Publish Date:Jul 24, 2019

EDITORIAL SPECIAL
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ALSO ON TELUGUONE N E W S
  'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ.. తన దృష్టినంతా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పెట్టాడు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ 'బ్రేకప్' అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా క్రాంతి మాధవ్ నిర్ధారించేశాడు. అవును. విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎస్. రామారావు సమర్పిస్తోన్న సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీని రామారావు కుమారుడు కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఒకరిద్దరు కాకుండా.. ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపే లవర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఆ నలుగురు భామలు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే. ఒక సెన్సిబుల్ సబ్జెక్టుతో క్రాంతి మాధవ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడనీ, ఈ మూవీకి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తేనే తెలుస్తుందనీ సినిమా యూనిట్ చెబుతోంది. కాగా సెప్టెంబర్ 20న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకొన్న 'డియర్ కామ్రేడ్' నిరాశ కలిగించడంతో, 'వరల్డ్ ఫేమస్ లవర్'తో సక్సెస్ సాధించాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడు.
  'సైరా.. నరసింహారెడ్డి' రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ అందరిలోనూ క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను చూడాలని వాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా మొదలయ్యే వరకూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో తెలీని వాళ్లకు ఇప్పుడు ఆయనెవరో తెలిసింది. 1857లో జరిగిందని హిస్టరీలో మనం చదువుకున్న ప్రథమ స్వాతంత్ర్య సమరానికంటే ఒక దశాబ్ద కాలం ముందుగానే బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధీరుడిగా, వారి ఉరితీతకు గురైన సమరయోధుడిగా ఇవాళ చాలామందికి నరసింహారెడ్డి గురించి తెలుసు. ఆ పాత్రనే 'సైరా'లో మెగాస్టార్ పోషించారు. నరసింహారెడ్డి సరే.. ఈ సినిమాలో మహామహులైన కొందరు నటులు చేసిన పాత్రల గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఆ పాత్రల్ని పరిచయం చేసుకుందాం. బ్రిటిష్ దొరల పెత్తనంపై తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డికి అండగా నిలిచిన గిరిజన నాయకుడు రాజా పాండి. తమిళ ప్రాంతానికి చెందిన ఆయన కూడా బ్రిటిషర్లను ధిక్కరించి పోరాడాడు. ఆ పాత్రను తమిళ హీరో, 'మక్కల్ సెల్వన్'గా ఫ్యాన్స్ పిలుచుకొనే విజయ్ సేతుపతి చేశాడు. పొడవాటి జుట్టు, నుదుటున విభూతి, మధ్యలో నిలువెత్తు తిలకంతో అతని ఆహార్యం ఆకట్టుకుంటోంది. పాలెగాడు అయిన నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న. ఆయన ప్రభావం నరసింహారెడ్డిపై ఎక్కువ. గురువు మాటను నరసింహారెడ్డి శిరసా వహిస్తాడని ఆయన కథ చెబుతోంది. అలాంటి వెంకన్న పాత్రను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేశారు. తెల్లగా నెరిసిన పొడవాటి జుట్టు, పెంచిన మీసాలు, గడ్డం, నుదుటున నిలువెత్తు కుంకుమ తిలకంతో గంభీరంగా కనిపిస్తోన్న అమితాబ్ రూపం ఆకట్టుకుంటోంది. గిద్దలూరు తిరుగుబాటు ఘటనలో నరసింహారెడ్డితో