Publish Date:Dec 8, 2017
Publish Date:Dec 7, 2017
Publish Date:Dec 6, 2017
Publish Date:Dec 5, 2017
Publish Date:Dec 4, 2017
Publish Date:Dec 2, 2017
Publish Date:Dec 1, 2017
Publish Date:Nov 30, 2017

LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
తను పనిచేసే హీరోల్ని, దర్శకుల్ని హీరోయిన్లు పొగడటం ఎప్పటి నుంచో జరుగుతుందే. అలా ఎందుకు పొగుడుతారో అందరికీ తెలిసిందే.. సదరు వ్యక్తులు తెలిసినవాళ్లకి తన గురించి రిఫర్ చేస్తాడనేది హీరోయిన్ల ఫీలింగ్. అయితే ఈ క్రమంలో వేరే వారిని తక్కువ చేయకూడదు కదా..? ఇప్పుడు ఇలాగే నోరు జారింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది తమన్నా. బాహుబలి హిట్‌తో ఆఫర్లు వస్తాయని భావించినప్పటికీ ఒక్క అవకాశం కూడా తమన్నా గుమ్మం తొక్కలేదు. ఇలాంటి టైంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నా నువ్వే సినిమాలో పిలిచి హీరోయిన్‌గా ఛాన్సిచ్చాడు. అందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుందో.. లేక మరేదైనా కారణమో కానీ కళ్యాణ్‌రామ్‌ను ఆకాశానికేత్తేసింది. కళ్యాణ్‌రామ్ మంచి డ్యాన్సర్‌ అని.. అతనే బెస్ట్ డ్యాన్స్ పార్టనర్‌ అని అంటూ పొగడ్తలతో ముంచేసింది. అయితే టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకున్న బన్నీ, ఎన్టీఆర్‌ల గురించి తెలిసికూడా.. కళ్యాణ్‌రామ్‌ని ఆ విధంగా అనడంపై వారిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. మరి ఈ విషయం తమన్నా దృష్టికి ఇంకా వెళ్లిందో లేదో మరి. ఇది మరింత పెద్దది కాకముందే మిల్కీ బ్యూటీ రియాక్ట్ అయితే మంచిది.
అనుష్క లీడ్ రోల్‌లో పిల్ల జమీందార్ ఫేం జి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భాగమతి. హారర్ కమ్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆ అంచనాలను మరింత పెంచాయి. రీసెంట్‌గా భాగమతి ఆడియో లాంచ్ ఘనంగా జరిగింది. తమిళ స్టార్ హీరో సూర్యతో పాటు శివగామి రమ్యకృష్ణ ఆడియో వేడుకలో సందడి చేశారు. ఇదంతా పక్కనబెడితే ఒక ప్రశ్న ఇప్పుడు సినీ జనాల మెదళ్లను తొలిచేస్తోంది. భాగమతి ఆడియో లాంచ్‌కి యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకు రాలేదని. ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత సంస్థ.. ఈ బ్యానర్‌లో నిర్మించిన అన్ని సినిమాల ఆడియో ఈవెంట్లకి యంగ్‌ రెబల్‌స్టార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక జేజేమ్మ అనుష్కతో ప్రభాస్‌కి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్రెండ్స్‌ అంటే ప్రాణం ఇచ్చేసే ప్రభాస్‌ మరి భాగమతి పాటల వేడుకకి ఎందుకు రాలేదు అంటూ ఫిలింనగర్‌లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని.. అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని వారిద్దరు ఖండించినప్పటికీ.. పుకార్ల జడివాన మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్కతో ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుందని ప్రభాస్ భయపడి ఉండవచ్చని కొందరంటుంటే.. సాహో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని మరికొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా భాగమతి ఆడియో లాంచ్‌లో ప్రభాస్ మిస్సవ్వడం గాసిప్ రాయుళ్లకు కావాల్సినంత పనిని ఇచ్చింది.
