Publish Date:Sep 20, 2013
Publish Date:Sep 11, 2013
Publish Date:Aug 31, 2013
Publish Date:Aug 22, 2013
Publish Date:Aug 2, 2013
Publish Date:Jul 15, 2013
Publish Date:Jun 27, 2013
Publish Date:Jun 20, 2013
Publish Date:Jun 8, 2013
Publish Date:May 27, 2013
Publish Date:May 1, 2013
Publish Date:Mar 30, 2013
Publish Date:Feb 8, 2013

EDITORIAL SPECIAL
  తిరుమల వెళ్లే బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలను ముద్రించడంపై బీజేపీ భగ్గుమంది. తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఆర్టీసీ ఆర్ఎంకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు . కుట్రలో భాగంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన మరో నేత సౌమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా గతంలోనూ ఉద్యమాలు చేశామని, ఈ ప్రచారం ఆగకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సుల టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలపై దుమారం రేగుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో ఇలా ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. రాంభగీచ బస్టాండ్‌లోని కౌంటర్‌లో గురువారం ఉదయం నుంచి ఇచ్చిన టిక్కెట్ల వెనుక భాగంలో హజ్, జేరుసలేం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్నాయి. దీంతో కొందరు భక్తులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. అయితే తిరుమలకు వచ్చే టిక్కెట్ రోల్‌పై ఎలాంటి ప్రకటనలు ఉండవని చెప్పిన డిపో మేనేజర్.. ప్రకటనలు ఉన్న ఐదు పేపర్లు పొరపాటున తిరుమలకు వచ్చాయని చెప్పారు.   ఇదే విషయమై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బస్సు టిక్కెట్ వెనుక అన్యమత యాత్రల గురించి ప్రచారం చేయడం ఘోరమని అన్నారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను నియమించినప్పుడే భక్తులు ఆందోళన చెందారని, ఇప్పుడు వారి భయమే నిజమైందని విమర్శించారు. ఆలయ పవిత్రత, మనోభావాలను కాపాడాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని రమణ ప్రశ్నించారు. ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని.. మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని కన్నా మండిపడ్డారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదని, ఈ విషయం గురించి సీఎం జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
  జగన్ ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలింది. జపాన్ లేఖతో కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలన్న ఏపీ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జగన్ సర్కారు తోక ముడిచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పీపీఏల రద్దును తీవ్రంగా పరిగణించిన జపాన్ ప్రభుత్వం... ఇండియన్ గవర్నమెంట్ కి ఘాటు లేఖ రాసింది. భారత విద్యుత్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన జపాన్.... జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, ఖరారైన ఒప్పందాలను రద్దు చేయడాన్ని ఫ్రాన్స్, సౌతాఫ్రికా, ఐరోపా దేశాలు కూడా గమనిస్తున్నాయంటూ జపాన్ బాంబు పేల్చింది. దాంతో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం.... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పీపీఏలను రద్దుచేస్తే ఫారిన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది భారత్ కు మంచిది కాదని తేల్చిచెప్పింది. సరైన ఆధారాల్లేకుండా పీపీఏలను రద్దుచేయడం సరికాదని, పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు తగ్గి, అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. అవినీతి జరిగిందని స్పష్టంగా తేలితే తప్ప, చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్నీ రద్దు చేయలేమని జగన్ సర్కారుకు గుర్తుచేసింది.  