Publish Date:Jan 31, 2013

EDITORIAL SPECIAL
  జగన్ ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలింది. జపాన్ లేఖతో కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలన్న ఏపీ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జగన్ సర్కారు తోక ముడిచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పీపీఏల రద్దును తీవ్రంగా పరిగణించిన జపాన్ ప్రభుత్వం... ఇండియన్ గవర్నమెంట్ కి ఘాటు లేఖ రాసింది. భారత విద్యుత్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన జపాన్.... జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, ఖరారైన ఒప్పందాలను రద్దు చేయడాన్ని ఫ్రాన్స్, సౌతాఫ్రికా, ఐరోపా దేశాలు కూడా గమనిస్తున్నాయంటూ జపాన్ బాంబు పేల్చింది. దాంతో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం.... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పీపీఏలను రద్దుచేస్తే ఫారిన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది భారత్ కు మంచిది కాదని తేల్చిచెప్పింది. సరైన ఆధారాల్లేకుండా పీపీఏలను రద్దుచేయడం సరికాదని, పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు తగ్గి, అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. అవినీతి జరిగిందని స్పష్టంగా తేలితే తప్ప, చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్నీ రద్దు చేయలేమని జగన్ సర్కారుకు గుర్తుచేసింది.  అయితే, పీపీఏలన్నింటినీ తాము రద్దు చేయలేదని, కేవలం అవకతవకలు జరిగాయని నిర్ధారించిన ఒప్పందాలను మాత్రమే పునసమీక్షిస్తున్నట్లు కేంద్రానికి తెలియజేసింది. ఒకవైపు జపాన్ లేఖ... మరోవైపు కేంద్రం హెచ్చరికలతోనే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పీపీఏల సమీక్ష నిర్ణయం తీసుకున్నామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినరోజే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ఈ ఆదేశాలు రావడం విజయసాయి మాటలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కూడా కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోడెల ఇంకా అనేక అక్రమాలు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల తన మార్కు చూపించారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనే నిర్ణయించారట. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ.. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదట.   ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారట. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారట. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదట. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవట. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయట. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.
  ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తేనే, ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి జరుగుతుంది. అయితే, పెట్టుబడులు రావడం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, ఆయా ప్రభుత్వాలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగితేనే, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టుల రద్దు, పీపీఏల సమీక్షలాంటి నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. పైగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేవైనా, వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకులాంటి మేజర్ ఇన్వెస్టర్స్ తప్పుకోవడంతో...ఇప్పటికే వందల వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయి. కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి.... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని, ఇలాగైతే రాష్ట్రం నాశనం కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తీరుతో ఏపీకి కొత్త పరిశ్రమలు రావని, ఆయన వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు దేవాలయాల భూములను జగన్ అనుచరులు కొట్టేస్తున్నారని, దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే పేరెన్నికగల పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వంపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేసిన అక్షయపాత్ర సంస్థకు దాదాపు 45కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందట. ఈ బిల్లులు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం నో చెప్పినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, విచారణ తర్వాతే చెల్లింపులు ఉంటాయని తేల్చిచెప్పిందట. ఇదే, టీవీ మోహన్‌దాస్‌ పాయికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అక్షయపాత్ర బోర్డులో సభ్యుడిగా ఉన్న మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటం, విచారణలు చేయడం వరకు ఓకే కానీ...చేసిన పనికి బిల్లులు చెల్లించమని, చెప్పడం ప్రభుత్వ ఉగ్రవాదం కిందకే వస్తుందని పాయ్ అంటున్నారు. ఏదేమైనా జగన్ ప్రభుత్వంపై ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటిసారి జగన్ టార్గెట్ గా పాయి ఘాటు విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ALSO ON TELUGUONE N E W S
  జాన్ అబ్రహాం హీరోగా నటించిన 'బాట్లా హౌస్' మూవీ సక్సెస్ పార్టీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ముంబైలో బుధవారం జరిగిన ఈ పార్టీలో ఆ మూవీ డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో బన్నీ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది బన్నీ బాలీవుడ్ సినిమా చేయనున్నాడనే ప్రచారానికి ఈ సక్సెస్ పార్టీ ఊతమిచ్చింది. ఈ పార్టీకి బన్నీ సింపుల్ వైట్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్‌తో అటెండ్ అయ్యాడు. ఇప్పటికే నిఖిల్ అద్వానీ కథ వినిపించాడనీ, బన్నీ సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన సినిమాలు హిందీలో అనువాదమై జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ప్రసారమవుతూ మంచి రేటింగ్ సాధిస్తున్నాయి. యూట్యూబ్‌లోనూ ఆ సినిమాలకు అత్యధిక సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. దీంతో అతనితో నేరుగా సినిమాలు చెయ్యాలని బాలీవుడ్ డైరెక్టర్స్ భావిస్తున్నారు. కాగా, బన్నీ ప్రస్తుతం త్రివిక్రం దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో టబు ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధం చుట్టూ నడిచే కథగా వినిపిస్తోంది. బన్నీ తండ్రిగా మురళీశర్మ నటిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ ఫిల్మ్ 'ది ఇన్వెన్షన్ ఆఫ్ లయింగ్'ను ఆధారం చేసుకొని ఈ మూవీ స్క్రిప్టును త్రివిక్రం రూపొందించాడనే ప్రచారం ఫిలింనగర్‌లో నడుస్తోంది. అందులో ఎంత నిజముందో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో..' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బహుశా దాని తర్వాత అతను బాలీవుడ్‌కు వెళ్లే అవకాశం ఉంది.
  ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు. సినీ ఫీల్డులో ఎంత గొప్పవాళ్లకైనా కష్టాలు తప్పవు. ఫ్లాపులతో సతమతమవక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి సైతం అందుకు అతీతుడు కాదు. 1978లో 'ప్రాణం ఖరీదు'తో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి, 1983లో వచ్చిన 'ఖైదీ'తో స్టార్‌గా మారారు. అప్పట్నుంచీ ఒక దశాబ్ద కాలం ఆయనకు తిరుగనేదే లేకుండా పోయింది. ఈ మధ్యలో ఆయన మెగాస్టార్‌గా కూడా బాక్సాఫీసును అనేక సార్లు బద్దలు కొడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల కాలం ఆయన కెరీర్‌లో ఒక పీడకలగా మారింది. 1993లో రిలీజైన 'ముఠామేస్త్రి' మూవీ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఒక దాని తర్వాత ఒకటిగా ఫ్లాపవుతూ వచ్చాయి. 'మెకానిక్ అల్లుడు', 'ముగ్గురు మొనగాళ్లు', 'ఎస్.పి. పరశురాం', 'బిగ్ బాస్', 'రిక్షావోడు' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గల్లంతయ్యాయి. 'బిగ్ బాస్' కంటే ముందు వచ్చిన 'అల్లుడా మజాకా' సినిమా ఫర్వాలేదనిపించుకున్నా బూతు సినిమాగా దానికి వచ్చిన పేరు, అత్త కేరెక్టర్ చేసిన లక్ష్మితో చిరంజీవి చేసిన సరసాలు విపరీతమైన విమర్శలనీ, కాంట్రవర్సీనీ సృష్టించాయి. ఇది మెగాస్టార్‌గా ఆయన సాధించుకున్న ప్రతిష్ఠకు మచ్చ తెచ్చింది. 