స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు...  దర్శకులు కొన్ని విషయాలను మాత్రం తూచ తప్పక పాటిస్తారు. ఏ పాత్రా... హీరో పాత్రను డామినేట్ చేయకుండా చూసుకోవడం అందులో ఒకటి. చివరకు హైట్ విషయంలో  కూడా రాజీ పడరు. తమల్ని డామనేట్ చేసే పాత్రలున్నా... సీన్స్ ఉన్నా.. కనీసం తమకంటే ఎదుటివాడు హైట్ గా కనిపిస్తున్నా కూడా... హీరోలు కూడా క్షమించరు. ఇమిడియట్ గా పాత్రధారులు మారిపోతుంటారు. అయితే... బాలకృష్ణ వీరందరిలో విభిన్నం. విలన్ పాత్రలే కాదు... కథనాయికలు తనకంటే హైట్ ఉన్నా..ఆయన పెద్దగా పట్టించుకోరు. అందుకు ఉదాహరణే ఆయన గత చిత్రాలు. బాలయ్యతో హిట్ పేయిర్ అనిపించుకున్న సిమ్రన్.. ఆయనకంటే హైట్. వీళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. ‘నరసింహనాయుడు’ విలన్ ముఖేష్ రుషి... బాలయ్య కంటే చాలా హైట్. కానీ.. ఆయన చాలా సినిమాల్లో బాలయ్యతో కలిసి పనిచేశాడు. బాలయ్య రీసెంట్ హిట్...‘జై సింహా’లో కూడా ఓ హీరోయిన్ గా నటించిన నటాషా జోషి.. బాలయ్య కంటే హైట్. విలన్ గా చేసిన కాలకేయ ప్రభాకర్ అయితే.. బాలయ్య కంటే చాలా హైట్. అయినా సరే... వారిద్దరినీ హీరోయిన్ గా, విలన్ గా తీసుకున్నారు. దీని గురించి ఇటీవల ‘జై సింహ’ విజయోత్సవ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ... ‘నేను పొట్టోడ్నని... నా సినిమాల్లో పొడుగోళ్లు చేయకూడదంటే ఎలా? అది కళామతల్లికి ద్రోహం చేసినట్లే.. అవకాశం కోసం వచ్చే వారిని అలా హైట్ ఉన్నాడని అన్యాయం చేయకూడదు. ‘నరసింహనాయుడు’  టైమ్ లో కూడా ఇలాగే జరిగింది. విలన్లలో ఓ విలన్ గా చేయడానికి ఓ నటుడు ఆడిషన్ కి వచ్చాడు. అతను పొడుగ్గా ఉన్నాడనీ... నేను పొట్టోడ్ని కాబట్టి.. నా పక్కన అతను పొడుగ్గా కనపడతాడు కాబట్టి... అతడ్ని పంపించేశారట. ఈ విషయం నాకు తెలిసి.. అతడ్ని మళ్లీ పిలిపించి వేషం ఇచ్చా. ఇందులో కూడా నటాషా నాకంటే హైట్. ప్రభాకర్ నా కంటే హైట్. నా ఫ్రెండ్స్ గా నటించిన శివాజీరాజా గ్రూప్ అంతా కూడా నా కంటే పొడుగు వాళ్లే. నేను పొడుగోళ్లలో పొట్టోడ్ని. పొట్టోళ్లలో పొడుగోడ్ని’ అని చెప్పి... వేదికపై అందర్నీ నవ్వించారు బాలయ్య. స్వీయ లోపంబెరుగుట గొప్ప విద్య అన్నారు. ఈ విషయంలో బాలయ్యను నిజంగా మెచ్చుకోవాల్సిందే. తనపై తానే సెటైర్ వేసుకోవడం...తన లోపాన్ని తానే ఎత్తి చూపడం.. బాలయ్య గొప్పతనాన్ని చెప్పకనే చెబుతుంది. ఏమంటారు ప్రెండ్స్.
