ALSO ON TELUGUONE N E W S
  ఒకే సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి చిన్నకొడుకు శ్రీసింహా హీరోగా పరిచయమవుతుండగా, ఆయన పెద్దకొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఆ సినిమా పేరు 'మత్తు వదలరా'. ఆ మూవీ ఫస్ట్‌లుక్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా బుధవారం విడుదల చేశారు. "కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు" అంటూ హీరోగా పరిచయం అవుతున్న శ్రీసింహాకు, సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న కాలభైరవకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 'మత్తు వదలరా' చిత్ర ఫస్ట్ లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో హైలెట్ చేసినవి చూస్తుంటే ఈ చిత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న హీరో, మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు డైరెక్టర్‌గా రితేష్ రాణా, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ సారంగం, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ.. "మత్తు వదలరా చిత్రం హాస్యంతో నిండిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దర్శకుడు రితేష్ రాణా చివరి వరకు ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తయారుచేశారు. కంటెంట్ అద్భుతంగా ఉంది కాబట్టి, అలాగే యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో మేమే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంతో కొత్తవారినెందరినో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాం. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం" అన్నారు. శ్రీసింహా, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తారాగణం.
  లక్షలాది మంది ఫ్యాన్స్‌కు అక్టోబర్ 23 ఒక పండగ రోజు. ఎందుకు కాదు? అది 'బాహుబలి' ప్రభాస్ పుట్టినరోజు మరి! నేటితో 40 ఏళ్లు నిండుతున్న అతనికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అనేకమంది బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్న 'హ్యాపీ బర్త్‌డే డార్లింగ్', 'హ్యాపీ బర్త్‌డే ప్రభాస్' అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో తమ ఫేవరేట్ స్టార్ బర్త్‌డేని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 'డార్లింగ్'గా అందరి చేతా ప్రశంసలు పొందుతున్న ప్రభాస్.. 'బాహుబలి', 'సాహో' సినిమాల్లో చేసిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాల్ని గెలుచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రభాస్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా లైంలైట్‌లో ఉంటూ ఉందో, అతని పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. చాలా కాలం నుంచే "మీ పెళ్లెప్పుడు?" అని ప్రశ్నను తరచూ ఎదుర్కొంటూ వస్తున్నాడు ప్రభాస్. సహనటి అనుష్కతో అతను ప్రేమాయణం నడుపుతున్నాడంటూ పదే పదే ప్రచారంలోకి వస్తుంటే, ఆ ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, తమ మధ్య అలాంటి అనుబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మూడేళ్ల నుంచీ.. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పుకుంటూ వస్తున్నా, ఆ మాటలు ఇంతవరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ 40వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ గురించి ఎక్కువమందికి తెలీని కొన్ని నిజాల్ని చెప్పుకుందాం. అవి చాలామందిని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అవేమిటంటే... ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ అభిమాన దర్శకుడు రాజమౌళి అనే విషయం మనకు తెలుసు. కానీ రాజమౌళి కంటే ప్రభాస్ అభిమానించే మరో డైరెక్టర్ ఉన్నాడు. ఆయన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. హిరాణీ రూపొందించిన ఫేమస్ ఫిలింస్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్' సినిమాల్ని ప్రభాస్ 20 కంటే ఎక్కువసార్లు చూశాడు. బ్యాంకాక్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటుచేయబడిన తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ ప్రభాస్. ప్రభాస్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడే తెలుగు సినిమా, అతని పెదనాన్న కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించగా 1976లో విడుదలైన 'భక్త కన్నప్ప'.  ప్రభాస్ అభిమాన హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు రెండూ హిందీలో విడుదలయ్యాయి కానీ ఆ రెండూ డబ్బింగ్ వెర్షన్లే. ప్రభాస్ ఫస్ట్ హిందీ మూవీ 'సాహో' అని చాలామంది అనుకుంటారు. కానీ 2014లోనే అతను అజయ్ దేవగణ్ మూవీ 'యాక్షన్ జాక్సన్'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. 2017లో జీక్యూ మేగజైన్ కూర్చిన 'మోస్ట్ ఇంఫ్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్' జాబితాలో ప్రభాస్ ఆరో స్థానంలో నిలిచాడు. యాక్టర్ కావాలని మొదట్లో ప్రభాస్ అనుకోలేదు. హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్లాలనేది అతని ఆలోచన. అతను బాగా ఇష్టపడే వంటకం  చికెన్ బిర్యాని. అతని ఫేవరెట్ కలర్.. బ్లాక్. 'బాహుబలి' కేరెక్టర్ కోసం అతను అదివరకటి కంటే 30 కిలోల బరువు ఎక్కువగా పెరిగాడు. నాలుగేళ్ల పాటు ఆ బరువును మెయిన్‌టైన్ చెయ్యడానికి రోజూ ఆహారంలో చికెన్, గుడ్లు తీసుకుంటూ వచ్చాడు. 'బాహుబలి' పాత్రకు కావాల్సిన రూపాన్ని పొందడంలో భాగంగా వాలీబాల్ ఆడుతూ వచ్చాడు ప్రభాస్. తన ఇంట్లోనే వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసుకొని, ఎప్పుడు ఆడాలంటే అప్పుడు ఆడుతూ వచ్చాడు. 'బాహుబలి 2' మూవీ చేస్తున్న సమయంలో ఒక ఫిట్నెస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం వచ్చిన 5.5 కోట్ల రూపాయల ఆఫర్‌ను వదులుకున్నాడు ప్రభాస్. ఇప్పటిదాకా అతనికి 6 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభాస్‌కు పక్షులంటే చాలా ఇష్టం. అతని ఇంట్లోని గార్డెన్‌లో ఎన్నో రకాల పూల చెట్లతో పాటు పక్షులూ ఉంటాయి. 
  'బాహుబలి' సినిమాకి ముందు ప్రభాస్.. టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో మాత్రమే. పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్ల తర్వాతే అతని పేరు ఉండేది. కానీ యస్.యస్. రాజమౌళి ఏ ముహూర్తాన 'బాహుబలి'గా ప్రభాస్‌ను ఊహించుకున్నాడో, అ క్షణాన ప్రభాస్ దశ తిరిగింది. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, వేరే ధ్యాస లేకుండా 'బాహుబలి'గా విశ్వరూపమే ప్రదర్శించాడు ప్రభాస్. ఆ మూవీతో దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అభిమాన సందోహాన్ని సంపాదించుకున్నాడు.  ఒక తెలుగు నటుడికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ రావడం ఇదివరకు మనమెన్నడూ చూడలేదు. 'బాహుబలి: ద బిగినింగ్' వేసిన ఫౌండేషన్‌తో 'బాహుబలి: ద కంక్లూజన్'తో మరింత రెచ్చిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమాతో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. ఆరడుగుల విగ్రహం వుండేవాళ్లు చాలామందే ఉంటారు. దానికి గ్లామరస్ లుక్ కూడా తోడైతే.. ఒక హీరో ఎలా ఉంటాడనేందుకు ట్రూ ఎగ్జాంపుల్‌గా నిలిచాడు ప్రభాస్. 'బాహుబలి 2' మూవీ వసూళ్ల సునామీతో అదివరకటి హిందీ సినిమాల రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించడం నిజంగా ఒక ఫినామినా.  