చేయి కలిపిన యోధుడు అవుకు రాజు. అవుకు రాజ్యానికి చెందిన అతను బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలపై నిరసనలు వ్యక్తం చేశాడు. ఆ పాత్రను 'అభినయ చక్రవర్తి'గా పేరుపొందిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ పోషించాడు. నలుపు దుస్తులు, నల్లగా నిగనిగలాడే పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మెలి తిప్పిన మీసంతో అవుకు రాజుగా సుదీప్ రూపానికి అందరూ ఫిదా అవుతున్నారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ అయినా, ఆయన మనసిచ్చిన ప్రేయసి లక్ష్మి. నరసింహారెడ్డి కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడని యువతి లక్ష్మి. ఆ పాత్రలో మిల్కీ బ్యూటీగా అందరూ పిలిచే తమన్నా భాటియా నటించింది. తన సహజ శరీర వర్ణానికి భిన్నమైన మేకప్‌తో ఆమె కనిపించనున్నది. ఆనాటి సంప్రదాయ వస్త్రాలంకరణ, ఆభరణాలతో తమన్నా రూపం కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి తెలియని వాళ్లెవరు? చిన్నప్పటి నుంచీ చరిత్ర పుస్తకాల్లోనూ, ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా లక్ష్మీబాయ్ గురించి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. నరసింహారెడ్డికి సమకాలీనురాలు. ఇక్కడ రేనాడులో బ్రిటిషర్లపై నరసింహారెడ్డి యుద్ధం ప్రకటిస్తే, అక్కడ ఉత్తర భారతంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా పాలన చేస్తూ, బ్రిటిషర్లపై తిరగబడిన వీర వనిత. కొద్దిసేపు కనిపించే ఆ పాత్రను అనుష్క చేసింది. ఇప్పటికే 'రుద్రమదేవి' వంటి మహా యోధురాలైన చారిత్రక స్త్రీ పాత్ర చేసిన ఆమెకు ఇది రెండో హిస్టారికల్ రోల్. ఆమె ఆహార్యం ఎలా ఉంటుందనేది వెల్లడించకపోయినా, లక్ష్మీబాయ్ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ పాత్రలో అనుష్క చెలరేగుతుంటే చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ. భర్తకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన సహధర్మచారిణి. నరసింహారెడ్డి మనసెరిగి నడచుకోవడమే కాకుండా, సదర్భం వచ్చినప్పుడు సలహాలిచ్చిన మేధావి. అలాంటి పాత్రలో దక్షిణ భారతావనిలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార నటించింది. సిద్ధమ్మగా తెలుగు సంప్రదాయ స్త్రీ మూర్తికి నిలువెత్తు అద్దంలా కనిపిస్తోన్న నయనతార ఆహార్యం అమితంగా ఆకట్టుకుంటోంది. నరసింహారెడ్డికి శత్రువులు బ్రిటిషర్లు మాత్రమే కాదు, వీరారెడ్డి కూడా శత్రువే. బ్రిటిషర్ల చేతికి నరసింహారెడ్డి దొరికిపోవడంలో వీరారెడ్డి పాత్ర ఉందని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అతనొక స్థానిక రాజు. ఆ పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించబోతున్నారు. సాఫ్ట్ హీరో నుంచి హార్డ్‌కోర్ విలన్‌గా మారి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తోన్న ఆయన వీరారెడ్డిగా దుష్టత్వాన్ని ఏ రీతిలో ప్రదర్సించి ఉంటారో ఊహించుకోవచ్చు. సగం నెరిసిన గడ్డం, పొడవాటి జుట్టు, తలపాగా, నుదుటున గుండ్రటి తిలకంతో నడివయసులో ఉన్న రెడ్డి రాజులా కనిపిస్తోన్న ఆయన ముఖంలో ప్రతినాయక హావభావాలు స్పష్టమవుతున్నాయి. ఇలా.. ఈ పాత్రలన్నింటి సమాహారమే 'సైరా.. నరసింహారెడ్డి' మూవీ. ఈ కేరెక్టర్ల సపోర్టుతో నరసింహారెడ్డి కేరెక్టర్ ఏ రీతిలో ఎలివేట్ అవుతుందో, ఆ కేరెక్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో చెలరేగిపోయారో.. అక్టోబర్ 2న మనం చూడబోతున్నాం.
