Publish Date:Sep 16, 2013
Publish Date:Jun 12, 2013
Publish Date:Jun 10, 2013

LATEST NEWS
  Our beloved prime minister loves flying to overseas. The fact that he has spent 12 percent of his tenure on foreign trips would support the fact. A reply to the question in Rajya Sabha has presented several interesting facts regarding his foreign tours. It’s revealed that he has visited 84 nations in this world! This is almost half of the number of countries in the world (195). These visits have cost just 1,482 crores to the nation. Mind you... these expenses didn’t include accommodation and other expenses. In contrast our previous Prime Minister Manmohan Singh has incurred just 642 crores in nine years of his tenure. The citizens of India might be left with red face with these statistics but the Indian government has an explanation for it. Ministry of External Affairs General V. K. Singh clarified that "the objective of PM’s visits abroad has been to enhance mutual understanding and to strengthen our relations with these countries across a wide range of sectors including trade, investment, technology, development partnership and to enhance people-to-people ties".
  The term of ragging might have been started to create rapport between the students. But it has often turned violent. It has became a tool for the seniors to harass. Cases of aggressive ragging has often led to ruined careers. But things have not changed in many colleges. Ragging is a norm that is being still followed. So, the Andhra Police has decided to deal with the menace in strict way. B. Prasada Rao, a DSP from Srikakulam District has warned o dire consequences for ragging. He said that the offending students would be booked under the Andhra Pradesh Prohibition of Ragging Act. People who are found guilty under this act would be facing imprisonment upto 10 years.
In what is said to be a rarest of the rare legal case, 20 people of Indian origin were sentenced to rigorous imprisonment ranging from four to twenty years. These people will be deported back to India after they complete the jail term. The said judgement was pronounced in a case pertaining to a call centre scam. Culprits in this scam impose themselves as the officials of Taxation or citizenship department. They choose victims who are vulnerable such as elderly ones or immigrants. Then they  threaten the victims that they would land in jail if they don’t remit certain amount of money to a bank account. The amount would be quickly withdrawn and diverted to India. The case has been a blot over the image of Indian Call Centres who are already struggling to survive under the regime of Trump.
ALSO ON TELUGUONE N E W S
  `When will Salman Khan get married?’ might be a million dollars question to us. Even Salman has no answer to offer us. But an old video has been circulating regarding a marriage proposal of Salman. In that video Salman is heard revealing that he asked Juhi’s father to give her hand to him. "She is very sweet. Adorable girl. I asked her father if you will let her get married to me. He said 'no'," he said. However Juhi’s father is said to have denied the proposal. Salman and Juhi has never acted together.  Well Juhi is now settled in a comfortable family. But it would be interesting to imagine the couple together! Well fate seems to have its own reasons!
You may not know him by name. But we all are familiar with his role in serials like Balika Vadhu (Chinnari Pelli Kooturu) . Sidharth Shukla, the famous Hindi serial actor is now facing charges for an alleged car accident. The car Shukla was driving has rammed three vehicles and jumped a divider on the New Link Road in Mumbai yesterday. One person is said to be injured in the accident. He will now be facing charges under IPC sections 279 (rash driving), 336 (endangering life or safety of others) and other relevant sections of the Motor Vehicles Act. Police suspect that he might have been under the influence of alcohol during the accident. However this is not the first time for Sidharth to get involved in a car accident. He reportedly made a car accident in 2014 too!
ఎనిమిదేళ్ల క్రితం సమంత కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏం మాయ చేసావే.ఈ సినిమాతో ఏం మాయ చేసిందేమోగాని నాగ చైతన్య మనసు పారేసుకున్నాడు.ఎన్నో ఆశ్చర్యాలకు గురిచేసిన వీరి ప్రేమ ప్రయాణం అప్పట్లో వైరల్ గా మారింది.అందరి ఊహాగానాలకు తెరదింపుతూ 2017లో వివాహబంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లయ్యాక చై, సామ్‌లు కలిసి ఇప్పటివరకు నటించలేదు.     వీరిద్దరికోసం శివ నిర్వాణ ఓ కథను సిద్ధం చేశారు.కాగా..ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంతతో పాటు నాగార్జున కూడా వచ్చారు. ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి కానీ ఆగస్ట్‌ నుంచి చిత్రీకరణ మొదలు కానుందని సమంత వెల్లడించారు. ఇందులో చై, సామ్‌ భార్యాభర్తల పాత్రల్లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది.పెళ్లయ్యాక భార్యభర్తల మధ్య చోటుచేసుకునే చిలిపి తగాదాలు, వాళ్ల అనుబంధం నేపథ్యంలో సాగబోతోంది. సాహి గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అవసరాల శ్రీనివాస్‌, రావు రమేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఓవైపు చై ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలతో బిజీగా ఉండగా మరోవైపు సామ్ 'యూటర్న్' అనే చిత్రంలో నటిస్తున్నారు.
  1 Kalalanni Pulakinchu Vela Meru mee cheliya kalisi kanna kalalu nijam avvutunaya danni pata dwara vinali anukunte ee pata tappakunda vinalsinde.   2.Anuraaga Teeraalalo Meru mee priyudu kalisi prematho matladkuni oka madhurageetam vinali anukunte Satyam garu sangeetam andinchina ee pata vinalsinde.   3.Manasulona Mouna Veena Mee priyuralni varninchataniki pata edi baguntundo alochistunara ayite ee pata taapakunda vinandi   4.Prathi Rathri vasantha rathri Ninduga chandamama kanipinchinapudu manasu ullasanga uthsahanga untundi alantapudu prati ratri ila unte bagunnu ana alochana vastundi. Alantapudu ee pata vinte chalu prati ratri okela anipistundi   5.O Allari Choopula Mee priyuralu allari chestunapudu ala chustu undi poyara? Ala saradaga tanavaipu chustu ee patani vinipinchandi tanu enta murisipotundo chustuu undipotaru   6.Pagati Poota Mee priyuralni varninchataniki chakkani pata unte baguntundi ani anukuntunar emo ayite ee pata vinandi tappakunda nacchutundi   7.Yedo Pilchinadi Meru mee priyuralu kalisi pataladara (patala dwara matladkunara) ledaa... Ayite ee pata vinandi pataladite yento baguntundi ani oppukuntaru  
The biopic of controversial Bollywood actor Sanjay Dutt has hit the screens. Though the movie was a hit and Ranbir was praised for his natural performance.... there were criticisms that the movie is nothing but a whitewash of Sanjay’s image. However sensational director Ram Gopal Varma is trying to handle this controversy in his own style. Sources reveal that RGV is going to make a movie of his own based on the life of Sanjay Dutt. However much of his focus would be made on Sanjay’s involvement in 1983 bomb blasts case for which he was arrested. The research for the story is going on and RGV’s team is said to be in contact with various police officers who dealt with the case. If sources are true, the movie might hold a title- `The Real Story of Sanju’.