టాలీవుడ్‌లో ఎంతమంది మహా మహా స్టార్లు ఉండనీ గాక.. వాళ్లెవరూ చెయ్యలేని పని ప్రభాస్ చేశాడు. అది.. బాలీవుడ్‌లో సవాలే లేకుండా సాగుతున్న ఖాన్ త్రయం హవాని నిలువరించడం! వాళ్ల అధిపత్యానికి గండికొట్టాడు ప్రభాస్. సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌కు కూడా సాధ్యం కాని ఫీట్‌ను ప్రభాస్ సాధించాడు. గతంలో హిందీలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని సినిమాలు చేశారు. తెలుగు నటుల విషయానికొస్తే.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ వాళ్లెవరూ స్టార్లు కాలేకపోయారు. కానీ అప్పటిదాకా ఎవరి ఊహకు కూడా అందని ప్రభాస్.. ఆ ఘనతను సాధించాడు. అందరు స్టార్లూ అసూయపడేంత కీర్తి సంపాదించాడు.  'బాహుబలి' సినిమాలు సృష్టించిన ప్రభంజనం ఘనతను చాలామంది రాజమౌళికే ఆపాదించి, ప్రభాస్ ప్లేస్‌లో ఎవరున్నా ఆ సినిమాలు ఆ రికార్డుల్ని సాధించేవేనని అతన్ని తక్కువచేసి మాట్లాడటం మనకు తెలుసు. కానీ వాళ్లది తప్పుడు అభిప్రాయమని 'సాహో'తో నిరూపించాడు ప్రభాస్. ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ ఎవరో తెలుగు ప్రేక్షకులకే సరిగా తెలీదు. దేశంలోని మిగతా సినీ ప్రియులకైతే పరిచయమే లేదు. 'సాహో' మూవీతోటే సుజిత్ ఎవరో ప్రపంచానికి తెలిసింది. 'సాహో' తెలుగునాట ఆశించిన రీతిలో ఆడలేదు. బయ్యర్లు నష్టపోయారు.  కానీ నార్త్ బెల్ట్‌లో 'సాహో' చేసిన వీరవిహారం చూసి బాలీవుడ్ స్టార్లు కళ్లు తేలేశారు..  తరణ్ ఆదర్శ్ లాంటి పేరుపొందిన బాలీవుడ్ విశ్లేషకుడు 'అన్‌బేరబుల్' అంటూ 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చి 'సాహో'ను దారుణంగా విమర్శించాడు. అలాంటివాడు 'సాహో' హిందీ వెర్షన్ సూపర్ హిట్టవడం చూసి బిత్తరపోయాడు. క్రిటిక్స్ అంతా చెత్త అని తేల్చేసిన 'సాహో'.. హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల రూపాయల్నీ, ఓవరాల్‌గా 142 కోట్ల రూపాయల్నీ రాబట్టి ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజిలో ఉందో చాటి చెప్పింది.  అప్పటిదాకా 'సాహో'ను విమర్శించినవాళ్లే, 'ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్' అని ప్రశంసల జల్లు కురిపించారు. నిజమే. రిలీజ్‌కి ముందు 'సాహో'లో పెద్ద కథేమీ లేదని స్వయంగా ప్రభాసే చెప్పాడు. యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా ఉంటాయని చెప్పాడు. కానీ ఆడియెన్స్ 'సాహో'ను చూసింది కథ కోసమూ కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసమూ కాదు.. కేవలం ప్రభాస్ కోసం! యస్.. ప్రభాస్‌ని చూడాలనే తహతహతోటే నార్త్ ఇండియాలోని మారుమూల ప్రాంతాల ప్రేక్షకులు 'సాహో' ఆడుతున్న థియేటర్లను హౌస్‌ఫుల్ చేశారు. 'సాహో' తెలుగునాట చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించకపోవచ్చు గాక.. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.. 'బాహుబలి' రెండు సినిమాలు సాధించిన రికార్డుల్లో రాజమౌళితో పాటు, ప్రభాస్‌కూ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని. 'సాహో'కు వచ్చిన క్రేజ్, హిందీలో ఆ సినిమా సాధించిన కలెక్షన్‌తో అసలు సిసలు పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా రూపాంతరం చెందాడు ప్రభాస్. ప్రస్తుతం ఏ బాలీవుడ్ స్టార్ కూడా పాన్ ఇండియా స్టార్ కాదు.  సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ స్టార్లు.. సౌత్ ఇండియాలో స్టార్లు కారు. ఆ విషయం ఇటీవలి 'వార్' మూవీతో తేటతెల్లమైంది. బాక్సాఫీస్ దగ్గర 'వార్' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా రికార్డులు సృష్టించింది. ఇద్దరు టాప్ యాక్షన్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. అందులో నటించారు. కానీ ఆ మూవీ తెలుగు వెర్షన్ ఆరేడు కోట్ల రూపాయలని మించి వసూలు చేయలేకపోయింది. తాజాగా 'వార్' సినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారనీ, అందులో ప్రభాస్‌ను ఓ హీరోగా నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనీ ప్రచారంలోకి వచ్చింది. కారణం.. హృతిక్‌తో పాటు ప్రభాస్ కూడా నటిస్తే.. ఆ సినిమా రేంజి.. వేరే లెవల్లో ఉంటుందనేది నిర్మాతల ఆలోచన అని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ ఆ సినిమా చేస్తే, తెలుగునాటే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వస్తుందనీ, అది కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందనీ నిర్మాతలు భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల మాట. అందులో నిజం ఉండనీ, లేకపోనీ.. ప్రభాస్ రేంజి ఏ లెవల్‌కు వెళ్లిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఇవాళ.. ప్రభాస్. ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూపర్ స్టార్! భవిష్యత్తులో కెరీర్ పరంగా అతను మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుంటాడని ఆశిద్దాం. విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే టు ప్రభాస్! (అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు) - యజ్ఞమూర్తి
'బాహుబలి' కాకుండా గత నాలుగైదు ఏళ్లలో అనుష్క నటించిన సినిమాల్లో గుర్తుపెట్టుకోదగ్గది, బాగా విజయవంతమైనది ఏదైనా ఉందంటే అది 'భాగమతి' చిత్రమే. అది ఫలానా జోనర్ సినిమా అని చెప్పలేం. హారర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ... సినిమాలో అన్నీ ఉన్నాయి. ప్రతి పావుగంటకు, అరగంటకు జోనర్ మారుతుంది. ఈ కాన్సెప్ట్, స్టోరీ సెటప్ హిందీ ఇండస్ట్రీలో ఓ నటుడికి బాగా నచ్చింది. అతడు ఎవరనేది ఇంకా తెలియలేదు గాని, 'భాగమతి'ని హిందీలో రీమేక్ చేయడానికి చకచకా పావులు కదుపుతున్నాడని తెలిసింది. తెలుగు 'భాగమతి'కి దర్శకత్వం వహించిన అశోక్, హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. 'భాగమతి'గా అనుష్క నట విశ్వరూపం చూపించింది. 'ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. భగ భగ భాగమతి' డైలాగ్స్ చెప్పే సన్నివేశంలో అయితే అనుష్కను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తెలుగులో అనుష్క ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది. హిందీలో అనుష్క పాత్రను భూమి పెడ్నేకర్ చేయనున్నారు. మిగతా పాత్రలకు సెలక్షన్ జరుగుతోంది.
పవన్ కల్యాణ్ దగ్గర మైత్రీ నిర్మాతల అడ్వాన్స్ ఉంది. ఒక్క సినిమాకు 40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తారట. ఇక పోతే 'రెబల్' నిర్మాతలు జె భగవాన్ రావు, జె. పుల్లారావ్ అడ్వాన్స్ ఉంది. అలాగే, దిల్ రాజుకు ఓ సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. వీళ్లు కాకుండా త్రివిక్రమ్ తో వరసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అడ్వాన్స్ కూడా పవన్ దగ్గర ఉందని సమాచారం. రాజకీయాల్లోకి వెళ్లే ముందు, వెళ్ళిన తరువాత మళ్లీ సినిమాలు చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు‌. సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. పవన్ సినిమా వస్తానంటే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలే కాదు... మిగతా నిర్మాతలు కూడా అంత రెమ్యూనరేషన్ కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శకుడు ఎవరనేది క్వశ్చన్ మార్క్. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారని వార్తలు వస్తున్నా... రీ ఎంట్రీ సినిమా మాత్రం అది కాదని సమాచారం. ఇటీవల పవన్ ను కలిసిన హరీష్ శంకర్ ఒక కథ వినిపించాడట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో ఆ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అలాగే, దర్శకుడు క్రిష్ కూడా పవన్ ని కలిసి ఒక కథ చెప్పారని టాక్. ఇకపోతే త్రివిక్రమ్ కూడా తమ్ముడు కోసం ఒక కథ రెడీ చేసాడట. త్రివిక్రమ్... హరీష్... ఇద్దరిలో ఎవరో ఒకరి దర్శకత్వంలో పవన్ సినిమా చేయవచ్చని తెలుస్తుంది.