'జై సింహా' హిట్ కాంబినేషన్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో విలన్ ఎవరో తెలుసా? శతఫ్ ఫిగర్. పేరు కొత్తగా ఉంది కదూ. తెలుగు తెరకు ఈ నటుడు కూడా కొత్తే. బాలకృష్ణ కోసం బెంగాలీ నటుడ్ని విలన్ గా తీసుకొచ్చారు దర్శకుడు కె.ఎస్. రవికుమార్. ప్రజెంట్ శతఫ్ హిందీలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. రాజ్ కుమార్ హీరోగా నటించిన 'మేడ్ ఇన్ చైనా'లో కీ రోల్ చేశాడు. 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో హీరో కార్తీక్ ఆర్యన్ కి ఫాదర్ గా నటిస్తున్నాడు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు విష్ణువర్థన్ తెరకెక్కిస్తున్న 'షేర్ షా'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.    
నిజమే... కమల్ హాసన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదు. తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. అన్యాయంగా ఆయన్ను అరెస్ట్ చేసి ఎవరో జైల్లో వేయలేదు. మరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ ఎందుకు ఉన్నారు? అంటే... సినిమా షూటింగ్ కోసం! లోక నాయకుడు కమల్ హాసన్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. తమిళంలో 'ఇండియన్'గా, తెలుగులో 'భారతీయుడు'గా విడుదలైన సినిమాకు ఇది సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతోంది. సమాజంలో అవినీతిపై శంకర్ సంధించిన సినిమా అస్త్రం 'భారతీయుడు'. ఈ సీక్వెల్ లో ఏ సమస్యలను ప్రస్తావిస్తాస్తున్నారో? కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జోడీగా నటిస్తున్నారు.
  మాస్ సినిమా చేస్తే ఎలాంటి కిక్ వస్తుందో, మాస్‌లో ఎలాంటి పవర్ ఉంటుందో వరుణ్ తేజ్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో చేసిన 'వాల్మీకి'.. అతనికి తొమ్మిదో సినిమా. ఇదివరకు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లోఫర్' అనే మాస్ సినిమా చేసినా హిట్ అందుకోలేకపోయిన అతను, ఇప్పుడు 'వాల్మీకి'ని తన ఫస్ట్ మాస్ ఫిలింగా భావిస్తున్నాడు.  ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్ "వాల్మీకి నా తొమ్మిదో సినిమా. ఫస్ట్‌ మాస్‌ సినిమా. ఫస్ట్‌ టైమ్‌ ఒక మాస్‌ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుండేవారు.. 'మేము మాస్‌ సినిమాలు ఎందుకు చేస్తామో.. నీకు అర్థం కావడం లేదు, మాస్‌లో ఒక పవర్‌ ఉంటుంది' అని. ఇప్పుడు అర్థం అయింది. ఈ సినిమా అవడానికి ముఖ్య కారణం హరీష్‌ శంకర్‌ గారు. కళ్యాణ్‌ బాబాయ్‌ ఫ్యాన్స్‌ అందరిలాగా నేనూ చాలా సంవత్సరాలు 'సరైన హిట్‌ ఎవరిస్తారు?' అనుకున్నాను. 'గబ్బర్‌సింగ్‌' చూశాక ఇది సినిమా అనిపించింది. మా బాబాయ్‌కి అంత పెద్ద హిట్‌ ఇచ్చిన ఆయన నాతో చేయడం నిజంగా నా అదృష్టం. సెట్లో కూడా సూపర్‌ ఎనర్జీతో ఉంటారు. ఆయన సపోర్ట్‌, గైడెన్స్‌ వల్లే ఈ క్యారెక్టర్‌ ఇంత మంచిగా చేయగలిగాను. మా ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట నాతో రెండు సంవత్సరాలుగా ట్రావెల్‌ అవుతున్నారు. ఫుల్‌ సపోర్ట్‌ చేసారు. వారితో నా ప్రయాణం కొనసాగుతుంది. అలాగే అయనంక బోస్‌ విజువల్స్‌ చాలా బాగున్నాయి. 'ముకుంద' సినిమా తర్వాత పూజతో అమేజింగ్‌ సీక్వెన్స్‌ చేశాను. స్పెషల్‌గా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్‌ రీమిక్స్‌ చేశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మిక్కీ ఫస్ట్‌ టైమ్‌ మాస్‌ సాంగ్స్ అదరగొట్టాడు. డెఫినెట్‌గా సెప్టెంబర్‌ 20న 'వాల్మీకి' మీ అందరికీ నచ్చుతుంది" అన్నాడు.
