LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
 ఫెయిల్యూర్ అన్న‌ది ఎరుగ‌ని సంస్థ‌గా ఇంత వ‌ర‌కు పేరు తెచ్చుకున్న `మైత్రీ మూవీ మేక‌ర్స్ ` సంస్థ‌కు స‌వ్య‌సాచి తో అప‌జయాన్ని చ‌వి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ షాక్ నుంచి మేలుకుంటుండగానే ఇటీవ‌ల విడుద‌లైన ర‌వితేజ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లై డిజాస్ట‌ర్ గా  నిలిచింది.  స‌వ్య‌సాచి ఫ‌లితంతో అటు నాగ చైత‌న్య ఇటు ద‌ర్శ‌కుడు చందుమొండేటి ఇద్ద‌రూ షాక‌య్యారు. మూడు వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ కు ఈ రెండు చిత్రాలు బ్రేకులు ప‌డేలా చేసాయి.     ర‌వితేజ‌, శ్రీనువైట్ల లాంటి క్రేజీ కాంబినేష‌న్ ని న‌మ్మి చేసినా కూడా ఈ చిత్రం ఫ‌స్ట్ డే టాకే చాలా నెగిటివ్ గా తెచ్చుకుంది. తొలి రోజు కేవ‌లం మూడున్న‌ర కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయంటే సినిమా ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సెకండ్ డే సీన్ పూర్తిగా రివ‌ర్సైంది. ఇక టాక్సీవాలా సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో ఇప్పుడు ర‌వితేజ టైమ్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టైంది. దీంతో మైత్రి వారికి రెండో షాక్ త‌గిలిన‌ట్టైంది.  ఇక మీద‌ట‌నే ఈ సంస్థ ఆచితూచి అడుగేయాల్సిన అవ‌స‌రం ఉంది.
 అవును గ‌న్ మిస్ ఫైర్ అవ‌డంతో హీరో రాజ‌శేఖ‌ర్ కి గాయాల‌య్యాయ‌ట‌. కానీ అది షూటింగ్ లో వాడే  డ‌మ్మీ గ‌న్ కావ‌డంతో పెద్ద‌గా గాయాలేమీ కాలేదు.  చిన్న గాయాలే కావ‌డంతో ట్రీట్ మెంట్ ఇచ్చి  రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుంద‌ని చెప్పార‌ట డాక్ట‌ర్స్. ఇంత కీ ఎప్పుడు ఎక్క‌డ ఎలా జ‌రిగింద‌నే క‌దా మీ డౌటు ...ఒక‌సారి పూర్తి వివ‌రాల్లోకి వెళితే.... రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లో ఈ ఇన్సిడెంట్ జ‌రిగింది. గ‌న్ తో షూట్ చేసే సీన్ ఒక‌టి సినిమాలో ఉంద‌ట‌. విల‌న్ గ్యాంగ్ పై హీరో రాజ‌శేఖ‌ర్ షూట్ చేసే సీన్ అల‌. ఈ సీన్ చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు గ‌న్ మిస్ ఫైర్ అయింద‌ట‌.  రియ‌ల్ గ‌న్ , బుల్లెట్స్ తో షూటింగ్  చేయ‌రు కాబ‌ట్టి డ‌మ్మీ బుల్లెట్ భుజానికి త‌గిలింద‌ట‌. దీంతో సెట్ లో అంతా టెన్ష‌న్ పడ్డార‌ట‌. వెంట‌నే రాజ‌శేఖ‌ర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్ట‌ర్ ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని చెప్ప‌డంతో షూటింగ్ క్యాన్సిల్ చేయ‌డం ఇష్టం లేని రాజ‌శేఖ‌ర్ లొకేష‌న్ కి వెళ్లి త‌న సిన్సియారిటీని చాటుకున్నారు.