  ‘మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’... వగైరా వగైరా వాక్యాలు మనం చాలానే వింటూ ఉంటాము. వినడానికి కాస్త అతిగా ఉన్నా, వాటిలో తప్పేమీ లేదని మనకి తెలుసు. అందుకే సిగిరెట్‌ మానడం కూడా ఏమంత కష్టం కాదని తేల్చేస్తున్నారు పెద్దలు. కావాలని అంటించుకున్న వ్యసనం, పొమ్మంటే పోకుండా ఉంటుందా! పోయేదాకా పొగపెడితే సిగిరెట్టైనా పారిపోకుండా ఉంటుందా! కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు పాటించేస్తే సరి... ప్రణాళిక ఏర్పరుచుకోండి: సిగిరెట్టుకి దూరం కావాలి అని నిర్ణయించుకోగానే, ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. కనీసం ఒక నెల రోజులన్నా మీరు సిగిరెట్టుకి దూరంగా ఉండేందుకు ఏమేం చేయాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని కుటుంబసభ్యులతో సహా మీ సన్నిహితులందరికీ తెలియచేయండి. మీరు ఏమాత్రం మీ లక్ష్యం నుంచి దూరమైనా, వాళ్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పొగకు దూరమైనప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నాళ్లు ఓపిక పట్టాలి?... వంటి విషయాలన్నింటి మీదా ఒక అవగాహనను ఏర్పరుచుకోండి. వ్యాపకం మీరు ఉద్వేగంగా ఉన్నప్పుడో లేక ఖాళీగా ఉన్నప్పుడో సిగిరెట్‌ తాగాలని నోరు పీకేయడం సహజం. అందుకనే ఏదో ఒక వ్యాపకాన్ని అలవర్చుకోండి. సిగిరెట్ తాగాలని మీ నోటికి అనిపించినప్పుడల్లా చూయింగ్‌ గమ్‌ నమలడమో, మంచి నీరు తాగడమో చేయండి. చేతులతో వీడియో గేమ్ ఆడటమో, రాయడమో చేయండి. అదీ ఇదీ కాకుంటే కాసేపు ధ్యానం చేయండి లేదా ఓ నాలుగడుగులు అలా వీధి చివరిదాకా వెళ్లిరండి. మొత్తానికి సిగిరెట్‌ తాగడం తప్ప మరేదన్నా పనికొచ్చే పనిచేయండి. వాతావరణం పొగని గుర్తుచేసే అన్ని వస్తువులనీ కట్టకట్టి అవతల పారేయండి. మీ సిగిరెట్‌ ప్యాకెట్లు, లైటర్లు, యాష్‌ట్రేలు.... వీటన్నింటినీ చెత్తబుట్టలో పారేయండి. ఇక పొగని గుర్తుచేసే ప్రాంతాలకి (ఉదా॥ సినిమా హాళ్లు, బార్లు...) దూరంగా ఉండండి. మీ స్నేహితులలో తెగ పొగ తాగేవారికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. వారి సాన్నిహిత్యంలో మీకు పొగ గుర్తుకురావడం మాట అటుంచి, మీతో మళ్లీ పొగ తాగించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు! సలహాసంప్రదింపులు సిగిరెట్టు వ్యసనానికి ముఖ్య కారణం అందులో ఉండే నికోటిన్‌ అనే పదార్థమే! కాబట్టి నికోటిన్‌ వ్యసనం నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహా తప్పకుండా ఉపయోగపడుతంది. నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ పేరుతో కొన్నాళ్ల పాటు తక్కువ మోతాదులో నికోటిన్‌ ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నికోటిన్‌ వ్యసనం నుంచి దూరం చేసేందుకు మందులూ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు గుర్తిస్తారు. అదీ ఇదీ కాదంటే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి, సిగిరెట్‌ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు సాయపడే సైకాలజిస్టులూ అందుబాటులో ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వైద్యుల సాయాన్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉండండి సిగిరెట్‌ మానేసిన మొదటి రోజు నుంచి తలనొప్పి మొదలుకొని నానారకాల ఇబ్బందులూ మీ శరీరాన్ని పీడించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు... వారాల తరబడి నానారకాల సమస్యలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేని మీదా ధ్యాస నిలువదు. నిస్సత్తువ, అజీర్ణం, దగ్గు... మనల్ని కుంగతీస్తాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల కోసం, మీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్నాళ్లపాటు వీటిని భరించక తప్పదని గుర్తుంచుకోండి. ఒకో వారం గడిచేకొద్దీ మీ ప్రయత్నాన్ని మీరే అభినందించుకోండి. మీకు మీరే బహుమతిగా ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి.   - నిర్జర.
  ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...   భయాన్ని పసిగట్టండి మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.   అలవాటు చేసుకోండి ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.   భయపడే పని చేసేయండి ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.   తాత్సారంతో లాభం లేదు భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.   చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి. - నిర్జర.  