మొన్నటి దాకా జరిగిన గొడవ చాలదన్నట్టు... మళ్లీ మెగా అభిమానుల్ని కెలుకుతున్నాడు కత్తి మహేశ్. రీసెంట్ గా...  సాయిధరమ్, వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఇంటలిజెంట్’ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గాయపడ్డ చేతితోనే గన్ పట్టుకొని ఉంటాడు సాయిధరమ్. దాన్నే టార్గెట్ చేశాడు కత్తి మహేశ్. ‘సినిమా పేరు ‘ఇంటిలిజెంట్‘ అని పెట్టారు. తెలివైవాడు గాయపడ్డ చేతితో గన్ పట్టుకోవడం ఏంటో. టైటిల్ కి తగ్గట్టు అయితే... ఫస్ట్ లుక్ లేదు’ అని ట్వీట్టర్ లో కామెంట్ పెట్టాడు. హీరో ఏ సందర్భంలో అలా గాయపడ్డ చేత్తో గన్ పట్టుకున్నాడో సినిమా చూస్తే కానీ... అర్థం కాదు. కానీ.. ఒక ఫిలిం క్రిట్ అయ్యుండి.. ఆ మాత్రం అవగాహన లేకుండా ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం ఏంటో అని ‘ఇంటిలిజెంట్’ సినిమా యూనిట్ సభ్యులు వాపోతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు టైటిల్ మీద కూడా విమర్శలొస్తున్నాయ్.  ‘ఇంటెలిజెంట్’  అని పెట్టాల్సింది పోయి... ‘ఇంటిలిజెంట్’ అని పెట్టడం పట్ల పలువురు సెటైర్లు వేస్తున్నారు. అయితే... ‘ఇంటెలిజెంట్’ ని ‘ఇంటిలిజెంట్’ని చేయడంలో కథకు సంబంధించిన ఏదైనా సంబంధం ఉందేమో..! అనే అనుమానం వ్యక్తం చేస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు.
సినిమా విడుదలకు ముందే కథలు లీకైపోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చిన్నా చితకా సినిమాల విషయంలో ఇలా జరిగితే ఫర్లా. కోట్ల ఖర్చుతో చేస్తున్న సినిమాల కథలు లీకవ్వడం నిజంగా బాధాకరమైన విషయమే. రీసెంట్ గా చరణ్ ‘రంగస్థలం’ సినిమా కథ ఇదే అని ఓ లైన్ హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటో తెలీదు కానీ.. ముందు వినిపిస్తునన కథేంటో చూద్దాం. అది 1960... పచ్చని పొలాలతో.. గోదారి పరవళ్లతో...  అమాయకమైన మనసులతో  ఆహ్లాదంగా ఉండే గ్రామం అది. , జగపతిబాబు,  ప్రకాశ్ రాజ్... ఇద్దరు ఆ ఊరు మోతుబరులు. వీరిద్దరి గొడవలు ఆ ఊరు ప్రశాంతతను దెబ్బ తీస్తుంటాయ్. అయితే... అనుకోకుండా రైతులకు...ఈ మోతుబరులకు జరిగిన గొడవలో... రైతు నాయకుడైన రాజీవ్ కనకాల బలైపోతాడు. అయితే... రాజీవ్ కనకాలను కావాలనే చంపారా? లేక పొరపాటున ఆ హత్య జరిగిందా? అనేది మాత్రం ఎవరిక అర్థం కాని విషయం. అతనికి ఒక్కగానొక్కడుకు రామ్ చరణ్... తండ్రి లేని కొడుగ్గానే పెరిగి పెద్దవుతాడు.కథ... 80ల్లోకి చేరుతుంది. అయితే... ఒక రోజు అనుకోని పరిణామం వల్ల...  తండ్రి చావుకు అసలు కారణం తెలుస్తుంది చరణ్ కి. తన తండ్రి గొడవల్లో దెబ్బ తగిలి చనిపోలేదు.  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా చంపారు. ఈ విషయం తెలుసుకున్న చర్రీ... తండ్రికి చావుకు కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడతాడు.చివకు తండ్రిని చంపిన వాళ్ల ఆటకట్టిస్తాడు. ఈ కథకు అనుబంధంగా.. చరణ్, సమంతల ప్రేమకథ కూడా నడుస్తుంది. ఇందులో సమంత పాత్ర పేరు లక్ష్మి. చరణ్ పేరు చిట్టిబాబు. పల్లెటూరి అమ్మాయిగా సమంత పాత్ర చాలా విభిన్నంగా సాగుతుందని సమాచారం. ‘రంగస్థలం’ కథ ఇదే... అంటూ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న కథ ఇదేనండీ. మరి ఇందులో నిజానిజాలు దేవునికే తెలియాలి. ఇదిలావుంటే...  ఆది పినిశెట్టి... ప్రభుత్వాధికారిగా ఓ వైరైటీ పాత్ర చేస్తున్నాడు. యాంకర్ అనసూయ పోలీస్ అధికారిగా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కుస్తున్నాడు. కథ పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగినా... 80ల్లో నాటి కథే అయినా... సుకుమార్ స్టైల్ ఎక్కడా మిస్ అవ్వదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 20 ఏళ్ల వ్యవధిలో సాగే కథ ఇది. అప్పటి వాతావరణాన్ని తలపించేలా సెట్ల నిర్మాణం జరిగింది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.