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు చర్చలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించిన తీరు....ప్రవర్తించిన విధానంతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు వచ్చినట్లేనని సీనియర్లు భావిస్తున్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు రెట్టింపు అయ్యాయి.  రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంతో యావత్ దేశం తమ వైపు చూస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.     నిజానికి అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం టానిక్‌లాంటిదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏభై ఏళ్ల వరకూ అధికారం వైపు కాదు కదా... కనీసం ఒకటి రెండు స్ధానాలు కూడా గెలిచే పరిస్ధితి లేదని ఆ పార్టీలో ఉన్న నాయకులే చెబుతున్నారు. ఇలాంటి స్ధితిలో లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం రాష్ట్రంలో పార్టీకి సంజీవనిలా పని చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఆదివారం నాడు జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో సమస్త అధికారాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే కట్టపెట్టారు. ఇది ఓ విధంగా మంచి పరిణామం. వివిధ రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో... ఎవరిని దూరం ఉంచాలో... ఎవరికి దగ్గర కావాలో.... పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడం మంచి సంప్రదాయం.     దీని వల్ల క్షేత్ర స్ధాయిలో సమస్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఆయా రాష్ట్రాలకు చెందిన పొత్తులు... స్నేహాలు... విరోధాలు... శత్రుత్వాలు... ఆయా రాష్ట్రాలకు చెందిన పిసిసిలే నిర్ణయించేవి. దీని వల్ల ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత కంటే నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం వచ్చేది. దీంతో కాంగ్రెస్ నాయకులు " వ్యక్తిగతంగా" లాభ పడ్డారు తప్ప పార్టీకి మాత్రం మేలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు... వారిచ్చిన నివేదికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. దీంతో క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందో అధి నాయకత్వానికి తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జిల నివేదిక ప్రమాణికంగా టిక్కట్ల కేటాయింపు నుంచి పొత్తుల వరకూ కీలక నిర్ణయాలు జరిగిపోయేవి. ఇది పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆ పాత పద్దతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పొత్తుల ఖరారుపై నిర్ణయాన్నే కాదు.... పార్టీ ప్రచార బాధ్యతలను కూడా సిడబ్ల్యూసి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే అప్పగించింది.     సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన కమిటీ. ఈ కమిటీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అవలంభిస్తుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా 23 మంది మాత్రమే సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నారు. ఆదివారం నాటి ఈ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చాలా ఉత్సాహంగా ప్రసంగించారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించుతామని ఆయన సిడబ్ల్యూసీ వేదికగా ప్రకటించారు. " బిజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది " అని ఈ వేదిక నుంచి ప్రకటించారు. ఇది రాహుల్ గాంధీ అత్యుత్సాహం అనే కంటే పెరిగిన నమ్మకంగానే పరిగణించాలి. ఈ నమ్మకం... ఈ విశ్వాసం... ఈ లక్ష్య నిర్దేశాలకి వేదిక లోక్‌‌సభ కావడం... అది కూడా విభజనతో నష్టపోయిన  ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కావడం కాకతాళీయమే అనుకోవాలి.    
పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కాసింత ఊరట. గడచిన కొన్నాళ్లుగా ధరాఘాతంతో సతమతమవుతున్న సామాన్యులకు దొరికిన ఆలంబన. నోట్ల రద్దు... జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశంలో సామాన్యుల నడ్డి విరిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలు ప్రతి ఒక్కరికి శరాఘాతంగా మారాయి. దేశంలో ప్రతి ఒక్కరూ ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు అని పాడుకునే పరిస్థితే కనిపించింది. అయితే దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా కేంద్రం కాసింత తగ్గింది.     తాజాగా జరిగిన జిఎస్టీ మండలి సమావేశంలో 88 వస్తువులు, సేవలపై పది శాతం జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ముదావహం. జీఎస్టీ పుణ్యమాని సామాన్యులు, మధ్యతరగతి మానవులు దేశంలో బతకలేని స్థితి కల్పించారు. ప్రతి వస్తువుపైనా రాష్ట్రం విధించే పన్ను, కేంద్రం విధించే పన్నులతో సతమతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ పేరుతో తీసుకువచ్చిన సరికొత్త వడ్డింపు బతకలేని స్థితికి తీసుకువచ్చింది. పప్పులు... ఉప్పులు... కూరగాయలు... పాలు... దేవుడి విగ్రహాలు.... చీపుర్లు... చివరికు కూరలో కరివేపాకు అని ఇన్నాళ్లూ తీసి పారేసిన ఆ కరివేపాకుపై కూడా జీఎస్టీ అంటూ పన్నులు విధించడం దేశంలో విడ్డూరాల్లో విడ్డూరం. దీని వల్ల రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తమ ఖజానా నింపుకునే అవకాశం ఉంటుందేమో కాని సామాన్యులకు మాత్రం చుక్కలు చూపించినట్లే అయ్యింది.      ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. శనివారం నాడు కేంద్ర తాత్కాలిక ఆర్ధిక శాఖా మంత్రి పియూష్ గోయోల్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సామాన్యులకు ఓకింత ఊరట కలిగిందనే చెప్పాలి.   ఈ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 88 వస్తువులపై భారం తగ్గనుంది. ఈ వస్తువులన్నీ సామాన్యులు నిత్యం వినియోగించేవే. టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలపై కూడా ఇంతకు ముందు జీఎస్టీ పేరుతో పన్నుల బాదుడు ఉండేది. తాజా నిర్ణయాల కారణంగా వీటన్నింటిపై ఆ పన్నులు తగ్గుతాయి.     ఇది ప్రజలకు... ముఖ్యంగా మ‌హిళా లోకానికి ఆనందాన్ని పంచే విషయం. జీఎస్టీ కారణంగా దేశంలో సగటు రైతు నానా కష్టాలు పడుతున్నారు. నానాటికీ దేశంలో వ్యవసాయం తీసికట్టుగా మారుతోంది. వ్యవసాయాధారిత దేశంలో రైతులు పడుతున్న అగచాట్లు అంతా ఇంతా కాదు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇక్కడి జరిగినన్ని రైతు ఆత్మహత్యలు మరెక్కడా జరగలేదు. అతివ్రష్టి, అనావ్రష్టితో రైతుల జీవితాలు సతమతమవుతున్నాయి. పంట చేతికి రాక... వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల తమ కుటుంబాలతో వలసలు పోయి కూలీ నాలీ చేసుకుంటున్నారు.     తాజాగా జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతులకు మేలు చేసేవిగా ఉన్నాయి. ఇది పూర్తిగా రైతుల జీవితాలను మారుస్తుందని చెప్పలేం కాని... కొంత మార్పు మాత్రం వస్తుంది. ఈ కీలక సమావేశంలో వ్యవసాయం, విద్య, ఫుడ్ ప్రాసెసింగ్, సామాజిక భద్రత వంటి సేవలపై మినహాయింపులు ఇవ్వడం శుభ పరిణామంగానే చూడాలి. మరో పది నెలల కాలంలో దేశంలో ఎన్నికలు రానున్నాయి. దీనికి ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా విషయంలో  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నట్లు అయ్యింది. ఆ వేడి ముందు ముందు మరింత ఎక్కువవుతుందని, ప్రజలను ప్రసన్నం చేసుకుందుకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు కూడా ఇక జిమ్మిక్కులు చేయడం ప్రారంభిస్తాయి.     ధికారంలో ఉన్న వారు ధరలు తగ్గించడం.... కొత్త కొత్త ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టడం వంటివి ప్రారంభిస్తారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం తాము అధికారంలోకి వస్తే మరిన్ని చేస్తామంటూ వాగ్దానాలు గుప్పిస్తాయి.  ఏది ఏమైనా సామాన్యుడికి మాత్రం రానున్న కాలమంతా ఒకింత మంచిగానే ఉండేట్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల పాటు ఏలికలు తమ చేతలతో పెట్టిన ఇబ్బందులను ఏడాది పాటు నిలిపివేసి ప్రజలకు ఊరట కలిగించడం... మరో నాలుగేళ్ల పాటు వారిని కష్టాలు పాలు చేసేందుకే దేశ ప్రజలకు తెలుసు. అయినా అల్ప సంతోషులైన ప్రజలు రాజకీయ నాయకుల ఉచ్చులో పడడం షరా మామూలే.
  అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మోదీ గెలిచారు. మరి రాహుల్ గాంధీ, చంద్రబాబులు? వాళ్లు ఓట్ల సంఖ్యతో చూస్తే ఓడిపోయినట్టే! కానీ, అసలు నాలుగేళ్ల తిరుగులేని పాలనలో మోదీ ఇలా జనం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావటం? అది ప్రతిపక్షాల గెలుపే! ఆ విధంగా చూసినప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో బాబు సక్సెస్ అయినట్టే. ముఖ్యంగా, ఏపీ సీఎం జనానికి ప్రత్యేక హోదా ఎవరి వల్ల రావటం లేదో అర్థంమయ్యేలా చేయగలిగారు. హోదా, పోలవరం లాంటివి కేవలం కేంద్రం ఉదాసీనత వల్లే ఆగిపోవటం, మందగించటం జరుగుతోందని ఓటర్లు గ్రహించేలా చేయగలిగారు. దీని ఎఫెక్ట్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది!     అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ప్రత్యేక హోదా రాదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రాజకీయ ఛాణుక్యుడైన చంద్రబాబు ఆ మాత్రం గ్రహించలేరా? ఆయనకూ హోదా రాదని తెలుసు. మోదీ ప్రభుత్వం కూలదనీ తెలుసు. కానీ, అసలు మొత్తం వ్యవహారం వెనుక లాభమేంటో కాస్త లోతుగా ఆలోచిస్తే మనకే తెలుస్తుంది! నిన్న మోదీ సభలో కేసీఆర్ ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అలాగే, చంద్రబాబుని తాను స్వయంగా వైఎస్ఆర్ సీపీ ట్రాప్ లో పడొద్దని హెచ్చరించానని చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ జనసేనాని కూడా తన ట్వీట్ల రాజకీయం నడిపారు! బీజేపీని తిడుతున్నట్టే ట్వీట్లు చేసి… టీడీపీకి తూట్లు పొడిచే వ్యూహం పన్నారు. తాజాగా పవన్ ట్వీట్లతోనూ , జగన్ ప్రెస్ మీట్లతోనూ చంద్రబాబుపై విరుచుకుపడుతూనే వున్నారు.     బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని చెప్పిన పవన్ టీడీపీ కూడా బీజీపీతో సమానమై ద్రోహం చేసిదంటూ అర్థం వచ్చేలా వ్యాఖ్యానాలు ఇచ్చారు! ఇక జగన్ మంగళవారం ఏపీ బంద్ అంటూ కొత్త అంకానికి తెర తీశారు. కీలకమైన అవిశ్వాస తీర్మానం చర్చలో తన ఎంపీలు ఎవరూ లేకుండా చేసి బీజేపీని కాపాడిన ఆయనే ఇప్పుడు చంద్రబాబును తూర్పార పడుతూ బంద్ అంటున్నారు! బందుల వల్ల జనం ఇబ్బందులు పడతారు తప్ప… లాభమేంటి? జగన్ కే తెలియాలి!     చంద్రబాబు మీద ఒకవైపు నుంచీ పవన్, మరో వైపు నుంచీ జగన్, ఇక ఇంకో వైపు నుంచీ ఎప్పటిలాగే బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరీ… ఇలా అంతా కలిసి ముప్పేట దాడి చేయటం దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల్లో టీడీపీ చేయాల్సిన ఒంటరి పోరుకి అవిశ్వాస తీర్మానం మరింత స్పష్టతనిచ్చింది. పైకి పవన్, జగన్ బీజేపిని నాలుగు మాటలంటున్నా ప్రధాన దాడి టీడీపీ మీదే చేస్తున్నారు. అది దిల్లీలోని కాషాయ నేతల డైరెక్షన్లోనే అన్నది బలపరీక్ష సందర్భంగా తేలిపోయింది. జగన్ తన ఎంపీల్ని ఉప సంహరించాడు. గతంలో మద్దతు కూడగట్టుకొస్తానన్న పవన్ ట్వీట్లతో టీడీపీనే దెప్పిపొడిచాడు. వీళ్ల వెనుక బీజేపీ కాక మరెవరు వున్నట్టు? అలాగే, టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని మెచ్చుకున్న మోదీ గులాబీ పార్టీని కూడా టీడీపీకి వ్యతిరేకం చేసేశారు! అంటే, 2019లో బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను, ఏపీ టీడీపీకి వ్యతిరేకంగా పవన్, జగన్ లను వాడుకోబోతందన్నమాట! అవిశ్వాసం తేల్చిన సత్యం ఇదే!     అంతా ఒక్కటై దాడి చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పక పోవచ్చు. రాహుల్ టీడీపీకి, ఏపీకి కాస్త మద్దతుగా మాట్లాడినా… హస్తం పార్టీతో కలిసి ముందుకు సాగటం టీడీపీకి పెద్దగా లాభమూ కాదు. మంచిది కూడా కాదు! కాబట్టి పసుపు సైనికులు ఇప్పట్నుంచే రానున్న కురుక్షేత్రానికి సర్వసన్నధ్దంగా వుండాలి. రాష్ట్రం రెండుగా చీలిన 2014లో కంటే వారికి 2019లోనే పెద్ద సవాలు ఎదురుకానుంది!  