'రిక్షావోడు' డిజాస్టర్‌తో ఆయన పునరాలోచనలో పడ్డారు. తర్వాత ఎలాంటి సబ్జెక్టును ఎంచుకోవాలో పాలుపోని స్థితిని ఎదుర్కొని, ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయారు. నిజంగా అది మెగాస్టార్‌కు సంకట స్థితే. ఆ టైంలో ఆయన దృష్టికి వచ్చింది ఒక మలయాళీ సినిమా. అది మమ్ముట్టి టైటిల్ రోల్ చేసిన 'హిట్లర్'. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మమ్ముట్టి చేసిన నటన, కథలోని సెంటిమెంట్ ఆ సినిమాని హిట్ చేశాయని అర్థం చేసుకున్న చిరంజీవి.. ఆ కథ తనకు సరిపోతుందని భావించారు. ఆయన బావమరిది, సన్నిహితుడు అల్లు అరవింద్ సైతం ఆయనను సపోర్ట్ చేశారు. నిర్మాత ఎడిటర్ మోహన్ ఆ సినిమాని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమాకి డైరెక్టర్‌గా ఎవర్ని ఎంచుకోవాలనే సమస్య ఎదురైంది. అప్పట్లో సెంటిమెంట్ సినిమాలు చేసి, విజయాలు అందుకున్న ముత్యాల సుబ్బయ్య పేరును చిరంజీవికి సూచించారు ఎడిటర్ మోహన్. అప్పటికే ఆయన బేనర్‌లో ముత్యాల సుబ్బయ్య 'మామగారు' వంటి సెంటిమెంట్ సినిమాని డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. పైగా అదే సమయంలో వెంకటేశ్, సౌందర్య జంటగా ఆయన రూపొందించిన 'పవిత్ర బంధం' సూపర్ హిట్టయింది. ఈ విషయాలు ఎడిటర్ మోహన్ చెప్పగానే చిరంజీవి, అరవింద్ కూడా సరేనన్నారు. అలా చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య తొలి కాంబినేషన్‌లో మలయాళ 'హిట్లర్' తెలుగు రీమేక్ అదే టైటిల్‌తో రూపొందింది. ఆ సినిమా మేకింగ్‌లో ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల్లాంటి ఉత్తరాలు అందుకున్నారు ముత్యాల సుబ్బయ్య. "మా బాస్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన్ని బాగా చూపించాలి, ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయండి" అనేది ఆ ఉత్తరాల్లోని సారాంశం. అయితే వాటికి సుబ్బయ్య భయపడలేదు. తనేం తీస్తున్నననే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. సబ్జెక్టుపై కాన్ఫిడెన్స్ ఉంది. టైటిల్ రోల్‌ను చిరంజీవి బ్రహ్మాండంగా చేశారు. సెంటిమెంట్‌ను బాగా పండించారు. దానికి కామెడీ జోడై, మూవీ సూపర్ హిట్టయింది. ఎంత హిట్టంటే ఒరిజినల్ కంటే, తమిళ, కన్నడ, హిందీ రీమేక్స్ కంటే పెద్ద హిట్టు. అలా మూడేళ్ల మెగాస్టార్ కెరీర్ స్లంప్‌కు 'హిట్లర్' చెక్ పెట్టేసింది. అలా మెగాస్టార్ కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆయన కెరీర్‌ను గాడిలో పెట్టిన డైరెక్టర్‌గా ముత్యాల సుబ్బయ్య పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. చిరంజీవి నుంచి మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా కూడా అందుకున్నారు. అవును. అప్పుడప్పుడే మొబైల్ ఫోన్లు వస్తున్నాయి. ఖరీదైన అవి పెద్ద పెద్ద వాళ్ల దగ్గర మాత్రమే ఉండేవి. ముత్యాల సుబ్బయ్య వాడిన తొలి మొబైల్ ఫోన్ మెగాస్టార్ ఇచ్చిన కానుకే!
  హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన 'సాహో' చిత్రం ఆగష్టు 30 న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్, ఇంటెర్నేషనల్ మీడియా తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంగ్లీష్ పేపర్ తో మాట్లాడిన ప్రభాస్ కు అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి ఒక  ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ ప్రభాస్ ... "మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే కానీ, ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇక ఈ విషయం గురించి అనుష్కతో ఒకసారి మాట్లాడాల్సిందే. తనని అయినా... త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పాల్సిందే" అంటూ సమాధానము  చెప్పుకొచ్చాడు ప్రభాస్.  ఇలాంటి న్యూస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. నిజంగా అలాంటిది ఉంటే దాచాల్సిన అవసరం ఏముంది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మంచి పద్దతి కాదంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా వరల్డ్ వైడ్ గా ఆగష్టు 30 న రిలీజ్ కాబోతుంది.