  తూర్పుగోదావరి బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అంటూ ట్వీట్ చేశారు. అయితే, బోటు ప్రమాదంపై ఏపీ అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా ఘాటుగా స్పందించారు. బోటు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బోట్లు నడుపుతున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్ణకరమన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా తీవ్రంగా స్పందించారు.  గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బోటు ప్రమాదంపై అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా, అలాగే తెలంగాణ బాధిత కుటుంబాలకు... కేసీఆర్‌ ప్రభుత్వం అదనంగా మరో 5లక్షలు పరిహారంగా అందజేయనుంది. తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఎక్కువమంది తెలంగాణవాసులు ఉండటంతో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ చేరుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌... బాధితులను పరామర్శించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
  బోటు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరిలో అధిక నీటి ప్రవాహమే బోటు బోల్తాకి ప్రధాన కారణమని అంటున్నా, అధికారుల అలసత్వం, బోటు సిబ్బంది నిర్లక్ష్యమే కొంపముంచినట్లు తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పాపికొండలకు బయల్దేరడం అదిపెద్ద తప్పు అయితే, ప్రయాణికులు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంతో మరో ఘోర తప్పిదంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం లేని డ్రైవర్లు, బోటు సిబ్బంది కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం... మలుపు దగ్గర చాకచక్యంగా వ్యవహరించలేకపోవడంతో... సుడిగుండాలకు బోటు బోల్తా కొట్టిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. అయితే, బోటు మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు... రెండో అంతస్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడంతో బోటు బ్యాలెన్స్ తప్పి, బోల్తాపడిందని అంటున్నారు. ఇదిలాఉంటే, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యాటకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే, రాయల్ వశిష్ట ప్రైవేట్ బోటును నడుపుతున్నట్లు గుర్తించారు. పైగా ఐదు లక్షలు పైగా ఇన్‌ ఫ్లో ఉండగా, పాపికొండలకు బోటు బయల్దేరడం అతిపెద్ద తప్పిదంగా అధికారులు తేల్చారు.
నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ ఆనంద క్షణాలను మనసులో మధురమైన గుర్తులుగా మార్చుకుందామని పర్యాటకులు ఆశిస్తారు. కానీ, అలలపై ఆహ్లాదంగా సాగిపోవాల్సిన బోటు ప్రయాణాలు విషాదాంతమవుతున్నాయి. యాత్రికుల రక్షణ గాల్లో దీపంలా మారుతున్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకృతి అందాలను తనివితీర తిలకిస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో గోదావరి అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదం పొంచి ఉందనే భయంకర నిజాన్ని పర్యాటకులు ఊహించలేకపోతున్నారు. దాంతో జల అందాలను ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం క్షణాల్లోనే ఆవిరైపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలోనూ ఇదే జరిగింది. అప్పటివరకు గోదావరి అందాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. పాపికొండలను చూస్తున్నామన్న ఆనందంలో కేరింతలు కొట్టారు. గోదావరి చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయారు. లోకాన్ని మరిచి...పరిసరాలను మైమరిచి నదీ సోయగాలను చూస్తూ ఉత్సాహంగా ముందుకుసాగారు. సహచర టూరిస్టులు, బంధువులు, కుటుంబ సభ్యులతో జాలీగా  గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు బోటులో సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయితే, ఆ అందమైన ప్రకృతే వికృతంగా మారుతుందని ఊహించలేకపోయారు. గోదారమ్మ అమాంతం తమను మింగేస్తుందని అనుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. దాంతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగి గోదావరిలో మునిగిపోతుంటే... పర్యాటకులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలు... ఆ గోదారమ్మ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆత్మీయులు జలసమాధి అయిపోయారు. దాంతో విహరయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. అయితే, బోటు పైఅంతస్తులో ఉన్నవారు మాత్రమే, ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో అద్దాల మధ్య ఉన్నవారతా జలసమాధి అయ్యారని భావిస్తున్నారు. బోటు దాదాపు 300 అడుగుల లోతులోకి దిగిపోవడంతో... వాళ్లంతా బోటులోనే చిక్కుకుని మరణించారని అంచనా వేస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే, మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.
  టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి. అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!
  వరుసగా రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డీలాపడిన కాంగ్రెస్ కు పునరుజ్జీవం తెచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. జవజీవాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పరపతిని పెంచేందుకు సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పూనుకున్న సోనియా... ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్ లతో వార్ రూమ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తరహా మోడల్ అనుసరించాలని భావిస్తున్నారట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని సోనియా థింక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ఒక్కటే సరిపోదని... ప్రజాసమస్యలపై స్పందిస్తూ నేరుగా ప్రజలతో అనుసంధానం కావాలని, అప్పుడే పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాకొచ్చిన సోనియా.... ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని డిసైడయ్యారట.  అతిత్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కు పెనుసవాలుగా మారాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి, కాంగ్రెస్ ను మళ్లీ రేసులో నిలిపేందుకు సోనియా సవాలుగా తీసుకున్నారట. మరి సోనియా ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.... కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో రాదో... మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది.
  'ముసలోడే కానీ మహానుభావుడు' అని అతడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు. డెబ్భై ఏళ్ల ఓ వృద్ధుడు కోరిక తెలిస్తే ఇప్పుడు మనం కూడా అదే డైలాగ్ చెప్తాం. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధుతో నాకు పెళ్లి జరిపించండి, లేదంటే నేనే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటా అంటూ ఓ వృద్ధుడు ఏకంగా జిల్లా కలెక్టరుకే వినతి పత్రం ఇచ్చాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా.. 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు. అందరూ సాయం చేయమని వినతి పత్రాలిస్తుంటే.. ఆయన మాత్రం వివాహం చేయమని వినతి పత్రం ఇచ్చాడు. తాను 2004లో జన్మించానని, తన వయసు 16 ఏళ్ళు అని, తాను దేవుడి ప్రత్యేక అవతారాన్నని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించానని అందులో పేర్కొన్నాడు. తనలాంటి కారణజన్ములు సాధారణ యువతులను పెళ్లి చేసుకోరాదని, అందుకే పీవీ సింధు వంటి పేరుప్రతిష్ఠలున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నానని లేఖలో తెలిపాడు. పీవీ సింధును పెళ్లి చేసుకునేందుకు కలెక్టర్ సహకారం అందించాలని, లేదంటే కిడ్నాప్ చేసైనా ఆమెను పెళ్లాడతానని 16 ఏళ్ళ వృద్ధుడు వార్నింగ్ కూడా ఇచ్చాడు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ వినతిపత్రం చూసిన కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అనంతరం కలెక్టర్‌ తోపాటు ఇతర సిబ్బంది అతనికి నచ్చజెప్పినా సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆ వృద్దుడికి ఎలా నచ్చచెప్పాలో తెలియక కలెక్టర్ మరియు కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం అన్నారు. '30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు' అంటూ నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగా హత్య జరిగినప్పుడు కోడెల హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపారని నరేంద్ర ఆరోపించారు. పోలీస్ శాఖలో రంగాకు అనుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజుల ముందే బదిలీ చేసారని ఆరోపించారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కోడెల అనే నీచుడు చనిపోయాడు. ఆయన చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం అని నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
  వాతావరణం బాగాలేకపోవడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలోనే చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లాలో ఈరోజు భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఓ ఇండిగో విమానం ల్యాండింగ్ కు వీలుకాక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విమానంలో విజయమ్మ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో విమానం దించేందుకు పైలెట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
  Coconut Oil for Good health:People who consume coconut oil on a regular basis (referring to the Keralites) are known to have a healthy skin, free from any bacterial attacks, lustrous hair, are intelligent , slim - contrary to the studies which say coconut oil is fattening, and the most important factor (for women) have wrinkle free skin … Coconut oil is one of the richest sources of saturated fat with about 90 percent of calories as saturated fat. It contains lauric acid, a powerful antibacterial and antiviral agent that keeps away viruses, infections, inflammation and acne. Coconut oil is also rich in essential fatty acids and Vitamin E, which are perfect for keeping your skin moist, soft, and wrinkle-free ( anti aging benfits) and is also known to reduce weight.WOmen use coconut oil to remove makeup and clean their face with it before going to bed. Coconut oil is especially good if you have thyroid. Plus, there’s considerable evidence that this oil has so many health benefits: Coconut oil contains a lot of medium chain triglycerides, which are metabolized differently and can have therapeutic effects on several brain disorders. The medium chain triglycerides in coconut oil have been shown to increase 24 hour energy expenditure by as much as 5%, potentially leading to significant weight loss over the long term. Coconut oil can be applied topically as well, studies showing it to be effective as a skin moisturizer and protecting against hair damage. It can also be used as a mild form of sunscreen and as mouthwash. So do we need to give more scientific reasons to bring this healthy natural oil back into our lives?