    'కాండిల్ లైట్ డిన్నర్' చేయటమంటే మీకిష్టమా. అదీ ఇంట్లో, కాని ఆ కొవ్వొత్తులని ఒకటి ఒకటి వెలిగించటం, అవి కరిగి ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద పడతాయో అన్న టెన్షన్ తో ఆ సరదాకి దూరంగా ఉంటున్నారా, అయితే 'లెడ్ ఫ్లేమ్ లైట్' లని తెచ్చుకోండి ఇంటికి. అగ్గిపుల్లతో వేలిగించనక్కర్లేదు, కరిగే భయం ఉండదు. ముఖ్యంగా పొగరాదు, అదెలా అంటే? చూడడానికి కొవ్వొత్తులా ఉండే ఈ 'లెడ్ ప్లేమ్ లైట్ ' నిజానికి ఓ లైట్. అయితే దీనిని వేయడానికి స్విచ్ అవసరం లేదు. కొవ్వొత్తుని ఆర్పడానికి ఊదినట్లు ఊదితే వెలుగుతుంది. మళ్ళీ ఊదితే ఆరిపోతుంది. విచిత్రంగా వుంది కాదూ. రెండు చిన్న బ్యాటరీలతో పనిచేసే ఈ ప్లాస్టిక్ క్యాండిల్ ధర కూడా చాలా తక్కువే. ఇంటిని౦డా ఎంచక్కా అందానికి వీటిని అలకరించుకుని కావల్సినప్పుడు ఊదుతూ వెళ్ళటమే. 'బ్లో అన్ ఆఫ్ క్యాండిల్స్' ఎక్కడ దొరుకుతాయి అంటారా? మనస్సు పెట్టి ఆలోచించండీ.
  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కొస్తుందా. కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య  కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా. ఇరువర్గాలూ మెట్టు దిగడానికి అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి బస్ భవన్ వర్గాలు.ఇరువర్గాల మధ్య ఆర్టీసీ విలీనంపైనే పీటముడి నెలకొని ఉంది. విలీనానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే మిగిలిన అంశాలకు అంగీకరిస్తే విలీనంపై కార్మిక సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నాటికి  సమస్య పరిష్కారం అవుతుందని హై కోర్టు ఆశాభావం వ్యక్తం చేసిన నేపధ్యంలో కమిటీ సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.కోర్టు ఉత్తర్వులు అందితే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.కార్మికుల డిమాండ్ లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.రెండురోజుల్లో ఎండీకి నివేదిక ఇవ్వనుంది నిన్న దీని పై ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ హై కోర్టు ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.కార్మికులు మెట్టు దిగడానికి అవకాశం ఉందా విలీనం డిమాండ్ మినహాయిస్తే కార్మి కుల డిమాండ్ లో ప్రధానమైనవేంటి, కార్మికుల సమ్మె కు ఎలా ముగింపు పలకవచ్చని అంశాల పై ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది.మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరింది బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేపట్టారు.అఖిల పక్ష పార్టీ లు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నేతలు కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ కొద్ది సేపట్లోనే భేటీకానుంది బస్ భవన్ లో భేటీ అవుతుంది. కోర్టు సూచించినటువంటి కోర్టు డైరెక్ట్ చేసినటువంటి ఇరవై ఒక్క అంశాలు ముందుగా కార్మిక సంఘాలన్ని కలిసి టీఎంయూ ఆధ్వర్యంలో నలభై రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.
  తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ సోకి పలువురు మృతిచెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్‌ను ఈరోజు హైకోర్టు విచారించింది. మనుషులు చనిపోతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణ చర్యలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు రేపు ఉదయం హైకోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించింది. డెంగ్యూ వచ్చి మనుషులు చనిపోతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. డెంగ్యూపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తెలిపింది.
  కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. బోటు నుంచి వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజుతో పాటు బోటులో ప్రయాణించిన వరంగల్ కు చెందిన పర్యాటకుడు కొమ్ముల రవీందర్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన ఆరు మృతదేహాలు ఎవరివన్నది నిర్ధారించాల్సి ఉంది. మొత్తం మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే మహిళది. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వెలికితీసిన వశిష్ట బోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోటు ఏసీ క్యాబిన్ లో ఉన్నాయి. బోటు గల్లంతైన రోజునే గల్లంతయిన వాళ్లంతా ఏసీ క్యాబిన్ లో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకొని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారిలో పన్నెండు మంది జాడ తెలియాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది బయటపడటంతో మిగిలిన నలుగురి జాడ కోసం బోటు ఉన్న ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు.మృత దేహాలు బాగా కుళ్ళీపోయి ఉండటంటో ఎవరివో గుర్తించటం చాలా కష్టంగా మారింది. మృతుల బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాదకర వాతావరణం నెలకొంది.