అందరూ ఊహించినదే జరిగింది. అందరూ అనుకున్నదే కళ‌్లముందు ప్రత్యక్షమైంది. ఆంధ్రుల కనీస హ‍క్కులకు విఘాతం కలిగింది. దింపుడు కళ్లెం ఆశ నిరాశగానే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మిగిలిన చివరి ప్రయత్నానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సాక్షిగా మంగళం పాడింది. శుక్రవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ... అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు... యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసాయి. ఈ అవిశ్వాసానికి మద్దతుగా లోక్‌‌సభలో వివిధ రాజకీయ పార్టీలు సహకరిస్తాయని, కేంద్రం చూపుతున్న వివక్షను దేశం ముందు ఉంచవచ్చునన్న తెలుగుదేశం వ్యూహం కొంత వరకూ ఫలించింది. అయితే నెంబర్ గేమ్‌లో మాత్రం లోక్‌సభ సాక్షిగా ఓడిపోయింది.     534 మంది సభ్యులున్న లోక్‌సభలో 451 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు చేస్తే 325 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార బిజెపి కూటమిలో ఉన్న శివసేవ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒడిషాకు చెందిన బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసింది. మొత్తానికి సంఖ్య పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ లోక్‌సభలో విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, ఆవేద‌న‌లను జాతీయ స్థాయిలో తెలిసేలా చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులు పదేపదే చేబుతున్న వాస్తవాల‌ను ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు సభ ముందుంచడంలో సఫలమయ్యారనే చెప్పాలి. దీని ద్వారా జాతీయ స్ధాయిలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు పడేలా చేశారు.     ఇందుకు తెలుగుదేశం లోక్‌సభ సభ్యులను అభినందించాల్సిందే. లెక్కలే దేనికైనా గీటురాయిగా మారిన దశలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు, అక్కడి ప్రజలు లోక్‌సభలో అంకెల పరాజయాన్ని నైతిక విజయంగానే పరిగణించాలి. అవిశ్వాసంపై గెలుపోటములు ఎలా ఉన్నా ఆవేదన నిండిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన ప్రసంగం ద్వారా కాసింతైనా ప్రధాని స్వాంతన చేకూరుస్తారని అందరూ ఆశించారు. అయితే ప్రధాని ఆ పని కూడా చేయకపోవడం ఏపీ ప్రజల పట్ల ఆయనకున్న వివక్షకు తార్కాణం. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఇవి చేశాం... ఇవి చేస్తాం అని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ తమను వీడి ఎందుకు వెళ్లింది.... విభజన పాపం తమది కాదు అని చెప్పడానికే పరిమితం కావడం ఆయనకూ.... ప్రధాని పదవికీ తగింది కాదు. ప్రధాని ప్రసంగంలో ఎక్కడా సానుభూతి కాని, సహానుభూతి కాని కనిపించకపోవడం ఆ పార్టీకి ఏపీ ప్రజలపై ఉన్న నిర్లక్ష్యాన్ని, వారి నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు లభించే అవకాశాలున్నాయి.     ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తనను శత్రుపక్షం... ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పప్పు అని ఎగతాళి చేసినా తాను బాధపడనని చెప్పిన తీరు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అంతే కాదు తనపై ప్రధానికి అకారణ కోపం ఉందని, దానిని ఈ సభలోనే తొలగిస్తానంటూ సభలో అందరి ముందు ప్రధాని స్ధానం దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి కౌగలించుకున్న తీరు అందరినీ ఆశ్యర్యపరిచింది. రాహుల్ చర్యను అపరిపక్వ చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నా.... ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మాత్రం ప్రశంసిస్తున్నారు. ఇది రాహుల్ గాంధీలో రాజకీయంగా వచ్చిన ఎదుగుదలకు చిహ్నంగా గుర్తిస్తున్నారు.     ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం కలిసి వచ్చే చర్యగానే చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు లోక్‌సభలో రాహుల్ ప్రసంగం... ఆయన ప్రవర్తించిన తీరు కలిసి వస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఈ తాత్కాలిక విజయానికి సంబరాలు చేసుకోవడం కంటే సభలో వివిధ పార్టీలు తమను ఎండగట్టిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకుని తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్ అంత అందంగా ఉండదు. నియంతగా వ్యవహరించిన ఇందిరాగాంధీకే పాఠాలు నేర్పిన దేశ ప్రజలు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోదీకీ,  భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించడం తథ్యం.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఏపీకి కీలకం ప్రత్యేక హోదా. కానీ, దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ వార్ పైనే దృష్టి పెట్టాయి! ఎందుకంటే, మరి కొన్ని నెలల్లోనే మోదీ, రాహుల్ ప్రధాని పదవి కోసం తొలిసారి సమరానికి సై అనబోతున్నారు. ఇండియాలో అమెరికా లాంటి ప్రెసిడెన్షియల్ ఎన్నికలు వుండవు కాబట్టి చాలా వరకూ ప్రధాని ఎవరు కాబోతున్నారు అన్నది పెద్దగా ప్రాముఖ్యత వహించదు. కానీ, నెహ్రు, ఇందిర, ఇప్పుడు మోదీ లాంటి వారు వున్నప్పుడు పీఎం ఎవరో ముందే తెలిసిపోతుంది కాబట్టి వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. 2014లో అదే జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకవైపు మన్మోహన్ మళ్లీ ప్రధాని అని గట్టిగా చెప్పలేదు. రాహుల్ ని కూడా ప్రైమినిస్టర్ చేస్తామని ప్రకటించలేదు. అలాంటి సమయంలో బీజేపీ మోదీని తన ప్రధాని అభ్యర్థిగా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకుని ముందుకొచ్చింది. అదే కాషాయదళానికి, ఎన్డీఏకి కలిసి వచ్చి మోదీ వేవ్ కొనసాగింది. అయితే, 2019 ఎన్నికలు అందుకు భిన్నంగా వుండబోతున్నాయి!     ఆ మధ్య కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ నేను ప్రధాని పదవికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. అలా ఆయన స్వయంగా చెప్పటం అదే మొదటి సారి. అయితే, ఇప్పుడు చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం పరోక్షంగా రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టగలిగింది. తన సుదీర్ఘ ప్రసంగంలో ఎప్పటిలా పెద్ద పెద్ద తప్పులు ఏం మాట్లాడలేదు రాహుల్. గతంలో కన్నా ఆరోపణల్లో పరిణతి కూడా కనబరిచాడు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఆయన నాలుగేళ్ల ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టాడు. ఒక విధంగా రాహుల్ రోజు రోజుకు ఎదుగుతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే, బీజేపీ వారు, బీజేపీ అభిమానులు, మోదీ భక్తులు సోషల్ మీడియాలో అన్నట్టు రాహుల్ ని పప్పు అనటం ఇక మీదట కాస్త కష్టమే. ఆయన మరీ అపర చాణుక్యుడైన రాజకీయ నేత అయిపోయాడని చెప్పలేకున్నా… మోదీకి ప్రస్తుతం కనుచూపు మేరలో వున్న ప్రత్యర్థి రాహులే అయ్యాడు!     