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్, మధునందన్, ఉత్తేజ్, రవివర్మ, కళ్యాణి, యమున తదితరులు కెమెరా: సుజిత్ సారంగ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్: సాయికుమార్ రెడ్డి సంగీతం: జేక్స్ బిజాయ్ నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ నిర్మాత‌: ఎస్.కె.ఎన్ కథ, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్   విడుదల తేదీ: నవంబర్ 17, 2018 విడుదలకు ముందు సినిమా మొత్తం నెట్టింట్లోకి వచ్చేసినా... పైరసీ రక్కసి సినిమాను కాటేసినా... విజయాన్ని ప్రభావితం చేయలేదని పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' నిరూపించింది. కంటెంట్ వుంటే థియేటర్లకు వచ్చి మరీ సినిమా చూస్తామని ప్రేక్షకులు నిరూపించారు. మరి, 'టాక్సీవాలా' పరిస్థితి ఏంటి? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం ఎప్పుడో నెట్టింట్లోకి వచ్చింది. ఈ సినిమా విజయాన్ని పైరసీ ప్రభావితం చేస్తుందా? సినిమాలో కంటెంట్ ఎంతుంది? రివ్యూ చదివి తెలుసుకోండి. క‌థ‌: శివ (విజయ్ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. రెండు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాక... పాత కారు కొని 'ఓలా క్యాబ్‌' కారు పెట్టి, క్యాబ్ డ్రైవ‌ర్‌గా ట్రిప్పులు వేయడం మొదలు పెడతాడు. అంతా సంతోషంగా వుందనుకున్న తరుణంలో కారులో ఒక ఆత్మ వుందని శివ తెలుసుకుంటాడు. ముందు భయపడి కారును అమ్మేయాలని ప్రయత్నిస్తాడు. తరవాత పరిస్థితుల ప్రభావం వలన మళ్లీ కారు ఎక్కుతాడు. క్యాబ్ డ్రైవ‌ర్‌గా ట్రిప్పులు వేయడం మొదలు పెడతాడు. ఓ సందర్భంలో కారు ఎక్కిన ప్రయాణికుణ్ణి ఆత్మ చంపేస్తుంది. అసలు, ఆత్మ అతణ్ణి ఎందుకు చంపింది? తన కళ్ల ముందు ఓ ప్రాణం పోయాక శివ ఏం చేశాడు? ఆత్మ కథేంటి? ఆత్మ వలన శివ కథ ఏ కంచికి చేరింది? అనేది మిగతా సినిమా! విశ్లేషణ: సూప‌ర్ నేచ‌రుల్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది! కానీ, దర్శకుడు చాలా తెలివిగా ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తూ కథలోకి వెళ్లాడు. మొదట రెగ్యులర్ హారర్ సినిమాల తరహాలో ప్రేక్షకులను నవ్వించినా... ఇంటర్వెల్ వచ్చేసరికి సూపర్ థ్రిల్ ఇచ్చాడు. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా అక్కడక్కగా థ్రిల్ ఇస్తూ సాగుతుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఫ్లాష్‌బ్యాక్‌ సుదీర్ఘంగా సాగడం సినిమాకు మైనస్. అందులో ఎక్కడా విజయ్ దేవరకొండ కనిపించడు. ఆ తరవాత హీరో, అతని స్నేహితులు దొంగతనం చేయడానికి వెళ్లిన సన్నివేశం బాగా నవ్విస్తుంది. కథ గురించి ఎక్కువ విశ్లేషిస్తే సినిమా చూడబోయే ప్రేక్షకులకు కిక్ వుండదు. కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి... దర్శకుడు కథ నుంచి బయటకు వెళ్లలేదు.  సగటు కమర్షియల్ అంశాల జోలికి వెళ్లలేదు. అందువల్ల, కొంచెం హీరోయిజం తగ్గింది. విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఆశించే అంశాలు తగ్గాయి. కానీ, కొంచెం కొత్త కథను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అయితే.. కథకు బీజమైన ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పాయింట్ సామాన్యులకు అర్థం కాదు. జేక్స్ బీజాయ్ పాటల్లో 'మాటే వినదుగా..' ఇప్పటికే ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతోంది. మిగతా పాటలు ఆ స్థాయిలో లేవు. కానీ, నేపథ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో వుండటం వలన చిన్న సినిమాగా కనిపించదు. హీరో వుండే గ్యారేజ్ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. చూడటానికి బావుంది. ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ నటన సినిమా కాన్సెప్ట్ ప్లస్ కామెడీ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం మైనస్ పాయింట్స్: సగటు ప్రేక్షకులకు అంతగా అర్థం కాని క్లైమాక్స్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ నటీనటుల పనితీరు: విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్, స్టయిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అతడి గత సినిమాలకు భిన్నంగా వుంటుందీ సినిమాలో క్యారెక్టర్. భయపడే సన్నివేశాల్లో బాగా నటించిన విజయ్ దేవరకొండ, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ పాత్ర 'మాటే వినదుగా' పాటతో పాటు కొన్ని సన్నివేశాలకు పరిమితమైంది. మాళవికా నాయర్ కథకు కీలకమైన పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడి పాత్రలో మధునందన్, అతని దగ్గర పనిచేసే హాలీవుడ్ పాత్రలో నటించిన వ్యక్తి, చమ్మక్ చంద్ర బాగా నవ్వించారు. రవివర్మ, ఉత్తేజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కళ్యాణి, యమున పాత్రలు ఎమోషనల్‌గా సాగాయి. చివరగా: 'టాక్సీవాలా' నవ్విస్తాడు. మధ్య మధ్యలో భయపెడతాడు. థ్రిల్ ఇస్తాడు. చివరిలో కొంచెం మనకు అర్థం కాని సన్నివేశాలతో ముగిస్తాడు. 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' విజ‌యాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్‌డ‌మ్ పెరిగింది. అతడికి ఫాన్స్ పెరిగారు. వారందరినీ 'నోటా' నిరాశ పెరిచింది. కానీ, 'టాక్సీవాలా' మాత్రం అలా చేయదు. మంచి సినిమా చూశామన్న సంతృప్తి ఇస్తుంది. రేటింగ్: 2.5/5
నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ఎన్టీఆర్‌.  ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా రెండు పార్ట్ లుగా రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క‌నువిందుగా తెర‌కెక్కుస్తున్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. అయితే ఇటీవ‌ల ఈ చిత్రం కోసం `దాన‌వీర శూర‌క‌ర్ణ‌` సినిమాలోని `చిత్రం భ‌ళారే విచిత్రం` పాట‌ను దుర్యోధ‌నుడి గెట‌ప్ లో ఉన్న బాల‌పై చిత్రీక‌రించారు. ఈ పాట‌లో బాల‌య్య స‌ర‌స‌న న‌టి శ్రియ శ‌ర‌న్ నర్తించింది. బాల‌య్య స‌ర‌స‌న న‌టి శ్రియ  ఇప్ప‌టికే చాలా చిత్రాల్లో న‌టించింది. వీరిద్ద‌రి జోడీ బాగుంటుంద‌న్న అభిప్రాయంతో ద‌ర్శ‌కుడు భ‌ళారే పాట‌కోసం శ్రియ‌ను తీసుకున్నారు. ఈ పాట అద్భుతంగా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.  కీర‌వాణి సంగీతం సమ‌కూరుస్తున్న ఈ చిత్రం క‌థానాయ‌కుడు పార్ట్ జ‌న‌వరి 9న విడుద‌ల కానుంది. రెండో పార్డ్ అదే నెల 24న విడుద‌ల చేయ‌నున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల శివ ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే స్క్రిప్టు వ‌ర్క్ కూడా పూర్తి చేశాడు కొర‌టాల‌. సైరా సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఇదిలా ఉంటే  రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల కొర‌టాల‌తో ఒక డీల్ కుదుర్చుకున్నాడ‌ట‌. ఈ వార్త సోష‌ల్ మీడియాలో  ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆ విషయానికొస్తే... రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా జ‌న‌వ‌రిలో సంక్రాతి కానుక‌గా విడుద‌ల కానుంది. దీని త‌ర్వాత రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట చ‌ర‌ణ్‌. ఈ లోపు చిరు, కొర‌టాల సినిమా అయిపోతుంది..కాబ‌ట్టి వెంట‌నే త‌న సినిమా ప్రారంభించాల‌ని ఇటీవ‌ల కొర‌టాల‌తో చెప్పాడ‌ట‌. దీనికి కొర‌టాల కూడా ఒప్పుకున్నార‌ట‌. ఆ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చి కొర‌టాల‌కు షాకిచ్చాడ‌ట చెర్రి.  మెగాప‌వ‌ర్ స్టార్ ప్లాన్ సూప‌ర్బ్ గా అంటున్నారు సినీ వ‌ర్గాలు.