  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి తెలంగాణ రాగం ఎందుకు ఎత్తుకున్నాడా అని సగటు అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అంటకాగుతూ వస్తుండటం.. అక్కడికే ఓటు హక్కు మార్పించుకోవడం.. సీమాంధ్రలోనే యాత్రలు చేయడాన్ని చూస్తే.. పవన్ ఏపీకే పరిమితమవుతాడని చెప్పకనే చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేనాని తెలంగాణలో యాత్ర ఎందుకు చేపట్టినట్లు..? కోదండరాంను గదుల్లోంచి బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయించిన ప్రభుత్వం.. పవన్ యాత్రకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకపోవడం ఏంటీ..? వీటన్నింటికి ఒకటే సమాధానం కేసీఆర్.   నాలుగేళ్ల క్రితం తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసీఆర్‌కు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అభివృద్ధి జరిగిపోతోందన్న ప్రచారం తప్ప నాడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలైన దాఖలాలు లేవు. తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలి.. అంతకంతకూ పుంజుకుంటున్న రెడ్లను కొట్టాలంటే.. రాజధాని ఏరియాలో.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్ల అండ కావాలి.. టీడీపీలోని మెజార్టీ నాయకుల్ని ఇప్పటికే లాగిపడేసిన కేసీఆర్‌కు... రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉన్న సీమాంధ్రుల బలం కావాలి. అది దక్కాలంటే సెటిలర్లతో పాటు తెలంగాణలోనూ ఫేమస్ అయిన వ్యక్తి అండ తనకు కావాలి. ఈ క్రమంలో కేసీఆర్‌కు కనిపించిన వ్యక్తి పవన్‌కళ్యాణ్.   అందుకే 2014 నాటి విభేదాలను పక్కనబెట్టి మరీ రాజ్‌భవన్ సాక్షిగా ఆయనతో చేయి కలిపారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే పవన్‌ కళ్యాణ్ ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేదంటే కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కేసీఆర్ సర్కార్.. నేడు పవన్ కళ్యాణ్‌కు రెడ్‌ కార్పెట్ పరచడమేంటీ. లేకపోతే చిన్న చిన్న నిరసనలకే అనుమతులు ఇవ్వని గులాబీ బాస్.. జనసేన అధినేతకు అనుమతి ఇచ్చేస్తాడా..? జగన్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారుగా ముద్రవేసి నాడు మానుకోటలో ఆయన్ను రాళ్లతో ఎదుర్కొన్న కేసీఆర్‌.. ఇప్పుడు పవన్ యాత్రకు అవరోధాలు లేకుండా చేయడమేంటీ.. జనసేన కార్యాలయం దగ్గర ప్రారంభమైన పవన్ కాన్వాయ్‌కి ఏ టీఆర్ఎస్ కార్యకర్తా అడ్డుపడలేదు..   అంతెందుకు తొలి రోజు యాత్రలో పవన్ బస చేసిన హోటల్ కూడా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేది కావడం విశేషం. కేసీఆర్‌కు మద్దతుగా పవన్ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారన్న వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా గిట్టని వారు చేస్తోన్ ప్రచారమా..? లేక పవన్- కేసీఆర్‌ల మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పందం కుదిరిందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
  మేళ తాళాలతో.. తప్పిట్లతో.. బాణాసంచా పేలుళ్లతో గుర్రం మీద కూర్చొన్న పెళ్లికుమారుడిని పెళ్లి పందిరి వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చే వేడుకే బరాత్‌. బంధువులు, సన్నిహితులు, తెలిసినోళ్లు డ్యాన్సులు చేస్తూ ఉంటే.. దానిని చూస్తోన్న వారు కూడా పూనకంతో ఊగిపోతూ కాలు కదిపే సంబరంలో ఉన్న మజానే వేరు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ బరాత్‌లకు పెట్టింది పేరు. మొదట్లో ముస్లింలు మాత్రమే జరుపుకునే ఈ సంబరాన్ని రాను రాను అన్ని మతాలు, కులాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్నాయి. ఏదీ ఏమైనా అసలైన బరాత్‌లు చూడాలి అంటే ముస్లింల పెళ్లిళ్లలోనే చూడాలి. అయితే ఇక మీదట హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింల పెళ్లిళ్లలో బరాత్‌లు కనిపించవు. తెల్లవారిందాకా బరాత్‌లు సాగడంతో పాటు అర్ధరాత్రి వేళ మేలతాళాలు మోగిస్తూ.. బాణాసంచా కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ నింపాదిగా పెళ్లి