వచ్చే ఎన్నికల్లో మోదీకి 2014లో లాగా స్వంత మెజార్టీ రాకుంటే తాము ప్రధానులు అయ్యేందుకు బీజేపీలోనే చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎన్డీఏలోని పక్షాలు మోదీని తిరస్కరిస్తే పీఎం అయ్యే కలల్లో చాలా మంది కాషాయ నేతలున్నారు. వార్ని పక్కన పెడితే ప్రస్తుతం లోక్ సభలో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా లేని మాయవతి నెక్ట్స్ పీఎం అవ్వాలని భావిస్తున్నారు. ఆమెలాగే మమతా బెనర్జీ, శరద్ పవార్, ములాయం, మన కేసీఆర్ … ఇలా చాలా మందే ప్రధాని పదవి రేసులో వున్నారు. అయితే, వీరికి అవకాశాలు ఎంతగా వున్నాయి? అదే విషయాన్ని తేల్చేసింది తాజా అవిశ్వాస తీర్మానం! అవిశ్వాస తీర్మానం సందర్భంగా అందరి దృష్టి రాహుల్ మీదే పడింది. ఆయన మోదీపై చేసే ఆరోపణలు ఏంటనే ఎదురు చూశారు. తానే ఆ మధ్య అన్నట్టు భూకంపం పుట్టిస్తాడా అని ఆశించారు! భూకంపం అయితే రాలేదుగాని… పార్లమెంట్లో నవ్వులు పూశాయి! తన ప్రసంగం అయ్యాక మోదీ వద్దకెళ్లి రాహుల్ ఆలింగనం చేసుకున్నాడు! ఇది మోదీతో సహా అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనని పప్పు అని ఎగతాళి చేసినా సరేనంటూ రాహుల్ మోదీ వద్దకెళ్లి ఆలింగనం రాజకీయం చేశాడు! ఇది నిజంగా ఆశ్చర్యకరమే! అంతకంటే ఎక్కువగా మారుతున్న రాహుల్ వ్యక్తిత్వానికి సూచిక!     రాహుల్ అవిశ్వాస తీర్మానం గురించి చేసిన ప్రసంగం రేపటికల్లా అందరూ మరిచిపోవచ్చు. కానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న ట్రెండ్ మాత్రం అందరూ గమనిస్తున్నారు. ప్రాంతీయ నేతలు ఎందరు  పీఎం రేస్ లోకి వచ్చినా మోదీ తరువాత నెంబర్ టూగా వుంటోంది రాహులే! మరి ఆయన మోదీని వెనక్కి నెట్టి పీఎం అవుతారా? లేదంటే మరో అయిదేళ్లు కూడా మోదీని విమర్శిస్తూ, ఇలాగే ఆలింగనం చేసుకుంటూ జనంలో తనని తాను సీరియస్ పొలిటీషన్ గా ప్రూవ్ చేసుకుంటారా? 2019 ఎన్నికల ఫలితాలు వచ్చే నాటిదాకా మాత్రం వేచి చూడాల్సిందే! 
లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లక్ష్యంగా.... దేశంలో పేరుకుపోయిన ఇతర సమస్యలనూ ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం అనూహ్యంగా అంగీకారం తెలిపింది. ఎవరూ ఊహించని ఈ పరిణామానికి బీజేపీ వ్యూహాతక్మంగా తెర తీసింది. తొలుత పది రోజుల్లో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం 24 గంటలలోపే శుక్రవారం నాడు చర్చకు అనుమతించడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే నేటి అంశాన్ని విపక్షాలు పాలకపక్షం ముందు చూపించి న్యాయం చేయమని కోరే అవకాశం ఉంది.  విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం చేసే యత్నాలకు ఇలాంటి సంఘటనలు అడ్డుకట్ట వేస్తాయి.     సరే, యుద్ధం ప్రారంభమైంది. సమర సమయం కూడా నిర్ణయం అయిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభ వేదికగా చర్చ ప్రారంభమవుతుంది. మొత్తం ఏడు గంటల పాటు ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వివిధ పార్టీలు సభలో చర్చిస్తాయి. లోక్‌సభలో పార్టీల బలాబలాలను బట్టీ ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించారు. సభ నియమాల ప్రకారం ఇది పద్దతే అయినా.... సమస్య పరంగా చూస్తే మాత్రం ఈ సమయ పాలన ఆంధ్రప్రదే‌శ్‌కు రుచించదు. ప్రత్యేక హోదాపై అట్టుడికిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లోక్‌సభలో వెల్లడించేందుకు రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి దక్కిన సమయం కేవలం 13 నిమిషాలు. ఈ కాస్త సమయంలోనే మొత్తం ఆవేదనంతా సభలో చెప్పుకోవాలి. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం 38 నిమిషాలు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని చూడడం మంచి పరిణామం. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ లోక్‌సభ సభ్యులకు ఇచ్చిన సమయం 9 నిమిషాలు. ఈ సమయంలో వారు ప్రత్యేక హోదా కంటే కూడా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిప‌క్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు రాజీనామా చేయ‌డంతో వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు.      ఈ ఏడు గంటల చర్చ అనంతరం అధికార పక్షానికి సమాధానం ఇచ్చుకునే సమయం చర్చకు కేటాయించిన సమయంలో సగం కంటే ఎక్కువే. అంటే ప్రతిపక్షాలు గంట సేపు సమస్యపై ప్రస్తావిస్తే అధికార పార్టీ మాత్రం దానికి మూడు గంటలకు పైగా సమాధానం ఇస్తుంది. దీనినే వడ్డించే వారు మనవారైతే అంటారు. అవిశ్వాసంపై విజయం అధికార పక్షానిదే అని తేలిపోయింది. సభలో వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికార పక్షానికి మిత్రపక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడిఎంకే, బిజేడీ వంటివి అవిశ్వాపానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి.     ఇందులో అన్నాడిఎంకే అయితే తమ సభ్యులు విధిగా సభకు హాజరుకావాలనే విప్‌ను కూడా జారీ చేయలేదు. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య. దీంతో మాకేంటి అని ఆ పార్టీ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఇంచుమించు ఇదే ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేసింది. దీంతో ఈ రెండు పార్టీలూ అధికార పక్షం వైపు చేరిపోయినట్లే. ఇక ఒడిషాలోని బిజేడీ అయితే తాము ఓటింగుకు దూరం అని ప్రకటించింది. శివసేనతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నెరపిన దౌత్యం ఫలించినట్లు కనిపించడం లేదు. ముందు సరే అన్నా... అర్ధరాత్రి శివసేన పులి ప్లేటు మార్చింది.      ఓటింగ్‌పై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానం పెట్టిన తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న కాంగ్రెస్ ఓటు వేస్తాయి. వీరికి మద్దతుగా వామపక్షాలు, మమతా బెనర్జీ, అమ్ ఆద్మీ వంటి పార్టీలు బాసగా నిలుస్తాయి. అయితే వీరి సంఖ్యాబలం తక్కువ కాబట్టి తీర్మానం వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ ముందుగా చర్చను ప్రారంభిస్తుంది. ఇందులో కూడా ఆ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ముందుగా తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని మాట్లాడతారని ప్రకటించారు. అనూహ్యంగా ఆయన స్ధానంలో గల్లా జయదేవ్ వచ్చారు. దీంతో నాని అనుచరుల్లో కోపం, అసహనం ప్రారంభమైంది. కేశినేని నాని కూడా పైకి తమ నాయకుడు చెప్పినట్లే చేస్తామని ప్రకటించినా లోలోపల ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇక సభకు  రానని భీష్మించుకున్న అనంతపురం ఎంపీ జె.సీ.దివాకర్ రెడ్డి అలక వీడారు. ఆయన అనుకున్నది సాధించుకుని శుక్రవారం సభకు హాజరవుతానని ప్రకటించారు. అంతే కాదు... కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నేడు తేలనుంది. ఈ అంశపై చర్చ అనంతరం ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారో... ఎవరిని తిరస్కరిస్తారో  తేలిపోతుంది.