అయితే, పీపీఏలన్నింటినీ తాము రద్దు చేయలేదని, కేవలం అవకతవకలు జరిగాయని నిర్ధారించిన ఒప్పందాలను మాత్రమే పునసమీక్షిస్తున్నట్లు కేంద్రానికి తెలియజేసింది. ఒకవైపు జపాన్ లేఖ... మరోవైపు కేంద్రం హెచ్చరికలతోనే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పీపీఏల సమీక్ష నిర్ణయం తీసుకున్నామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినరోజే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ఈ ఆదేశాలు రావడం విజయసాయి మాటలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కూడా కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోడెల ఇంకా అనేక అక్రమాలు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల తన మార్కు చూపించారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనే నిర్ణయించారట. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ.. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదట.   ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారట. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారట. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదట. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవట. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయట. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  శుక్రవారం విడుదలైన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా సమర్పకులు, క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని అందించిన సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు రెండు తెలుగు న్యూస్ చానళ్లు.. టీవీ9, ఎన్‌టీవీపై ఆగ్రహాన్నీ, ఆక్రోశాన్నీ వ్యక్తం చేశారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌గా ఆ రెండు చానళ్లను తాము ఎంకరేజ్ చేస్తూ వస్తుంటే, ఇవాళ తమ సినిమా ఈవెంట్‌ను లైవ్ టెలిక్యాస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలపై ఇంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. ఇది తమను అవమాన పరచినట్లుగా భావిస్తున్నామని రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ నాయికగా, భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన 'కౌసల్య కృష్ణమూర్తి' మూవీ ఆగస్ట్ 23న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందుతూ, ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఆ మూవీ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రామారావు మాట్లాడుతూ "మా సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తే టీవీ 9, ఎన్టీవీ లైవ్ టిలికాస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎల్.ఎల్.పీ. ద్వారా ఆ రెండింటినీ మేం ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. లైవ్ కోసమంటూ కెమెరాలు పెట్టారు. మేం ఫంక్షన్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తే, టీవీలో లైవ్ రాలేదేంటని ఇంట్లోవాళ్లు అడిగారు. దాన్ని మేం చాలా షేంగా ఫీలయ్యాం. ఎందుకంటే ఆ రెండు చానల్స్‌ని నిర్మాతల తరపునా, ఇండస్ట్రీ తరపునా చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. పెద్ద సినిమాలకు వాళ్లేం చెయ్యక్కర్లేదు. చేస్తే అది వాళ్లకు ఉపయోగం. చిన్న సినిమాల్ని బతికించడం కోసం వాటిని ఎంకరేజ్ చేస్తే, అది వాళ్లకీ గర్వకారణంగా ఉంటుంది, మరిన్ని మంచి చిన్న సినిమాలు రావడానికి ఆస్కారం కలుగుతుంది. దయచేసి ఆ చానళ్లు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి వ్యాపార దృష్టీ లేకుండా మంచి సినిమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. లైవ్ ఆ రెండు చానళ్లకే ఎందుకిస్తున్నామో ఇప్పుడు నాకర్థం కాలేదు. చిరంజీవి గారిది కానీ, మహేశ్ బాబు గారిది కానీ చేస్తారు. బాగానే ఉంది. మాదెందుకు చెయ్యట్లేదు? మేం కూడా డబ్బులిస్తున్నాం. మేం కూడా ఆ రెండింటికే డబ్బులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం. అలాంటిది ఆ రెండూ మా సినిమాకి లైవ్ ఇవ్వలేదని షేం ఫీలయ్యాం. మేం నిర్మాతలం కామా? మాది సినిమా కాదా? వాళ్లు లైవ్ ఇవ్వనందున మా సినిమాకు ఓపెనింగ్స్ రాలేదనే డౌట్ నాకు లేదు. మా సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడానికి వేరే రీజన్ ఉంది. సినిమా ప్రచారంలో మీడియా కూడా ఒక భాగం. అందుకని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నా. ఇక నుంచీ అలాంటి తారతమ్య భేదాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని ఆవేదన వ్యక్తం చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న మహా ముల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `.  ప్రెజెంట్ ఈ చిత్ర యూనిట్ బల్గెరియా లో ఉంది. అక్కడే నెల రోజుల  పాటు షూటింగ్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ పైనే  కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధిచిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే... `ఆర్ ఆర్ ఆర్ `మూవీ ఫస్ట్ లుక్ అక్టోబర్ 22 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అదే రోజు న చేయడానికి కారణం... ఆ రోజు కొమరం భీం పుట్టిన  రోజు అట.  అందుకే కొమరంభీం గా నటిస్తోన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది.  అజయ్ దేవ్ గణ్ , సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  మాస్ డైరెక్టర్‌గా పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ అందించిన వి.వి. వినాయక్ త్వరలో హీరోగా అవతారం ఎత్తనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు 'శరభ' ఫేం నరసింహారావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నటించడం కోసం వినాయక్‌కు భారీ పారితోషికాన్నే రాజు అందిస్తున్నట్లు ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. ఆ కేరెక్టర్ కోసం వినాయక్ తన శరీరాన్ని కష్టపెడుతున్నారు. బరువును తగ్గించుకోడానికి డైట్ ఫాలో అవడమే కాకుండా జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. వినాయక్ తెరపై కనిపించడం ఇదే తొలిసారి కాదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఠాగూర్'లో వినాయక్ ఒక చిన్న పాత్రలో దర్శనమిచ్చారు. ఆ సినిమాని వినాయక్ డైరెక్ట్ చేసిన విదితమే. ఇప్పుడు హీరో అవుతున్న వినాయక్‌తో చిరంజీవి ఏం చెప్పారు?  "దిల్ రాజు బేనర్‌లో నేను హీరోగా నటించబోతున్నానని తెలిసి అన్నయ్య (చిరంజీవి) చాలా ఆనందించారు. 'వినయ్.. నువ్వు నటించబోతున్నట్లు వచ్చిన ప్రకటనలో నీ ఫొటో చూశాను. నాకు చాలా ఆనందం వేసింది. రాజు చూపించాడు. నువ్వు యాక్టర్‌వి అవుతున్నావనే ఎగ్జైట్‌మెంట్ కంటే కూడా.. ఫస్ట్ నువ్వు బరువు తగ్గుతున్నావు. జిమ్ కెళ్లి కష్టపడుతున్నావ్. బాడీని ఒక షేప్‌లోకి తెచ్చుకుంటున్నావ్. ఈ యాక్టింగ్ ఉంటేనే అది చేస్తావ్. నీ ఇంటికి పెద్దవి నువ్వే. నువ్వు ఎంత హెల్దీగా ఉంటే నీ ఫ్యామిలీ అంత బాగుంటుంది. అది నాకు చాలా ఆనందమేసింది. ఇంకా కష్టపడు. ఇంకా తగ్గు' అని చెప్పారు" అని వినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా 'ఠాగూర్'లో వినాయక్ వేసిన చిన్న రోల్‌ని చిరంజీవి ప్రస్తావించారు కూడా. "వినయ్.. ఇప్పుడు నువ్వు మెయిన్ రోల్ చేస్తున్నప్పటికీ, నిన్ను మొదట యాక్టర్ని చేసింది నేనే" అని సరదాగా అన్నారని వినాయక్ చెప్పారు. "అది నిజమే. ఆయన చెయ్యమంటేనే 'ఠాగూర్'లో ఒక సన్నివేశంలో కనిపించే రోల్ చేశాను.  "నీ కళ్లు బాగుంటాయి. ఇది నువ్వు చెయ్యి" అని ఆ రోజు నాచేత బలవంతంగానే ఆయన చేయించారు. ఆ సీనులో నేను బాగా చేశానని ఎవరైనా అన్నారంటే, ఆ క్రెడిట్ అన్నయ్యదే" అని చెప్పుకొచ్చారు వినాయక్.
  నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య తెరపై అవే తరహా పాత్రలు చేస్తోన్న చిత్రం 'వెంకీ మామ'. ఆ ఇద్దరు కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కూడా ఇదే. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తొన్న ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై డి. సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలొ వెంకీ జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా వల్ల వెంకటేశ్‌కి రాశీ పెద్ద అభిమాని అనే విషయం తెలిసింది. ఆ సినిమా సెట్స్‌పై వెంకీని కావలించుకొని ఫొటో దిగిన రాశి, దాన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసి, 'ఫ్యాన్ గాళ్' అంటూ క్యాప్షన్ జోడించింది. స్టార్ హీరోల్లో చాలా నిరాడంబరంగా కనిపించే వెంకీకి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌పై సరదాగా గడిపే ఆయన, సహనటులతో పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. వాటిలో ఆధ్యాత్మిక అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయనతో ఒక అర గంట మాట్లాడితే చాలు.. చాలా విషయాలు తెలుస్తాయని అందరూ చెప్పే మాట. బహుశా రాశికి కూడా వెంకీ అట్లాంటి విషయాలేవో చెప్పి ఉంటారు. ఆ ఆనందాన్ని ఇలా ఫోటో తీయించుకోవడం ద్వారా వ్యక్తీకరించి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాశి. ఈ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.  ఆర్మీ నేపథ్యంలో నడిచే కథతో తయారవుతున్న 'వెంకీ మామ'ను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
    విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఈ నెల 25(ఆదివారం)న ఆవిష్క‌రించేందుకు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ ఆవిష్క‌ర‌ణ కార‌ణాంత‌రాన వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్రభుత్వం నుండి  అనుమ‌తులు ఇంకా మంజూరు కాలేదు.  త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. అయితే అనుమతులు రాకుండా విగ్రహా విష్కరణ కి డేట్ ఎందుకు ఫిక్స్ చేసారు? అన్నది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట. ఇక ఈ ప్రోగ్రామ్ కోసం మెగాస్టార్ చాలా కార్యక్రమాలు పోస్ట్ పోనే చేసుకున్నారట. ఇక ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. 18 జూలై 1974లో ప‌ర‌మ‌ప‌దించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయ‌న‌ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు.  విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఈయన బిరుదులు.
  స్వామి పరిపూర్ణనంద... హిందూధర్మ పరిరక్షణలో దూకుడుగా వెళ్తూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫ్యామస్ అయిన స్వామీజీ. ఇదే బీజేపీ హైకమాండ్ ను ఆకర్షించింది. అంతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలోకి రప్పించి రాష్ట్రమంతా తిప్పారు. పరిపూర్ణానంద కూడా బాగానే హడావిడి చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరుగుతూ... లక్ష్మణ్‌కు పోటాపోటీగా, సభలు సమావేశాలు, ర్యాలీలతో అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. మతం, జాతీయవాదం పేరుతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతూనే... కాంట్రవర్సీ కామెంట్స్ తో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దాంతో భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేది స్వామీజీనే అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత కథ అడ్డం తిరిగింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. పైగా డిపాజిట్లు కూడా రాలేదు. రాజాసింగ్ సొంత ఇమేజ్‌తో గెలిచాడు. తన ప్రయోగం విఫలం కావడంతో పరిపూర్ణానంద కలత చెందారట. ఇక ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దాంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు.  అయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ వెనువెంటనే వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో, అసెంబ్లీ అనుభవంతో, ఒక్క ఎంపీ సీటూ కూడా రాదని స్వామిజీ అంచనా వేశారట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్‌ పోరులో, అందరి అంచనాలను తలకిందులుచేస్తూ... నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి ఉంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్‌ లీడర్‌గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సే లేకుండా పోయింది. దాంతో, ఇప్పుడెక్కడా కనిపించకుండా సెలైన్స్ మెయింటైన్ చేస్తున్నారట స్వామీజీ. అయితే, పార్టీకి ఆదరణ లేనప్పుడు పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ పుంజుకుంటున్నప్పుడు పట్టించుకోకపోవడం స్వామిజీకి రుచించడం లేదట. పైగా కొందరు నేతలు పరిపూర్ణానందను అవమానించారని, అందుకే దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, స్వామీజీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం కొందరు ముఖ్యనేతలకు నచ్చడంలేదనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి, పరిపూర్ణానంద పరిస్థితిని తలుచుకుని... పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.
  ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపరైనా తనకు తిరుగులేదని అసెంబ్లీ అండ్ లోకల్ ఎలక్షన్స్ లో రుజువు చేసుకుంది టీఆర్ఎస్. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ లెక్క తప్పింది. ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కూడా మూడు సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక కారు-సారు(కేసీఆర్)-పదహారు అంటూ బరిలోకి దిగిన టీఆర్ఎస్... 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ తొమ్మింటిలోనూ రెండు స్థానాలను బొటాబోటీ మెజారిటీతో దక్కించుకుంది. ఇదంతా పక్కనబెడితే కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లో... కూతురు కవిత నిజామాబాద్ లో దారుణ పరాజయం పాలవడంతో గులాబీ బాస్ షాక్ తిన్నారు. అయితే, తన కూతురుపై ప్రజాగ్రహాన్ని ముందే గుర్తించిన కేసీఆర్... కవిత గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. నిజామాబాద్ లో పట్టున్న మండవ లాంటి లీడర్లను అప్పటికప్పుడు పార్టీలోకి రప్పించి కవితను గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. అయినాసరే నిజామాబాద్ ప్రజలు కేసీఆర్ అండ్ కవితకు తిరుగులేని షాకిచ్చారు. అయితే, ఓటమి తర్వాత సైలెంటైపోయిన కవిత భవిష్యత్ ఏంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో మెరుపులా మెరిసి, ఇప్పుడు సైలెంటైపోవడంతో ఆమె అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే, కరీంనగర్ లో ఓడిపోయిన వినోద్ కుమార్ ను కేబినెట్ ర్యాంకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.... కూతురు కవితకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన కీలక పదవిని అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని, అలాగే పార్టీకి-ప్రభుత్వానికి మధ్య కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది.  అయితే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కవితను నియమిస్తారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. కేబినెట్‌ ర్యాంకున్న ఈ పదవిని, కవితకు ఇస్తే బాగుంటుందన్న చర్చ తెలంగాణ భవన్‌లో జరుగుతోంది. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి రైతుల ఆందోళనే ముఖ్య కారణం. అందుకే, రైతులతో మరింత మమేకమయ్యేందుకు, ఈ పదవి ఉపకరిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో వెళ్తారా? లేక పార్టీకి, ప్రభుత్వానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారా? లేదంటే రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కొత్త బాధ్యతలు చేపడతారో చూడాలి.
  అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారా? అమరావతి నగరంపై మంత్రి బొత్సకు అసలు అవగాహన ఉందా? లేక విలేకరులు అడిగారని... తెలిసీ తెలియని సమాచారంతో అత్యుత్సాహంతో మాట్లాడేశారా? అసలింతకీ బొత్స చెబుతున్నట్లు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందా? లేదా? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రి బొత్స మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం బౌండరీస్ గట్టుపైన ఉన్నాయి. అది సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఎత్తును 25 మీటర్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు సైతం కృష్ణమ్మ... సముద్రమట్టానికి 21 మీటర్లు దాటలేదు. అంటే వరద ఇంకో 12 అడుగులు (3 మీటర్లు) మేర పెరిగినా రాజధాని అమరావతి ఇంచు కూడా మునగదు. ఇక ప్రకాశం బ్యారేజీ రోడ్ కూడా సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే రాజధాని అమరావతిలోకి నీళ్లు రావాలంటే, కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ పైనుంచి పొంగి పొర్లాలి. అదే జరిగితే అమరావతే కాదు... కృష్ణా డెల్టా మొత్తం మునిగిపోవాల్సి ఉంటుంది. ఇక కొండవీటి వాగు లిఫ్ట్ వల్ల... వాగులోకి వరద ఎదురుతన్నే ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతి ఎలా మునుగుతుంది? ఒకవేళ అమరావతి మునగాలంటే... రెండు మూడు డ్యాములు బద్దలైతే తప్ప సాధ్యంకాదు.   