Publish Date:Nov 7, 2019
Publish Date:Nov 4, 2019
Publish Date:Oct 29, 2019

EDITORIAL SPECIAL
  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరుబాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ముగింపు పలికారు. డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా చేస్తోన్న సమ్మెను విరమించారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్... విధులకు హాజరవుతామని ప్రకటించింది. ఒకవైపు హైకోర్టులో ఆశించిన న్యాయం జరగకపోవడం... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు ముగింపు పలికారు. అయితే, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని అశ్వద్ధామరెడ్డి వ్యక్తంచేశారు. ప్రభుత్వం గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదంటోన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మికులెవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు చరిత్రలో లేనివిధంగా 52రోజులపాటు పోరాటంచేసి కార్మికులు నైతిక విజయం సాధించారని అన్నారు. ఇక, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండంగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపట్నుంచి విధులకు రావొద్దని కోరిన అశ్వద్ధామరెడ్డి... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయితే, నాలుగైదు రోజులుగా తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నా... అధికారులు మాత్రం తిప్పిపంపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంతో పలు డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించినందున... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి అశ్వద్ధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
  మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'డిస్కో రాజా'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి వి.ఐ. ఆనంద్ డైరెక్టర్. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం (డిసెంబర్ 6) యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పిన దానికి అనుగుణంగానే టీజర్ ఉంది. ఇండియన్ మెడికల్ రీసెర్చి అసోసియేషన్ వ్యతిరేకించినా విలన్ ఒక మెడికల్ ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమవుతాడనీ, ఆ ప్రయోగాన్ని రవితేజపై చేస్తారనీ తెలుస్తోంది. అదివరకే మంచులో అచేతనంగా ఉన్న రవితేజ శరీరాన్ని వాళ్లు తీసుకొచ్చి ప్రయోగం చేస్తారనే అభిప్రాయం కలుగుతుంది. పైగా "వీడైతే నో రికార్డ్స్.. నో రిపోర్ట్స్.. నో రిలెటివ్స్.. జీరో రిస్క్" అని విలన్ చెప్పడం దాన్నే బలపరుస్తోంది. అంటే అనామకంగా అతడి బాడీ వాళ్లకు దొరికిందని ఊహించవచ్చు. ఆ వెంటనే ప్రయోగానికి సిద్ధం చేసిన రవితేజను చూపించారు. "వి ఆర్ గోయింగ్ టు బి గాడ్స్" అని విలన్ చెప్పడాన్ని బట్టి అతని బృందం చేసిన ప్రయోగం సఫలమై రవితేజ బతికాడని అంచనా వేసుకోవచ్చు.  ఈ సినిమాలో ల్యాబ్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలోనే వేసి, అక్కడ సన్నివేశాలు తీశారు. టీజర్‌లో చూపించిన షాట్స్ కొన్ని అక్కడ తీసినవే. మంచు ప్రదేశంలో కనిపించిన సీన్స్ ఐస్‌లాండ్‌లో తీసినవి. ఇక రవితేజ రెట్రో గెటప్‌పై ఉన్న యాక్షన్ షాట్స్‌తో టీజర్‌ను ఎండ్ చేశారు. ఈ మూవీలో విలన్‌గా బాబీ సింహా నటిస్తున్నాడు. జనవరి 24న భారీ స్థాయిలో 'డిస్కో రాజా'ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు. తమన్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. అబ్బూరి రవి మాటలు రాయగా నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
  'సింహా', 'లెజెండ్‌' లాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్ తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం నిర్మాణ పనులు శుక్రవారం (డిసెంబర్ 6) ఘనంగా ప్రారంభమయ్యాయి. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్‌ క్లాప్‌ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫస్ట్‌ షాట్‌లోనే "నువ్వొక మాటంటే అది శబ్దం, అదే మాట నేనంటే అది శాసనం" అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్‌, శివలెంక కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ "ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న,బోయపాటి శ్రీనుతో కలిసి నేను చేస్తున్న నూతన చిత్రం ప్రారంభమైంది.  ద్వారక క్రియేషన్‌  మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నేను 'సింహా', 'లెజెండ్‌' సినిమాలు చేయడం, అవి అద్భుతమైన విజయాలు అందుకోవడం మీకు తెలుసు. మా కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. అయితే  నాది, బోయపాటిది ఏం సిద్ధాంతం అంటే.. గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్‌ట్రేషన్‌ మా నెక్స్‌ట్‌ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం. రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే  జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే 'సింహా', 'లెజెండ్‌' సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్‌లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను" అని చెప్పారు.  బోయపాటి  శ్రీను మాట్లాడుతూ "ద్వారక క్రియేషన్స్‌లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్‌ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా 'భద్ర'. ఒక మంచి సినిమాతో నా లైఫ్‌ స్టార్ట్‌ అయింది. 'సింహా' వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. 'సింహా', 'లెజెండ్‌' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను" అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ  "భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తియ్యవచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను" అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: తమన్ ఎస్., సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో శిక్ష విధించాడు దిశ ఉదతంతంలో నిందితులైన నలుగురిని శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై బాలకృష్ణ స్పంధించారు. "దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్‌కౌంటర్‌  చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి  నాన్నగారు నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే 'లెజెండ్‌' సినిమాలో మేము కూడా 'స్త్రీ లేకుంటే సృష్టి లేదు' అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించాడు. మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు  ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే  పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు. ఇదే అంశపై బోయపాటి మాట్లాడుతూ "దిశకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నపుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారిపోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి.. పొల్యూషన్‌ నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్‌ నుండి ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు బోయపాటి శ్రీను.