  వైసీపీ అధినేత జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన దాడి ఘటన తర్వాత తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్.. పార్వతీపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయని విమర్శించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని జగన్ నిలదీశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు తోటపల్లి ప్రాజెక్టు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనిని కూడా చంద్రబాబు నాలుగున్నర ఏళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల్ని శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తారని ధ్వజమెత్తారు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాగా దోపిడీలకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీ పోస్టులను కూడా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా వదిలిపెట్టడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని, అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు కాజేస్తున్నారని జగన్ ఆరోపించారు. జిల్లాలో 26 కరవు మండలాలుంటే వాటిలో 4 మండలాల్లో మాత్రమే కరవు ఉందని చంద్రబాబు అంటున్నారని అన్నారు. రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయైనా కరీఫ్, రబీ రైతులకు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నారని వ్యాఖ్యానించారు. పునాదులు మాత్రమే కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా తనపై జరిగిన దాడి గురించి కూడా జగన్ స్పందించారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమాని తనపై ఎందుకు హత్యాయత్నం చేస్తాడని ప్రశ్నించారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. దాడి జరిగిన గంటకే స్క్రిప్ట్ ప్లే చేశారని, చంద్రబాబు స్క్రిప్ట్‌ను డీజీపీ చదివారని జగన్ ఆరోపించారు.ఫ్లెక్సీలో విజయమ్మ ఫొటో లేదని, గరుడపక్షి ఫొటో ఉందన్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడి దగ్గర ఎలాంటి లెటర్ కనబడలేని జగన్ చెప్పారు. లెటర్ ఇస్త్రీ చేసినట్లు ఉందని, మడతలు కూడా లేవన్నారు.  తాను విశాఖలో అడుగు పెట్టినప్పుడే సీసీ కెమెరాలు ఆగిపోయానని తెలిపారు. తెలిసీ తెలీకుండా అభాండాలు వేయకూడదనే హత్యాయత్నంపై తాను వెంటనే స్పందించలేదనన్నారు. అప్పటికప్పుడు చొక్కా మార్చుకుని బయల్దేరానని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడొద్దని ట్వీట్ చేశానని జగన్ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో తనపై హత్యాయత్నం, కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. కుట్రలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకి వెళ్తారని చంద్రబాబు వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
  టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఇంటి పార్టీకి కాంగ్రెస్ ఒక టిక్కెట్ కేటాయించిందని, ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ నకిరేకల్ నుంచి బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్ సీటుని చిరుమర్తి లింగయ్యకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికే సీటుని కేటాయించింది. దీనిపై ఇంటి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పాపం కాంగ్రెస్ ది కూడా ఏం చేయలేని పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలోని మిగతా మూడు పార్టీలకు సీట్లు కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో నిరసన సెగలు తగులుతున్నాయి. మరి అలాంటి సమయంలో అంతగా బలం లేని ఇంటి పార్టీకి టిక్కెట్ కేటాయిస్తే ఇంకేమైనా ఉందా?. నిరసన సెగ తారాస్థాయికి చేరదు. దీనికితోడు నల్గొండలో బలమైన కేడరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదనలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే ఇంటి పార్టీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇంటి పార్టీ మాత్రం కూటమిలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది.  తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ తాజాగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అమరావతి నుంచే కాంగ్రెస్ టిక్కెట్లు వస్తున్నాయని ఆరోపించారు. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని ఆయన చెప్పారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని అన్నారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చెరుకు సుధాకర్ బరిలోకి దిగుతానని చెప్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009లో సుమారు 29వేలు, 2014 ఎన్నికల్లో 23వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఉత్తమ్ మీద పోటీకి సుధాకర్ సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మహాకూటమిలో ఉన్న సుధాకర్.. ఇప్పుడు కూటమిలోని పెద్దన్న పార్టీ కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ మీదే పోటీకి సిద్ధమయ్యారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
  టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అసలు ఈ కూటమి ఎన్నికల వరకు ఉంటుందా? ముందే ముక్కలవుతుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి దూసుకుపోతుంది. కూటమిలోని పార్టీలు, నేతలు త్యాగానికి సిద్దమవుతూ తమ ప్రధాన లక్ష్యం ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. టీడీపీ తక్కువ సీట్లకు సర్దుకుపోయింది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసి పొత్తు ధర్మాన్ని పాటించారు. ఇక సీపీఐ కూడా తక్కువ సీట్లు కేటాయించినా.. టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు. కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. పొన్నాల జనగామ నుంచి అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయనికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి పొన్నాలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని టీజేఎస్ కి కేటాయించింది. ఇక్కడి నుంచి కోదండరాం బరిలోకి దిగలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పినా.. పొన్నాల మాత్రం జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సుముఖుత వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ సీనియర్ నేత అయిన పొన్నాలకు మొండిచేయి చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కోదండరాం పొన్నాల కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా టీజేఎస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కోదండరాం వేరే ఏదైనా స్థానం పోటీ చేస్తారో లేక కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమిలోని పార్టీలు, నేతల త్యాగాలు చూస్తుంటే టీఆర్ఎస్ ని ఓడించాలని కూటమి ఎంత బలంగా ఫిక్స్ అయిందో అర్ధమవుతోంది. చూద్దాం కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో.
