Publish Date:Jan 13, 2013

ALSO ON TELUGUONE N E W S
  దర్శకుడిగా రాఘవ లారెన్స్ ప్రయాణం మొదలైంది తెలుగు చిత్ర పరిశ్రమలోనే. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, 'స్టైల్' సినిమాతో దర్శకుడిగా మారారు. తర్వాత అక్కినేని నాగార్జున 'మాస్', 'డాన్'... ప్రభాస్ 'రెబల్' సినిమాలకు దర్శకత్వం వహించారు. తర్వాత పూర్తిగా తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. అక్కడ హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మధ్య మధ్యలో రాఘవ లారెన్స్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ ఫ్రాంచైజీ 'కాంచన' సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. రాఘవ లారెన్స్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించి ఏడేళ్లవుతుంది. చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారా? అనే డౌట్ లు వస్తున్నాయి. ఎందుకంటే... 'కాంచన 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లో స్టైల్ సీక్వెల్ గురించి రాఘవ లారెన్స్ మాట్లాడారు. డాన్స్ బాగా చేసే హీరోలతో సీక్వెల్ తీయాలని ఉందని చెప్పారు. "డాన్స్ బాగా చేసే హీరోలు ఎవరు ఉన్నారు? అల్లు అర్జున్... రామ్ చరణ్. ఎన్టీఆర్ కూడా బాగా డాన్స్ చేస్తున్నారు. స్టైల్ సీక్వెల్ తీస్తే పెద్ద హీరోలతో తీస్తా" అని రాఘవ లారెన్స్ అన్నారు. మెగా ఫ్యామిలీ కి రాఘవ లారెన్స్ క్లోజ్ కనుక... అల్లు అర్జున్ లేదా రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో 'స్టైల్' సీక్వెల్ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలుగు సినిమా జనాలు అనుకుంటున్నారు. ఒకవేళ సినిమాలో ఇద్దరు ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. 'స్టైల్'లో ప్రభుదేవా రాఘవ లారెన్స్ ఇద్దరు హీరోలు ఉన్నారు కదా!
  హమ్మయ్య.... మహేష్ బాబు అభిమానులకు ఓ టెన్షన్ తగ్గింది. 'మహర్షి' సినిమా చిత్రీకరణ ముగిసింది. నిన్న అనగా... బుధవారం సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కుమార్తె సితార, చిత్ర బృందంతో కలిసి మహేష్ కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక, 'మహర్షి' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలున్నాయి. త్వరలో వాటిని పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి, ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదల కావాలి. సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావని... నిర్మాతలకు ముందుగానే అర్థం కావడంతో విడుదల వాయిదా వేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అల్లరి నరేష్ హీరో స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే... దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాత్రం మెప్పించలేకపోయాయి. సినిమాలో లో విడుదలైన రెండు పాటలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూడో పాట 'ఎవరెస్ట్ అంచున' శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. అదెలా ఉంటుందో మరి??
  ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుందనేది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. ఆయనకది వెన్నతో పెట్టిన విద్య. వర్మ తీసిన సినిమాలు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడతాయో... అంతకంటే ఎక్కువ రోజులు మీడియాలో వర్మ సినిమా వార్తలు వస్తాయి. ఎందుకంటే... వర్మ ఎంపికచేసుకునే కథాంశాలు అటువంటివి‌. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 'కోబ్రా'తో సహా! ఈరోజు అటువంటి సినిమాను వర్మ ప్రకటించారు. సారీ సారీ... ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు. సినిమా టైటిల్... 'టైగర్ కేసీఆర్' ‌(పోస్టర్ ను బట్టి).  ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయోపిక్ ఇది. ఈ సినిమా కాప్షన్ ఏంటో తెలుసా? 'ది అగ్రస్సివ్ గాంధీ'! తెలంగాణ వాళ్లను ఆంధ్ర ప్రజలు థర్డ్ క్లాస్ పీపుల్ గా ట్రీట్ చేయడాన్ని తట్టుకోలేని కేసీఆర్.... తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎటువంటి పోరాటం చేశాడు? ఎలా తెలంగాణ సాధించారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్న ట్లు వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వర్మ ప్రకటించలేదు. శశి లలిత... కోబ్రా... ఇప్పుడీ టైగర్ కేసీఆర్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'  విడుదల తర్వాత తమ ప్రకటించిన సినిమాల జాబితా. వీటిలో ఏది ముందు వస్తుందో? ఏది అటక ఎక్కుతుందో?
  దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, అహ్మదాబాద్ ఇతర ప్రదేశాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. ఒక్క ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. యాక్షన్ ఎపిసోడ్ తో యంగ్ టైగర్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ సీన్ చూసిన సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అహ్మదాబాద్ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా రామ్ చరణ్ కాలికి గాయమైంది. అందువల్ల, పుణెలో జరగాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. ఈ లోపు సినిమా యూనిట్ కి మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో  ఎన్టీఆర్ కి కొత్త జోడిని వెతికే పనిలో రాజమౌళి పడ్డారు. హిందీ హీరోయిన్ శ్రద్ధాదాస్, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నిత్యామీనన్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి. అయితే చిత్రబృందం ఎవరిని ఖరారు చేయలేదట.  రామ్ చరణ్ గాయం నయం అయ్యే లోపు.... ‌ ఎన్టీఆర్ కి జోడి ని ఎంపిక చేసి మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
  నాని క్రికెట‌ర్ గా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 19 న విడుద‌ల‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ఇప్ప‌టికే మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాని ఈ రోజు మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు... అందుకే జెర్సీ టైటిల్ పెట్టాం... జెర్సీ అంటే క్రికెట‌ర్ యూనిఫార్మ్ అని. ప్ర‌తి స్పోర్ట్స్ మేన్ వేసుకునే యూనిఫార్మ్ ని జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ స్టోరి కాబ‌ట్టి ఈ టైటిల్ పెట్టామ‌నుకోద్దు. ఇందులో జెర్సీ టైటిల్ కు బ‌ల‌మైన కార‌ణం ఉంది. సినిమా చూస్తే క‌చ్చితంగా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటో మీకు అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ లో చాలా చెప్పాం... ఇది అర్జున్ స‌క్సెస్ ఫుల్ క్రికెట‌ర్ స్టోరీనా? లేక ఫ్ర‌స్టేట‌డ్ క్రికెట‌ర్ స్టోరీనా అంటే రెండూ కావ‌చ్చు, కాక‌పోవ‌చ్చు. ట్రైల‌ర్ లో ఇప్ప‌టికే చాలా స్టోరీ చెప్పేశాం. అర్జున్ ని లూస‌ర్ అన‌డం, త‌క్కువ చేసి మాట్లాడంలాంటివ‌న్నీ ఉంటాయి. వాటివ‌ల్ల ఫ్ర‌స్టేష‌న్ ఉంటుంది. ఆ ఫ్ర‌స్టేష‌న్ వ‌ల్ల అర్జున్ జీవితంలో ఏం జ‌రిగిందనేదే సినిమా స్టోరి. గ‌ల్లీ క్రికెట‌ర్ ని... నేను గ‌ల్లీలో క్రికెట్ ఆడేవాణ్ని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్ మేన్ ని. కొన్ని సార్లు నా టీమ్ లో అంద‌రూ ఓడిపోతేనో, లేకుంటే ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌లు త‌గిలితేనో నాకు ఆడే అవ‌కాశం వ‌చ్చేది. ఆ బ్యాచ్ అన్న మాట నాది. అంతే త‌ప్ప సీరియ‌స్ గా ఎప్పుడూ ఆడ‌లేదు.   చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా... నా ప్ల‌స్ లు, మైన‌స్ లు ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నా సినిమా విష‌యంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను త‌ప్ప ఓవ‌ర్ కాన్ఫిడెంట్ కాదు. ప్ర‌జంట్ నేను చాలా సంతృప్తితో ఉన్నా. ఒక గొప్ప సినిమా చేసాన‌నే ఫీలింగ్ ఈ సినిమాతోనే వ‌చ్చింది. ముస‌లివాడిగా అయినా న‌టిస్తా... నేను ఎటువంటి పాత్ర‌లో అయినా న‌టించ‌డానికి సిద్ద‌మే. ముస‌లివాడిగా చేయ‌మ‌న్నా చేస్తాను. ప్రాస్త‌టిక్ మేక‌ప్ వేసుకోమ‌న్నా సిద్ధంగానే ఉన్నా. న‌టుడిగా నాది కాని వ‌య‌సులో న‌టించ‌డానికి చాలా ఇష్ట‌ప‌డ‌తాను. ఎవ‌రూ జడ్జ్ చేయ‌లేదు... ల‌క్కీగా నా సినిమాలు కొన్నిసార్లు స‌క్సెస్ కాన‌ప్పుడు కూడా నా న‌ట‌న గురించి ఎవ‌రూ ఎప్పుడూ ఒక మాట అన‌లేదు. కాక‌పోతే రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు నాని ఇక క‌మ‌ర్షియ‌లేనా అని అన్నారంతే.. అది కూడా పెద్ద జ‌డ్జిమెంట్ కాదులెండి. ఇక స్టార్ డ‌మ్ లాంటి వాటి మీద నాకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. కంటెంట్ వ‌ల్లే స్టార్ డ‌మ్ వస్తుంద‌ని న‌మ్ముతా.   