  ఏదన్నా ఆహారపదార్థం గురించి వార్త రానంతవరకూ దానిని విచక్షణారహితంగా వాడేయటం, ఏదో ఒక వార్త రాగానే బెంబేలెత్తిపోవడం వినియోగదారులకు ఉండే అలవాటే! దానికి గొప్ప ఉదాహరణగా నూడిల్స్ గురించి చెప్పుకోవచ్చు. మ్యాగీ వంటి ప్రముఖ బ్రాండ్‌ నూడిల్స్‌లో సైతం MSG అనే ప్రమాదకరమైన రసాయనం ఉందని తెలియగానే దేశం నూడిల్స్ ఉడికినట్లు ఉడికిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రెడ్‌ల గురించి కూడా వస్తున్న ఇలాంటి వార్తలు భారతీయులని కలవరపరుస్తున్నాయి. వివాదం ఏమిటి! దిల్లీకి చెందిన CSE అనే ఓ సంస్థ చేసిన పరిశోధనే ప్రస్తుత వివాదానికి కారణం. CSE చెబుతున్న వివరాల ప్రకారం, దిల్లీలో సేకరించిన దాదాపు 38 రకాల బ్రెడ్‌ నమూనాలలో దాదాపు 84 శాతం నమూనాలలో ప్రమాదకరమైన పొటాషియం బ్రోమైట్‌, అయోడైట్‌ అనే పదార్థాలు కనిపించాయి. ఈ నమూనాలు ఎక్కడో మారుమూల ఉన్న బేకరీల్లోంచి సేకరించినవి కావు. బ్రిటానియా దగ్గర్నుంచీ KFC వరకూ ప్రఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన నమూనాలు కూడా ఈ పరీక్షలో తేలిపోయాయి.   ఎందుకువాడతారు! బ్రెడ్‌ కోసం కలిపిన పిండి చక్కగా సాగేందుకు, బ్రెడ్‌ ఉబ్బెత్తుగా వచ్చేందుకు, మంచి రుచితో ఉండేందుకు ఈ పదార్థాలను వాడతారు. నిజానికి బ్రెడ్‌ లేదా బేకరీ పదార్థాల తయారీలో వీటిని ఉపయోగించకూడదన్న చట్టమేమీ మన దేశంలో లేదు. కాకపోతే ఒక మోతాదు మేరకే వీటిని వాడాలన్న నిబంధనలు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు బ్రెడ్‌ తయారీలో 50 PPM వరకూ ఈ పదార్థాలను వాడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే తాము బ్రెడ్‌లను ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్తిదారులు చెబుతున్నారు   సమస్య ఏమిటి! ఉత్పత్తిదారులు చెబుతున్న మాట వాస్తవమే. బ్రెడ్‌ తయారు చేసే సమయంలో పొటాషియం బ్రొమైట్‌ను కలపినా కూడా ఉత్పత్తి దశలో అది పొటాషియం బ్రోమైడ్‌గా మారిపోతుంది. బ్రోమైడ్ ఏమంత హానికారక పదార్థం కాదు. కానీ అలా జరగకపోవడమే అసలు సమస్య. CSE అందించిన గణాంకాల ప్రకారం... ప్యాక్‌ చేసిన బ్రెడ్‌లో కూడా పొటాషియం బ్రోమైట్‌ ఆనవాళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. బ్రెడ్‌ను ఉత్పత్తి చేసే సమయంలో లోపాలు ఉండటం, బ్రెడ్‌ మరింత ఉబ్బెత్తుగా కనిపించడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ పాళ్లు కలపడంతో.... మన చేతిలో ఉండే బ్రెడ్‌లో కూడా బ్రోమైట్‌ ఉంటోంది.   