  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది. ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి. సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.
  తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.     ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా? పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా? కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా? పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా? ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా? సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా? విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా? పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా? ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా? ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా? విభజన మాయని గాయం అని బాధ పడలేదా?
  Set aside some time from your busy schedule and get reacquainted with yourself!   Every human is destined to be alone at some point of time in his/her  life. It’s just that we don’t want to realise and accept it, because it is very difficult to feel that we are alone and be alone. Not many are willing to understand the importance of being alone in life as we are all social beings and it is fun to be in the company of colleagues, friends and family. To be alone is not a desirable option. But often when being alone it helps unclog one’s mind and listen to everything that is happening and -not happening around you. A good way to get started is to stay in a dark room or a room with curtains closed for a few minutes every day. No noise, no talking, no visual or aural stimulation, just the unique experience of being with yourself and by yourself. Looking at solitude from a fresh angle we will understand its numerous benefits. * This is one of the best ways to unwind and put one’s mind in auto pilot cruise control mode , as it allows one to put off the routine issues aside momentarily and makes one feel at ease with one’s self. * By doing this we gain a solid approach and confidence to do things as we gain independence of mind. Take out the “I, me, myself “time periodically. You could define that time based on your work schedule and comfort .When we make out those few days every year to spend time with our families it would be wonderful if the same holiday be given to yourself –alone. Take that holiday for yourself it could be a small holiday somewhere close to nature,  the beach ,a resort, if you love trekking -  a trip up the hills, near a river or forest. The idea of being close to nature helps us in revitalising our mind, body and soul and refresh the thought process and come back fully charged.   It may be difficult and feel empty but when done like a scheduled practice it works wonders on our outlook. This concept is not new to us , the sages would go for their spiritual retreats in the forest and come back more powerful and divine. The same way if we are alone... only with the self, diving deep within  we return though the situations remains the same ,our outlook towards it changes to a large extent. Connect with your inner soul.Try being alone .Don’t hold  yourself back .Think about what makes you...you. Spend time asking yourself for advice; you will need less input from others. Every person has an inner voice that talks to them all the time. When you connect with your inner soul - you will also notice a heightened intuition which is very useful. When you trust yourself to solve problems , you become a much stronger and more confident person and you take on challenges that you wouldn’t have felt capable of facing earlier. It fosters creativity. It is a known fact that many legendary people discovered great things when they were alone. Sir Isaac Newton was alone under the apple tree when the apple fell and he discovered the Law of Gravitation. A crowd surrounds you , yet you are walking alone. It doesn’t mean that you separate yourself from the rest of the world, you need to detach yourself and experience solitude! Alone time is our chance to do all the things we personally enjoy nd it’s the perfect way to pamper our senses..In short being alone is a welcome change of pace . Feel it, enjoy it and Keep going...