ఇక కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లుకి, రాజధాని అమరావతికి అస్సలు లింకు పెట్టుకూడదు. ఎందుకంటే, చంద్రబాబు ఇల్లు ... గట్టుకి నదికి మధ్యన ఉంది. ఆ ప్రాంతం దాదాపు 250 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టే ప్లాన్ లేదు. అక్కడ కేవలం రివర్ టూరిజం ప్రాజెక్ట్స్, ప్లే గ్రౌండ్స్, పార్కులు మాత్రమే వస్తాయి. మరి, అమరావతి మునిగిపోతుందని... మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో... లేక చంద్రబాబుపై కక్షతోనే మాట్లాడుతున్నారో తెలియదు గానీ, అమాత్యుల్లో అవగాహనారాహిత్యమైతే కనబడుతోంది.  ఇక ఏకపక్ష విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని కావాలని, అది ప్రపంచశ్రేణి నగరం కావాలని, ఏపీ భవిష్యత్ కోసం తమ భూములను త్యాగంచేసిన రైతులకు మంత్రులు ఏం సమాధానం చెబుతారు? వేలాది మంది రైతుల త్యాగాలను, ఉసురును ప్రభుత్వం మూటగట్టుకుంటుందా? ల్యాండ్ ఫూలింగ్ లో కేవలం ఆరేడు వందల ఎకరాల భూములివ్వని రైతుల కోసం పోరాడిన మేధావులు... ఇప్పుడు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు?
  ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ నేతలు అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. జగన్ సర్కార్ కి రాజధానిని మార్చే ఆలోచన ఉందా అని సామాన్య ప్రజలకు సైతం అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి బడా నేతల నుంచి చోటా నేతల వరకు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొద్ది రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం.. రాజధానిగా అమరావతి అనుకూలం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరని, పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్‌ త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల బడా బాబులు అక్కడి భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో భూములు కొని ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ రాజధాని నిజంగానే మారనుందా? లేక ఇదంతా ప్రచారానికే పరిమితం కానుందా? అని జగనే తేల్చాలి.
  తాడిని తన్నేవాడు ఒకడుంటే... వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు. తెలంగాణలో ఇప్పుడిలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తోన్న గులాబీ హవాకు మెల్లమెల్లగా గండిపడుతోంది. ఎందుకంటే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఇప్పటివరకు తమకు తిరుగులేదని దీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌‌కు ఇప్పుడు బీజేపీ ఫీవర్ పట్టుకుంది. పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం స్లోగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, కేసీఆర్ కూతురు కవితను ఓడించి, తమ సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఈసారి తెలంగాణపై సీరియస్ గా గురిపెట్టింది. దక్షిణాదిన కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో మాత్రమే పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన కాషాయ అధినాయకత్వం....సీరియస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏదో తూతూమంత్రంగా కాకుండా, 2023లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే కేవలం కాంగ్రెస్, టీటీడీపీ లీడర్లనే కాకుండా, అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త లీడర్లను గుర్తించి, కమలం గూటికి చేర్చేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ వెన్నంటి ఉన్నా, పదవులు రాని లీడర్లకు గాలమేస్తోంది. 2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అ అసంతృప్త నేతలంతా... ఇఫ్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వ్యూహాన్ని, ఎత్తుల్ని పసిగట్టిన టీఆర్ఎస్... అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉందట. నామినేటెడ్ పోస్టుల ఆశ కల్పిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే, ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి లీడర్లు... కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లంతా త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌షా ఆధ్వరంలో... కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం... ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది.
  అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.