Cast: Kartikeya, Neha Solanki, Rao Ramesh, Ravikishan, Satyaprakesh, Roll Rida & others Cinematographer: Yuvraj Editor: S R Shekar Music Director: Anup Rubens Producer: Ashok Reddy Gummakonda Director: Sekhar Reddy Yerra Release Date: 6th Dec 2019   After delivering a blockbuster hit like “RDX 100”, Karthikeya’s movies Hippi & Guna 369 did not perform well at the box office. And thus Karthikeya surely needs a hit with 90ML. So has it entertained the audience, let us read the review.   Story:  A mother (who does not want a girl to be born) wants a great lover like Devadasu. Finally a boy was born to her who was born with “Fatal Alcohol Syndrome”. Which means addicted to alcohol since birth. Devadasu will be alive only if he is given 90ML alcohol 3 times a day, else he would not survive. Finally Devadasu came to a state where in he could be normal only after having 90ML alcohol. He then encounters his lady love (Neha) who hates alcohol. Now will Karthikeya quit drinking for her? Will he survive without alocohol? Answers to all this becomes 90ML movie.  Analysis:  As the title states, the entire movie revolves around alcohol only. The audience who are not addicted to alcohol are sure to get frustrated. Though first half was amusing, second half seemed to test the audience patience with weak screenplay. Director did not understand how to turn the story in the second half & thus has inserted a few forceful scenes.  Plus Points:  Karthikeya Acting Music by Anup Rubens  Minus Points:  Heroine Characterization Many illogical scenes which are not necessary Frustrating screenplay in second half Climax   Performances:  Karthikeya acted very well as Devadasu. He was extremely jovial in comedy scenes & also very emotional during the emotional scenes. He excelled in fighting scenes. His dance had both speed & rhythm. But dialogue delivery in certain places seemed a little too much. He should have taken a little care while dubbing. Heroine Neha Solanki attracted the audience with her looks. But her characterization is extremely weak. And the director has to be blamed for the same. Should we say anything specific about Rao Ramesh? Except for last 30 mins where his characterization was completely ruined he did complete justice to the role. Posani Murali Krishna & Ali were seen in guest appearances.  TeluguOne Perspective:  ‘90 ML' is a perfect example of how old storylines can be spoilt with characterization, inappropriate scenes, and weak screenplay, even if it takes a new point as a love story backdrop.  Rating: 2/5