  We have spent enough time accumulating things for our living spaces and in the name of organizing things we see that we have gathered enough stuff that we begin to see that its is a reflection of our state of mind. If there's one deeper, universal truth, than it's that clutter can prevent us from letting anything new into our lives. As you see the clutter growing we begin to feel overwhelmed and it is only when we shift our houses that we realize how much of stuff we have gathered .   Getting started to de -clutter your home: There is no need to start immediately ! Do it phase wise.Your house is a reflection of your self.Shift your perspective and see what you need and what you don’t and work on individual spaces.This can be done phase wise and room by room.Ask yourself : Do I love it? and Do I need it? This will help you   get a more objective view of what was taking up space.   Once you begin to  get an objective, clear-eyed view of the  clutter, we were ready for phase two -- no, not clearing out, but planning. Specifically, making a plan to prevent future clutter and a plan for moving out existing clutter. It's pretty simple: First, determine where clutter is coming from and shut off the flow. If the items are too valuable you can donate to charity or old age homes or if its is of no use to anyone just throw the stuff away. Donate those old books to the  local library or to a school for under privileged.  Now we were ready to roll on actually clearing space. which is phase three.Most people find that the energy generated during this part propels them forward, but to avoid feeling overwhelmed at the outset, work in a specific area at a time for 30 minutes a day -to sort through the clutter. Keep the garbage bags, boxes, ready and  "When in doubt, throw it out," once you start you get motivated to get the job done. You will  experience one of the biggest perks of clutter clearing: a feeling of greater emotional and mental space -- a sense of greater ease, of having more time and less stress. In a span of a few days or week based on the plan you have made  you will feel better and  the changes will be much deeper. You will feel much better about yourself and have more energy, feel more "togetherness," with your family member and just felt more enthusiastic about life in general .See what happens when we make the space for something to enter our life and when the old is pushed out. Obstacles you may encounter while clearing out your clutter: Procrastination- Don't feel overwhelmed by the task, make baby steps towards cleaning.These are tiny steps -- five minutes or less -- that will move you toward completing your project.  Paper -Just keep those  financial and legal documents which are important to us and release attachment to all kinds of information like unused recipes stuck in a file, old magazine articles ,paintings etc. Use the internet and find what you want. The Past- By hanging on to  items which keeps us attached to the past. Ask yourself, What do I need to do to complete the past and let go?  You will feel amazing; happier, lighter and free! when you clear up the physical clutter in your life. This creates space and possibility for the “new” to enter your life that you can start to change your life and begin to live a life that you love. Clear the old and enjoy the new! - Charitha
  పూర్వం ఓ రైతు ఉండేవాడు. అతనికి వంశపారంపర్యంగా ఎకరా పొలం మాత్రమే దక్కింది. అది కూడా రాళ్లూరప్పలతో నిండి ఉంది. దాంతో రైతు తెగ నిరాశపడిపోయాడు. పని చేయాలన్న కోరిక అతనిలో అడుగంటిపోయింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. నాకెలాగూ పనికిమాలిన పొలం చేతికొచ్చింది. కాబట్టి, ఇకమీదట నన్ను పోషించాల్సిన బాధ్యత ఆ దేవుడిదే అనుకున్నాడు. అలా అనుకున్న రైతు పనీపాటా మానేసి ఊరికనే ఓ చోట కూర్చుండిపోయాడు. కానీ అదేం చిత్రమో కానీ... దేవుడు ఆ రైతుకి పిడికెడు ఆహారం కూడా పంపలేదయ్యే! దేవుడు తనకి ఆహారం పంపకపోవడం చూసి రైతు చాలా నిరాశపడిపోయాడు. ‘బహుశా నేను నడుస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎదురుపడి ఆహారాన్ని అందిస్తాడేమో!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నడుస్తూ, సాయం కోసం అటూఇటూ చూడసాగాడు. కానీ రహదారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ దారిన తాము వెళ్లిపోతున్నారే కానీ... రైతు దగ్గరకి వచ్చి ఓ రెండు ముద్దలు పెట్టనేలేదయ్యే! ‘ఇలా కాదు! ఇలాంటి జనసంచారం మధ్య దేవుడు కనిపించకపోవచ్చు. అందుకే మునులంతా అడవిలోకి వెళ్లి తపస్సు చేస్తారేమో! నేను కూడా అడవిలోకి వెళ్లి దేవుడి కోసం ప్రార్థిస్తాను!’ అనుకున్నాడు రైతు. అలా అనుకుంటూ సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోకి అడుగుపెట్టిన రైతు ఓ మంచి నున్నటి రాయి చూసుకుని, దాని మీద కూర్చుని... దేవుడి కోసం ప్రార్ధించడం మొదలుపెట్టాడు. ఆకలి మీద ఉన్న రైతుకి మరింత నీరసం వచ్చిందే కానీ దేవుడు అతనికి ఆహారం పంపలేదు. కంటి ముందున్న పళ్లు రైతు ఆకలిని తీర్చలేకపోయాయి. ఈలోగా అతనికి ఓ చిత్రమైన సంఘటన కనిపించింది. రైతుకి అల్లంత దూరంలో ఓ వేటకుక్క కనిపించింది. దాని రెండు కాళ్లూ విరిగిపోవడంతో, ఎవరో దాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లినట్లున్నారు. విరిగిన రెండుకాళ్లతో దేకుతూ ఆ వేటకుక్క అక్కడక్కడే తిరుగుతోంది. ‘అసలే చిన్నప్రాణి! పైగా రెండుకాళ్లూ పోగొట్టుకుని తప్పించుకునే పరిస్థితులో కూడా లేదు. ఈ కుక్కకి ఆహారం ఎలా అందుతోందబ్బా!’ అనుకున్నాడు రైతు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ సింహం అటుగా వచ్చింది- ‘హా! ఇక ఈ కుక్క పని అయిపోయింది. సింహం ఆ కుక్కని నమిలిపారేస్తుంది,’ అనుకున్నాడు రైతు. రైతు అలా గమనిస్తుండగానే సింహం కుక్క దగ్గరకు వచ్చేసింది. వేటకుక్కని అటూఇటూ కదిపి దాని పరిస్థితిని గమనించింది. ఆశ్చర్యంగా తన నోట్లో ఉన్న మాంసం ముక్కని తీసి ఆ కుక్క ముందు వదిలేసి వెళ్లిపోయింది. ఆ మాంసంతో ఆ పూటకి వేటకుక్క ఆకలి తీరింది. ఇదంతా చూసిన రైతుకి మతి చెడిపోయింది. ఆపై దేవుడి మీద విపరీతంగా కోపమూ వచ్చేసింది. ‘ఎందుకూ పనికిరాని కుక్కకేమో దాని శత్రువైన సింహం కూడా సాయపడిందా! నాకేమో సాటి మనిషి ఎవ్వడూ రెండు మెతుకులు కూడా ఇవ్వడం లేదా! నా మీద దేవుడికి ఇంత పక్షపాతమా!’ అనుకున్నాడు. ఆ కోపంలోనే అడవిని వీడి వడివడిగా తన ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. చీకటిపడేసరికి అతను దారిమధ్యలో ఉన్న ఓ ఆశ్రమంలో సేదతీరాడు. అక్కడ కనిపించిన స్వామీజీకి తన అనుభవాలన్నీ ఏకరవు పెట్టాడు. ‘దేవుడు మహా కఠినుడు. నాలాంటి వారి కష్టాలను అతను ఆలకించడు,’ అంటూ నిష్టూరాలాడాడు. రైతు మాటలు విన్న స్వామీజీ చిరునవ్వుతో- ‘ఇంతకీ నువ్వు ఆ కుక్క గురించే ఆలోచిస్తున్నావు. ఆ జీవితోనే నిన్ను పోల్చుకుంటున్నావు. నీ బతుకు కూడా దానిలాగా కావాలని అనుకుంటున్నవా ఏం! దేవుడు బహుశా నిన్ను సింహంలాగా బతకాలనుకుంటున్నాడేమో! నీ బలంతోనూ, తెలివితోనూ, కష్టంతోనూ ఆహారం సంపాదించుకోవాలనీ... ఆ ఆహారాన్ని నిస్సహాయులతో పంచుకోవాలని కోరుకుంటున్నాడేమో. ఇంతకాలం నువ్వు దేవుడు నీకేదో చేస్తాడని ఆశపడ్డావు. కానీ ఆయన ఆశకి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేశావా! నీ ఇంట్లో కూర్చుంటేనో, నడుచుకుంటూ వెళ్తేనో, అడవిలో తపస్సు చేసుకుంటేనో దక్కని దేవుని కరుణ... నువ్వు కష్టపడి జీవిస్తే దక్కుతుందేమో చూడరాదా!’ అని సూచించాడు. స్వామీజీ మాటలు విన్న రైతుకి అతని మాటలు నిజమే కదా అనిపించాయి. నిజమే కదా! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  మహాకూటమిలో కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ పార్టీలు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు టీజేఎస్ మాత్రం తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు గడువు కూడా ముగియనుండటంతో ఆ పార్టీ తాజాగా తొలి విడుత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌ 94, తెదేపా 14, తెజస 8, సీపీఐ 3 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. టీజేఎస్ తొలి విడుత అభ్యర్థుల జాబితా: 1. మల్కాజ్‌గిరి- కపిలవాయి దిలీప్‌కుమార్‌ 2. దుబ్బాక- రాజ్‌కుమార్‌ 3. సిద్దిపేట- భవానీరెడ్డి 4. మెదక్‌- జనార్దన్‌రెడ్డి
  తెలుగు దేశం పార్టీ,నాయకులపై విమర్శలు చేయటంలో కయ్యానికి కాలు దువ్వుతారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.రోజా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పకిటికీ ఆమె భర్త సెల్వమణి రాజకీయాలపై మాట్లాడిందిగానీ, సభల్లో కనిపించిన దాఖలాలు గానీ ఎక్కడా లేవు. కానీ తాజాగా ఆయన చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరిలో వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహ్యించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గానికి తాను చేసిన అభివృద్ధి ఏంటో తెలుకునేందుకు మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని,దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని,తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు.
  మహేంద్రసింగ్ ధోనీ విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. మొదటినుంచి ధోనీకి విశాఖ అంటే ప్రత్యేక అభిమానం. 2005లో పాకిస్థాన్‌తో రెండో వన్డే ఆడేందుకు విశాఖలో అడుగుపెట్టిన ధోనీ 123 బంతుల్లో ఏకంగా 148 పరుగులు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తనకు అచ్చొచ్చిన విశాఖ అంటే అప్పటి నుంచి ధోనీకి అభిమానం. విశాఖ ఎంతో అందమైన నగరమని, అక్కడ ఉండడమంటే తనకెంతో ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు ఏకంగా అకాడమీనే ఏర్పాటు చేసి నగరంతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. తాజాగా ధోనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు.