అవునండి కూర్చుంటే ముప్పే అంటున్నారు పరిశోధకులు. మారుతున్న జీవనశైలి,పనిచేసే పద్ధతి మనని కదలనీయకుండానే అదే పనిగా కూర్చొబెట్టేస్తున్నాయి. దీర్ఘకాలం కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులకు గుండె జబ్బులే కాదు ఊబకాయంతో పాటు వెన్నుకి సంబందించిన సమస్యలు చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఒకొక్కరు ఆఫీసుకి వెళ్ళిన దగ్గరనుంచి వచ్చేదాకా పని వల్ల ఆ ప్లేస్ నుంచి కదలలేకపోతారు. వారికి కావాల్సిన చిన్న చిన్న పనులకి కూడా ప్యూన్ ల మీద అధారపడుతూ ఉంటారు. నిజానికి అదే పనిగా ఎక్కువ సేపు కూర్చోవటం మన మన ఒంటికి సరికాదు అంటున్నారు మన వైధ్యులు. ఎందుకంటే కూర్చున్న సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్ లైపేజ్(L P L )అనే ఎంజైమ్ యొక్క పనితీరు మందగిస్తుందిట. దాని వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను పీల్చుకుని కండరాలలోకి మార్చే ప్రక్రియకు అంతరాయం కలుగుతుందిట. దానితో రక్తం లోని కొవ్వు ప్రతి అవయవం దగ్గరా పెరిగిపోయి చివరకు అది గుండెపోటుకు మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందిట. ఇలా కూర్చోవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ తెచ్చుకోవటం అవసరమా. అందుకే కొన్ని పద్ధతులు పాటించి వాటిని మన దగ్గరకి రాకుండా జాగ్రత్త పడదాం. *  అదేపనిగా కూర్చోకుండా ప్రతి 20 నిమిషాలకి ఒకసారి లేచి నిలబడి అటు ఇటు  తిరిగితే మంచిది. *  ఒత్తిడిగా అనిపిస్తే భుజాలకి విశ్రాంతి ఇచ్చేందుకు మధ్య మధ్యలో వాటిని పైకి కిందకి లేపుతూ ఉండాలి.  ఒక రెండు నిమిషాలు ఇలా చెయ్యటం వల్ల మెడ నొప్పికూడా  రాకుండా ఉంటుంది.   *  మనం  పనిచేసే సమయంలో మన మెదడుతో పాటు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవి మన కళ్ళు. ఒక్క రెండు నిమిషాల వ్యవధి రాగానే కళ్ళకి చిన్నపాటి ఎక్సరసైజ్ చెయ్యటం మంచిది. దూరంగా ఉన్న వస్తువుని చూడటం, మొహం తిప్పకుండా కళ్ళని కుడి వైపు ఎడమ వైపు తిప్పటం ఇలాంటివి చెయ్యాలి. ' *  ఆఫీసు లో ఫోన్ మాట్లాడేటప్పుడు నుంచుని మాట్లాడటం అలవాటు చేసుకున్నా మంచిదే. *  రోజులో కనీసం 40 నిమిషాలపాటు నడిస్తే కీళ్ళకు బాగా పనిచేస్తాయట. *  మనం పనిచేసే ప్లేస్ లో కూర్చునే కుర్చీ,ఎ దురుగా ఉండే టేబుల్ సరైన హైట్ లో ఉన్నాయో లేదో గమనించుకుంటూ ఉండాలి. వాటిలో ఏ మాత్రం తేడ ఉన్న మీకన్నా ముందు మీ నడుముపై  ఆ ప్రభావం   కనిపిస్తుంది.   *  ఆఫీసులో మిగిలిన వారితో పని ఉంటే ఫోన్లు వాడకుండా లేచి వెళ్లి వస్తూ ఉండటం కూడా మంచిది. *  కాళ్ళు ఎక్కువసేపు కిందకి పెట్టి కూర్చోవటం వల్ల రక్తం మొత్తం కిందకి దిగి కాళ్ళు బరువెక్కి తిమ్మెరలు వస్తూ ఉంటాయి. దీనిని నివారించేందుకు కాళ్ళ కింద కాస్త ఎత్తుగా చిన్న స్టూల్ పెట్టుకోవటం మంచిది. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరీ ఏదో ఒక పద్దతి మొదలుపెట్టేద్దామా. ...కళ్యాణి  
  ఎగ్జామ్స్ టైం వస్తోందంటే చాలు పిల్లలు చదివి చదివి అలసిపోతారు. అలాంటి చిన్ని కళ్ళని మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. వాళ్ళు ఎక్కువగా చదవటం వల్ల వచ్చే ఒత్తిడిని కళ్ళు వెంటనే మనకి తెలియచేస్తాయని చెప్తున్నారు కంటి వైధ్యులు. అలా అలిసిపోయిన కళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాపాడుకోవచ్చట. పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళ గదిలో ఉండే గాలి వెలుతురుని అంతగా పట్టించుకోరు. తొందరగా చదివేసుకోవాలనే తపన తప్ప వాళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. తగినంత వెలుతురు లేని చోట చదవటం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందిట.   * ఏకధాటిగా చదివే సమయంలో కళ్ళనుంచి నీరు కారుతుంది. అలాంటి సమయంలో పల్చటి మజ్జిగలో తడిపిన దూదిని కళ్ళ మీద వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచినా చాలు. * నిద్ర లేవగానే ముందుగా కళ్ళ మీద చల్ల నీళ్ళని అయిదు నిమిషాల పాటు కొట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంత అలిసిపోయిన కళ్ళయినా సేద తీరుతాయి. * కళ్ళ మంటలు తగ్గాలంటే ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ ఉండాలి. అదే పనిగా ఎక్కువసేపు ఒకే వైపు చూస్తూ ఉండిపోకూడదని చెప్తున్నారు డాక్టర్లు. * అలిసిపోయిన కళ్ళకి ఫ్రిజ్ లో పెట్టి తీసిన టీ బాగ్స్ బాగా పనికొస్తాయి. అలా బయటకి తీసిన టీ బాగ్స్ ని కళ్లపై ఉంచుకుని కాసేపు అయ్యాక తీసి చల్ల నీళ్ళతో కళ్ళు కడిగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది. * కీరా దోసని గాని, బంగాళదుంపని గాని పల్చటి చక్రాలుగా తరిగి కళ్ల రెప్పలపై వేసి ఉంచినా కళ్ళు త్వరగా చల్లబడతాయి.   * అలసట వల్ల కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తే టమాటో గుజ్జులో చిటికెడు పసుపు, 1 స్పూన్ నిమ్మరసం,1 స్పూన్ సెనగపిండి వేసి ముద్దలా చేసి దానిని కనురెప్పలపై పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ తొందరగా మాయమవుతాయి. * రోజ్ వాటర్ కళ్ళకి మంచి మందులా పనిచేస్తుంది. రోజ్ వాటర్ లో దూది ముంచి దానిని కనురెప్పలపై వేసినా కళ్ల అలసట తగ్గుతుంది. * చదువుతూనే కళ్ళకి అప్పుడప్పుడు చిన్నపాటి ఎక్సరసైజ్ ని చేయిస్తూ ఉండాలి. ఐ బాల్స్ ని గుండ్రంగా తిప్పుతూ, కిందకి మీదకి,ఎడమవైపు కుడివైపు తిప్పుతూ ఉంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలతో పాటు కళ్ళకి మంచి ఆరోగ్యనిచ్చే ఆహారం కూడా తీసుకుంటే పిల్లల కళ్ళు దెబ్బతినకుండా ముద్దులొలుకుతూ ఉంటాయి. --కళ్యాణి  
    With the onset of the winter season the, climate becomes more harsh and dry mostly towards our skin. Skin being the most easily exposed, is most affected and its vital moisture and oils are snatched away! Your skin also needs moisturizing during the winter chills, so it is advisable to use oil-based creams; a wise choice is to be made among oils as certain clog facial pores. Avocado oil, mineral oil, primrose oil and almond oils are amongst the advisable oils! Just because it is not summer-time we need not put away the sunscreen lotions. They are very much needed during the winter also the sun and snow glare do the same damage to our skin as the hot sun does during summer. But the sunscreen with a lower SPF is advisable i.e., above 20 SPF! Try covering your limb extremities with woolens, start with cotton thermals and then switch to wool as wool may cause irritation. Wearing wet socks and gloves is most likely to invite problems; it flares up skin irritation and diseases like, itching, cracking and eczema. Most of us apply various peels and replenishing packs while, most of these masks, alcohol-based toners and astringents also evaporate the moisture from the skin. Instead of these masks it is advisable to use cleansing milk or foaming cleansers which are devoid of alcohol. When the temperature drops down, taking steaming hot baths feels great. But the saddening fact behind these super hot baths is that they break down the lipid barriers and the snatch away the moisture and making the skin all the more dry and life-less! Protect your skin and look stunning round the year! Take Care!! ......SIRI
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.