  సినిమా పేరు: 90ఎంఎల్ తారాగణం: కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేశ్, సత్యప్రకాశ్, ప్రగతి, రోల్ రిడా, అజయ్, ప్రభాకర్, పోసాని కృష్ణమురలి, రఘు కారుమంచి, అలీ, ప్రవీణ్ సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: యువరాజ్ ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్ ఆర్ట్: జి.ఎం. శేఖర్ ఫైట్స్: వెంకట్ నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ దర్శకత్వం: శేఖర్‌రెడ్డి యర్ర బ్యానర్: కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ విడుదల తేదీ: 6 డిసెంబర్ 2019 'ఆర్ఎక్స్ 100' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చేసిన 'హిప్పీ', 'గుణ 369' సినిమాలు ఫ్లాపవడంతో కచ్చితంగా మరో హిట్టు అవసరమైన కార్తికేయ.. సొంత బేనర్‌పై చేసిన సినిమా '90ఎంఎల్'. శేఖర్‌రెడ్డి యర్ర డైరెక్టర్‌గా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాలో ప్రతి పూటా 90ఎంఎల్ అల్కహాల్ వెయ్యకపోతే చచ్చిపోయే అరుదైన జబ్బు ఉన్న యువకుడిగా కార్తికేయ నటించాడంటూ విడుదలకు ముందుగానే ప్రచారం చేశారు. ట్రైలర్ వచ్చాక, అలాంటి జబ్బు ఉన్న హీరో తన ప్రేమను గెలిపించుకోడానికి ఏం చేస్తాడోనని ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూశారు. మరి సినిమా ఎలా ఉందంటే... కథ దేవదాసు లాంటి గొప్ప ప్రేమికుడు తన కడుపున పుట్టాలని కోరుకున్న ఒక తల్లి (ప్రగతి)కి పుట్టుకతోనే 'ఫాటల్ అల్కహాల్ సిండ్రోం' అనే జబ్బుతో కొడుకు పుడతాడు (అమ్మాయి పుట్టాలని ఆ తల్లి కోరుకోదని గ్రహించాలి). అంటే పుట్టుకతోనే ఆల్కహాల్‌కు బానిసయ్యే జబ్బన్న మాట. ఆ కొడుకుకు దేవదాసు అనే పేరు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. మూడు పూటలా బిడ్డకు మందెయ్యాలని, ఒక్క పూట మందెయ్యకపోయినా బతకడని డాక్టర్ చెప్పడంతో, వాళ్లు ఆల్కహాల్‌నే మందుగా వేస్తూ పెంచుతారు. పెద్దవాడయ్యేసరికి పూటకు 90ఎంఎల్ వేస్తే తప్ప మామూలు మనిషిగా ఉండలేని స్థితికి వస్తాడు దేవదాసు (కార్తికేయ). ఒక మందు ముహూర్తాన సువాసన (నేహా సోలంకి) అనే ఫిజియోథెరపిస్టును చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి సువాసన కూడా అతడికి మనసిస్తుంది. అయితే దేవదాసు జబ్బు విషయం సువాసనకు తెలీదు. మందు వాసనే గిట్టని ఆమె తండ్రి, ట్రాఫిక్ ఎస్సై 'క్షుణ్ణాకర్ రావు' (రావు రమేశ్)కు దేవదాసు మందుబాబు అనే విషయం తెలిసిన క్షణాల్లోనే సువాసనకూ తెలుస్తుంది. దాంతో అతడికి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమెపై కన్నేసి, ఆమెను పెళ్లాడాలనుకున్న జాన్ విక్ (రవికిషన్) అనే వ్యాపారవేత్త వేసిన ఎత్తును దేవదాసు చిత్తు చేశాడా? సువాసన మనసును మళ్లీ గెలుచుకున్నాడా? అనేది మిగతా కథ. విశ్లేషణ టైటిల్‌కు తగ్గట్లే ఈ లవ్ స్టోరీ అంతా 90ఎంఎల్ మందు చుట్టూ తిరిగితే, పాత్రలన్నీ ఆ 90ఎంఎల్ చుట్టూ తిరుగుతుంటాయి. సినిమా మొత్తం మందుమయమే కావడంతో మందుబాబులు కాని ప్రేక్షకులకు కాస్త సహనం ఉండాల్సిందే. ఫస్టాఫ్ కాస్త వినోదంతో నడించిందంటే, సెకండాఫ్ నానా కంగాళీగా, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అతి బలహీనమైన స్క్రీన్‌ప్లేతో సహనానికి పరీక్షగా నిలిచింది. సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా ఎలా నడిపించాలో తెలీకపోవడం వల్లే అలాంటి సన్నివేశాలు కల్పించాడని ఇట్టే అర్థమైపోతుంది. జాన్ విక్ బృందం ఒక రౌడీ మూక అని ముందుగానే క్షుణ్ణాకర్ రావుకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి ఆ బ్యాచ్‌కు క్షుణ్ణాకర్ రావు కుటుంబం (సువాసన మినహాయించి) దేహశుద్ధి చేస్తుంది. అలాంటి జావ్ విక్ తన చేతుల మీదుగా ఒక అవార్డ్ ఇచ్చేసరికి క్షుణ్ణాకర్ రావు మనసు మారిపోవడం ఏమిటో, జాన్ విక్ వచ్చి సువాసనను పెళ్లి చేసుకుంటాననేసరికి ఒప్పేసుకోవడం ఏమిటో అర్థం కాదు. ఆ సన్నివేశాలతో అంతదాకా ఉన్నతంగా కనిపించిన క్షుణ్ణాకర్ రావు పాత్ర ఔచిత్రం ఒక్కసారిగా అథమ స్థాయికి పడిపోయింది.  క్లైమాక్స్ సీన్ కోసం డైరెక్టర్‌లోని రచయిత కల్పించిన ప్రదేశం కూడా ఏవగింపు కలిగిస్తుంది. ఒక పబ్‌లో ఐటం సాంగ్ పెట్టి క్లైమాక్స్‌ను నీచస్థాయికి దిగజార్చేశాడు. "ఏంటి ఇలాంటి సీన్ వచ్చింది?" అని మనం చికాకు పడుతుండగానే, అదే తరహాలో మరో సీను వచ్చి మన చికాకును మరింత పెంచుతుంది. హీరో చెప్పేది వినకుండా హీరోయిన్ అతడిని అపార్థం చేసుకోవడం ఎన్ని సినిమాల్లో చూసుంటాం! ఇందులోనూ అంతే.. దేవదాసు నిజం చెప్పాలని నోరు తెరిస్తే చాలు.. అతడు చెప్పేది విననని నోరు మూయించేస్తుంటుంది సువాసన. మిగతా విషయాలు ఎన్ని చెప్పినా వినే ఆమె, అతడు తన జబ్బు గురించి చెప్పబోయినప్పుడు మాత్రమే వినిపించుకోదు! కొత్త దర్శకుడైన శేఖర్‌రెడ్డి ఈ విషయంలో మాత్రం పాత చింతకాయ పచ్చడి హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌నే నమ్ముకొని తప్పులో కాలేశాడు. పైగా దేవదాసు నిజం చెబుతామని నోరు తెరిచినప్పుడల్లా పెద్ద పెద్దగా అరిచేస్తుంటుంది సువాసన. దాంతో హీరోయిన్ పాత్రను మనం ప్రేమించలేం, ఆ పాత్రతో డిస్‌కనెక్ట్ అయిపోతాం.  దేవదాసు చేత మందు మానిపించాలని అతడిని సువాసన రీహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లే ఎపిసోడ్ సినిమాకు ఏ రకంగానూ ఉపకరించలేదు. అది కథలో బలవంతంగా చొప్పించిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ జాన్ విక్ క్యారెక్టరైజేషన్ విషయంలోనూ తికమకకు గురయ్యాడు దర్శకుడు. సైకో మనస్తత్వం కలిగిన అతడు క్షుణ్ణాకర్ రావు ఇంటికి తొలిసారి వెళ్లినప్పుడు జోకర్‌లాగా బిహేవ్ చెయ్యడం, క్షుణ్ణాకర్ రావు భార్య కర్రలతో తన గ్యాంగ్‌ను కొడుతుంటే, బాల్కనీపైకి ఎక్కి భయపడటం.. ఏంటీ క్యారెక్టరైజేషన్? సినిమాలో చెప్పుకోదగ్గది ఏదైనా ఉన్నదంటే.. అది అనూప్ రూబెన్స్ మ్యూజిక్. రెండు మూడు పాటలు బాగున్నాయనిపించాయంటే, అది ఆయనిచ్చిన సంగీతం వల్లే. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు కూడా వంక పెట్టలేం. ఈ సినిమా చూస్తుంటే మీడియాలేని కాలంలో జరిగినట్లు అనిపిస్తుంది. దేవదాసు పోలీస్ స్టేషన్లో ఎస్సైనీ, కానిస్టేబుళ్లనూ చితక్కొట్టినా, విలన్ వదిలెయ్యమనేసరికి ఆ ఎస్సై అతడిని వదిలేస్తాడు. మామూలుగా అయితే ఇది మీడియాకు తెలియకుండా ఉండదు, హెడ్‌లైన్స్‌లోకి ఎక్కకుండా ఉండదు. అయితే సినిమాలో కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మాత్రం కనిపిస్తుంది.  ప్లస్ పాయింట్స్ కార్తికేయ నటన అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బలవంతంగా చొప్పించిన, లాజిక్‌కు అందని పలు సన్నివేశాలు సెకండాఫ్‌లో విసుగెత్తించే స్క్రీన్‌ప్లే అథమ స్థాయిలో ఉన్న క్లైమాక్స్ నటీనటుల అభినయం దేవదాసు పాత్రలో కార్తికేయ చలాకీగా నటించాడు. సరదా సన్నివేశాలను ఎంత చులాగ్గా చేశాడో, ఎమోషనల్ సీన్లలో అంత పరిణతితో హావభావాలు పలికించాడు. ఫైట్లలో చెలరేగిపోయాడు. డాన్సుల్లో స్పీడుతో పాటు రిథం చూపాడు. అయితే అక్కడక్కడా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఓవర్ డ్రమటైజేషన్ ప్రదర్శించాడు. డబ్బింగ్ విషయంలో అతను కాస్త శ్రద్ధ వహించాలి. హీరోయిన్ నేహా సోలంకి అందచందాల పరంగా ఆకట్టుకుంది. చాలా సన్నివేశాల్లో ముచ్చటగా అనిపించింది కూడా. కానీ కీలక సన్నివేశాల్లో ఆమె క్యారెక్టరైజేషన్ కారణంగా ఆ పాత్రతో మనం సహానుభూతి చెందలేం. అది ఆమె తప్పు కాదు, దర్శకుడి తప్పు. మందు తాగితే ఒకరకంగా, మామూలుగా ఉన్నప్పుడు మరోరకంగా వ్యవహరించే జాన్ విక్ క్యారెక్టర్ లాంటివి రవికిషన్‌కు అలవాటైన వ్యవహారం. ఓవర్‌గా బిహేవ్ చేసే క్యారెక్టర్‌లో రాణించాడు. క్షుణ్ణాకర్ రావుగా రావు రమేశ్ పాత్రకు వంక పెడతామా? చివర అర గంటలో ఆయన క్యారెక్టర్‌ను పాడు చెయ్యకుండా ఉన్నట్లయితే, ఆయన మరింతగా నచ్చి ఉండేవాడు. అజయ్, కారుమంచి రఘు, ప్రగతి, సత్యప్రకాశ్ పరిధుల మేరకు నటించారు. హీరో ఫ్రెండుగా రోల్ రిడా రాణించాడు. కామెడీ విలన్‌గా ప్రభాకర్ కొత్తగా కనిపించి మెప్పించాడు. పోసాని, అలీ, ప్రవీణ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌గా ఒక కొత్త పాయింట్ తీసుకున్నా కూడా, పాత చింతకాయ పచ్చడి ధోరణి క్యారెక్టరైజేషన్స్, అసందర్భ సన్నివేశాలు, బలహీనమైన స్కీన్‌ప్లేతో సినిమాని ఎలా పాడుచేయవచ్చో చెప్పడానికి '90ఎంఎల్' ఒక నిఖార్సయిన ఉదాహరణ. రేటింగ్: 2/5 - బుద్ధి యజ్ఞమూర్తి
నటీనటులు: ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్, సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి, శరణ్య కథ: భూపతి రాజా మాటలు: రాజేంద్రకుమార్, మధు  సినిమాటోగ్రఫీ: గణేష్ చంద్ర సంగీతం: గిఫ్టన్ ఇలియాస్  దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్ నిర్మాతలు: జి. శ్రీరామ్ రాజు, కె. భరత్ రామ్   విడుదల తేదీ: 06 డిసెంబర్ 2019 పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'లో 'ఈ మనసే...' పాటను రీమేడ్ చేశామనే విషయాన్ని ప్రచారంలో 'మిస్ మ్యాచ్' టీమ్ హైలైట్ చేస్తూ వచ్చింది. దీనికి తోడు త్రివిక్రమ్ ఒక పాటను విడుదల చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావ్, విక్టరీ వెంకటేష్ వచ్చారు. ప్రచారంలో ప్రముఖులు సహాయ పడడంతో 'మిస్ మ్యాచ్' గురించి ప్రేక్షకులకు బాగానే తెలిసింది. మరి, సినిమా ఎలా ఉంది? కథ: సిద్ధార్థ్ అలియాస్ సిద్ధూ (ఉదయ్ శంకర్) ఓ జీనియస్. ఏదైనా ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకోగలడు. పదో తరగతిలో ఉండగా... ఈ విద్య కారణంగా అతడికి గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా వస్తుంది. ఐఐటీలో చదివిన అతడు, వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే కంపెనీ పెడతాడు. హీరోయిన్ విషయానికి వస్తే... కుస్తీని ప్రాణంగా ప్రేమించే గోవిందరాజు (ప్రదీప్ రావత్) కుమార్తె కనక మహాలక్ష్మి అలియాస్ మహా (ఐశ్వర్యా రాజేష్). 2019 యూత్ సమ్మిట్ లో ఇద్దరూ కలుస్తారు. సిద్ధూకి మహా ప్రపోజ్ చేస్తుంది. 'మన ఇద్దరికీ మ్యాచ్ కాదు' అని మొదట మహా ప్రేమకు నో చెప్పిన సిద్ధూ, తర్వాత ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఇంట్లో ప్రేమ విషయం చెబుతారు. ఒక రోజు ఇరు కుటుంబాలు ఒక దేవాలయ ప్రాంగణంలో కలుస్తారు. కుస్తీని కించపరిచిన కారణంగా సిద్ధూ మావయ్యను గోవిందరాజు చేయి చేసుకుంటాడు. దాంతో వాళ్ళు సంబంధం వద్దనుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ సిద్ధూ, మహా ఎలా కలిశారు? తమ గ్రామంలో పంట పొలాల నాశనానికి కారణమవుతున్న సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన గోవిందరాజును పోలీసులు అరెస్ట్ చేస్తే.. సిద్ధూ ఎలా సహాయం చేశాడు? అంతర్జాతీయ కుస్తీ (రెజ్లింగ్) పోటీల్లో మహా విజయం సాధించేలా సిద్ధూ ఏం చేశాడు? చివరకు, ఇద్దరి ప్రేమ ఏమైంది? అనేది మిగతా సినిమా.   