LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
Akkineni Akhil’s second movie Hello final theatrical worldwide business ends at 19.6 crores. The film’s theatrical rights valued 32 crores, which mean it recovered only 62% of investment. Final verdict is, the film is a disaster at box office. Although the Vikram Kumar directed film received positive reviews from critics, BO performance was not up to the mark. Here is Hello final worldwide shares list: Area      Business (In Crores) Nizam – 6.18 Ceded – 2.40 UA - 1.55  East - 0.75 West - 0.70 Krishna – 1.00 Guntur - 1.33 Nellore - 0.55 Total 14.46 Cr Karnataka – 1.60 USA – 2.88 Rest Of The World – 0.66 Total (WW) – 19.60
Rebel Star Krishnam Raju wished to direct his nephew Prabhas in a film. The veteran actor cum filmmaker even registered a title “Okka Adugu” for the film. Apparently, Prabhas is not keen on doing the film. Instead, the young rebel star has agreed to do a film under Krishnam Raju’s home production of Gopikrishna Movies. Today on the eve of his birthday, Krishnam Raju announced to make a film with Prabhas. Radhakrishna Kumar of Jil fame will direct this movie which will go on floors from April, this year. So, Prabhas will work simultaneously for Saaho and this new project. On the other hand, Okka Adugu has been shelved. Prabhas is said to be not willing to work under the direction of Krishnam Raju. Sources inform that the story narrated by Krishnam Raju was outdated. So, Prabhas told him to better shelve the project, so he would allot call sheet for a film under his production house.
నడమంత్రంగా హీరోలైన వారి సంగతి పక్కన పెడితే.. కష్టపడి పైకొచ్చే ఏ హీరో అయినా.. వృత్తిని దైవంగానే భావిస్తాడు. అందుకు ఎగ్జాంపుల్ గా ఓ ముగ్గురు హీరోల గురించి చెప్పుకుందాం.  ముందు చిరంజీవి... సినిమా షూటింగ్ మొదలైన తొలి రోజు కెమెరాకు హారతి ఇవ్వడం పరిపాటి. తర్వాత ఆ హారతి సెట్ లో అందరూ అందుకుంటారు. చిరంజీవి కూడా అలాగే అందుకుంటారు. కానీ.. ఆయన మేకప్ లో ఉన్నారనుకోండీ... హారతిని దగ్గరకు కూడా రానీయరు. హారతి తీసుకొని ఆయన దగ్గరకు రావడానికి కూడా టెక్నీషియన్స్ భయపడతారు. కారణం.. హారతి తీసుకోవడం ఇష్టం లేక కాదు. హారతి హత్తుకుంటే.. ఆ వేడికి ఖరీదైన ఆయన మేకప్ కరిగిపోతుందని ఆయన భయం. మిగిలిన హీరోలు మేకప్ లో కూడా హారతి తీసేసుకొని.. మేకప్ కోసం మరో అరగంట సమయం వృధా చేస్తారు. కానీ.. మెగాస్టార్.. ఆ అరగంట కూడా వేస్ట్ కానీయరు. ఆయనకు పనిని మించిన దైవం లేదు. మేకప్పే ఆయనకు తొలి దైవం. ఆ తర్వాతే ఏదైనా.. అందుకే... ఆయన మెగాస్టార్.  తర్వాత మోహన్ లాల్ షూటింగుల్లో.. దర్శకుడు కుర్చీ దర్శకుడికీ.. హీరో కుర్చీ హీరోకీ.. నిర్మాత కుర్చీ నిర్మాతకీ.. ఇలా ఎవరికి కుర్చీ వారికి కేటాయించి ఉంటుంది. 24 శాఖల సాంకేతిక నిపుణులందరూ సెట్ ప్రాపర్టీనీ... కెమెరాలనూ క్రేన్ సామాగ్రినీ.. మోస్తూ నానా యాతన పడుతుంటే... వీళ్లు మాత్రం దర్జాగా కుర్చీల్లో కూర్చొని షాట్ గ్యాప్ లో కబుర్లు చెప్పుకుంటుంటారు. ప్రతి లొకేషన్లో జరిగేది అదే. కానీ.. మోహన్ లాల్ సినిమా షూటింగ్ లో అలా జరగదు. ఆయన అలా తీరిగ్గా కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పరు. టెక్నీషియన్లతో పాటు తాను కూడా షూటింగ్ సామాగ్రిని మోస్తూ.. వాళ్లకు సాయం చేస్తుంటారు. ఒక సూపర్ స్టార్ అలా ఒళ్లు వంచి పని చేస్తుంటే... మిగిలిన వాళ్లు తీరిగ్గా కూర్చోలేరు కదా. అందుకే.... మిగిలిన వారు కూడా లొకేషన్లో ఏదో ఒకటి చేస్తూ కనిపిస్తారు. అందుకే.. ఆయన సూపర్ స్టార్.  మన యంగ్ హీరో ప్రభాస్ కూడా లొకేషన్లో ఒళ్లు వంచుతాడంటండోయ్. ఈ మధ్య ఈ విషయం తెలిసింది. వీళ్లని మిగిలిన హీరోలు కూడా ఫాలో అయితే.. పని స్పీడ్ గా అయిపోతుంది. ఏమంటారు ఫ్రెండ్స్. 
