Publish Date:Nov 23, 2013
Publish Date:Nov 20, 2013
Publish Date:Nov 18, 2013
Publish Date:Nov 14, 2013
Publish Date:Nov 13, 2013
Publish Date:Nov 12, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Nov 1, 2013
Publish Date:Oct 29, 2013
Publish Date:Oct 25, 2013
Publish Date:Oct 23, 2013
Publish Date:Sep 28, 2013

EDITORIAL SPECIAL
  అయోధ్య వివాదం 1822లో మొదలైంది. ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా... ఓ కేసు సందర్భంగా దీన్ని వివాదంగా పేర్కొన్నారు. కానీ, 1957లో తొలి వ్యాజ్యం పడింది. బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మహ్మద్ అస్ఘర్ ఈ వ్యాజ్యం వేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు ప్రాంతాన్ని హనుమాన్ గఢీ మహంత్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దాంతో, హనుమాన్ గఢీ మహంత్ లో ఉండే వైష్ణవ బైరాగులు ప్రతి కేసు దాఖలు చేశారు. బాబ్రీ మసీదు స్థలం... రాముడు పుట్టిన చోటు అంటూ వైష్ణవ బైరాగులకు చెందిన నిర్మోహీ అఖాడా 1857లో కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం... వివాదాస్పద స్థలంలో అడ్డుగోడ కట్టించి, హిందువులంతా తూర్పువైపు నుంచి.... ముస్లింలు ఉత్తరం వైపు నుంచి వెళ్లాలని ఆదేశించింది. ఇక, 1860-84 మధ్య అయోధ్య స్థలంపై అనేక కేసులు దాఖలు అయ్యాయి. కానీ అతిముఖ్యమైన కేసు 1885లో పడింది. వివాదాస్పద స్థలానికి(రామజన్మస్థానం) తానే మహంత్ నని, అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ధార్మిక నేత రఘువర్ దాస్ పిటిషన్ వేశారు. అయితే, దాన్ని 1986లో కోర్టు కొట్టివేసింది. అయితే, వివాదాస్పద ప్రాంతాన్ని హిందువులు రామజన్మభూమి అని బలంగా నమ్మడానికి దోహడపడింది. దాంతో అప్పట్నుంచి 1923వరకు అనేక వ్యాఖ్యాలు నమోదయ్యాయి.  అయితే, 1949లో అయోధ్య బాబ్రీ మసీదు లోపల... కొందరు బలవంతంగా సీతారామలక్ష్మణుల విగ్రహాలు పెట్టడంతో... దేశ చరిత్రలోనే అతిపెద్ద వివాదంగా రూపుదాల్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఈ వివాదం పురుడు పోసుకుంది. అయితే, 1949 డిసెంబర్ 29న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద ప్రాంతంలో యథాతధ స్థితిని కొనసాగించాలని ఫైజాబాద్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాంతో, ఆ ప్రాంతాన్ని మూసివేసి, ముస్లింలకు అనుమతి నిరాకరించారు. అయితే హిందూ పూజల నిమిత్తం నలుగురు పూజారులకు మాత్రం అనుమతి ఇచ్చారు. అనంతరం 1950 జనవరి 16న హిందూమహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ కేసు వేశారు. వివాదాస్పద ప్రాంతంలో ఉన్న హిందూ విగ్రహాలను ఎప్పటికీ తొలగించరాదని, పూజలు చేసుకోనివ్వాలని కోరారు. ఇక, 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ వేసింది. అది రాముడు పుట్టిన చోటని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరింది. దాంతో, 1961 డిసెంబర్ 18న సున్నీ వక్ఫ్ బోర్డు కౌంటర్ పిటిసన్ వేసింది. అక్కడున్న బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడని, ఆ ప్రాంతం తమకే చెందుతుందని, దాన్ని తమకు అప్పగించాలని కోరింది. ఇక, 1990ల్లో ఈ వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. ఈ ఘటన వివాదాన్ని మరో మలుపు తిప్పింది.  అనంతరం, ఈ వివాదంపై 1992 నుంచి 2002వరకు అలహాబాద్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, 2010 జులై 26న తీర్పు ప్రకటించిన అలహాబాద్ హైకోర్టు... వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకు సమానంగా పంచుతూ నిర్ణయం ప్రకటించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక, 2019 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు ఏకధాటిగా 40రోజులపాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పగిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన నిర్ణయం ప్రకటించింది.