  తెలుగులో  ప్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ మెహర్ రమేష్ అని చెప్పొచ్చు. షాడో తర్వాత ఇంతవరకు ఈయన డైరెక్షన్ లో ఏ సినిమా రాలేదు. అయితే అల్లు అరవింద్ , హీరో మహేష్ లాంటి బిగ్ సినీ  పర్సనాలిటీస్ తో మాత్రం సన్నిహితం గా ఉంటూ వస్తున్నారు. ఇక  త్వరలో మెహర్ రమేష్  డైరెక్టర్ గా రీ  ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే... మహేష్ బాబు నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతూ.. వెబ్ సిరీస్  తో పాటు సినిమాలు కూడా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధిచిన పనులన్నీ మహేష్ వైఫ్ చూసుకుంటున్నారు.  ఇప్పటికే అడివి శేష్ తో `మేజర్` సినిమాను నిర్మిస్తోన్న నమ్రత ఒక వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఆ వెబ్ సిరీస్ కి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే మెహర్ రమేష్ మాత్రం అలాంటిదేం లేదని, ప్రస్తుతానికి తనకి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసే ఆలోచన లేదని ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
  'ఇస్మార్ట్ శంకర్' సూపర్ సక్సెస్‌తో యమ ఖుషీగా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన తర్వాతి సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించనున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ మూవీకి 'ఫైటర్' అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి కనెక్ట్స్ బేనర్‌పై ఆ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ విజయ్ దేవరకొండతో చేసే సినిమా కోసమే అని పూరి సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఆ టైటిల్‌ని బట్టి విజయ్ కేరెక్టర్ ఎలా ఉండబోతోందో, అతడ్ని పూరి ఎలా చూపించబోతున్నాడో అర్థమవుతోంది. కాగా కేరెక్టర్‌కు తగ్గట్లు విజయ్ తన బాడీని మార్చుకోకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వర్కౌట్స్, డైట్ ఫాలో చేసి, శరీరాన్ని దృఢంగా మార్చుకోనున్నాడు. ఇప్పుడైతే విజయ్ సన్నగా కనిపిస్తున్నాడు. 'ఫైటర్' రోల్‌కు కండలు తిరిగిన శరీరం కావాలి కాబట్టి దానికోసం డిసెంబర్ వరకు టైం తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే 2020 జనవరిలో పూరి, విజయ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. విజయ్ సరసన హీరోయిన్ కోసం పూరి, నిర్మాత ఛార్మి అన్వేషిస్తున్నారు. విజయ్‌తో కొత్త కాంబినేషన్‌ను చూపించాలని వాళ్లనుకుంటున్నారు.  
  అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారా? అమరావతి నగరంపై మంత్రి బొత్సకు అసలు అవగాహన ఉందా? లేక విలేకరులు అడిగారని... తెలిసీ తెలియని సమాచారంతో అత్యుత్సాహంతో మాట్లాడేశారా? అసలింతకీ బొత్స చెబుతున్నట్లు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందా? లేదా? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రి బొత్స మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం బౌండరీస్ గట్టుపైన ఉన్నాయి. అది సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఎత్తును 25 మీటర్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు సైతం కృష్ణమ్మ... సముద్రమట్టానికి 21 మీటర్లు దాటలేదు. అంటే వరద ఇంకో 12 అడుగులు (3 మీటర్లు) మేర పెరిగినా రాజధాని అమరావతి ఇంచు కూడా మునగదు. ఇక ప్రకాశం బ్యారేజీ రోడ్ కూడా సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే రాజధాని అమరావతిలోకి నీళ్లు రావాలంటే, కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ పైనుంచి పొంగి పొర్లాలి. అదే జరిగితే అమరావతే కాదు... కృష్ణా డెల్టా మొత్తం మునిగిపోవాల్సి ఉంటుంది. ఇక కొండవీటి వాగు లిఫ్ట్ వల్ల... వాగులోకి వరద ఎదురుతన్నే ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతి ఎలా మునుగుతుంది? ఒకవేళ అమరావతి మునగాలంటే... రెండు మూడు డ్యాములు బద్దలైతే తప్ప సాధ్యంకాదు.   