బ్రోమైట్‌ ఉంటే ఏంటట! బ్రోమైట్‌ గురించిన భయాలు ఈనాటివి కావు. బ్రోమైట్‌ ఒక క్యాన్సర్‌ కారకమంటూ దశాబ్దాల తరబడి పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీ, థైరాయిడ్ వంటి అనేక క్యాన్సర్లను ఇది కలిగించే ప్రమాదం ఉందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే ఆస్ట్రేలియా మొదలుకొని బ్రెజిల్‌ వరకూ దీనిని ఆహారపదార్థాల తయారీలో వాడవద్దంటూ నిషేధించారు. అంతదాకా ఎందుకు? మన పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలలో సైతం ఈ నిషేధం అమలులో ఉంది. కానీ నిరంతరం తన నిర్ణయాల కోసం అమెరికా వైపు చూసే మన దేశం మాత్రం, అక్కడిలాగే ఇక్కడ కూడా బ్రోమైట్‌ గురించి చూసీ చూడనట్లు ఉండిపోయింది. ఇక అయోడైట్ గురించి కూడా ఇలాంటి భయాలే ఉన్నాయి. థైరాయిడ్‌ పనితీరుని అయోడైట్ దారుణంగా ప్రభావంతం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.     ఇప్పుడేం చేసేది! బ్రోమైట్‌ క్యాన్సర్‌ కారకం అన్న మాట నిజమే కానీ... దానిని ఎలా, ఏ స్థాయిలో తీసుకుంటే క్యాన్సర్‌ కారకమో అన్న విషయం మీద స్పష్టత లేదు. పైగా ఇక నుంచి బ్రెడ్‌ ఉత్పత్తిలో బ్రోమైట్‌ను నిషేధిస్తామంటూ Food Safety Standards Association of India (FSSAI)  ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడినట్లే. కానీ మొన్నటి వరకూ నూడిల్స్, ఇప్పుడు బ్రెడ్‌కు సంబంధించిన వివాదాలతో మనకు ఓ పాఠం తెలిసొచ్చినట్లు అయ్యింది. ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉండే పళ్లు, కూరగాయల వంటి ఆహారాన్ని కాదని... బద్ధకంతోనో, జిహ్వచాపల్యంతోనో, గొప్ప కోసమో కృత్రిమమైన ఆహారం మీద ఆధారపడితే, అది ఎప్పటికైనా, ఎలాగైనా ఆరోగ్యానికి నష్టం కలిగించక మానదు. మరమరాల దగ్గర్నుంచీ మినప బజ్జీల వరకు మన సాంప్రదాయకమైన ఆహారాలు ఇన్ని ఉండగా పాశ్చాత్య ధోరణుల కోసం పాకులాడితే బొక్కబోర్లా పడకా తప్పదు.
  Health benefits of neem juice: 1. Due to its anti-inflammatory ingredients, neem juice extract is best to get rid of acne or pimples. Neem juice also improves the complexion. 2. By drinking neem juice, the toxins from the system are flushed out. This improves the hair quality, skin complexion and digestion. 3. Neem juice is considered effective for diabetic patients. By having neem juice everyday, you control the sugar levels in the body. 4. Neem juice reduces vaginal pain during pregnancy. Many pregnant women massage with neem juice to get rid of labor pain. Use of Neem Leaf for Dental Problems: Dry Neem leaves in shade and grind to make powder. Use it to massage your gums to treat pyorrhoea. It will also strengthen the gums. You may add a pinch of clove powder and peppermint powder to make it more refreshing.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.