అప్పుడు కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యా... సినిమా, సినిమాకు ఎద‌గ‌డం నాకు పెద్ద‌గా ప్రెజ‌ర్ ఏమీ లేదు. ఎంసీఏ త‌ర్వాత కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యాను. ప్ర‌జంట్ మాత్రం ఆ ప్రెజ‌ర్ లేదు. జెండా పై క‌పిరాజు, పైసా ఇలా కొన్ని సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. ఆ స‌మ‌యంలో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా చేసా. అది మంచి పేరు తీసుకొచ్చింది. నాకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్తున్నా. వాటిని ఇగ్నోర్ చేస్తున్నా... ప్రారంభంలో సోష‌ల్ మీడియాలో నా పై ఏమైనా రాస్తే వాటిని చూసి కొంచెం ఫీల‌య్యేవాడిని. వాటిని త‌ల‌చుకొని తెగ బాధ‌ప‌డేవాడిని. పోను పోను అంతా అల‌వాటైపోయింది. పిల్ల జ‌మీందార్ సినిమా స‌మ‌యంలో నానికి చాలా త‌ల పొగ‌రు అని రాసారు. అప్పుడు చాలా ఫీల‌య్యా. అప్పుడు అంత బాధ‌ప‌డాల్సి ఉండాల్సి కాదు అని ఇప్పుడ‌నిపిస్తోంది. రాయ‌డం వాళ్ల ధ‌ర్మం, వాటిని ప‌ట్టించుకోకుండా ఇగ్నోర్ చేయ‌డం మ ధర్మం అని ఇప్పుడు అర్థ‌మైంది. బిగ్ బాస్ తో ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది.. మ‌నం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డం క‌న్నా, ప్ర‌పంచానికి మ‌నం ప‌రిచ‌యం కావ‌డం ప్ర‌ధానం. బిగ్ బాస్ తో  నాకు ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది. ఇక బిగ్ బాస్ చేసేట‌ప్ప‌డు ఎక్స్ట్రా బ‌ర్దెన్ లా ఎప్పుడు ఫీల‌వ‌లేదు. కాక‌పోతే ఒక్కో ఎపిసోడ్ అక్క‌డ జ‌రుగుతున్న కొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో దాని ర‌ఫ్లెక్ష‌న్ ఉండేది. షోల్ హీట్ పెరిగే కొద్దీ... ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో హీట్ పెరిగేది. ఇది నా ఆఖ‌రి ఎపిసోడ్ అని ఎప్పుడు ట్వీట్ చేసానో, ఆ త‌ర్వాత నాని అన్నా ప్లీజ్ క‌మ్ బ్యాక్ అంటూ చాలా మంది అడిగేవారు.
    ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.   - గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.   - తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.   - ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.   Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే! - నిర్జర.  
  ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  
  స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా ఫర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్ ఫోన్ కొంపలు ముంచుతోంది. కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్ఫోన్ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...   టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్ఫోన్ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవరైనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ!   అభ్యర్థుల స్మార్ట్ఫోన్ పక్కగదిలో ఉండటమో, టేబుల్ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితమైన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.   ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ‘ఫోన్తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు ‘అబ్బే మేము ఫోన్ లేకుండా నిమిషం కూడా బతకలేము,’ అని చెప్పారు. మరికొందరు ‘ఫోన్ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం,’ అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్ని ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవరైతే ఫోన్ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్లో కనిపించిని చిన్నిపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట.   ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్ వస్తుందేమో, వాట్సప్ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్ ఉదో లేదో, భార్యకి కాల్ చేయాలి కదా, ఆన్లైన్లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా పనిచేసుకోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్ఫోన్, జీవితాలను కమ్ముకుని ఉంటోంది. - నిర్జర.          
  ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు పోలవరం, సీఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేశారు. పోలింగ్ తర్వాత మళ్లీ పాలనా పరమైన వ్యవహారాలపై దృష్టి పెడతానని చంద్రబాబు తెలిపారు. పోలవరం మీద, రాష్ట్రంలో తాగునీటి అంశం మీద చంద్రబాబు సమీక్ష నిరవహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించడంపై పలువురు అభ్యంతరం తెలిపారు. తాజాగా ఈసీ కూడా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించరాదని స్పష్టం చేసింది.
  టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీకి చెందిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘం తీరుపై ఫిర్యాదులు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అలాగే అమరావతిలో జరిగే సమావేశానికి పార్టీ అభ్యర్థులందరూ హాజరుకావాలని చంద్రబాబు ప్రత్యేకంగా కోరారు.
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ.. అంబానీకి లబ్ది చేకూరేలా వ్యవహరించారంటూ రాహుల్ పదేపదే చెప్తుంటారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ అంబానీపై విమర్శలు చేస్తుంటే.. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తన మద్దతు తెలిపి ఆశ్చర్యం కలిగిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలు వరకు మిలింద్ దేవరాకు తమ మద్దతు తెలియజేశారు. మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ కూడా తమ మద్దతు తెలియజేశారు. వీడియో ట్వీట్ చేస్తూ మిలింద్ దేవరా దక్షిణ ముంబై అంటే బిజినెస్ అని రాశారు. దాంతో పాటే ప్రజలు నన్ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగావకాశాలు తెస్తాను. యువతకు ఉద్యోగాలివ్వడం నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ వీడియోలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా సరైన వ్యక్తి అన్నారు. అతను పదేళ్లుగా ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడని అంబానీ చెప్పారు. మిలింద్ కు అనేక అంశాలపై మంచి అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను.. అతను యువతకు ఉద్యోగావకాశాలు చూపగలడు అని అన్నారు. ముకేష్ అంబానీ, మిలింద్ దేవరా కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. బహుశా ఇదే కారణంగా ముకేష్ అతని ప్రచార వీడియోలో కనిపించి ఉండొచ్చని తెలుస్తోంది.
మనుపటి రోజుల్లో అందం గురించి శ్రద్ధ అంతగా ఉండేది కాదు. ఉన్నా దాన్ని కాపాడుకునే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు! అందం గురించిన ఆసక్తీ ఎక్కువయ్యింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు లక్షల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకోసారి మన అందాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు ప్రాణాంతకం కావచ్చునంటున్నారు పరిశోధకులు. అందుకు ఉదాహరణే సన్‌స్క్రీన్‌ లోషన్లు!   మొక్కలకీ మనుషులకీ మధ్య ఓ పోలిక ఉంది. మొక్కలు సూర్యకాంతి మీద ఆధారపడి తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లుగానే, మనుషులు సూర్యుడి నుంచి విటమిన్ డిని పొందుతారు. అలా సహజంగా లభించాల్సిన విటమిన్‌ డికి దూరమైతే చాలా సమస్యలే వస్తాయి. ఊపిరితిత్తుల జబ్బులు, ఎముకలు బలహీనపడిపోవడం, కండరాలు పనిచేయకపోవడం, డయాబెటిస్‌, మెదడు ఎదుగుదలలో లోపాలు... లాంటి ఎన్నో ఇబ్బందులు డి విటమిన్ లోపంతో తలెత్తుతాయని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- మన శరీరంలోని ప్రతి కణానికీ విటమిన్ డి చాలా అవసరం.   సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం వల్ల, సూర్యుడి నుంచి వెలువడే ultraviolet rays (అతినీలలోహిత కిరణాలు) నుంచి తప్పించుకునే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎందుకంటే వీటివల్ల శరీరం మీద మచ్చలు పడటం దగ్గర్నుంచీ, స్కిన్ కేన్సర్‌ వరకూ చాలా సమస్యలే వస్తాయి. కానీ బయటకి అడుగుపెట్టే ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ లోషన్ రాసుకోవడం వల్ల మన శరీరం డి విటమిన్ను ఏమాత్రం ఉత్పత్తి చేసుకోలేదట. ఒక అంచనా ప్రకారం SPF 15 (sun protection factor) కంటే ఎక్కువ గ్రేడ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్లు డి విటమిన్‌ను దాదాపు 99 శాతం అడ్డుకుంటాయి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కనిపిస్తున్న సన్‌స్క్రీన్‌లు SPF 15 కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.   