విశ్లేషణ:  కుటుంబంలో పెద్దలు పంతాలు, పట్టింపులు, ఇగోలకు పోవడంతో ప్రేమికులు విడిపోవడం, మళ్ళీ కలవడం కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. తెలిసిన కథను కొత్తగా, ఆసక్తికరంగా చెప్తే ఎక్కడ  ప్రేక్షకులైనా చూస్తారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే... ఈ సినిమాలో కొత్తదనం కోసం వెతకడం సముద్రంలో మంచినీటి కోసం వెతికినట్టు ఉంటుంది. కుస్తీ నేపథ్యంలో కథానాయిక పాత్రను కొంచెం రఫ్ అండ్ టఫ్ గా తీరిదిద్దారంతే. పోనీ తెలిసిన కథ, సన్నివేశాలను ఆసక్తికరంగా తీశారా అంటే అదీ లేదు. ఉత్కంఠ కలిగించాల్సిన కుస్తీ పోటీ సన్నివేశాలు నీరసంగా సాగుతాయి. ఫస్టాఫ్ అయితే మరీ చప్పగా, విసుగు పుట్టిస్తూ సాగుతుంది. సెకండాఫ్ లో ఐశ్వర్యా రాజేష్ నటన వల్ల తండ్రీకూతుళ్ళ మధ్య భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అసలు, హీరో హీరోయిన్లు ప్రేమలో ఎలా పడ్డారో అర్థం కాదు.   తమిళ దర్శకుడు కాబట్టి ఎటువంటి డైలాగులు రాసినా చెల్లుతుందనట్టు మాటల రచయితలు ఇద్దరూ పేజీలకు పేజీలు డైలాగులు రాశారు. సినిమాలో హీరో పేరును ప్రేక్షకులు మర్చిపోతారనుకున్నారేమో... మాటకు ముందు సిద్ధూ, మాట తర్వాత సిద్ధూ అంటూ లెక్కకు మించి ఆ పేరును వాడారు. దర్శకుడిది తమిళనాడు కావడంతో సినిమాలో తమిళ వాసన ఎక్కువ కొట్టింది. తెలుగు నేటివిటీ మిస్ అయ్యింది. ఇది లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ? థ్రిల్లర్ సినిమానా? అని డౌట్ వచ్చేలా కొన్ని సన్నివేశాల్లో అనవసరమైన షాట్స్ చూపించారు. ఉదాహరణకు... ఇంటర్వెల్ కి ముందు టెంపుల్ సీన్ లో జనాల హడావిడి చూపిస్తూ ఏదో జరుగుతున్న బిల్డప్ ఇచ్చారు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు, రచయితలు ఫెయిల్ అయ్యారు. హీరోయిన్ తండ్రిగా ప్రదీప్ రావత్ గానీ, హీరో స్నేహితులుగా నటించిన ఇద్దరు గానీ, విలన్ గానీ ఎవరూ సెట్ కాలేదు. పాటల్లో గుర్తు పెట్టుకునేంతగా ఏమీ లేవు. నేపథ్య సంగీతంలో హిట్ ఫిల్మ్స్ బీజియమ్స్ గుర్తుకు వస్తాయి. పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'లో 'ఈ మనసే...' పాటను ఏమంత గొప్పగా తీయలేదు. నిజాయతీగా చెప్పాలంటే చెడగొట్టారు. యాక్షన్ సీన్స్ లో ఛేజింగ్ బాగా తీశారు.  ప్లస్ పాయింట్స్: ఐశ్వర్యా రాజేష్ తండ్రీకూతుళ్ల మధ్య కొన్ని భావోద్వేగాలు మైనస్ పాయింట్స్: ఉదయ్ శంకర్ ప్రదీప్ రావత్ రొటీన్ స్టోరీ మాటలు, దర్శకత్వం పాటలు, నేపథ్య సంగీతం నటీనటుల అభినయం:  ఉదయ్ శంకర్ హీరో మెటీరియల్ అనిపించుకోవాలంటే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్స్‌ప్రెషన్స్ మీద ఇంకా వర్క్ చేయాలి. ఐశ్వర్యా రాజేష్ మంచి నటి. కొన్ని సన్నివేశాల్లో తానేంటో చూపంచింది. క్యారెక్టరైజేషన్ వల్ల కొన్ని సన్నివేశాల్లో ఓవర్ ది బోర్డ్ వెళ్లి నటించింది. సినిమాకు ఆమె ప్లస్ పాయింట్. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా, 'నేను శైలజ'లో హాస్యనటుడిగా చూసిన ప్రదీప్ రావత్, హీరోయిన్ తండ్రిగా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంటే జీర్ణించుకోవడం కష్టమే. ప్రదీప్ రావత్ గెటప్ బాగోలేదు. ఆయన నటన అంతకంటే బాగోలేదు. హీరో తండ్రిగా సంజయ్ స్వరూప్ రొటీన్ క్యారెక్టర్ చేశారు.   తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: 'మిస్ మ్యాచ్'... ఈకాలంలో ప్రేక్షకుల అభిరుచికి ఇటువంటి కథలు మిస్ మ్యాచ్ అవుతాయి. అసలు, కథలో కొన్ని కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్న నటీనటులు మిస్ మ్యాచ్ అయ్యారు. ఒక్క ఐశ్వర్యా రాజేష్ తప్ప. ఏదో ఒక థియేటర్‌కు వెళ్లి రెండున్నర గంటలు కాలక్షేపం చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్లవచ్చు. కుటుంబ అనుబంధాలు, మంచి ప్రేమకథ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. రేటింగ్: 1.25/5  
  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.