కొడుకు రోడ్ల మీద వెళుతూ ఉంటే.. పబ్లిక్ డిస్ట్రబ్ అవుతుండటంతో పాటు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బరాత్‌లో కాల్పులు.. మరో బరాత్‌లో తల్వార్ ఆట కారణంగా ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. దీంతో వీటిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింల వివాహా వేడుకల్లో బరాత్‌లు బ్యాన్ చేయడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధించే దిశగా కసరత్తులు చేస్తోంది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేయాలని.. రాత్రి 12 గంటలు దాటితే ఫంక్షన్ హాల్స్ మూసే విధంగా చర్యలు చేపట్టనుంది.   అలాగే పెళ్లి విందులో గొప్పలకు పోకుండా పరిమితితో సాగే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్ బోర్డ్ భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా 23వ తేదిన పోలీసులు, ఖాజీలు, మత పెద్దలతో తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమావేశం కానుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వస్తోన్న ఆచారాన్ని నిషేధిస్తే ఒప్పుకునేది లేదని కొందరు .. సాంప్రదాయం అనేది మనుషుల్లో ఆనందాన్ని నింపాలి కానీ.. మనుషుల ప్రాణాలు తీయడం.. సమాజాన్ని ఆటంకపరచరాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే.
  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈ సారి కూడా అధికారం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్న వేళ.. అలా జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమని.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో వెలువడిన ఒక సర్వే రిజల్ట్.. టీడీపీకి షాక్‌ని.. వైసీపీకి మంచి బూస్ట్‌ని అందించింది. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలిపింది.   ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఏపీలో మరో పార్టీ లేదు కాబట్టి వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న టైంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   సర్వే నిర్వహించిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బీజేపీ పక్షపాతి అన్నది ఓపెన్ టాక్. సీట్‌లో ఎంతటి వారున్నా సరే తన వాగ్ధాటితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అర్నాబ్‌... 2014 ఎన్నికల సమయంలో మోడీని చేసిన ఇంటర్వ్యూతో తాను ప్రధానికి పరమ భక్తుడిని అని చెప్పకనే చెప్పాడు. తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ 335 సీట్లు సాధిస్తుందని చెప్పి బీజేపీ భజన చేసిన అర్నాబ్‌‌.. మరి అదే ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ‌ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు.   అందుకు తగ్గట్టుగానే నిధులివ్వమంటే ఇవ్వరు.. మా బాధలు మేం పడి పనులు పూర్తి చేసుకుంటుంటే మీకు ఎందుకు అంత నొప్పి అంటూ కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. మరి వాళ్లు తక్కువ తింటారా..? టీడీపీకి బలంగానే కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు కూడా మోడీతో తాడో పేడో తేల్చుకుంటారని.. ఢిల్లీ టూర్‌లో మొత్తం తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా సీఎం.. పీఎంలు గంటపాటు రాష్ట్ర సమస్యల గురించి చర్చించుకున్నారు.. నవ్వుతూ బయటకు వచ్చారు. తాము ఎంతగా ప్రయత్నిస్తున్నటికీ బాబును ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలు అర్నాబ్‌ను రంగంలోకి దించారట. తద్వారా ఎన్నికలు దగ్గరపడే లోగా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నీ దెబ్బ తీయాలన్నది కమల నాథుల మైండ్‌గేమ్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ గేమ్‌లో ఫస్ట్ స్టెప్‌‌లో భాగంగానే సర్వే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాడనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అయినప్పటికీ సీనియర్లు మోత్కుపల్లి, రావుల, ఎల్ రమణ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వర్థంతి వేళ మోత్కుపల్లి నర్సింహులు అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు.   