సన్‌స్క్రీన్‌ లోషన్లతో మరో ప్రమాదం కూడా ఉంది. రంగు తక్కువగా ఉన్నవారు, ఎండలో మరింత నల్లబడతామేమో అన్న అనుమానంతో ఈ లోషన్లు తెగ వాడేస్తూ ఉంటారు. సాధారణంగా నల్లటి చర్మం ఉన్నవారిలో విటమిన్ డిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మరింత తక్కువగా ఉంటుంది. వీరు సన్‌స్క్రీన్‌ వాడటంతో అసలుకే ఎసరు వస్తుంది.   బయట ఎండ విపరీతంగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ రాసుకుని సిద్ధం కావడం మంచిదే కానీ.... దానిని మీ మేకప్ కిట్‌లో భాగంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు. పౌడర్‌ వాడినంత తరుచుగా సన్‌స్క్రీన్‌ లోషన్ వాడితే డి విటమిన్ లోపం రాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అసలే డయాబెటిస్ వంటి సమస్యలని అదుపు చేయడానికి విటమిన్ డి చాలా అవసరం కదా! ఇంతా చదివిన తరువాత మనకి విటమిన్‌ డి చాలా అవసరమనీ, దాన్ని సన్‌స్క్రీన్‌ లోషన్లతో అడ్డుకోవద్దనీ తేలిపోయింది. కానీ విటమిన్ డి కోసం ప్రత్యేకించి స్విమ్ సూట్లు వేసుకుని బీచ్ ఒడ్డున పడుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. వారానికి ఒక గంటన్నా ఒంటికి ఎండ తగిలేలా జాగ్రత్తపడితే కావల్సినంత డి విటమిన్‌ ఒంటికి పడుతుందట.   - నిర్జర.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆ తిండిలో తగినన్ని పోషకాలు ఉండాలి. శరీరంలో జరిగే జీవచర్యలన్నీ కూడా సవ్యంగా సాగిపోయేందుకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు అందాలి.  కానీ ప్రస్తుతం మనం తింటున్న ఆహారంలో అలాంటి పోషకాలు లేకుండా పోతున్నాయి. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్నామే కానీ, లోపల మాత్రం డొల్లబారిపోతున్నాం. ఆ విషయాన్ని మరో పరిశోధన మరోసారి గుర్తుచేస్తోంది. రోజూ తగినంత జింక్ని తీసుకుంటే మన డీఎన్ఏ సైతం భద్రంగా ఉంటుందని తేలుస్తోంది.   అసలు జింక్ ఎందుకు మనం అంతగా పట్టించుకోకపోయినా కూడా ఒంటికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం జింక్. రోగనిరోధక శక్తి సన్నగిల్లకుండా ఉండేందుకు, గాయాలు త్వరగా మానేందుకు జింక్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల దగ్గర్నుంచీ తీవ్రమైన గాయాల వరకూ చాలా సందర్భాలలో జింక్ సప్లిమెంట్స్ వాడమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. పిల్లలు త్వరగా, బలంగా ఎదిగేందుకు కూడా జింక్ అవసరం ఉంది.   డీఎన్ఏతో సంబంధం జింక్ వలన Oxidative stress నియంత్రణలో ఉంటుందన్న విషయం ఇంతకుముందే రుజువైపోయింది. దీని వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ అనే విష పదార్థాలు అదుపులో ఉంటాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అదుపులో ఉంచడం వల్ల కేన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలు సైతం మనల్ని దరిచేరవు. ఇప్పుడు ఏకంగా జింక్ వల్ల డీఎన్ఏకి ఏమన్నా లాభం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు ఆరువారాల పాటు కొందరికి తగు మోతాదులో జింక్ సప్లిమెంట్లను అందించారు. ఈ సమయంలో వారి శరీరంలోని డీఎన్ఏ తీరు ఎలా ఉందో గమనించారు.   అరుగు తరుగులు తగ్గాయి రోజుకి నాలుగు మిల్లీగ్రాముల జింక్ని అదనంగా తీసుకున్నా కూడా అది మన డీఎన్ఏ మీద సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మన ఆరోగ్యంలో ముఖ్యపాత్రని పోషించే డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండేందుకు, దెబ్బతిన్న డీఎన్ఏ తిరిగి స్వస్థతని పొందేందుకూ కూడా ఈ జింక్ ఉపయోగపడుతోందట. దీని వల్ల శరీరం ఎలాంటి రోగాన్నయినా, క్రిములనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందన్నమాట.   ఎందులో లభిస్తుంది మాంసం, రొయ్యలు, చేపలు, పీతలు వంటి మాంసాహారలో జింక్ సమృద్ధిగానే లభిస్తుంది. ఇక బచ్చలికూర, చిక్కుడు గింజలు వంటి కొన్నిరకాల శాకాహారంలోనూ జింక్ లభించకపోదు. అయితే పాలిష్ పట్టని బియ్యంలో కావల్సినంత జింక్ లభిస్తుందన్న విషయాన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. అదే కనుక పట్టించుకుంటే జింక్ కోసం అటూఇటూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితే రాదు! - నిర్జర.  