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు భూవివాదమే కారణమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, లంచం కోసం వేధించినందుకే సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సర్వే నెంబర్ 90, 101లో గల 20 ఎకరాలకు సంబంధించిన భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణంగా తెలుస్తోంది. తన వ్యవసాయ భూమిని ఓ రియల్టర్‌కు కట్టబెట్టేలా రిపోర్ట్ ఇవ్వడంతో... కొద్దిరోజులుగా సురేష్‌....  అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అన్యాయంగా తన భూమిని రియల్టర్‌కు కట్టబెట్టేలా వ్యవహరించినందుకే... మనోవేదనకు గురై... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌... ల్యాండ్ మ్యుటేషన్ కోసం తహశీల్దార్ విజయారెడ్డికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఎంతకీ తన పని కాకపోవడంతో.... విజయారెడ్డిపై కోపం పెంచుకున్న సురేష్‌.... ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇక, నిందితుడు సురేష్‌కి కూడా తీవ్ర గాయాలు కావడంతో... కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అసలు, విజయారెడ్డి కార్యాలయంలోకి దుండగుడిని ఎవరు అనుమతించారు... హత్యకు అసలు కారణమేంటనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, భూవివాదంలో... విజయారెడ్డి మర్డర్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్న సీపీ.... దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు.... పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
  ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.     ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.     దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.     కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
  సూపర్‌స్టార్ మహేశ్ కుమారుడు గౌతమ్ '1.. నేనొక్కడినే' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె సితార సైతం సినిమాల్లోకి అడుగుపెడుతోంది. అయితే నటిగా కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా! అవును. హాలీవుడ్ యానిమేషన్ ఫిల్మ్ 'ఫ్రోజెన్ 2' తెలుగు వెర్షన్‌లో ప్రధాన పాత్ర 'ఎల్సా'కు ఆమె వాయిస్ ఇచ్చింది. డిస్నీ స్టూడియో నిర్మించగా, సూపర్‌హిట్టయిన 'ఫ్రోజెన్' మూవీకి ఇది సీక్వెల్. నవంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. మహేశ్, నమ్రతల ముద్దుల కుమార్తె ఏడేళ్ల సితార ఈ మూవీలో చిన్నప్పటి ఎల్సాకు డబ్బింగ్ చెప్పింది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ "సితారకు 'ఫ్రోజెన్' మూవీ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూస్తూ పెరిగింది. అందులో ఎల్సా పాత్ర అంటే తనకు మరీ మరీ ఇష్టం. ఆ ఇష్టం వల్ల, యంగ్ ఎల్సాకు వాయిస్ ఇవ్వాలనే ఆఫర్‌ను కాదనడానికి ఎలాంటి కారణమూ కనిపించలేదు. ఈ సినిమాకు ప్రతి అమ్మాయీ కనెక్టవుతుంది. సితార అందుకు మినహాయింపు కాదు. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన డిస్నీ బృందానికి మా థాంక్స్. 'ఫ్రోజెన్ 2' తెలుగు వెర్షన్‌లో భాగమైనందుకు సితార చాలా హ్యాపీగా ఉంది. అలాగే తన ఫేవరేట్ కేరెక్టర్‌కు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంతగానో ఆస్వాదించింది" అన్నారు. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అమ్మాయిలు చేసే సాహసాలతో సాగే 'ఫ్రోజెన్ 2' సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ వెర్షన్లలో దేశవ్యాప్తంగా నవంబర్ 22న రిలీజ్ అవుతోంది. సితార తన వాయిస్‌తో ఎల్సా కేరెక్టర్‌కు ఏ విధంగా జీవం పోసిందో చూడాలి.
  సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఓపెనింగ్‌ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రామానాయుడు స్టూడియోను ఓపెనింగ్‌ కోసం బాగా ముస్తాబు చేశారు. ప్రొగ్రామ్‌ లైవ్‌ ఇచ్చారు. ఇంచుమించు ఆదివారం పాతిక లక్షలు ఖర్చు చేశారని టాక్‌. మనవడిని ఆశీర్వదించడానికి కృష్ణ వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి రామ్‌చరణ్‌, దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా, అక్కినేని ఫ్యామిలీ నుండి అమల, సుశాంత్‌, కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వచ్చారు. అశోక్‌ తండ్రి గల్లా జయదేశ్‌ రాజకీయ సహచరులు, తెలుగుదేశం నేతలు వచ్చారు. ఎంతమంది వచ్చినా అక్కడ మహేష్‌బాబు లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడింది. కొందరు అభిమానుల్లో డిస్కషన్‌ పాయింట్‌ కూడా అయ్యింది. మేనల్లుడు అశోక్‌కి విషెస్‌ చెప్తూ, ఆదివారం ఉదయం మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు. ఓపెనింగ్‌కి అర్థాంగి నమ్రతను పంపాడు. మరి, అతడు ఎందుకు రాలేదు? అంటే... తను ఓపెనింగ్‌కి వస్తే సినిమా హిట్‌ కాదని మహేష్‌ సెంటిమెంట్‌. సొంత సినిమా ఓపెనింగ్స్‌లో మహేష్‌ కనిపించడు. అందుకని, మేనల్లుడి సినిమా ఓపెనింగ్‌కి రాలేదని ఘట్టమనేని ఫ్యామిలీ ఇన్‌సైడ్‌ టాక్‌. షూటింగ్‌కి ఒకట్రెండు సార్లు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి అటెండ్‌ అవ్వడం ఖాయమట! మేనల్లుడికి మహేష్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది.
  యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌, డైనమిక్‌ లేడీ యాక్టర్‌ జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆల్రెడీ చిన్నకుమార్తె శివాత్మిక ‘దొరసారి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. పెద్ద కుమార్తె శివాని కూడా ఈపాటికి ఎంట్రీ ఇవ్వాల్సిందే. కానీ, ‘2 స్టేట్స్‌’ సినిమా ఆగిపోవడంతో లేట్‌ అయ్యింది. అడివి శేష్‌ హీరోగా మొదలైన ఆ సినిమా ఆగినా... మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇంద్ర’లో హీరో చిన్నప్పటి పాత్ర చేసిన తేజ గుర్తున్నాడా? అదే మొన్న సమంత ‘ఓ బేబీ’లో మనవడిగా నటించాడు. ఆ కుర్రాడు హీరోగా, శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా ఒక సినిమా మొదలైంది. ‘నరుడా డోనరుడా’ ఫేమ్‌ మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘అ!’, ‘కల్కి’ సినిమాల దర్శకుడు ప్రశాంత్‌ వర్మ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌, రైటర్‌. సైంటిఫిక్‌ ట్విస్ట్‌తో ముడిపడిన లవ్‌ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘అద్భుతం’ అనే టైటిల్‌ ఖరారు చేశారని తెలిసింది. సినిమా అద్భుతం అనేలా ఉంటుందో? లేదో? చూడాలి.
  అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్ట్ చేసొన్న 'అల.. వైకుంఠపురములో' మూవీలో రెండు పాటలు యూట్యూబ్‌లో విడుదలై సంచలనం సంచలనం సృష్టించాయి. తమన్ స్వరాలు కూర్చగా, సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన 'సామజవరగమన' పాట ఎంతటి సెన్సేషనల్ హిట్టయిందో మనకు తెలుసు. యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూడ్ తెలుగు సాంగ్‌గా అది రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత రిలీజ్ చేసిన 'రాములో రాములా' సాంగ్ సైతం సూపర్ పాపులర్ అయ్యింది. ఈ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రాశాడు. ఈ పాటల పాపులారిటీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కారణం.. మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'కి మ్యూజిక్ ఇస్తోంది ఆయనే. 'సరిలేరు.. నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండూ ఒకే రోజు జనవరి 12న విడుదలవుతున్నాయి.  దాంతో సహజంగానే రెండింటి మధ్యా తీవ్ర పోటీ నెలకొంది. మహేశ్, బన్నీ.. ఇద్దరూ మాస్‌లో అమితమైన క్రేజ్ ఉన్న స్టార్స్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఆ సినిమాల పబ్లిసిటీ విషయంలో సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాటిని అసాధారణ రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' దర్శక నిర్మాతలు ఆ సినిమా పబ్లిసిటీని రెండు పాటల రిలీజ్‌తో చాలా ఘనంగా ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. క్రమం తప్పకుండా ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌తో ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు.  