  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.
రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.
  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాన్వాయిలో వెనుక వస్తున్న వాహనం బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్ లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్య మొదలైంది. కాన్వాయ్ లో ఏం జరుగుతోంది అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కాన్వాయ్ లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. లేటెస్ట్ వెర్షన్ ఫార్చునర్ వాడుతున్నారు, అయితే ఇచ్చిన కారు సౌకర్యంగా లేదని మంత్రులు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లల్లో హై ఎండ్ ,సెకన్ లలో వంద కిలోమీటర్ల స్పీడ్ దాటి పరుగుపెడతాయి.దీంతో ఈ కారును స్పీడ్ ను కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లో అందుకోలేకపోతున్నాయి. మంత్రి కారును అందుకోవాలని స్పీడుగా వెళ్లి పైలట్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదంలోనూ ఇదే జరిగింది. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే ఆయన కారును అందుకోవాలని స్పీడ్ గా కాన్వాయ్ వాహనం వెళ్ళిందని తెలిసింది. చివర్లో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైంది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లో వాహనం కూడా బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయట పడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మళ్లి కొంత మంది మంత్రులు సొంత వాహనాన్ని వాడుతున్నారు. రూరల్ ఏరియా లో సింగిల్ రోడ్ల పై మంత్రుల కాన్వాయ్ కు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యుల పై దూసుకెళుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
2020 సంవత్సరంలో తమ పదవీ కాలం ముగియనుండడంతో గులాబీ పార్టీలో ఆ సీనియర్ నాయకులకు రెన్యువల్ ఉంటుందో లేదో అనే గుబులు పట్టుకుంది 2020 లో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఎమ్మెల్సీ, మరో 2 రాజ్యసభ స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. అయితే వాటిలో ఒక ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వారికి ఈ సారి రెన్యువల్ కష్టం అని టాక్ పార్టీలో మొదలైంది. మాజీ హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2014 లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2020 తో ముగుస్తుంది. అయితే 2014 క్యాబినెట్ లో నాయనకీ చోటిచ్చిన కేసీఆర్, 2018 లో మాత్రం అవకాశమివ్వలేదు. అప్పట్నుంచీ నాయిని పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కిన నాయిని రీసెంట్ గా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిశాక కార్మిక సంఘాల విషయంలో కూడా ప్రభుత్వం లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయనకి ఈ సారి పదవి డౌట్ అనే చర్చ జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు కెకె పదవీ కాలం కూడా 2020 లోనే ముగుస్తుండటంతో కేకే పదవిపై కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయినితో పాటు కేకే కూడా గులాబీ పార్టీలో కీలక నాయకుడు. అయితే ఆర్టీసీ సమ్మె సమయంలో కేకే ప్రకటనలూ గులాబీ బాస్ ను నొప్పించాయని సమాచారం. దీనికి తోడు కేకే అన్ని పార్టీల నాయకులతో నిత్యం టచ్ లో ఉంటారు. కేకే వయసు కూడా ఎక్కువ ఉండడంతో ఆయన సీటు వేరెవరికీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో మిగతా వారి సంగతి పక్కనబెడితే కేకే అండ్ నాయిని నరసింహరెడ్డికి మాత్రం పదవి టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకూ అంటే అటు విపక్షాలు కూడా ఇపుడు పదవులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఉన్న పదవులన్నీ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ రాములు నాయక్ పదవి కూడా 2020 తోనే ముగియనుంది. కాని ఆయన 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకి కూడా పదవి లేదు. మరొక ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవి కూడా 2020 లోనే ముగుస్తుంది. కానీ ఈయనకు రెన్యువల్ పక్కా అని తెలుస్తోంది. కర్నెకు విప్ పదవి కూడా కేటాయించారు సీఎం. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయినట్టే. మొత్తానికి ఈ నేతలకు 2020 టెన్షన్ పట్టుకుంటే ఆశావహులు మాత్రం సంబరపడుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్లకు రెన్యువల్ కాకుంటే తాము ట్రై చేయొచ్చు అని. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఆ ఇద్దరు సీనియర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అన్నది 2020 సమాధానం చెప్పబోతోంది.