  Regular exercise, including walking, significantly reduces the chance that a frail older person will become physically disabled, according to one of the largest and longest-running studies of its kind to date. The results, published on Tuesday in the journal JAMA, reinforce the necessity of frequent physical activity for our aging parents, grandparents and, of course, ourselves. While everyone knows that exercise is a good idea, whatever your age, the hard, scientific evidence about its benefits in the old and infirm has been surprisingly limited. “For the first time, we have directly shown that exercise can effectively lessen or prevent the development of physical disability in a population of extremely vulnerable elderly people,” said Dr. Marco Pahor, the director of the Institute on Aging at the University of Florida in Gainesville and the lead author of the study. Countless epidemiological studies have found a strong correlation between physical activity in advanced age and a longer, healthier life. But such studies can’t prove that exercise improves older people’s health, only that healthy older people exercise. Other small-scale, randomized experiments have persuasively established a causal link between exercise and healthy aging. But the scope of these experiments has generally been narrow, showing, for instance, that older people can improve their muscle strength with weight training or their endurance capacity with walking. The exercise group received information about aging but also started a program of walking and light, lower-body weight training with ankle weights, going to the research center twice a week for supervised group walks on a track, with the walks growing progressively longer. They were also asked to complete three or four more exercise sessions at home, aiming for a total of 150 minutes of walking and about three 10-minute sessions of weight-training exercises each week. Most of the volunteers “tolerated the exercise program very well,” Dr. Pahor said, but the results did raise some flags. More volunteers in the exercise group wound up hospitalized during the study than did the participants in the education group, possibly because their vital signs were checked far more often, the researchers say. The exercise regimen may also have “unmasked” underlying medical conditions, Dr. Pahor said, although he does not feel that the exercise itself led to hospital stays. Dr. Pahor cautioned that the LIFE study is not meant to prompt elderly people to begin solo, unsupervised exercise. “Medical supervision is important,” he said. Talk with your doctor and try to find an exercise group, he said, adding, “The social aspect is important.” Mildred Johnston, 82, a retired office worker in Gainesville who volunteered for the LIFE trial, has kept up weekly walks with two of the other volunteers she met during the study.“Exercising has changed my whole aspect on what aging means,” she said. “It’s not about how much help you need from other people now. It’s more about what I can do for myself.” Besides, she said, gossiping during her group walks “really keeps you engaged with life.” NY Times
  Diabetes is on the rise, yet most cases are preventable with healthy lifestyle changes. Some can even be reversed. Taking steps to prevent and control diabetes doesn’t mean living in deprivation. While eating right is important, you don’t have to give up sweets entirely or resign yourself to a lifetime of bland “health food”. With these tips, you can still enjoy your favorite foods and take pleasure from your meals without feeling hungry or deprived. https://www.youtube.com/watch?v=cNjKPvT1wkw  
  Dry Eyes : One common side effect of wearing contact lenses is developing dry eyes. This condition results from having insufficient tears. Dry eyes can occur in wearers of soft and hard contact lenses, alike. People with dry eyes might experience symptoms such as the eyes feeling hot, a sensation of something stuck inside the eye, redness, and burning or tearing. Fluid deposit : Intraocular fluid from the lens gets deposit on the retina. This fluid can lead to eye infections. This is more common when you wear soft lenses daily, as they are flexible and the fluid doesn’t come out easily after washing with the solution. Burning eyes : When you try to set these plastic or silicon lens inside your eyes, you feel a burning sensation instantly. Eyes are very sensitive. If a small dust particle enters, it becomes red. What will happen when you try to put lens? The inflammation is felt but, it is temporary. You can also get bumps on the eyelids and these swollen eyelid are painful. Pressure on the Eyes : Contact lenses exert a certain amount of pressure on the eye. Depending upon the fit and oxygen permeability of your lens, this pressure can change the shape of the cornea. Allergic Reactions : The chemicals used in the cleaning, disinfecting and lenses storage solutions may irritate sensitive eyes. Giant Papillary Conjunctivitis (GPC) is a particular allergic condition that is often due to chemical allergies and protein build-up on contact lenses. Symptoms include small bumps on the inside of an eyelid, mucus and itching.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.