సోకలేదు. కానీ నౌక, ఆ నౌకతో పాటు తమ టికెట్టు డబ్బులు తీరం దాటి వెళ్లిపోయాయి. రెండువారాలు గడిచాయి.... ఇంటిల్లపాదీ చిన్నబోయిన మొహోలతో ఊళ్లోకి వచ్చారు. కానీ తనకి ఎదురొచ్చిన ప్రతిఒక్కరూ శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు క్లార్క్‌. తమని వెక్కిరించేందుకే వారలా చేస్తున్నారని మొదట అనుకున్నాడు. కానీ అసలు విషయం తెలిసేసరికి అతని ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తాము ఎక్కుదామనుకున్న నౌక నడిసముద్రంలో మునిగిపోయిందనీ... అందులో దిగువ తరగతుల్లో ప్రయాణిస్తున్నవారు చాలామంది చనిపోయారనీ తెలిసింది. ఆ నౌక మరేదో కాదు... 1,500 మంది ప్రాణాలను బలిగొన్న టైటానిక్‌! ఇప్పుడు కార్ల్క్ దురదృష్టం కాస్తా అదృష్టంగా మారిపోయింది. క్లార్క్ పరుగుపరుగున వెళ్లి తన చిన్న కొడుకుని కావలించుకుని ఏడ్చేశాడు. తన కుటుంబం యావత్తునీ కాపాడావంటూ ముద్దులతో ముంచెత్తాడు. పాశ్చాత్య దేశాలలో క్లార్క్‌ కథ విస్తృత ప్రచారంలో ఉంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారెవ్వరూ లేరు. కానీ ఇలా జరిగే అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండటం, సజీవంగా ఉండటాన్ని మించిన అదృష్టం ఉందన్న విషయాన్ని ఎవరు మాత్రం నిరాకరించగలరు!     - నిర్జర.
  Do you think you are Loyal towards the Mother Earth after taking everything that is essential? After seeing so much of deforestation we feel the answer is absolutely no. How loyal should you be towards the planet - watch this video to know more.......   https://www.youtube.com/watch?v=dSohFWv4tgs  
కరోనా వైరస్‌ బారిన పడుతున్న బాలీవుడ్‌ ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. షారుఖ్‌ ఖాన్‌ స్నేహితుడు, నిర్మాత కరీమ్‌ మొరానీ ఫ్యామిలీ కోలుకుందని సంతోషించేలోపు... నటుడు కిరణ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఫేమస్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ ఇంట్లో ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకింది. బోనీ కపూర్‌ ఇంట్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. రీసెంట్‌గా మ్యూజిక్‌ డైరెక్టర్‌ వాజిద్‌ ఖాన్‌ మృతి చెందారు. ఓ షాక్‌ నుండి కోలుకోకముందే మరో షాక్‌ తగులుతోంది. లేటుస్టుగా కరోనా బారిన పడ్డ ప్రముఖుల్లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో షిబాసిష్‌ సర్కార్‌ చేరారు. ఆయన ముంబైలోని కోకిలాబెన్‌ హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలో కోలుకుంటారని డాక్టర్స్‌ చెప్పారు. అక్షయ్‌కుమార్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో ‘సూర్యవంశీ’, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఫస్ట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న 1983 సంఘటన మీద తెరకెక్కుతున్న ‘83’ సినిమాలకు షిబాసిష్‌ సర్కార్‌ క్రియాశీలకంగా పని చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నిమ్మగడ్డ వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌‌ను దాఖలు చేసింది.  హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలను పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న హక్కల మేరకే కమిషనర్‌గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై రేపు లేదా ఎల్లుండి విచారణ జరిగే అవకాశం ఉంది.  కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను కొనసాగించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌లు, జీవోలను కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కింది.  
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) కి సమర్పించింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో కమిటీ సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపింది.  ముఖ్యంగా, ఐదు కీలక తప్పిదాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. "అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజి తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు. ప్లాంట్ లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడంలేదు.  స్టైరీన్ స్టోరేజి ట్యాంకు టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడంలేదు. ప్లాంట్ లో రిఫ్రిజరేషన్ వ్యవస్థను 24 గంటల పాటు ఆపరేట్ చేయడంలేదు. ప్లాంట్ లోనూ, స్టోరేజి ట్యాంకు వద్ద పర్సన్ ఇన్ చార్జిల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్టంగా ఉంది." అని నివేదికలో పేర్కొంది. కాగా, విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్‌జీటీ అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...   ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.   వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!   ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!! - నిర్జర.  
  ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మేఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్‌ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి. పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికంగా ఉంటుంది. ఇది ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్‌ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం ఉంది. అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతోపాటుగా ఆక్జలేటులు ఉంటాయి. ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ. పాలకూర టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటున్నాం. ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. మోతాదును మించితేనే ప్రమాదం. పరిమితస్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అయితే రోజూ నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.