    మొన్న ఏప్రిల్ లో ఎపి అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో వైసిపి అధినేత జగన్ నవరత్నాల తో పాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ హామీలలో  వృద్దులను అమితంగా ఆకట్టుకుని వారి ఓట్లను కొల్లగొట్టిన హామీ వృద్ధుల పింఛన్ ను రూ 3000 కు పెంచడం. ఐతే జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత అప్పటి వరకు రూ 2000 గా ఉన్న పింఛన్ ను రూ 2250 కు పెంచి వృద్దులకు అందిస్తున్నారు. పింఛన్ మూడు వేలు చేస్తామన్నారు కదా అని వృద్దులు ప్రశ్నిస్తే వైసిపి నేతల నుండి వచ్చిన సమాధానం మేము మూడు వేలకు పెంచుకుంటూ పోతామన్నాం అని. ఐతే గత ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు వృద్దులకు 1 లేదా 2వ తేదికి ఇంటికి వచ్చి పింఛన్లు అందచేసేవారు. ఐతే ఇప్పుడు ఎదో ఒక కారణం తో పదో తేదీ వరకు పింఛను అందని  పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కుక్కునూరు వేలేరుపాడు గ్రామం లో ఐతే ఏకంగా పింఛను సొమ్ములో దొంగ నోట్లు పంచినట్లు వార్తలు వస్తున్నాయి. వృద్దులకు దొంగ నోట్లు పంచితే మరి పంచాల్సిన అసలు నోట్లు ఎటు పోయినట్లు అని విమర్శలు వినిపిస్తున్నాయి.  
  ఏపీ రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈరోజు హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్ ని కలిశారు. రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు పవన్ ని కోరారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబు అని పవన్‌‌ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే కానీ రద్దు చేస్తామనడం సరికాదని పవన్ హితవు పలికారు. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదన్నారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని తెలిపారు. ఇప్పుడు రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. రాజధాని కోసం రైతులు తరతరాలుగా వస్తున్న భూములను త్యాగం చేశారని కొనియాడారు. రైతులకు పొలం పని తప్ప ఇంకేమీ తెలియదన్నారు. అయినా పొలాలను వదులుకున్నారంటే అది రాష్ట్రం కోసమేనని పవన్ ప్రశంసించారు.
    టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రముఖ బీజేపీ నేత, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. గతంలో ఆంధ్రోళ్లు జల దోపిడీ చేస్తున్నారని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారని అయితే ఇప్పుడు కేసీఆర్‌ పాలనలోనూ అదే జరుగుతోందని విమర్శించారు. గోదావరి నీటిని నది పరిసర ప్రాంతాలకు ఇవ్వకుండా అనవసరమైన రిజర్వాయర్లు కట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలను జలదోపిడీ కాకపోతే ఏమంటారని తెలంగాణ ప్రభుత్వాన్ని సోమారపు ప్రశించారు. ఈ జలదోపిడీ ఆపకపోతే ప్రబుత్వానికి ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. సోమారపు సత్యనారాయణ గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఐతే మొన్న డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో  రామగుండం నుండి సోమారపు సత్యనారాయణ పై విజయం సాధించిన ఇండిపెండెంట్ కోరుకంటి చంద్రశేఖర్ ను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం పై అధిష్టానం తో విభేదించి ఆయన బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే.