  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం వీచిన సమయంలో సైతం 10 నియోజకవర్గాల్లో 5 నియోజక వర్గాలను టిడిపి కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీకి 4 నియోజకవర్గాలే దక్కాయి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోనే 10 కి 10 స్థానాలను టిడిపి చేజార్చుకుంది. ప్రతికూల ఫలితాలు రావటానికి కారణాలను పార్టీ ముఖ్యనేతలు అభ్యర్ధులు శోధిస్తే అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొందరు నేతలు చేసిన తప్పిదాలు.. లోపాయికారి ఒప్పందాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై ఆ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ప్రస్తుతం టిడిపి నుంచి వలసలు సాగుతున్న నేపథ్యంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమావేశాలు నిర్వహించారు. టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ టికెట్లను 33 శాతం యువతకు, 33 శాతం మహిళలకూ ఇవ్వనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కమిటీ వేసేందుకు పేర్ల పరిశీలన కూడా కొనసాగుతోంది. అలాగే నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇటీవల పరిష్కారం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమస్య మీది పరిష్కారం కోసం పోరాటం మాది అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ప్రతి శనివారం ప్రజలు టిడిపి కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకోవడం సోమవారం అధికారులను కలిసి ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటమే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పరిష్కారం కార్యక్రమంలో అందిన సమస్యలను ఒకటికి రెండు సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వారు స్పందించకుంటే పోరాటమైనా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి జోరుగానే చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అనుకుంటున్నారు. మరోవైపు టిడిపి హయాంలో పదవులు అనుభవించిన చోటమోటా నేతలు కొందరు ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీతో ప్రయాణం ఎలా ఉందని ప్రశ్నిస్తే వారు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చకచకా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గానీ, ఆ తర్వాత తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేసి కార్యక్రమాలు చెప్పడం లేదని ఒకవేళ వాటికి వెళ్లిన వెనక సీట్లలోనే కూర్చోవల్సి వస్తుందని స్థానికంగానూ ఆ పార్టీలో ముందు నుంచి నాయకులతో విభేదాలు తలెత్తుతున్నాయని వారు బాధలను ఏకరువు పెడుతున్నారు. ఈ సంగతి తెలిసి టిడిపిలో పక్క చూపులు చూస్తున్న వారు అధికార పార్టీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో పార్టీలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ వెళుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో టిడిపిలో అసలు లీడర్లే ఉండకూడదనే లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు సమాలోచనలు చేసిన దాఖలాలు లేవు. అందులోనూ జిల్లాలో పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు వర్గపోరు ఆరంభమైన చాయలు కనిపిస్తున్నాయి. మంత్రి అనిల్ కుమార్ ప్రధానంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజక వర్గాల మీదనే దృష్టి సారించగా, మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే జిల్లాకు ఇద్దరు ఇన్ చార్జి మంత్రులు మారారు. తొలుత సుచరితని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. వారు ఒకట్రెండు సార్లు జిల్లాకొచ్చి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయారని పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రం అస్సలు పట్టించుకోలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇక బిజెపి విషయానికొస్తే ఇటీవల నెల్లూరు జిల్లాకు ఆ పార్టీ ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు టిడిపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారంతా తమ పార్టీలోకి వస్తారని లెక్కలు వేస్తున్నారు. ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తాయని వారు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రతిపక్ష టిడిపి చకచకా పావులు కదుపుతుంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో వైపు బిజెపి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరి సింహపురిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరికి మేలు చేస్తాయో ఎవరికి కీడు తెచ్చిపెడతాయో చూడాలి.  
  హైదరాబాద్ వెటర్నరి డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సైబారాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును స్వీకరించినాట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై త్వరలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఎన్ కౌంటర్ పై ఒక సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిశ అత్యాచారానికి, హత్యకు గురైన  స్థలాన్ని అలాగే ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఒక నివేదిక ఇస్తుందని సమాచారం. 
  ఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
  తొక్కలతో దోమలకు చెక్     దోమలతో  యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా.  జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు  మనకు వచ్చే ఎన్నో  ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల  దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.    మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి.  * మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం. * పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. * దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు.  దోమల ఉదృతి తగ్గుతుంది. * అరటి తొక్కలు కాల్చినా  చాలు దోమలు మాయం అవుతాయి. * వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు. * వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . ..                                                                              ----కళ్యాణి
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.