తెలుగు నాట తొలి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అన్న విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత  ప్రాంతీయ పార్టీలు కొన్ని పుట్టుకొచ్చినీ... ఏవీ నిలబడలేదు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ మాత్రం బాగానే హల్ చల్ చేసింది. ఇప్పుడు వైయస్ ఆర్ సీపి. అయితే...చాలామందికి తెలీని విషయం ఏంటంటే...  ఎన్టీయార్ ‘తెలుగుదేశం’ తర్వాత... 80ల్లోనే మరో ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి తెలుగునాట పార్టీ  పెట్టాలనుకున్నారట. ఆ స్టార్ హీరోలను ‘పార్టీ పెట్టండి.. కలిసి పోటీ చేయండి..’ అని చాలామంది ప్రాధేయపడ్డారట కూడా. వాళ్లిద్దరూ కూడా పార్టీ పెట్టాలనుకున్నా... తర్వాత ‘రాజకీయాలు మనకు పడవులే.. ఆ భారాలను మనం మోయలేం లే’ అనుకుని వెనక్కు తగ్గారట.  ఇంతకీ ఆ సూపర్ స్టార్లు ఎవరు? అనేగా మీ ప్రశ్న. వారిలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ అయితే... మరొకరు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తెర వెనుక కూడా మంచి స్నేహితులైన వీరిద్దరూ అప్పుడు కలిసి పార్టీ పెడితే... అప్పటి రాజకీయ చిత్రపటం ఎంత మారేదో తెలీదు కానీ... కొంతవరకైతే ప్రభావం చూపించేవారేమో కదూ. ప్రస్తుతం తమిళనాట కూడా ఎక్కువ మంది కోరుకుంటోంది అదే.. రజనీకాంత్, కమల్ హాసన్ వేరే వేరుగా కాకుండా.. కలసి పార్టీని స్థాపించాలనీ.. కలిసే.. రాజకీయాలను ప్రక్షాళనం చేయాలని అందరి ఆకాంక్ష. చూద్దాం ఏం జరుగుతుందో. 