  French fries, Samosa, Chips.... Mouth watering snacks that no one can resist. But, have ever realized how much junk you are filling your body with? You need to look beyond taste and take care of your body. When your stomach calls for your attention before dinner time. Don’t give it anything and everything that’s available. Think! What adds to your health without adding much to your calories. Healthy snacking is a habit you need to develop carefully. If you like something sweet try out the Cashew-Strawberry Crunch. The cashew butter will take care of your heart and the half teaspoon honey will make you glow a little more. A plate of prosciutto or ham around a part-skim mozzarella string cheese will give you all the taste and health you need. It a very good source of 1000 mg calcium that a women needs. If you are looking for a good fruit snack, ¼ cup dried pineapple pieces with about 25 pistachio nuts is the best recipe for you. Want to know why? It is because this dish will give you the much needed antioxidants through pineapple and nuts. Have you ever tried a combination of apple and cottage cheese. You should try it if you want protein, fiber and calcium. All need to do is slice an apple, such as Fuji or Granny Smith, and top with ½ cup of low-fat cottage cheese. Stick to the healthy food and enjoy healthy snacks everyday! -Kruti Beesam
  It is not always possible to visit a doctor for some of the common and frequent health disorder. And rightly it is not such a good idea to pop in tablets at your comfort! So it is best to solve them at home. Here are the some common yet bothersome problems and their remedies! Stress-induced headaches can be shooed away by clenching a pencil, by doing so you relax your jaw muscles and erase out tension and stress. This remedy is not applicable for migraine and sinus pressure headaches Is motion sickness scaring you from traveling? Then grab some olives or lemon, these are effective in diminishing nausea, and in relieving you from motion sickness Most of us might have experienced uncontrollable hiccups, the way out is to suddenly scare the person or a spoon full of sugar would do the trick! Warts, the small blister which deface the appearance of your skin can be ditched of by a strip of duct tape used daily, followed by exfoliation by a pumice stone once a week. Though it is a slow process golden results are assured! Inflamed skin or Eczema can be cure by the use of oatmeal, having anti-inflammatory properties; it is applied over affected area for 15 minutes and then rinsed. Oatmeal is successful in reducing inflammation as well as redness Is nail fungus frightening you? Use vapor rub instead to time-taking manicures and pedicures. When used consistently not only the fungus falls off but the infected toenail too, instead a new fungus-free nail grows! Bad breathe embarrassing you among your peer group or colleagues? Then include yogurt in your meals without fail! Because its neutralizing powers and probiotics reduce the bacteria and thus bad breathe Follow Simple Rules!! And Stay Hassle-free!!
మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి... ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్యే సోడియం అనే మినరల్ కూడా బయటకి వెళ్లిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌ లాంటి చాలా సమస్యలకి దారితీస్తుంది. షికంజిలో కలిపి ఉప్పు, పంచదార ORSలాగా పనిచేసి ఒంటికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి. ఎండాకాలంలో డైజషన్‌ చాలా sensitiveగా ఉంటుంది. దానికి తోడు చల్లదనం కోసం మనం రకరకాల డ్రింక్స్‌ తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటి వల్ల కూడా digestion upset అవుతుంది. కానీ షికంజిలో ఉండే నల్ల ఉప్పు, అల్లం, జీరాపొడి, నిమ్మరసం... అన్నీ కూడా మన digestive systemని healthyగా ఉంచుతాయి. షికంజి తాగడం వల్ల immunity పెరుగుతుంది. దీనిలో ఉన్న నిమ్మరసం వల్ల మన ఒంటికి కావల్సిన విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్‌ సి వల్ల పళ్ల దగ్గర నుంచీ గుండె దాకా ఒంట్లో అన్న organs healthyగా ఉంటాయి. ఇక అల్లంలో gingerol అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక natural antibiotic గా painkiller గా పనిచేస్తుందట. షికంజితో weight loss కూడా సాధ్యమే అంటున్నారు. షికంజిలో pectin అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వుని కరిగించేస్తుంది. ఒంట్లో ఉన్న విషాన్నంతా బయటకి పంపేసే detoxing agentలాగా షికంజి పనిచేస్తుంది. దాని వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, కొవ్వు కణాలన్నీ కరిగిపోతాయి. చూశారుగా! normal drinkలాగా కనిపించే షికంజి వెనుక ఎన్ని లాభాలున్నాయో. ఒకవేళ దీన్ని బయట రకరకాల నీళ్లు కలుపుతారు కాబట్టి, తేడా చేస్తాయి అనుకుంటే ఇంట్లోనే మామూలు నీటితోనే షికంజి తయారుచేసుకోవచ్చు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.