అయితే దానికి భిన్నంగా 'సరిలేరు నీకెవ్వరు' దర్శక నిర్మాతలు అడపాదడపా పండగ, పుట్టినరోజు సందర్భాల్లో పోస్టర్ల రిలీజ్‌తో పబ్లిసిటీని సరిపెడుతూ వస్తున్నారు. 'సామజవరగమన' సాంగ్ బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి ఒకటిన్నర నెల గడిచినా, 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఇంతవరకూ ఒక్క పాటా బయటకు రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ ఎప్పుడు ఫస్ట్ సాంగ్‌ను బయటకు తెస్తాడా అని అత్యంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటల్ని దేవి ఇచ్చేశాడనీ, దర్శక నిర్మాతలే తొందరపడకుండా వాటిని సరైన సమయంలో విడుదల చేయడానికి ఒక పబ్లిసిటీ ప్లాన్‌ను అమలు చేయాలని డిసైడ్ చేసుకున్నారనీ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రచార పరంగా 'సరిలేరు నీకెవ్వరు'పై 'అల.. వైకుంఠపురములో' మూవీది పైచేయిగా కనిపిస్తోందనేది వాస్తవం. దానికి తమన్ స్వరాలు కూర్చిన పాటలే కారణం. యూట్యూబ్‌లో ఆదిత్యా మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేసిన 'సామజవరగమన' సాంగ్ రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ 77 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటతో తమన్ క్రేజ్, తద్వారా మూవీ క్రేజ్ అమాంతం అనేక రెట్లు పెరిగింది. నెల తర్వాత ఆదిత్యా మ్యూజిక్ 'రాములో రాములా' సాంగ్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 27న బయటకు వచ్చిన ఈ పాట సైతం బ్లాక్‌బస్టర్ హిట్టయి ఇప్పటి దాకా 43 మిలియన్ వ్యూస్ రాబట్టింది. హై రేంజిలో హిట్టయిన ఆ పాటలు సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచాయి.  బన్నీ మునుపటి సినిమా 'నా పేరు నా ఇల్లు ఇండియా' డిజాస్టర్ కావడంతో, 'అల.. వైకుంఠపురములో' మూవీపై అందరి కళ్లూ నిలుస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాని బ్లాక్‌బస్టర్ హిట్ చేయాలనే సంకల్పంతో దానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పాజిటివ్ బజ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు పాటలూ ఒకదాన్ని మించి మరొకటి సంగీత ప్రియుల్ని అమితంగా అలరించడంతో దేవి శ్రీప్రసాద్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొన్నదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తమన్ స్వరాలు కూర్చిన పాటల స్థాయికి 'సరిలేరు నీకెవ్వరు' పాటల స్థాయి ఏమాత్రం తగ్గినా సహించడానికి మహేశ్ ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. ఫుట్ ట్యాపింగ్ నంబర్స్ ఇవ్వడంలో దేవిని మించినవాడు ఎవ్వరూ లేరని ఇప్పటి దాకా టాలీవుడ్‌లో పేరుంది. అందుకే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.  గత ఏడాది 'రంగస్థలం' మూవీకి అతడిచ్చిన సాంగ్స్ ఏ రేంజి హిట్టయ్యాయో మనం చూశాం. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'కు దాన్ని మించిన మ్యూజిక్ ఇవ్వాల్సిన ఒత్తిడిని అతను ఫీలవుతున్నాడు. గతంలో అతనెప్పుడూ ఈ స్థాయి ఒత్తిడిని ఎదుర్కోలేదు. మహేశ్ మునుపటి రెండు సినిమాలు 'భరత్ అనే నేను', 'మహర్షి'కి మ్యూజిక్ డైరెక్టర్ అతనే. వాటికి అతడిచ్చిన మ్యూజిక్ బాగానే పాపులర్ అయ్యింది. అయితే ఆ స్థాయి మ్యూజిక్ 'సరిలేరు నీకెవ్వరు'కు ఇస్తే చాలదు. ఎందుకంటే 'సామజవరగమన', 'రాములో రాములా' పాటల స్థాయిలో ఆ సినిమాల్లోని పాటలు హిట్టవలేదు. అందుకే 'సరిలేరు నీకెవ్వరు'కు దేవి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడోనని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకు డిసెంబరులో తొలి పాటను రిలీజ్ చెయ్యాలనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని నవంబరులోనే ఆ పాటను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. చూద్దాం.. తమన్ ట్యూన్స్‌కు దేవి ట్యూన్స్ ఎలాంటి పోటీ ఇస్తాయో!
  తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న 'సూరారై పొట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో విడుదల కానున్నది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంలో జరిగిన ఘటనలను ఆధారం చేసుకొని బయోగ్రాఫికల్ డ్రామాగా ఈ సినిమాని సుధ రూపొందిస్తున్నారు. అపర్ణ బాలమురళి నాయికగా నటిస్తోన్న ఈ మూవీని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. తెలుగు టైటిల్‌కు తగ్గట్లు రెండు చేతులూ పూర్తిగా చాపి పైకి ఎగురుతున్న సూర్య ఈ లుక్‌లో కనిపిస్తున్నారు. 'ఒక సాధారణ వ్యక్తి కన్న ఒక అసాధారణ కల' నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. సూర్య మునుపటి రెండు సినిమాలు 'ఎన్‌జీకే', 'బందోబస్త్' (తమిళంలో 'కాప్పాన్') సినిమాలు అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆశించిన రీతిలో ఆడలేదు. 'ఆకాశం నీ హద్దురా' సినిమా పూర్తవగానే, 'ఖైదీ' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు సూర్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లోకేశ్ ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణకుమార్ తారాగణమైన 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి స్క్రీన్ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర, మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: శ్రీనికిత్ బొమ్మిరెడ్డి, ఎడిటర్: సతీష్ సూర్య, ఆర్ట్ డైరెక్టర్: జాకీ, కో ప్రొడ్యూసర్: రాజశేఖర్ కర్పూర పాండ్యన్, కథ, దర్శకత్వం: సుధ కొంగర.
  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.
  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.
  వైసిపి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రతిపక్షం టిడిపిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది గోడ దూకుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది. మాజీలుగా ఉన్నవాళ్లు టిడిపిని వీడడానికి ఎలాంటి ఇబ్బందులూ ఆటంకాలు ఉండవు. కానీ ఎమ్మెల్యే గానో ఎంపీగానో కొనసాగుతున్న వారు పార్టీ మారాలంటేనే సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో మాదిరి అయితే ఈపాటికే పెద్ద ఎత్తున పార్టీలు మారే వ్యవహారం రసకందాయంలో పడేదేమో. అయితే పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తీరాల్సిందేనని స్వీయ నిబంధన పెట్టుకున్న క్రమంలో వైసీపీలోకి ఆశించిన స్థాయిలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిలు వెళ్ళలేదనే చెప్పాలి. ఇదే సందర్భంలో వైసిపి నేతలు సదరు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారో వారితో మాత్రం వైసీపీ పెద్దలు  సన్నిహిత్యం లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైన సమయంలో వీలు చూసుకుని పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందాక ఒక్కొక్కరినీ తెరమీదకు తెచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా మాజీలపై ఫోకస్ పెట్టి వరసలపై దృష్టి సారించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే వంశీని వెంటబెట్టుకొని మంత్రులు నాని ద్వయం సీఎంను కలవడం ద్వారా వరస ఎపిసోడ్ కు తెరలేపినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో నెమ్మదిగా తమతో టచ్ లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదే బాట పట్టించే దిశగా పావులు కదిపేందుకు వైసీపీ రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. గంటా కూడా పార్టీ కార్యకలాపాలలో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే భావన అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న క్రమంలో గంటా రూట్ బిజెపినా లేక వైసిపినా అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఉత్తరాంధ్ర వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే వైసిపికి చెందిన ఓ పెద్దాయనతో గంటా మాట్లాడుకోవలసిన అంశాలన్నీ మాట్లాడేశారని అంటున్నారు. ఈ క్రమంలో వంశీ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చాక గంట కూడా ఇదే తరహాలో తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఇక వీరిద్దరే కాకుండా ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కొందరు చాప కింద నీరులా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో బలంగా జరుగుతోంది. ప్రస్తుతం టిడిపి అధినాయకత్వం మీద అసంతృప్తి, చంద్రబాబు వారసుడు లోకేష్ పై అపనమ్మకం ఉన్న వారిని గుర్తించే పనిలో సదరు టిడిపి నేతలు సీరియస్ గానే నిఘా పెట్టారని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.  