గ్యాంగ్‌ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య అభిమానులను ఒక ఛానెల్‌‌లో యాంకర్లు చేసిన ఓవర్ యాక్షన్ ఒళ్లు మండించింది. సూర్య హైట్ గురించి సెటైర్లు వేయడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు యాంకరమ్మలను నానా తిట్లు తిడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడంతో మరోసారి హీరోల హైట్ గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎంతోమంది హీరోలు ఉన్నా హైట్ విషయంలో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. నటనతో ఎంతగా మెప్పిస్తున్నప్పటికీ.. హైట్‌ను సాకుగా చూపి వారిని టార్చర్ చేసిన సందర్భాలు ఏన్నో. అంతెందుకు తెలుగునాట నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో.. డ్యాన్స్‌తో యంగ్‌ జనరేషన్‌లో ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్‌ను.. మానసికంగా కొట్టడానికి హైట్‌ చూసుకోని మాట్లాడాలంటూ యాంటీ ఫ్యాన్స్ వాదించేవారు. ఇది ఎంతకు వెళ్లింది అంటే ఒక సినిమాలో తన హైట్ గురించి మాట్లాడిన వారిని గుడ్డలూడదీసి కొడతా అని జూనియర్ డైలాగ్ చెప్పేంతగా.. అప్పటి నుంచి యాంటీ ఫ్యాన్స్ కాస్త తగ్గినట్లుగానే కనిపిస్తోంది. సరే అది వేరే విషయం.. అసలు హీరోలు అంటే ఆరడుగుల హైట్.. అదిరిపోయే పర్సనాలిటీ.. మంచి స్కిన్ టోన్ ఉండాలన్న పాత మాటను పక్కనబెట్టి.. హీరోకి నటనే కొలమానం అన్న వాదన నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో మళ్లీ హైట్ ప్రస్తావన రావడం సిగ్గు చేటు. ఇకనైనా ఇలాంటి పనికిమాలిన వాదనలు పక్కనబెట్టాలని పలువురు అంటున్నారు.
  మేళ తాళాలతో.. తప్పిట్లతో.. బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌. బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.. దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బరాత్‌లకు పెట్టింది పేరు. మొదట్లో ముస్లింలు మాత్రమే జరుపుకునే ఈ సంబరాన్ని రాను రాను అన్ని మతాలు, కులాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి. ఏదీ ఏమైనా అసలైన బరాత్‌లు చూడాలి అంటే ముస్లింల పెళ్లిళ్లలోనే చూడాలి. అయితే ఇక మీదట హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్‌లు కనిపించవు. తెల్లవారిందాకా బరాత్‌లు సాగడంతో పాటు అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ.. బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు రోడ్ల మీద వెళుతూ ఉంటే.. పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బరాత్‌లో కాల్పులు.. మరో బరాత్‌లో తల్వార్ ఆట కారణంగా ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింల వివాహా వేడుకల్లో బరాత్‌లు బ్యాన్ చేయడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే దిశగా కసరత్తులు చేస్తోంది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలని.. రాత్రి 12 గంటలు దాటితే ఫంక్షన్ హాల్స్ మూసే విధంగా చర్యలు చేపట్టనుంది.   అలాగే పెళ్లి విందులో గొప్పలకు పోకుండా పరిమితితో సాగే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్ బోర్డ్ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా 23వ తేదిన పోలీసులు, ఖాజీలు, మత పెద్దలతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమావేశం కానుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆచారాన్ని నిషేధిస్తే ఒప్పుకునేది లేదని కొందరు .. సాంప్రదాయం అనేది మనుషుల్లో ఆనందాన్ని నింపాలి కానీ.. మనుషుల ప్రాణాలు తీయడం.. సమాజాన్ని ఆటంకపరచరాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.