Whenever there is a significant technological advancement, it generates debate over the change - whether it’s “good” or “bad.” One such sensitive topic is that of social media. Internet-based, social media tools like email, Facebook, and YouTube have revolutionized the way human beings get information and communicates or interacts with one another. In a short span of time, social media has had some very positive effects in terms of empowering and connecting people. At the same time, they have provided new platforms for some decidedly unhealthy and destructive behaviors.     One of the biggest advantage of social media is that it nurtures relationships. Improving communication and strengthening human connection is the reason social media emerged. Facebook, Twitter, Instagram, Snapchat, chat groups, LinkedIn, and countless other social networking sites help people build relationships and making new friends. Regardless of where a person lives, it’s possible to find others who share the same interests and concerns. Social Media offers certain advantages like: 1. Anonymity - Many people find it easier to share problems and feelings openly when there’s minimal risk of identification or “real-life” consequences. 2. 24/7 availability - The internet never sleeps, and with the prevalence of cell phones, you don’t even need to be home at your computer to access the resources you need. In the event of a crisis, this can truly be life-saving. 3. No geographic limitations - Location can be an obstacle for participating in traditional support groups that require physical attendance. Online groups pull members from all over and can host larger numbers of people, adding to the pool of knowledge and experience.     The internet and social media boost productivity. These tools offer more information— including real-time news—than a library full of encyclopedias, and the information’s accessible at any time of day or night. Studies have linked internet/social media use with greater success in academics as well as improved job performance and employment prospects. Social media gives small business owners the power to be more competitive with larger companies. By simply creating and maintaining a Linkedln account they can reach a wider audience, share press releases and other company news, connect with job seekers, and more.   Ultimately, whether social media is “good” or “bad”/“healthy” or “unhealthy”, is directly related to how they are used. Key to enjoying the benefits while avoiding the problems is to use these powerful tools sensibly, constructively, and in moderation. Like food, which we truly can’t live without, the right choices in the right amounts keep people healthy and satisfied, while poor choices and excess consumption can lead to significant, potentially life-threatening health conditions.  
  ఒక ప‌న్నెండేళ్ల పిల్ల‌వాడు ఏదో ఘోర‌మైన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని కుడి చేయి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్ల‌వాడికి చిన్న‌ప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను క‌రాటేలో గొప్ప ప్ర‌తిభావంతుడిని కావాలన్న‌దే ఆ కోరిక‌! కానీ ఇప్పుడేం చేసేది? త‌న కుడి చేయి ఇక క‌రాటేకి స‌హ‌క‌రించ‌దు క‌దా! అయినా ఆశ చావక తన బ‌డిలో ఉంటున్న క‌రాటే మాస్ట‌రు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.   `నేను ఇంక జీవితంలో క‌రాటేని నేర్చుకోలేమోన‌ని అనిపిస్తోందండీ` అన్నాడు బాధ‌గా. ఆ మాస్ట‌రుగారు ఒక్క‌నిమిషం ఆలోచించి `నీలో క‌నుక నిజంగా ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప‌కుండా క‌రాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రేనా!` అని అన్నాడు. `నా చిన్న‌ప్ప‌టి కోరిక‌ను నెర‌వేర్చుకునేందుకు నేను ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్ల‌వాడు. మ‌రుస‌టి రోజు నుంచి పిల్ల‌వాడు రోజూ క‌రాటే మాస్టరుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్ట‌రు రోజూ పిల్ల‌వాడికి ఒక‌టే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే ప‌ని. అదే కదలిక‌ని అభ్యాసం చేసీ చేసీ పిల్ల‌వాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒక‌టే ర‌కం భంగిమ‌తో అత‌నికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాట‌కి క‌ట్టుబ‌డి ఊర‌కుండిపోయేవాడు. కొన్నాళ్ల‌కు ఇంక ఉండ‌బ‌ట్ట‌లేక `కరాటే అంటే ఇంతే కాదు క‌దా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలిక‌నే సాధ‌న చేస్తూ ఉండు. చాలు!` అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడ‌కుండా అదే భంగిమ‌ను సాధ‌న చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండ‌గా కొన్నాళ్ల‌కి ఆ బ‌డిలో కరాటే పోటీలు మొద‌లుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీల‌లో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమ‌న‌తోనా!` అంటూ ఉక్రోషంగా బ‌దులిచ్చాడు పిల్ల‌వాడు.   గురువుగారు ఓ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్ల‌వాడు త‌న‌కి పోటీలో ఎదుట‌ప‌డిన ఇద్ద‌రు ప్రత్యర్థుల‌నీ చాలా తేలికగా మ‌ట్టి క‌రిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మ‌రింత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఎదురుపడ‌సాగారు. కానీ ఎలాగొలా చివ‌రిక్ష‌ణంలో అయినా వాళ్ల‌ని ఓడించగ‌లిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అత‌నిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివ‌రికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అత‌నే విజేత‌గా నెగ్గాడు. `గురువుగారూ! జ‌రిగింది న‌మ్మ‌లేక‌పోత‌న్నాను. నేనీ ఒక్క క‌ద‌లిక‌తోనే విజ‌యాన్ని సాధిస్తాన‌ని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చ‌ర్యంగా. `మ‌రేం లేదు! నీకు నేర్పిన ఈ క‌ద‌లిక క‌రాటేలోనే చాలా క‌ష్ట‌మైన‌ది. అందుక‌ని చాలామంది దాన్ని నేర్చుకోవ‌డానికి వెనుకాడ‌తారు. ఇక‌పోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బ‌లంగా ఎడ‌మ‌చేత్తో పోరాడ‌లేరు. అందుక‌నే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజ‌యాల‌ను సాధించ‌గ‌లిగావు` అన్నారు గురువుగారు. ఎంత‌సేపూ త‌న బ‌ల‌హీన‌త గురించి ఆలోచించే ఆ పిల్ల‌వాడు, ఆ బ‌ల‌హీన‌త‌ని సైతం బ‌లంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.  