హైదరాబాద్ కేంద్రంగా సదరు టిడిపి నేతలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా పిలిపించుకుని మాట్లాడుతూ పార్టీలో పరిస్థితేంటి ఇలాగే ఉంటే భవిష్యత్తు రాజకీయం ఎలా అనే అంశాల పై వివిధ స్థాయిల్లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పుకారులు కూడా వెల్లడవుతున్నాయి . అయితే ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడపాలని నిర్ణయించుకుని ఉమ్మడి రాజధాని కేంద్రంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రాంగం కనుక ఫలిస్తే టిడిపి నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందటున్నారు వైసీపీ వర్గాలు. ఇదంతా జరిగితే ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.  అధికారంలోకి వచ్చి నిండా అయిదు నెలలు కాకుండా భారీ స్థాయిలో వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం పై గూడుకట్టుకొని పోయిందనే ప్రచారం ప్రతిపక్షం పెద్దఎత్తున చేస్తోంది. ప్రతిపక్ష ప్రచారానికి చెక్ చెప్పాలంటే ఉప ఎన్నిక ద్వారానే సమాధానం చెప్పొచ్చు అనేది కొందరి వైసిపి నేతల వ్యూహంగా కనిపిస్తోంది. పనిలో పనిగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది కాబట్టి ఇదే ఊపులో తమతో టచ్ లో ఉన్న ఇంకొందరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తే అన్ని నియోజక వర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం అధికార పక్ష శ్రేణుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ పని తీరు మీద రిఫరెండం అటు ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి సత్తా చాటాలని కొందరు సూచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పార్టీ పెద్దల వద్ద నిర్ణయం జరగాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపి టిడిపిలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.ఇక ఈ రెండు మూడు నెలల్లో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.
    ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో గతేడాది తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. రెండు మూడు నెలల గ్యాప్ తో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత సార్వత్రి ఎన్నికలు... అనంతరం జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగ్గా... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మున్సిపోల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపోల్స్ కు రంగంసిద్ధమవుతుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్ కంటే ముందుగా తమ టికెట్ ను కన్ఫ్మామ్ చేసుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. ప్రతి వార్డు, డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి మేయర్ పీఠం వరకు టికెట్లు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఎప్పట్నుంచో మీ గెలుపు కోసం పనిచేశాను... ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యనేతలు తలల పట్టుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, టికెట్ల కేటాయింపు తమ చేతిలో ఉండదని, అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.      మొత్తానికి నవంబరు నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో.... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ, జెడ్పీ, పంచాయతీల్లో ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, టికెట్ల లొల్లి... ప్రతి వార్డు, డివిజన్ లో మూడేసి గ్రూపులు ఉండటం.... టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.   
వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది. అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.
  ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా సీనియర్ సినీనటుడు విజయ్ చందర్ ను నియామిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి సంబంధించి మోహన్ బాబు, పోసాని, ఆలీ, జయసుధ, భాను చందర్ వంటి పేర్లు ప్రచారం జరిగినా.. చివరకు మాత్రం ఆ పదవి విజయ్ చందర్‌కి దక్కింది. మొదటి నుండి తనకు అండగా ఉన్న కారణంగానే సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. కరుణామయుడుగా, సాయిబాబాగా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తులు. తరువాత జగన్ కు కూడా అండగా ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనూ, షర్మిళ పాదయాత్ర వేళ ,ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా పని చేసారు. జగన్ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలా హాజరై.. జగన్ పట్ల తన విధేయత చాటుకున్నారు.  
  ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. రూట్ల ప్రైవేటీకరణ పై కేబినెట్ తీర్మానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. పధ్ధెనిమిది అంశాలతో కూడిన అఫిడవిట్లలో ఆర్టీసీ పై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.పధ్ధెనిమిది అంశాలతో కూడిన అఫిడవిట్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి హైకోర్టుకు సమర్పించారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది వాధనలు వినిపించారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని నివేదిక ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అనేకసార్లు తాము కోరామని గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇలాగే చేయాలని ఆదేశించలేమని పేర్కొన్న హైకోర్టు.. విచారణను రేపట్టికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్రంలోని పలు రూట్లను ప్రవైటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానం కాపీని విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. రెండు రోజుల క్రితం హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి 11 వ తేదీ డెడ్ లైన్ పెట్టింది.ప్రభుత్వాన్ని పదకొండు లోపు  చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలి అదే విధంగా నాలుగు డిమాండ్లకు సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలను ఆర్టీసీ ఇవాళ్ళీ చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.ఆర్టీసీ  ఐదు వేల కోట్ల పైగా నష్టాల్లో ఉన్నతరుణంలో రెండు వేల కోట్ల రూపాయలు అత్యవసరంగా ఆర్టీసీ బకాయిల పడనున్నది కాబట్టి ఇప్పుడున్న నలభై ఏడు కోట్ల రూపాయలు ఇస్తే సరిపోవు అనే అంశాన్ని కూడా ఈ రోజు అఫిడవిట్లో పేర్కొన్నారు.మరోవైపు యూనియన్లు చట్ట విరుద్ధంగా సమ్మెలోకి వెళ్లాయని చెప్పి పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రోజులుగా ఆర్టీసీ కార్మికులను కూడా జీతాల్లేక రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిస్థితి ఉధృక్తి చేస్తున్నారని తెలిపింది. మరి రేపైనా హైకోర్టు ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందేమో చూడాలి.  
  నవంబర్ నెలలో పిఆర్‌సి ప్రకటన చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రానున్న 10 - 12 రోజుల్లో వేతన సవరణ కమిటీ (పిఆర్‌సి) నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు పిఆర్‌సి కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది నుంచి  వేతనాలు పెంచనున్నట్లుగా తెలిపారు. ఉద్యోగులకు 27 నుండి 35 శాతం మధ్య ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. నివేదికలో కూడా ఇదే విధంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖలు, కేడర్ వారీగా కనీస, గరిష్ఠ మూల వేతనం, అలవెన్సులను నివేదికలో ప్రతిపాదిస్తున్నారు పిఆర్‌సి చైర్మన్ సిఆర్ బిశ్వాల్.  ఒక పక్క ఉద్యోగ సంఘాలు 43 శాతం ఐఆర్, 63 శాతం ఫిట్‌మెంట్, రూ.24 వేల కనీస వేతనాన్ని సిఫారసు చేయాలంటూ కోరుతున్నాయి. ఫిట్‌మెంట్ 63 శాతం ఇవ్వాలని పిఆర్‌సికి టీఎన్‌జీఓ, టీజీఓ విజ్ఞప్తి చేశాయి. వారి డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.  సాధారణంగా వేతన స్కేళ్లు..విభాగాల వారీగా ఉద్యోగులు.. వాళ్ళు చేస్తున్న పని.. వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు.. ఇవన్నీ పిఆర్‌సి నివేదికలో ఉంటాయి. అవన్నీ పరిశీలించిన తరువాతే ఎంత మేరకు ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు మూడు బృందాలను నియమించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వేతనాలు, వేతన సంస్కరణలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో నివేదిక సిద్ధం చేసే పని కూడా ఆలస్యమైంది. ఆగస్టు 25వ తేదీనే కమిటీ గడువు ముగిసింది. అయినా ప్రభుత్వం గడువును పొడిగించింది.
  బరువు తగ్గాలంటే ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఇక ఫుడ్ విషయానికొస్తే, అవి తినొద్దు.. ఇవి తినొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. అయితే, మీకు నచ్చే తీయని చాక్లెట్ తింటూ బరువు తగ్గండి అంటున్నారు పరిశోధకులు. ఏంటి, చాక్లెట్ తింటే బరువు ఎలా తగ్గుతారు అని ఆశ్చర్యపోతున్నారా! నిజమండి బాబూ. ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి, బరువు తగ్గడం గ్యారంటీ.. https://www.youtube.com/watch?v=k4vg4CUUvfs
  * జలుబుతో బాధపడుతుంటే మిరియాలు, బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. * పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. * తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం. * అజీర్ణం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటే... పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు జీలకర్ర పొడి, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపు కుని తాగాలి. ఇలా వారం రోజులు చేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. * గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.