  ఎండాకాలం మొదలైందంటే చాలు... కూల్డ్రింక్లకీ, పళ్లరసాలకీ డిమాండ్ పెరిగిపోతుంది. ఇళ్లలో ఫ్రిజ్లన్నీ సీసాలతో నిండిపోతాయి. కానీ ఎన్ని కూల్డ్రింక్స్ తాగినా జేబులు ఖాళీ అవుతాయేమో కానీ దాహం మాత్రం తీరదు. అందుకే కూల్డ్రింక్స్ పక్కన పెట్టి కొబ్బరిబోండాన్ని ఓ పట్టు పట్టమంటున్నారు నిపుణులు. దానికి బోలెడు కారణాలు చూపిస్తున్నారు కూడా!   - శీతల పానీయాలు నిలవ ఉన్నా, సీసా మూతలు తుప్పు పట్టినా లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కొబ్బరినీళ్లు sterile waterతో సమానం. అంటే వీటిలో సూక్ష్మక్రిములు ఇంచుమించుగా కనిపించవన్నమాట.   - కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇలాంటి ఖనిజాలని మనం Electrolytes అంటాము. గుండె కొట్టుకోవడం, రక్తపోటు నియంత్రణలో ఉండటం, కండరాలు పనిచేయడం వంటి ముఖ్యమైన జీవచర్యలకు ఇవి చాలా అవసరం. అందుకే శరీరం నిస్సత్తువుగా ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కానీ కొబ్బరినీళ్లు తాగించమని చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎలక్ట్రాల్ పౌడర్ వంటి మందులు ఒంటికి ఎంత ఉపయోగపడతాయో... కొబ్బరినీరు దాదాపు అంతే ఉపయోగపడతాయి.   - ఎండాకాలం చాలామందిని వేధించే సమస్య తలనొప్పి. ఎండ తీక్షణత చేతనో, ఒంట్లో నీరు తగ్గిపోవడం చేతనో... ఈ కాలంలో తలనొప్పి తరచూ పలకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్లతో బాధడేవారికి ఎండాకాలం నరకం చూపిస్తుంది. కొబ్బరినీరు ఈ తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొబ్బరినీరు ఒంట్లోని తేమని భర్తీ చేస్తుంది. పైగా ఇందులో ఉండే మెగ్నీషియం తలనొప్పి తీవ్రతని తగ్గిస్తుంది.   - మధుమేహంతో బాధపడేవారు దాహం తీరేందుకు పళ్లరసాలు, శీతల పానీయాలు తీసుకోవడం వల్ల అసలుకే మోసం వస్తుంది. కొబ్బరినీటితో ఈ ప్రమాదం లేకపోగా... ఇందులో ఉండే అమినో యాసిడ్స్ వల్ల రక్తంలో చక్కెర నిల్వలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.   - కిడ్నీలో రాళ్లతో బాధపడటం ఈ రోజుల్లో అతి సహజంగా మారిపోయింది. వీటిలో ఎక్కువశాతం కాల్షియం, ఆక్సిలేట్ వంటి పదార్థాలతో ఏర్పడతాయి. ఇలా కిడ్నీ లేదా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూడటంలో కొబ్బరినీరు పనిచేస్తుందని తేలింది.   - ఎండాకాలంలో విరేచనాలు సర్వసాధారణం. వీటివల్ల శరీరం డీహైడ్రేషన్కు లోనవుతుంది. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేసేందుకు కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. WHO సంస్థ సూచించే ORS నీటితో సమానంగా కొబ్బరినీరు పనిచేస్తుందని చెబుతారు.   - కొబ్బరినీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ నిష్పత్తి చాలా ప్రభావం చూపుతుంది. అందుకే కొబ్బరినీరు తాగేవారిలో రక్తపోటు తగ్గుతుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.   ఒక్కమాటలో చెప్పాలంటే... ఖరీదైన స్పోర్ట్స్ డ్రింక్స్కంటే కూడా కొబ్బరినీరే ఎక్కువ ఉపయోగం అని వైద్యులు సైతం తేల్చేశారు. మరింకెందుకాలస్యం... దాహం వస్తే కొబ్బరినీటికే ఓటు వేద్దాం. - నిర్జర.    
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.