ఇక కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లుకి, రాజధాని అమరావతికి అస్సలు లింకు పెట్టుకూడదు. ఎందుకంటే, చంద్రబాబు ఇల్లు ... గట్టుకి నదికి మధ్యన ఉంది. ఆ ప్రాంతం దాదాపు 250 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టే ప్లాన్ లేదు. అక్కడ కేవలం రివర్ టూరిజం ప్రాజెక్ట్స్, ప్లే గ్రౌండ్స్, పార్కులు మాత్రమే వస్తాయి. మరి, అమరావతి మునిగిపోతుందని... మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో... లేక చంద్రబాబుపై కక్షతోనే మాట్లాడుతున్నారో తెలియదు గానీ, అమాత్యుల్లో అవగాహనారాహిత్యమైతే కనబడుతోంది.  ఇక ఏకపక్ష విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని కావాలని, అది ప్రపంచశ్రేణి నగరం కావాలని, ఏపీ భవిష్యత్ కోసం తమ భూములను త్యాగంచేసిన రైతులకు మంత్రులు ఏం సమాధానం చెబుతారు? వేలాది మంది రైతుల త్యాగాలను, ఉసురును ప్రభుత్వం మూటగట్టుకుంటుందా? ల్యాండ్ ఫూలింగ్ లో కేవలం ఆరేడు వందల ఎకరాల భూములివ్వని రైతుల కోసం పోరాడిన మేధావులు... ఇప్పుడు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు?
  ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ నేతలు అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. జగన్ సర్కార్ కి రాజధానిని మార్చే ఆలోచన ఉందా అని సామాన్య ప్రజలకు సైతం అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి బడా నేతల నుంచి చోటా నేతల వరకు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొద్ది రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం.. రాజధానిగా అమరావతి అనుకూలం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరని, పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్‌ త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల బడా బాబులు అక్కడి భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో భూములు కొని ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ రాజధాని నిజంగానే మారనుందా? లేక ఇదంతా ప్రచారానికే పరిమితం కానుందా? అని జగనే తేల్చాలి.
  తాడిని తన్నేవాడు ఒకడుంటే... వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు. తెలంగాణలో ఇప్పుడిలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తోన్న గులాబీ హవాకు మెల్లమెల్లగా గండిపడుతోంది. ఎందుకంటే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఇప్పటివరకు తమకు తిరుగులేదని దీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌‌కు ఇప్పుడు బీజేపీ ఫీవర్ పట్టుకుంది. పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం స్లోగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, కేసీఆర్ కూతురు కవితను ఓడించి, తమ సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఈసారి తెలంగాణపై సీరియస్ గా గురిపెట్టింది. దక్షిణాదిన కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో మాత్రమే పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన కాషాయ అధినాయకత్వం....సీరియస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏదో తూతూమంత్రంగా కాకుండా, 2023లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే కేవలం కాంగ్రెస్, టీటీడీపీ లీడర్లనే కాకుండా, అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త లీడర్లను గుర్తించి, కమలం గూటికి చేర్చేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ వెన్నంటి ఉన్నా, పదవులు రాని లీడర్లకు గాలమేస్తోంది. 2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అ అసంతృప్త నేతలంతా... ఇఫ్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వ్యూహాన్ని, ఎత్తుల్ని పసిగట్టిన టీఆర్ఎస్... అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉందట. నామినేటెడ్ పోస్టుల ఆశ కల్పిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే, ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి లీడర్లు... కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లంతా త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌షా ఆధ్వరంలో... కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం... ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది.
  అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.
  దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది. విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  యువత మీద మీడియా ప్రభావం ఎంత ఉందో తెలీదు కానీ.. సోషల్ మీడియా ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి.. యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి పార్టీ వ్యక్తుల మీద ఏదోక తప్పుడు వార్తను సృష్టించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో అది నిజమనుకొని పలువురు నమ్ముతున్నారు. దీని మూలంగా ఆ వ్యక్తి ప్రతిష్టకు నష్టం జరుగుతుంది. ఇలా ఏదో ఒక పార్టీ అని కాదు.. చాలా పార్టీలు ఇలానే చేస్తున్నాయి. ప్రత్యర్థుల మీద అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి, సోషల్ మీడియాలో రచ్చ చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఆరోపణలే చేసి.. జనసైనికుల ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు ఉండటంతో జనసైనికులు ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ సినిమాలను వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చిస్తున్నారు. దీంతో పార్టీ నడిపేందుకు వీలుగా భారీ మొత్తాన్ని ఆయనకు విరాళంగా ఇవ్వాలని జనసైనికులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు తమకు తోచిన మొత్తాన్ని సాయం చేస్తున్నారు. అయితే ఇదంతా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్‌ అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీలో పవన్ మీద సంచలన ఆరోపణలు చేసారు. "పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి, వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి.. దానిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు." అని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఫేస్ బుక్ పేజీలో సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళు జనసేనను ఎదగనీకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారు ? జనసేన అంటే ఎందుకంత భయం?" అని జనసైనికులు నిలదీస్తున్నారు. మేము పార్టీకి విరాళంగా ఇవ్వబోయే ప్రతీ రూపాయి మా కష్టార్జితం. మేము ఇచ్చే డబ్బులు ప్రతిదానికి లెక్క చూపిస్తాం. వైసీపీ చేసిన ఈ ఆరోపణలకు ఒక్క సాక్ష్యం అయినా చూపించాలి అని జనసైనికులు ఛాలెంజ్ విసురుతున్నారు. అసలు పవన్ కు డబ్బులే ముఖ్యం అనుకుంటే తాను ఇప్పుడు సినిమాలకు ఒప్పుకున్నా సరే కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఏవైనా బ్రాండ్స్ కు ప్రకటనలు చేసుకున్నా సరే ఎన్నో డబ్బులు వస్తాయి. అలాంటిది కేవలం డబ్బులు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీతో కుమ్మక్కు అయ్యారని ప్రచారం చెయ్యడం ఏమాత్రం సమంజసం కాదని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. 
    నిన్న సాయంత్రం విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా అశీసులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐతే దీని పై బీజేపీ నుంచి ఎదురు దాడి తీవ్రమైంది. దీని పై సుజనా చౌదరి నిన్న స్పందిస్తూ దీని పై మోడీ అమిత్ షాలకు కంప్లైంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదే విషయమై బీజేపీ నేత పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం రివర్స్‌ టెండర్లు, పీపీఏల రద్దు అనేవి జగన్‌ ప్రభుత్వ స్వయంకృతాపరాదాలని ఆమె అన్నారు. పీపీఏల రద్దు పై కేంద్రం ఎన్ని లేఖలు రాసినా జగన్  పట్టించుకోలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మోడీ షాల అశీసులు ఉన్నాయనేది పచ్చి అబద్దమని పురందేశ్వరి స్పష్టం చేశారు.  తాజాగా ఇదే విషయం పై ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా స్పందిస్తూ గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇపుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏక పక్షంగా వెళ్ళొద్దని, ఆలా వెళ్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఎంత మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం ఏమాత్రం వినలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరికాదని కన్నా చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం, పోలవరం అథారిటీ చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదని అయన ధ్వజమెత్తారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని కన్నా తెలిపారు.