ఎంతగా ప్రజల్లోకి వెళుతున్నా వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి తోడు.. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న గవర్నర్ గిరి ఇక దక్కే అవకాశం లేదు..? కనీసం రాజ్యసభకైనా పంపిస్తారా అన్న గ్యారెంటీ చంద్రబాబు నుంచి లేకపోవడంతో ఆయనలో కాస్త అసహనం పెరిగిందంటున్నారు. అందుకే తన దారి తాను చూసుకోవాలని మోత్కుపల్లి భావిస్తున్నారని.. దీనిలో భాగంగానే పార్టీ మారతానని చెప్పకుండా.. పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలంటూ కొత్తరాగం అందుకున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా నర్సింహులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాలేదు. అయితే నర్సింహులు నోటి వెంట విలీనం మాట రావడంతో తెర వెనుక ఏదో జరిగిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.   టీఆర్ఎస్ నుంచి ఆఫరైనా వచ్చి ఉండాలని లేదంటే.. ఎంత కష్టపడినా పార్టీ బండి నడవటం కష్టమేనని భావించి ఆ మాటలు అన్నారా అంటూ శ్రేణుల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించాల్సి ఉంది.. ఉదయం అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఆయనకు పార్టీ నాయకులు మోత్కుపల్లి మ్యాటర్‌ను చెప్పారట. ఆ మాట విన్న వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే నర్సింహులు వంటి సీనియర్ నేతే విలీనం పాట పాడటం వల్ల పార్టీ పరిస్థితిపై శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని.. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓపెన్‌గానే అంటున్నారు. మరి నర్సింహులుపై అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.. శ్రేణులకు ఏం సమాధానం చెబుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీ గురించి తగు జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బహిరంగానే అవి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మే నెల వరకూ గడువు తీసుకున్నట్టు తెలుస్తోంది   నిజానికి అవ్వడానికి మిత్రపక్షమైనా మోడీ ఏపీకి చేసింది పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగి.. తిరిగి... వాళ్లని అడిగి అడిగి సాయం చేయండయ్యా బాబు అంటే ఆ మాత్రం నిధులన్నా ఇచ్చారు. నిజానికి కేంద్రం విషయంలో చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నట్టే. నాలుగేళ్ల సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాలుగేళ్లే ఇచ్చారు.. ఇంకా ఈ నాలుగు నెలలు ఇవ్వడం పెద్ద మేటర్ ఏంకాదు. అంతకన్నా ఎక్కువ టైం ఇచ్చినా టీడీపీకే నష్టం. ఎందుకంటే ఇంకా ఎదురుచూపులు చూస్తే జనం టీడీపీని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా కావాలనే టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోతే..   అసలు సంగతేంటంటే.. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అయితే మే నెలలోపు  కర్ణాటకతో పాటు మరో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఉన్న సామర్ధ్యం ఏంటో.. బీజేపీ భవితవ్యం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచన అని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీతో ఇప్పుడే తెగతెంపులు చేసుకుంటే.. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉంటే.. రాష్ట్రానికి అందుతున్న ఈ పాటి సాయం కూడా అందదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఫలితాలు అటూ ఇటూ అయి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. టీడీపీ బయటకు వస్తుంది. మరి టీడీపీని కాదని.. బీజేపీ వైసీపీ తో చేయి కలిపి... ఇప్పుడు చెప్పిన సోది... హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో అయితే జనం లేరు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి మే వరకూ టైం తీసుకున్నట్టు వినికిడి. మరి అందుకేనేమో చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అన్నది. అంత ముందు చూపుతో ఆలోచిస్తారు కాబట్టే ఆయనకు ఆపేరు వచ్చింది.
  ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...   యాదృశ్చికమో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ మరోసారి మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు బయటపడింది. ఇప్పటికే మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు ఏంటో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సాక్షిగా ఏపీపై ఉన్న చిన్న చూపు బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పండుగల్లో.. కొత్త ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ. ఈ పండక్కి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లందరూ సొంతఊరుకు వచ్చి  ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఇక మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో.. తెలంగాణాలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో జరుపుకుంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఉంది. నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తమిళ్, కన్నడ, పంజాబీ వారి వారి భాషల్లో  వేరు వేరు భాషల్లో ట్వీట్ చేశారు. అలాగే మన ఏపీ ప్రజలకు కూడా చెబుతారు అని అనుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం మనల్ని మరిచిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని. అంతే మరోసారి మోడీకి ఏపీ అంటే ఎంత గౌరవం... ఏపీ ప్రజలంటే ఎంత మర్యాద.. అని అనుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే..రాహుల్ గాంధీ అయితే, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు. ఎందుకో తెలుసా... కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... మొత్తానికి రాజకీయ నాయకుల బుద్ది మరోసారి బయటపెట్టారు. అంతేకాదు మోడీకి కూడా ఏపీ ప్రజలపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపెట్టాడు. అంతేకాదు తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది మరి.
  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ నేతలతో పాటు పలు విషయాలపై మాట్లాడారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని యుద్ధానికి జనసైన్యంతో సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్ మెచ్చుకున్నారు. దీంతో ఎప్పటిలాగే పవన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సీఎం కేసీఆర్ తాట తీస్తానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ‘ సీఎం అంతా బాగా చేస్తుంటే నువ్వు తిరుగుడెందుకు?’ అని పవన్‌కు వీహెచ్ సూటి ప్రశ్న సంధించారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఆంధ్రాలో తిరగాలని ఆయన సవాల్ విసిరారు.
  బీజేపీ-శివసేన మిత్రపక్షమైనప్పటికీ అప్పుడప్పుడు బీజేపీపై శివసేన విమర్శలు గుప్పిస్తూనే ఉంటది. అయితే ఇప్పుడు ఏకంగా  ఓ గట్టి షాకే ఇచ్చింది శివసేన. పొత్తు నుండి బయటకు వస్తున్నట్టు తెలిపింది. బీజేపీతో బంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకుంది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోరాదని, ఒంటరిగానే పోరాటం చేయాలని శివసేన నిర్ణయం తీసుకుంది. పార్టీ నేత సంజయ్ రౌత్ ఇందుకు సంబంధించి ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో పార్టీ ఆమోదించడం విశేషం.  
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన తన యాత్ర ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన అనంతరం నిన్న రాత్రి కరీంనగర్‌లోని ఓ హోటల్ బస చేశారు. పవన్ అక్కడున్న విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నారు. దీంతో అభిమానులను ఆపడం పోలీసుల తరం కావడం లేదు.. ఒకదశలో తోపులాట చోటు చేసుకుంది. ఈ కారణంగా హోటల్ అద్దాలు ధ్వంసమవ్వగా.. సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ఠితులు చోటు చేసుకున్నాయి. పవన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
  జీవితంలో ఎంతో పోరాడి.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి నిశ్చింతగా ఉండే వయసు వృద్ధాప్యం. కానీ శరీరంలో పటుత్వం తగ్గిపోయి.. వ్యాధులు దండయాత్ర చేసే ఆ వయసులో చిన్న చిన్న ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=1S_jSRyXRH4
డయాబెటిస్ ఉన్న వాళ్లందరికీ థైరాయిడ్ వస్తుందా? అలా ఖచ్చితంగా వస్తుంది అని ఏం లేదు కానీ, చిన్న వయసులో డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. డయాబెటిస్ మూలంగా ఆంటీ బాడీస్ శరీరంలోని అవయవాలు దెబ్బ తినేలా పని చేస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో డయాబెటిస్, థైరాయిడ్ లను ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=ZNS5cDt9pg0