మీరు నా లాంటి వారయితే chocolates తినడానికి ఇష్టపడతారు. కానీ ఏ చాక్లెట్. అవును నేను dark chocolate  గురించి మాట్లాడుతున్నాను.  Dark chocolates గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. 1. Dark Chocolatesలో Fiber, Iron, Magnesium, Copper, Manganese ఇంకా చాలా రకాలైన Minerals ఉంటాయట.  2. Dark Chocolateలోని Flavonols చర్మాన్ని సంరక్షించడంతోపాటు Sun Damage నుండి కాపాడతాయట. 3. దీనిలోని Caffeine And Theobromine, Brain Functioning ని Improve చేయటంలో ఎంతో దోహద పడతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. 4. Dark Chocolatesలో చాలా రకాలైన Antioxidants ఉంటాయట. ఇవి మిగిలిన Foods లో కంటే దీనిలో ఎక్కువగా లభిస్తాయని చెబుతున్నారు.   5. ఎవరైతే Dark Chocolates తీసుకుంటారో వారిలో గుండె జబ్బులు వచ్చే లక్షణాలు తక్కువ గా వుంటాయని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. So,  మరి ఇంకా ఆలస్యం దేనికి మనం కూడా మన Daily Life లో Dark Chocolate ని ఒక భాగం చేసేద్దాం రండి !!    
మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? అనే యాడ్ చూసి స్ఫూర్తి పొందారో ఏంటో.. కొందరు స్మగ్లర్స్ మా పేస్ట్ లో బంగారం ఉంది అంటున్నారు.. స్మగ్లర్స్ దొరికిన ప్రతిసారీ వీళ్ళ తెలివితేటలు ఏంట్రా బాబు అని అవాక్కవుతాం.. ఈ తెలివి తేటలేదో సక్రమంగా ఉపయోగించి బాగుపడొచ్చుగా అని తలపట్టుకుంటాం.. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది.     డీఆర్‌ఐ వర్గాల కథనం ప్రకారం, కొలంబో కేంద్రం గా కొందరు స్మగ్లర్లు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు బంగారం తరలిస్తున్నారని సమాచారం అంది.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మదురై మీదుగా శంషాబాద్‌కు వచ్చిన విమానంలోంచి దిగి ఎయిర్‌పోర్టు వెలుపలికి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు.. ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని సోదా చేశారు.. అతని వద్ద పేస్టు రూపంలో ఉన్న కెమికల్‌ మిశ్రమంలో పొడిగా చేసి ఉన్నబంగారాన్ని కనుగొన్నారు..అయితే 1,800 గ్రాములు బరువున్న ఆ పేస్ట్ ని కరిగించగా.. 1,120 గ్రాముల బంగారం వచ్చినట్టు తెలుస్తోంది.. మొత్తానికి స్మగ్లర్ ఎంత తెలివిగా వచ్చాడో, అధికారులు అంతే తెలివిగా అరెస్టు చేశారు.
అవిశ్వాస తీర్మానం బీజేపీని ఎంత దెబ్బ తీసిందో తెలీదు కానీ, కాంగ్రెస్ లో మాత్రం విశ్వాసం పెంచింది.. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. తాజాగా రాహుల్‌ గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది.     నరేంద్ర మోదీ సర్కారును గద్దె దించి, రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిపై అధిష్టింపచేయడమే పార్టీ లక్ష్యమని సీడబ్ల్యూసీ తీర్మానించింది.. రాబోయే ఎన్నికల్లో 200కుపైగా సీట్లు సాధించి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచేందుకు పోరాడాలని నిర్ణయించింది.. ఎన్నికలకు ముందు, తర్వాత ఏయే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలో, ఎవరెవరితో చర్చలు జరపాలో నిర్ణయించే బాధ్యతను రాహుల్ కే అప్పగించింది.. అలానే పది కీలక అంశాలపై పోరాడాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.. వాటిల్లో ఏపీ ప్రత్యేకహోదా అంశం కూడా ఉండటం విశేషం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పూర్తిగా కట్టుబడి ఉందని కమిటీ తీర్మానించింది.. కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేసింది.. అయితే ఒడిసా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ బిహార్‌తోపాటు తమ రాష్ట్రం కూడా వెనకబడి ఉన్నాయని, వాటికి కూడా ప్రత్యేక హోదా కల్పించే విషయంపై పోరాడాలని సూచించారు.. ఈ విషయంపై స్పందించిన సోనియాగాంధీ 'రాష్ట్ర విభజనతో ఏపీ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.. దానికి అన్యాయం జరిగింది.. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని హామీ ఇచ్చాం.. ఆ రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలను పోల్చేందుకు వీలు లేదు' అని స్పష్టం చేశారు.. అదే విధంగా రాహుల్ మాట్లాడుతూ 'నిర్దిష్ట పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని.. దానికి కట్టుబడి ఉన్నామని.. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు' అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న సభలో అప్పటివరకు బీజేపీపై దుమ్మెత్తి పోసి, అనంతరం మోదీని ఆలింగనం చేసుకోవటం అందరికి తెలిసిందే.దీనిపై ఆ పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ద్వేషాన్నివ్యతిరేకిస్తుందని అందుకే "మీరు ద్వేషించినా.. మేము ప్రేమిస్తున్నామన్న" సందేశం తెలియజెప్పటానికే కౌగిలించుకున్నారని తెలిపారు.   నిన్న లోక్‌సభలో తెరాస అనుసరించిన వ్యవహార శైలిని అందరూ గమనించారన్న ఉత్తమ్‌, కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌ అని, నిన్నలోక్‌ సభలో తెరాస, భాజాపా దోస్తీ  బయటపడిందని అన్నారు. అసెంబ్లీలో మోదీని విమర్శించొద్దని చెప్పిన వ్యక్తి కేసీఆరే అని గుర్తుచేశారు. ముస్లిం రిజర్వేషన్లపై తెరాస లోక్‌సభలో ఎందుకు నిలదీయాలేదన్నారు. ముస్లింల పట్ల ప్రేమ నటించే కేసీఆర్‌.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు అడగకుండా, నాలుగేళ్ల తర్వాత అడగడమేంటని నిలదీశారు.  
  పరిశోధనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు కాఫీ మంచిదని ఓ పరిశోధన చెబుతుంది. సరే మంచిదే కదా అని ఓ లోటాడు కాఫీ తాగేందుకు సిద్ధపడిపోతే... మర్నాడే కాఫీ మంచిది కాదని ఇంకో పరిశోధన వస్తుంది. మద్యం సంగతి కూడా ఇంతే! మందు మంచి కాదని ఓ పరిశోధన చెబితే... కాదని మరోటి చెబుతూ ఉంటుంది. కానీ ఈమధ్యకాలం మందు గురించి పరిశోధకులకి ఓ క్లారిటీ వచ్చేసిందండోయ్‌!   లిమిట్‌లో ఉంటే మందు వల్ల నష్టాలకంటే లాభాలే ఎక్కువగా ఉంటాయని చాలా పరిశోధనలు చెప్పుకొస్తున్నాయి. ఏకంగా మందు తాగనివాళ్లకంటే తాగేవాళ్లే ఎక్కువకాలం బతికేస్తారని ఓ రిపోర్ట్‌ కూడా వచ్చింది. ఇదంతా ఓ ఎత్తైతే ఇప్పుడు మందు వల్ల మగవారిలో ఫెర్టిలిటీ కూడా పెరుగుతుందని తేలింది. ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.     మందుకీ మగవారి వీర్యానికీ మధ్య సంబంధం తేల్చేందుకు వీళ్లు ఓ 323 మందిని ఎన్నుకొన్నారు. వీళ్లలో 10 శాతం మంది అసలు మందు అలవాటు లేనివాళ్లు. మరో 30 శాతం మంది వారానికి ఆరుపెగ్గులు పుచ్చుకునేవాళ్లు. ఇంకో 30 శాతం మంది వారానికి పది పెగ్గుల దాకా పుచ్చుకుంటారు. మిగతావాళ్లకి వారంలో ఓ పన్నెండు పెగ్గులు మించి పుచ్చుకునే అలవాటు ఉంది.   కొన్నాళ్ల తర్వాత చూస్తే వీళ్లలో కాస్త మోతాదులో... అంటే వారానికి పది పెగ్గుల దాకా పుచ్చుకునేవారిలో వీర్యం కాస్త ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు తేలింది. అంతేకాదు! వీరిలో వీర్యకణాలు కూడా ఎక్కువగా కనిపించాయి. దీనికి కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, హద్దులు దాటకపోతే ఏ అలవాటైనా చెడు చేయదని మాత్రం తేలిపోయింది. - SURYA
  For people who are extremely obese Bariatric Surgery is a boon says science. But who should undergo Bariatric Surgery and is it safe, Dr. Sharath Chandra clarifies....  https://www.youtube.com/watch?v=FFjuE_WJ7hI  
  The thought of getting back home and doing all the household chores is my biggest nightmare! How many of you feel the same? Almost all of us feel the same – Right? About 40 – 43% of workers report feeling tired after work. Let us try to decode this nightmare of low energy or feeling fatigued. Too little sleep and too much stress are the two major reasons for this says a research. The irony is that, the cycle only drags down your overall productivity, your health and happiness. Want more energy – Here are some things which I have started doing and hope it helps all of you too. “It’s always YOU first” – Be Good to Yourself! We generally tend to take too much stress, saying yes to everyone – just to maintain cordial relations with our colleagues and later scrambling around to get it all done at the right time. It's hard not to be exhausted when you put yourself in that position. I have to remind myself that my to-do list is arbitrary and sometimes, rest needs to be bumped to the top. Good Food for energy I have often heard my friends discussing – skip food to lose weight, but remember blood sugar levels greatly affect energy levels. So, if your energy is draining after work, chances are you haven't fueled yourself properly during the day. The best fuel comes from whole grains, fruits and vegetables. Eat a healthy breakfast, pack a lunch, and bring nutritious snacks to fight the drowsy afternoon crash. If your blood sugar's stable, your energy levels will be more stable.  Not only your Smartphone – But your body also needs to be reset! If you are sleep deprived, a short nap can significantly improve your energy levels — and help you pay back some of the sleep debt you've been accumulating. I say a short nap because while it may be tempting to pass out for hours, instead of feeling energized you will end up becoming a zombie. In other words, it'll make you feel more tired. A study by NASA has found out that the ideal nap time for improving alertness and energy was 20 to 25 minutes. (While pondering over this point I remembered my colleague who used to tell me this – and I used to end up laughing. Today I have realized she was right) It’s not the computer – But your Brain needs to be turned off! When you feel exhausted, the word exercise seems like a punishment, isn’t it? Most of us in the recent times work in front of the computer where we use only our muscles all throughout the day typing emails, answering the telephone and sometimes turning your head to gaze longingly out the window thinking when will I go out of this work place. If you feel tired, that means the chances are that your brain is fatigued and not your body. So next time when you feel fatigued, turn off your brain, and do something that gets your blood pumping. It'll energize you immediately, and also improve your health and help you sleep better. Stop high Caffeine intake! Don’t worry – I will not tell you to cut caffeine out entirely since I am a caffeine addict too and all of us are aware that moderate caffeine intake can help you live longer. Excess intake of caffeine will surely help you in being awake but over a period of time it can cause insomnia, restlessness, irritability and upset your stomach. So next time onwards, when you are going to rely on coffee to complete your work remember these points. These suggestions seems very simple right? Yes – they surely are but changing habits is hard, even when we want to. Try incorporating these changing slowly and you will surely agree that it’s not the body that is fatigued but the brain is fatigued. If you could relate yourself with these points – do not forget to comment below and let me know that even you are my companion in feeling fatigued and running out of energy.