  ఒక పార్టీకి చెందిన నేత తప్పు చేస్తే.. ఆ పార్టీకి చెందిన మిగతా నేతలు ఆయన్ని వెనకేసుకొని రావడం చూస్తుంటాం. అయితే వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై మాత్రం సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆయన తీరుతో టీడీపీకి నష్టం జరుగుతోందని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాకు తెలిసినంతవరకూ కోడెల చేసింది తప్పే. విషయం బయటకు వచ్చాక ఇప్పుడు కావాలంటే ఫర్నీచర్ తీసుకెళ్లండి అని కోడెల చెప్పడం కరెక్ట్ కాదు' అన్నారు. అసెంబ్లీ సిబ్బంది తీసుకెళ్లలేదు కాబట్టి సామగ్రిని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పడం కూడా తప్పే. కోడెల వ్యవహారశైలి కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని వర్ల రామయ్య పునరుద్ఘాటించారు. అదేవిధంగా రాజధాని మార్పు వార్తలపై కూడా వర్ల రామయ్య స్పందించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై జగన్ కు ద్వేషం ఉందనీ, అందుకే పిచ్చి తుగ్లక్ లా రాజధానిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య  ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి... ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్యే సోడియం అనే మినరల్ కూడా బయటకి వెళ్లిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌ లాంటి చాలా సమస్యలకి దారితీస్తుంది. షికంజిలో కలిపి ఉప్పు, పంచదార ORSలాగా పనిచేసి ఒంటికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి. ఎండాకాలంలో డైజషన్‌ చాలా sensitiveగా ఉంటుంది. దానికి తోడు చల్లదనం కోసం మనం రకరకాల డ్రింక్స్‌ తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటి వల్ల కూడా digestion upset అవుతుంది. కానీ షికంజిలో ఉండే నల్ల ఉప్పు, అల్లం, జీరాపొడి, నిమ్మరసం... అన్నీ కూడా మన digestive systemని healthyగా ఉంచుతాయి. షికంజి తాగడం వల్ల immunity పెరుగుతుంది. దీనిలో ఉన్న నిమ్మరసం వల్ల మన ఒంటికి కావల్సిన విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్‌ సి వల్ల పళ్ల దగ్గర నుంచీ గుండె దాకా ఒంట్లో అన్న organs healthyగా ఉంటాయి. ఇక అల్లంలో gingerol అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక natural antibiotic గా painkiller గా పనిచేస్తుందట. షికంజితో weight loss కూడా సాధ్యమే అంటున్నారు. షికంజిలో pectin అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వుని కరిగించేస్తుంది. ఒంట్లో ఉన్న విషాన్నంతా బయటకి పంపేసే detoxing agentలాగా షికంజి పనిచేస్తుంది. దాని వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, కొవ్వు కణాలన్నీ కరిగిపోతాయి. చూశారుగా! normal drinkలాగా కనిపించే షికంజి వెనుక ఎన్ని లాభాలున్నాయో. ఒకవేళ దీన్ని బయట రకరకాల నీళ్లు కలుపుతారు కాబట్టి, తేడా చేస్తాయి అనుకుంటే ఇంట్లోనే మామూలు నీటితోనే షికంజి తయారుచేసుకోవచ్చు.  
  Dates are sodium-free, fat-free, cholesterol-free, and a good source of fiber -- all of which are important factors in keeping a watch on the weight. Dates are a better substitute for candy or a packaged sweet, when satiating a sweet tooth or serving as an instant glucose supplement. Dates can provide lot of health benefits. Dates are high in iron content and fluorine. Dates are rich source of vitamins and minerals The benefits of dates include relief from constipation, intestinal disorders, heart problems, sexual dysfunction, diarrhoea, abdominal cancer, etc Loaded with fibre -- both soluble and insoluble -- dates are able to fill you up and keep your bowel habits regular. They are an excellent source of potassium and provide numerous other important vitamins and minerals -- quite a powerhouse packed in a tiny, portable package. Go grab a pack of dates in any form, whole dates or syrup. They are available off the shelf, aren’t they? - Radha Krishnaveni
Five Healthy skin foods!   A healthy skin signifies a healthy body and there are five foods which can add that glow and rejuvenate your skin! Lemon juices: A simple ingredient which can brighten up your skin like no other! Lemon juice tightens up the skin pores, gets rid of the oil, resulting a squeaky clean and shiny face. Eggs: Take the whole egg or simply the white, which when applied on your skin will give an enhanced moisturising effect. The white part firms up the skin. Gently rub the egg white over the skin surface and wash off. Honey: Honey can be applied daily on the face. It has a great moisturising effect and also fights infections and skin acne imparting the skin with soft and supple properties. Take some honey, mix it with few spoons of lemon juice and sandalwood powder and you can apply it for the face followed by rinse off. Strawberries: The fruit acts a very effective cleanser as it contains antioxidants, Vitamin C, and exfoliants. Crushed strawberries can be used a mask and also can be rubbed over your skin. Simply observe the glow! Bananas: The tropical fruits are a great moisturiser which also imparts a refreshed feeling to your skin. - Kalam Dhari  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.