  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈ సారి కూడా అధికారం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్న వేళ.. అలా జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమని.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో వెలువడిన ఒక సర్వే రిజల్ట్.. టీడీపీకి షాక్‌ని.. వైసీపీకి మంచి బూస్ట్‌ని అందించింది. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలిపింది.   ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఏపీలో మరో పార్టీ లేదు కాబట్టి వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న టైంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   సర్వే నిర్వహించిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బీజేపీ పక్షపాతి అన్నది ఓపెన్ టాక్. సీట్‌లో ఎంతటి వారున్నా సరే తన వాగ్ధాటితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అర్నాబ్‌... 2014 ఎన్నికల సమయంలో మోడీని చేసిన ఇంటర్వ్యూతో తాను ప్రధానికి పరమ భక్తుడిని అని చెప్పకనే చెప్పాడు. తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ 335 సీట్లు సాధిస్తుందని చెప్పి బీజేపీ భజన చేసిన అర్నాబ్‌‌.. మరి అదే ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ‌ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు.   అందుకు తగ్గట్టుగానే నిధులివ్వమంటే ఇవ్వరు.. మా బాధలు మేం పడి పనులు పూర్తి చేసుకుంటుంటే మీకు ఎందుకు అంత నొప్పి అంటూ కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. మరి వాళ్లు తక్కువ తింటారా..? టీడీపీకి బలంగానే కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు కూడా మోడీతో తాడో పేడో తేల్చుకుంటారని.. ఢిల్లీ టూర్‌లో మొత్తం తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా సీఎం.. పీఎంలు గంటపాటు రాష్ట్ర సమస్యల గురించి చర్చించుకున్నారు.. నవ్వుతూ బయటకు వచ్చారు. తాము ఎంతగా ప్రయత్నిస్తున్నటికీ బాబును ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలు అర్నాబ్‌ను రంగంలోకి దించారట. తద్వారా ఎన్నికలు దగ్గరపడే లోగా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నీ దెబ్బ తీయాలన్నది కమల నాథుల మైండ్‌గేమ్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ గేమ్‌లో ఫస్ట్ స్టెప్‌‌లో భాగంగానే సర్వే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాడనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అయినప్పటికీ సీనియర్లు మోత్కుపల్లి, రావుల, ఎల్ రమణ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వర్థంతి వేళ మోత్కుపల్లి నర్సింహులు అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు.   ఎంతగా ప్రజల్లోకి వెళుతున్నా వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి తోడు.. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న గవర్నర్ గిరి ఇక దక్కే అవకాశం లేదు..? కనీసం రాజ్యసభకైనా పంపిస్తారా అన్న గ్యారెంటీ చంద్రబాబు నుంచి లేకపోవడంతో ఆయనలో కాస్త అసహనం పెరిగిందంటున్నారు. అందుకే తన దారి తాను చూసుకోవాలని మోత్కుపల్లి భావిస్తున్నారని.. దీనిలో భాగంగానే పార్టీ మారతానని చెప్పకుండా.. పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలంటూ కొత్తరాగం అందుకున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా నర్సింహులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాలేదు. అయితే నర్సింహులు నోటి వెంట విలీనం మాట రావడంతో తెర వెనుక ఏదో జరిగిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.   టీఆర్ఎస్ నుంచి ఆఫరైనా వచ్చి ఉండాలని లేదంటే.. ఎంత కష్టపడినా పార్టీ బండి నడవటం కష్టమేనని భావించి ఆ మాటలు అన్నారా అంటూ శ్రేణుల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించాల్సి ఉంది.. ఉదయం అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఆయనకు పార్టీ నాయకులు మోత్కుపల్లి మ్యాటర్‌ను చెప్పారట. ఆ మాట విన్న వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే నర్సింహులు వంటి సీనియర్ నేతే విలీనం పాట పాడటం వల్ల పార్టీ పరిస్థితిపై శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని.. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓపెన్‌గానే అంటున్నారు. మరి నర్సింహులుపై అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.. శ్రేణులకు ఏం సమాధానం చెబుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీ గురించి తగు జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బహిరంగానే అవి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మే నెల వరకూ గడువు తీసుకున్నట్టు తెలుస్తోంది   నిజానికి అవ్వడానికి మిత్రపక్షమైనా మోడీ ఏపీకి చేసింది పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగి.. తిరిగి... వాళ్లని అడిగి అడిగి సాయం చేయండయ్యా బాబు అంటే ఆ మాత్రం నిధులన్నా ఇచ్చారు. నిజానికి కేంద్రం విషయంలో చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నట్టే. నాలుగేళ్ల సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాలుగేళ్లే ఇచ్చారు.. ఇంకా ఈ నాలుగు నెలలు ఇవ్వడం పెద్ద మేటర్ ఏంకాదు. అంతకన్నా ఎక్కువ టైం ఇచ్చినా టీడీపీకే నష్టం. ఎందుకంటే ఇంకా ఎదురుచూపులు చూస్తే జనం టీడీపీని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా కావాలనే టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోతే..   అసలు సంగతేంటంటే.. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అయితే మే నెలలోపు  కర్ణాటకతో పాటు మరో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఉన్న సామర్ధ్యం ఏంటో.. బీజేపీ భవితవ్యం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచన అని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీతో ఇప్పుడే తెగతెంపులు చేసుకుంటే.. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉంటే.. రాష్ట్రానికి అందుతున్న ఈ పాటి సాయం కూడా అందదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఫలితాలు అటూ ఇటూ అయి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. టీడీపీ బయటకు వస్తుంది. మరి టీడీపీని కాదని.. బీజేపీ వైసీపీ తో చేయి కలిపి... ఇప్పుడు చెప్పిన సోది... హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో అయితే జనం లేరు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి మే వరకూ టైం తీసుకున్నట్టు వినికిడి. మరి అందుకేనేమో చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అన్నది. అంత ముందు చూపుతో ఆలోచిస్తారు కాబట్టే ఆయనకు ఆపేరు వచ్చింది.
  ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...   యాదృశ్చికమో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ మరోసారి మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు బయటపడింది. ఇప్పటికే మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు ఏంటో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సాక్షిగా ఏపీపై ఉన్న చిన్న చూపు బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పండుగల్లో.. కొత్త ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ. ఈ పండక్కి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లందరూ సొంతఊరుకు వచ్చి  ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఇక మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో.. తెలంగాణాలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో జరుపుకుంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఉంది. నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తమిళ్, కన్నడ, పంజాబీ వారి వారి భాషల్లో  వేరు వేరు భాషల్లో ట్వీట్ చేశారు. అలాగే మన ఏపీ ప్రజలకు కూడా చెబుతారు అని అనుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం మనల్ని మరిచిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని. అంతే మరోసారి మోడీకి ఏపీ అంటే ఎంత గౌరవం... ఏపీ ప్రజలంటే ఎంత మర్యాద.. అని అనుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే..రాహుల్ గాంధీ అయితే, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు. ఎందుకో తెలుసా... కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... మొత్తానికి రాజకీయ నాయకుల బుద్ది మరోసారి బయటపెట్టారు. అంతేకాదు మోడీకి కూడా ఏపీ ప్రజలపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపెట్టాడు. అంతేకాదు తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది మరి.
  సుప్రీంకోర్టు.. దశాబ్దాలుగా భారతదేశ న్యాయవ్యవస్థను భుజాలపై మోస్తూ.. సంచలన తీర్పులతో.. ఎందరో దోషులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి.. ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న సర్వోన్నత న్యాయస్థానం. కింది కోర్టులలో న్యాయం జరగని వారికి మనకు సుప్రీంకోర్టు ఉందన్న భరోసాని అందించింది అంటే సుప్రీంకోర్టు గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప సంస్థ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వతంత్ర్య భారత చరిత్రలోనే మునుపెన్నడూ జరగని పరిణామం ఇవాళ జరిగింది. న్యాయం చేయాలంటూ సుప్రీం జడ్జీల ముందు మనం నిలబడితే.. మీరే సుప్రీంను కాపాడాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని నడిపిస్తున్న న్యాయమూర్తులు దేశ ప్రజల ముందుకొచ్చారు.   ఒకేసారి నలుగురు జడ్జీలు ప్రెస్ మీట్ పెట్టి మరి సుప్రీంలో జరుగుతున్న అవతవకలను జాతికి తెలియజేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా ముందుకు వచ్చి.. "భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది.. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సుప్రీంలో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు.. గత కొద్ది రోజులుగా అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురుం చర్చించి.. పాలనా వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా కోరుతూ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం.. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం.. న్యాయమూర్తులుగా ఇలాంటి సమావేశం పెట్టడం బాధాకరమే అయినా.. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటూ" చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు పంపిన లేఖను మీడియాకు చూపారు.   ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలి సవ్యంగా లేదంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ జడ్జిలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించడం.. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అనుమానం సామాన్యులకు కలిగేలా చేసిందని భావిస్తున్నారు. మరోవైపు న్యాయమూర్తుల మీడియా సమావేశం కేంద్రప్రభుత్వ వర్గాల్లో సంచలనం కలిగించింది. వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. కేంద్రప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ సంక్షోభాన్ని చక్కదిద్దకపోతే.. దేశ ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థ సవ్యంగా పరిఢవిల్లేలా చేస్తున్న మూడు స్తంభాల్లో ఒకటిగా.. ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానానికి కలంకాన్ని తీసుకువస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  
ప్రేమ, ఈ పదం వింటేనే కొందరికి ఒళ్ళు పులకరిస్తే, మరికొందరికి జలదరిస్తుంది. ప్రేమ ఎంత మందికి కావాలి అంటే నో అని సమాధానం చెప్పే వాళ్ళు కనిపించరు. కానీ, అదే ప్రేమని పంచేవాళ్ళు ఎంతమంది అనే ప్రశ్న వచ్చినప్పుడు, చాలా తక్కువ మంది రియాక్ట్ అవుతారు. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే... డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో, సప్లై అంత తక్కువగా ఉంది. మన జీవితంలో మనకి చాలా ప్రేమ పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=cCMcgyrozj8  
సాధారణంగా మనకు భయం వేస్తే ఏం చేస్తాం. దాన్ని అణచివేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. అది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. ఒకవేళ, మనకి జాబ్ కోల్పోయే పరిస్థితి వస్తే ఎలా పేస్ చేస్తాం. ఉదాహరణకి, మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ లో కొందర్ని తీసేస్తున్నారు అని వార్త వచ్చింది అనుకోండి, ఫ్లోర్ ఫ్లోరంతా టెన్షన్ పడిపోతారు. కొందరు తాము ఆ లిస్ట్ లో ఉన్నామా అని భయపడుతుంటే, ధైర్యవంతులు మాత్రం తమకేం కాదని నార్మల్ గా ఉంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్ ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=aybrrLOmweA            
చాలా మంది యువకులు చిన్న వయసులోనే థైరాయిడ్, డయాబెటిస్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇవి కాకుండా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువవడం... తరచుగా తల నొప్పి రావడం అనేది చాలా కామన్ అయిపొయింది. ఒత్తిడి వల్ల కోపం, చిరాకు ప్రదర్శించడం చేస్తూ ఉంటాం. ఈ జనరేషన్ మొత్తం తీసుకుంటే హ్యాపినెస్ కి దూరం అయిపోతున్నారు. యూత్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం లేదు. మరి ఈ సమస్యని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=sptOILN5xOY
డయాబెటిస్ ఉన్న వాళ్లందరికీ థైరాయిడ్ వస్తుందా? అలా ఖచ్చితంగా వస్తుంది అని ఏం లేదు కానీ, చిన్న వయసులో డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. డయాబెటిస్ మూలంగా ఆంటీ బాడీస్ శరీరంలోని అవయవాలు దెబ్బ తినేలా పని చేస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో డయాబెటిస్, థైరాయిడ్ లను ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=ZNS5cDt9pg0
వంట వండడానికి ఎలాంటి ఆయిల్ ఉపయోగించాలి? రకరకాల నూనెల్ని ఎందుకు మిక్స్ చేయాలి? అసలు, ఒక మనిషి గరిష్టంగా ఎంత ఆయిల్ తీసుకోవాలో తెలుసా? 20 గ్రాములు అంటే 4 టీ స్పూన్స్. సో, ఒక మనిషి ఒక నెలకి దాదాపు 600 గ్రాముల మించి ఆయిల్ తీసుకోకూడదు. అయితే, మనకి తెలియకుండానే మోతాదుకు మించి నూనె వినియోగిస్తున్నాం. మరి, వంట చేసేప్పుడు నూనె సరైన మోతాదులో వాడేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=uKdp171Qksw
అనీమియా అంటే రక్తంలో అవసరం కన్నా తక్కువ మోతాదులో హిమోగ్లోబిన్ ఉండడం. ఈ సమస్య మన భారతీయుల్లో, అందులోనూ ఆడవాళ్లు మరియు చిన్నపిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం, బుద్ది మందగించడం లాంటివి జరుగుతుంటాయి. మరి అనీమియా ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.. https://www.youtube.com/watch?v=yytNrsuoRKE